“నవంబరు 3–9: ‘సజీవులు, మృతుల కొరకు సంతోషకరమైన స్వరము’: సిద్ధాంతము మరియు నిబంధనలు 125–128,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 125–128,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
Us with Them and Them with Us [వారితో మేము, మాతో వారు], కెయిట్లిన్ కొన్నోలి చేత
నవంబరు 3–9: “సజీవులు, మృతుల కొరకు సంతోషకరమైన స్వరము”
సిద్ధాంతము మరియు నిబంధనలు 125–128
1840 ఆగష్టులో, బాధపడుతున్న జేన్ నేమన్ తన స్నేహితుడు సీమోర్ బ్రూన్సన్ అంత్యక్రియల వద్ద ప్రవక్త జోసెఫ్ మాట్లాడడం విన్నది. ఇటీవలే జేన్ యొక్క యౌవన కుమారుడు సైరస్ కూడా మరణించాడు. సైరస్ ఎన్నడూ బాప్తిస్మము పొందలేదనే వాస్తవం ఆమె బాధను పెంచింది మరియు అతని నిత్య ఆత్మకు ఏమవుతుందోనని జేన్ విచారించింది. బాప్తిస్మము తీసుకోక ముందే మరణించిన తన ప్రియమైన అన్న ఆల్విన్ గురించి అదే విధంగా జోసెఫ్ విచారించారు. కాబట్టి, సువార్త యొక్క విధులను పొందకుండా మరణించిన వారి గురించి ప్రభువు ఆయనకు బయల్పరచినది మరియు వారికి సహాయపడేందుకు మనము చేయగల దాని గురించి అంత్యక్రియల వద్దనున్న ప్రతిఒక్కరితో పంచుకోవాలని ప్రవక్త నిర్ణయించుకున్నారు.
మృతుల కొరకు బాప్తిస్మము యొక్క సిద్ధాంతము పరిశుద్ధులను విస్మయానికి గురిచేసింది; వారి ఆలోచనలు వెంటనే మరణించిన కుటుంబ సభ్యులవైపు మళ్ళాయి. ఇప్పుడు వారికి నిరీక్షణ గలదు! జోసెఫ్ వారి ఆనందాన్ని పంచుకున్నారు మరియు మృతుల రక్షణ గురించి ప్రభువు ఆయనకు బోధించిన దానిని వ్యక్తం చేయడానికి ఆనందకరమైన, ప్రోత్సాహకరమైన భాషను ఉపయోగించారు: “పర్వతములు సంతోషధ్వని చేయనియ్యుడి, లోయలారా మీరు గట్టిగా అరువుడి; సముద్రములారా, ఆరిన నేలలారా మీ నిత్యరాజు చేసిన అద్భుతములను తెలుపుడి! ” (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:23).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
నా కుటుంబముపట్ల నేను శ్రద్ధచూపాలని ప్రభువు కోరుకుంటున్నారు.
ఆయన సేవచేసిన అనేక మిషన్లలో ఒకటైన ఇంగ్లండ్ మిషన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, బ్రిగమ్ యంగ్‌కు ప్రభువు నుండి మరొక ముఖ్యమైన పిలుపు వచ్చింది. ఆయన లేనప్పుడు బాధపడ్డ “[ఆయన] కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించమని” (3వ వచనము) ఆయన అడుగబడ్డారు. మీరు ఈ విభాగాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, మన సేవలో ప్రభువు కొన్నిసార్లు త్యాగం ఎందుకు కోరుతున్నారో ఆలోచించండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ఏమి చేయగలరు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 127:2–4
కష్ట కాలములందు నేను ప్రభువుపై ఆధారపడగలను.
తప్పుడు నేరారోపణలు మరియు ఖైదు చేస్తారనే బెదిరింపు 1842 ఆగష్టులో మరలా దాగుకొనేలా జోసెఫ్ స్మిత్‌ను బలవంతపెట్టాయి. అయినప్పటికీ ఈ సమయంలో (ఇప్పటి సిద్ధాంతము మరియు నిబంధనలు 127) ఆయన పరిశుద్ధులకు వ్రాసిన మాటలు పూర్తిగా సానుకూల దృక్పథంతో, ఆనందంతో నిండియున్నాయి. దేవుని గురించి, ఎగతాళి లేదా వ్యతిరేకతను ఎదుర్కోవడం గురించి 2–4 వచనాలు మీకేమి బోధిస్తాయి? మీరు హింసించబడినప్పుడు ఈ వచనాల్లోని ఏ వాక్యభాగాలు మీకు సహాయపడవచ్చు? మీ జీవితపు “అగాధజలములలో” ప్రభువు మీకెలా సహాయపడుతున్నారో నమోదు చేయడాన్ని పరిగణించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 127:5–8; 128:1–8
“భూమిమీద మీరు దేనిని లిఖించెదరో, అది పరలోకమందును లిఖించబడును.”
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 127:5–8; 128:1–8 చదువుతున్నప్పుడు, మృతుల కొరకు బాప్తిస్మములను లిఖించడం గురించి ప్రభువు అటువంటి ప్రత్యేక సూచనలను జోసెఫ్ స్మిత్‌కు ఎందుకు ఇచ్చారనే కారణాల కొరకు చూడండి. ఇది ప్రభువు గురించి మరియు ఆయన కార్యము గురించి మీకు ఏమి బోధిస్తుంది? వ్యక్తిగత దినచర్య పుస్తకాల వంటి మీ స్వంత కుటుంబ వృత్తాంతాలకు ఈ సూచన ఎలా వర్తించగలదని మీరు భావిస్తున్నారు?
మన పూర్వీకుల కొరకు దేవాలయ సేవ చేయడం మన హృదయాలను వారితో బంధిస్తుంది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 128:5–25
నా పూర్వీకుల రక్షణ నా రక్షణ కొరకు ఆవశ్యకమైనది.
ఈ జీవితంలో బాప్తిస్మము తీసుకోని మన పూర్వీకులకు తమ రక్షణ నిమిత్తం మన సహాయం ఎందుకు అవసరమో జోసెఫ్ స్మిత్ ద్వారా దేవుడు బయల్పరచిన దాని నుండి స్పష్టమవుతుంది: మనము వారి తరఫున బాప్తిస్మం తీసుకున్నాము, కాబట్టి వారు ఈ విధిని అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి ఎంచుకోవచ్చు. కానీ మన పూర్వీకుల రక్షణ “మన రక్షణకు అవసరమైనది మరియు ఆవశ్యకమైనది” అని కూడా ప్రవక్త బోధించారు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 128:15–18 చదివినప్పుడు, అది ఎందుకు అని ఆలోచించండి.
మృతుల కొరకు బాప్తిస్మపు విధి “జగత్తు పునాది వేయబడక మునుపు సిద్ధపరచబడినదని” 5వ వచనము బోధిస్తుంది. దేవుడు మరియు ఆయన ప్రణాళిక గురించి ఈ సత్యము మీకు ఏమి బోధిస్తుంది? ఎల్డర్ డేల్ జి. రెన్లండ్ సందేశం “కుటుంబ చరిత్ర మరియు దేవాలయ కార్యము: బంధింపబడుట మరియు స్వస్థత” మీ అవగాహనకు ఏమి జోడిస్తుంది? (లియహోనా, మే 2018, 46-49).
యాజకత్వ విధులు మరియు మృతుల కొరకు బాప్తిస్మము గురించి బోధిస్తున్నప్పుడు, “బంధించు అధికారము,” “సంబంధము,” “పరిపూర్ణముగా ఐక్యమై” వంటి వాక్యభాగాలను జోసెఫ్ స్మిత్ ఉపయోగించారు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 128:5–25 చదువుతున్నప్పుడు, వీటికొరకు మరియు ఇటువంటి వాక్యభాగాల కొరకు చూడండి. ఈ వాక్యభాగాలను వివరించడానికి మీరు ఉపయోగించగల గొలుసు లేదా తాడు వంటి వస్తువుల గురించి మీరు ఆలోచించగలరా? ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి ఎందుకు ఇవి మంచి వాక్యభాగాలు?
ఈ క్రింది ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోవడం కూడా ఈ వచనాలపై మీ అధ్యయనానికి సహాయపడవచ్చు:
-
మీ అభిప్రాయం ప్రకారం, మృతుల కొరకు బాప్తిస్మము ఎందుకు “నిత్య సువార్తకు సంబంధముగల అన్ని విషయములలోను అత్యంత మహిమకరమైనదిగా” పరిగణించబడుతుంది? (17వ వచనము). ఈ విధంగా అనుభూతి చెందడానికి మీకు ఏ అనుభవాలు సహాయపడ్డాయి?
-
“తండ్రులు, పిల్లలకు మధ్య … సంబంధము లేనియెడల” భూమి ఏ కోణంలో శపించబడవచ్చు? (18వ వచనము).
-
19–25 వచనములలో జోసెఫ్ స్మిత్ మాటలను గూర్చి మిమ్మల్ని ప్రభావితపరచినదేది? ఈ వచనాలు యేసు క్రీస్తు గురించి, మీ పూర్వీకుల కొరకు దేవాలయ సేవ గురించి మీరు భావించేదానిని ఎలా ప్రభావితం చేస్తాయి?
ఈ వచనాలను అధ్యయనం చేసిన తర్వాత, మీరు మీ పూర్వీకుల కోసం ఏదైనా చేయాలనే స్ఫూర్తిని పొందవచ్చు. FamilySearch.org లోని ఉపాయాలు సహాయపడవచ్చు.
సంబంధిత సంఘ వనరులను ఉపయోగించండి. రండి, నన్ను అనుసరించండి నమూనాలలోని లింక్‌లు మీకు సువార్త సత్యాలను అర్థం చేసుకోవడంలో మరియు అన్వయించడంలో లేదా మీరు పొందే మనోభావాలపై చర్య తీసుకోవడంలో సహాయపడే సహాయక వనరులకు సులభంగా ప్రవేశాన్ని అందిస్తాయి. ఉదాహరణకు, పైన ఉన్న FamilySearch లింక్ మీ స్వంత వంశవృక్షాన్ని నిర్మించడం, దేవాలయ విధులు అవసరమయ్యే పూర్వీకులను కనుగొనడం, మీ పూర్వీకులు ఎక్కడ నుండి వచ్చారో చూడడం లేదా కుటుంబ కథనాన్ని అప్లోడ్ చేయడం వంటి కార్యకలాపాలకు దారి తీస్తుంది.
కెవిన్ ఆర్. డంకన్, “సంతోషకరమైన స్వరము!,” లియహోనా, మే 2023, 95–97 కూడా చూడండి.
“ఒక మహిమకరమైన మరియు అద్భుతమైన ఏర్పాటు.”
అధ్యక్షులు గార్డన్ బి. హింక్లి ఇలా అన్నారు:
“అందరి తరఫున యేసు చేసిన ప్రాయశ్చిత్తం గొప్ప ప్రత్యామ్నాయ త్యాగాన్ని సూచిస్తుంది. ఆయన మానవజాతి అంతటికీ ప్రతినిధిగా మారిన నమూనాను ఏర్పాటు చేశారు. ఒక వ్యక్తి మరొకరి తరఫున వ్యవహరించగల ఈ నమూనా ప్రభువు మందిరము యొక్క విధులలో ముందుకు తీసుకెళ్ళబడింది. ఇక్కడ మనము సువార్త జ్ఞానము లేకుండా మరణించిన వారి తరఫున సేవ చేస్తాము. నిర్వహించబడిన విధిని అంగీకరించడం లేదా తిరస్కరించడం వారి ఎంపిక. వారు భూమిపై జీవించే వారితో సమానంగా ఉంచబడ్డారు. చనిపోయిన వారికి జీవించి ఉన్నవారితో సమానమైన అవకాశం ఇవ్వబడుతుంది. మళ్ళీ, సర్వశక్తిమంతుడు తన ప్రవక్తకు తన బయల్పాటు ద్వారా ఎంత మహిమకరమైన మరియు అద్భుతమైన ఏర్పాటు చేసారు” (“The Great Things Which God Has Revealed,” Liahona, May 2005, 82–83).
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 126:3
నేను నా కుటుంబాన్ని చూసుకోవడానికి సహాయం చేయగలను.
-
మీ పిల్లలు వారి కుటుంబ సభ్యులకు సేవ చేయడం నేర్చుకోవడంలో సహాయపడడానికి, సిద్ధాంతము మరియు నిబంధనలు 126 ను మీ స్వంత మాటలలో సంక్షిప్తపరచండి. “నీ కుటుంబంపై ప్రత్యేక శ్రద్ధ చూపుము” (3వ వచనము) అనే వాక్యభాగాన్ని మీరు నొక్కిచెప్పవచ్చు మరియు మన కుటుంబాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం అంటే ఏమిటో మీ పిల్లలతో మాట్లాడవచ్చు.
1:33Chapter 50: The Saints in Nauvoo: January–July 1841
-
కుటుంబ సభ్యుల పట్ల మనము “శ్రద్ధ వహించడం”లో సహాయపడగల మార్గాల గురించి మీరు కలిసి మాట్లాడేటప్పుడు కుటుంబ చిత్రాలను చూడడం (లేదా చిత్రాలను గీయడం) మీకు మరియు మీ పిల్లలకు సరదాగా ఉండవచ్చు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 128:5, 12
దేవుని పిల్లలందరికీ బాప్తిస్మం పొందే అవకాశం కావాలి.
-
జోసెఫ్ స్మిత్ మనసును ఏ విషయం ఆక్రమించిందో సిద్ధాంతము మరియు నిబంధనలు 128:1 నుండి తెలుసుకోవడానికి మీ పిల్లలను ఆహ్వానించండి. ఆయన ఏ విషయాన్ని “అత్యంత మహిమకరమైనది”గా భావించాడో తెలుసుకోవడానికి వారు 17వ వచనమును కూడా శోధించవచ్చు. వారు కనుగొన్న వాటిని వారిని పంచుకోనివ్వండి మరియు ఈ విషయం ఎందుకు చాలా ఉత్తేజకరమైనది అనే దాని గురించి మాట్లాడనివ్వండి.
-
మీ పిల్లలు వారి స్వంత బాప్తిస్మపు నిబంధనలకు సిద్ధపడడానికి (మరియు జీవించడానికి) సహాయం చేయడంతో పాటు, వారి జీవితకాలంలో ఈ నిబంధనలను చేయని వ్యక్తులకు ఎలా సహాయం చేయాలో తెలుసుకోవడానికి మీరు వారికి సహాయపడవచ్చు. మీకు తెలిసి బాప్తిస్మం తీసుకోకుండానే మరణించిన వారి గురించి మీ పిల్లలకు చెప్పండి. అప్పుడు మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 128:5 కలిసి చదవవచ్చు మరియు దేవాలయపు బాప్తిస్మపు తొట్టె యొక్క చిత్రాన్ని చూడవచ్చు (ఈ నమూనా చివరిలో ఉన్నటువంటిది). ప్రతి ఒక్కరూ పరలోక తండ్రితో నిబంధనలు చేసుకునే అవకాశం ఉండేలా మరణించిన వ్యక్తుల తరఫున దేవాలయాలలో బాప్తిస్మం పొందడం గురించి మీరెలా భావిస్తారో మీ పిల్లలకు చెప్పండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 128:18
నా కుటుంబ చరిత్ర గురించి నేను నేర్చుకోవాలని పరలోక తండ్రి కోరుతున్నారు.
-
తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు మొదలైన వారి పేర్లతో కాగితం గొలుసును తయారు చేయడం మీకు మరియు మీ పిల్లలకు సరదాగా ఉండవచ్చు (ఈ వారపు ప్రోత్సాహకార్యక్రమ పేజీని చూడండి). అప్పుడు మీరు ఈ పూర్వీకుల గురించి మీకు తెలిసిన వాటిని ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. మన కుటుంబ చరిత్రను “పూర్తిగా మరియు సంపూర్ణంగా” చేసే “అనుసంధాన కొక్కెము” ఏమిటో తెలుసుకోవడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 128:18ని కలిసి చదవండి.
1:38Courage: I Think I Get It From Him
-
కుటుంబ చరిత్రలో పాల్గొనడంలో మీ పిల్లలకు సహాయపడే అదనపు కార్యకలాపాలు అనుబంధం బి లోని “దేవాలయము మరియు సంతోష ప్రణాళిక”లో లేదా FamilySearch.org వద్ద కనుగొనబడగలవు.
దేవాలయ విధులు కుటుంబాలను గొలుసులోని కొక్కెముల వలె కలిపి ఉంచడంలో మనకు సహాయపడతాయి.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.