Doctrine and Covenants 2025
సెప్టెంబరు 29–అక్టోబరు 5: “ఇది నీ మందిరము, నీ పరిశుద్ధతకు ఒక ప్రదేశము”: సిద్ధాంతము మరియు నిబంధనలు 109–110


“సెప్టెంబరు 29–అక్టోబరు 5: ‘ఇది నీ మందిరము, నీ పరిశుద్ధతకు ఒక ప్రదేశము’: సిద్ధాంతము మరియు నిబంధనలు 109–110,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 109–110,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

కర్ట్‌లాండ్ దేవాలయము యొక్క ప్రతిష్ఠాపన

A Glorious Light—Kirtland Temple [ఒక మహిమకరమైన వెలుగు—కర్ట్‌లాండ్ దేవాలయము], గ్లెన్ ఎస్. హాప్కిన్‌సన్ చేత

సెప్టెంబరు 29–అక్టోబరు 5: “ఇది నీ మందిరము, నీ పరిశుద్ధతకు ఒక ప్రదేశము”

సిద్ధాంతము మరియు నిబంధనలు 109–110

కర్ట్‌లాండ్ దేవాలయ ద్వారాలు 1836, మార్చి 27 ఉదయం ఎనిమిది గంటల వరకు తెరువబడకూడదు. కానీ, ప్రతిష్ఠిత సేవలకు హాజరు కావాలని కోరిన పరిశుద్ధులు ఏడు గంటల నుండే బారులు తీరడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరికీ వసతి కల్పించడానికి అదనంగా స్థలము మరియు రెండవ సభ అవసరమైంది. హాజరు కావాలని కోరినవారిలో సజీవులు మాత్రమే లేరు. ప్రతిష్ఠాపన సమయంలో మరియు తరువాత దేవాలయంలో మరియు పైకప్పు మీద కూడా తాము దేవదూతలను చూసామని అనేకమంది సాక్ష్యమిచ్చారు. నిజంగా “పరలోక సైన్యములు” కడవరి-దిన పరిశుద్ధులతో పాటు “పాడడానికి మరియు కేకలు వేయడానికి” వచ్చినట్లు అనిపించింది (“The Spirit of God,” Hymns, no.2).

తెరకు ఇరువైపులా ఎందుకంత ఉత్సాహముంది? శతాబ్దాల తర్వాత, భూమిపై మళ్ళీ ప్రభువు మందిరం ఏర్పడింది. “మహోన్నత స్థలము నుండి శక్తితో” (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:32) తన పరిశుద్ధులకు వరమిస్తాననే తన వాగ్దానాన్ని ప్రభువు నెరవేరుస్తున్నారు. మరియు ఇది “దీవెనకు ఆరంభం మాత్రమే” (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:10) అని ఆయన ప్రకటించారు. వేగవంతమైన దేవాలయ కార్యము మరియు లక్షలమంది సజీవులకు, మృతులకు లభ్యమవుతున్న విధులతో—మనమిప్పుడు జీవిస్తున్న యుగము—“భూమిపై కప్పబడిన తెర చిరిగిపోవడం ప్రారంభమైనప్పుడు” (“The Spirit of God”) కర్ట్‌లాండ్‌లో మొదలైంది.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 109

సెమినరీ చిహ్నము
దేవాలయ నిబంధనల ద్వారా ప్రభువు నాకు గొప్ప ఆశీర్వాదాలను అందజేస్తారు.

నేడు మనకు తెలిసిన దేవాలయాల నుండి కర్ట్‌లాండ్ దేవాలయం భిన్నంగా ఉంది. ఉదాహరణకు, అక్కడ బలిపీఠాలు మరియు బాప్తిస్మపు తొట్టె లేవు. కానీ 109వ ప్రకరణములో వివరించబడిన దీవెనలు, కర్ట్‌లాండ్ దేవాలయం కొరకు ప్రతిష్ఠాపన ప్రార్థన నేడు కూడా ప్రభువు మందిరంలో లభ్యమవుతాయి. ఈ దీవెనలలో కొన్నింటిని కనుగొనడానికి క్రింది వచనాలను సమీక్షించండి మరియు పరలోక తండ్రితో, యేసు క్రీస్తుతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి అవి ఎలా సహాయపడతాయో ధ్యానించండి.

5, 12–13 వచనాలు (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:6–8 కూడా చూడండి): ప్రభువు మందిరంలో ఆయన తననుతాను నాకు ప్రత్యక్షపరచుకోగలరు మరియు నేను ఆయన శక్తిని అనుభవించగలను.

9, 15–19, 26, 78–79 వచనములు:

21–23 వచనములు:

24–33, 42–46 వచనములు:

35–39 వచనములు:

ఇతర దీవెనలు:

మీరు ప్రభువు మందిరానికి వెళ్ళి ఉంటే, మీ జీవితంలో ఈ వాగ్దానాలు ఎలా నెరవేరాయో ఆలోచించండి.

The Spirit of God” (Hymns, no.2) కీర్తన కర్ట్‌లాండ్ దేవాలయ ప్రతిష్ఠాపన కొరకు వ్రాయబడింది మరియు అప్పటినుండి ప్రతి దేవాలయ ప్రతిష్ఠాపనలో పాడబడుతోంది. మీ అధ్యయనం మరియు ఆరాధనలో భాగంగా దీనిని పాడడం లేదా వినడాన్ని పరిగణించండి. ఈ కీర్తనలో ఏ దేవాలయ దీవెనలు వర్ణించబడడాన్ని మీరు కనుగొంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 109

ప్రార్థన అనేది పరలోక తండ్రితో సంభాషణ.

109వ ప్రకరణము బయల్పాటు ద్వారా జోసెఫ్ స్మిత్‌కు ఇవ్వబడిన ప్రతిష్ఠాపన ప్రార్థన (ప్రకరణ శీర్షిక చూడండి). ఈ ప్రకరణము నుండి ప్రార్థన గురించి మీరు ఏమి నేర్చుకుంటారు? ఉదాహరణకు, ప్రవక్త దేనికి కృతజ్ఞతలు తెలిపారు మరియు ఆయన ఏ దీవెనలు కోరారు అని మీరు గమనించవచ్చు. ఈ ప్రార్థనలో ఆయన ఇంకా ఏమి చెప్పారు? మీరు చదువుతున్నప్పుడు, పరలోక తండ్రితో మీ స్వంత సంభాషణను మీరు అంచనా వేయవచ్చు. ఈ ప్రార్థన నుండి మీరు ఆయన గురించి మరియు ఆయన కుమారుని గురించి ఏమి నేర్చుకుంటారు?

మీకు సమీపంలోనున్న దేవాలయంతో సహా ఇతర దేవాలయాల ప్రతిష్ఠాపన ప్రార్థనలను మీరు చదవాలనుకుంటే, temples.ChurchofJesusChrist.org వద్ద దేవాలయ పేజీని సందర్శించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 110:1–10

ఆయన మందిరంలో ప్రభువు తననుతాను నాకు ప్రత్యక్షపరచుకోగలరు.

మీరు ప్రకరణ శీర్షికతో పాటుగా, సిద్ధాంతము మరియు నిబంధనలు 110:1–10లో రక్షకుని యొక్క వర్ణనల గురించి చదువుతున్నప్పుడు, ఈ వచనాలు ఆయన గురించి ఏమి సూచిస్తున్నాయో ధ్యానించండి.

యేసు క్రీస్తు తన మందిరంలో తననుతాను ఎలా ప్రత్యక్షపరచుకుంటారు లేదా తననుతాను మీకు తెలుపుకుంటారు? ఆయన మీ త్యాగాలను అంగీకరిస్తారని తెలుసుకోవడానికి ఆయన మీకు ఎలా సహాయం చేస్తారు?

కర్ట్‌లాండ్ దేవాలయం లోపల

కర్ట్‌లాండ్ దేవాలయం లోపల.

సిద్ధాంతము మరియు నిబంధనలు 110:10–16

రక్షకుడు తన కార్యమును యాజకత్వ తాళపుచెవుల ద్వారా నిర్దేశిస్తారు.

యాజకత్వ తాళపుచెవులు పునరుద్ధరించడానికి మోషే, ఎలియాసు మరియు ఏలీయా దేవాలయంలో ప్రత్యక్షమవడానికి ముందు, “నా జనుల శిరస్సులపై క్రుమ్మరించబడబోవు దీవెనకు ఇది ఆరంభము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:10) అని యేసు క్రీస్తు చెప్పారు. మీరు 11–16 వచనములు చదువుతున్నప్పుడు, ఈ తాళపుచెవులచే నిర్దేశించబడిన కార్యము ద్వారా రక్షకుడు మీపై క్రుమ్మరించే దీవెనల గురించి ఆలోచించండి. ఉదాహరణకు:

  • 11వ వచనము: మోషే మరియు ఇశ్రాయేలు సమకూర్పు యొక్క తాళపుచెవులు (లేదా సువార్త పరిచర్య). ఆయన సంఘము యొక్క సువార్త పరిచర్య ప్రయత్నాల ద్వారా ప్రభువు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఏవిధంగా దీవించారు?

  • 12వ వచనము: ఎలియాసు మరియు అబ్రాహాము నిబంధనతో పాటు అబ్రాహాము సువార్త యొక్క తాళపుచెవులు. మీ నిబంధనల కారణంగా ప్రభువు మిమ్మల్ని మరియు “[మీ] తర్వాతి తరాలను” ఎలా ఆశీర్వదించగలరు? (రస్సెల్ ఎమ్. నెల్సన్, “నిత్య నిబంధన,” లియహోనా, అక్టో. 2022, 4–11; లేఖన దీపిక, “ఎలియాసు,” సువార్త గ్రంథాలయము చూడండి.)

  • 13–16 వచనములు: ఏలీయా మరియు దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము ద్వారా ప్రత్యక్షపరచబడిన ముద్రవేయు శక్తి. దేవాలయ విధుల ద్వారా మీరు మీ పూర్వీకులతో అనుసంధానం కావాలని పరలోక తండ్రి ఎందుకు కోరుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? (గెరిట్ డబ్ల్యు. గాంగ్, “సంతోషంగా మరియు శాశ్వతంగా,” లియహోనా, నవ. 2022, 83-86 చూడండి.)

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దేవుని కార్యములో మన బాధ్యతలు (సువార్తను జీవించడం, అవసరంలో నున్న వ్యక్తుల పట్ల శ్రద్ధ వహించడం, సువార్తను పొందడానికి అందరినీ ఆహ్వానించడం మరియు నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయడం) మరియు ఈ తాళపుచెవుల మధ్య మీరు ఏ సంబంధా‌లను చూస్తున్నారు?

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దేవుని కార్యముతో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? రక్షకుడు, ఆయన సంఘము మరియు ఆయన కార్యము గురించి ఈ అనుభవాలు మీకు ఏమి బోధిస్తున్నాయి?

ఇతరులను చేర్చుకోవడానికి మార్గాలను కనుగొనండి. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 110:11–16 గురించి బోధిస్తున్నట్లయితే, మీరు మోషే, ఎలియాసు లేదా ఏలీయా మరియు అతను పునరుద్ధరించిన తాళపుచెవుల గురించి అధ్యయనం చేయడానికి ప్రతి అభ్యాసకుడిని నియమించడాన్ని పరిగణించవచ్చు. అప్పుడు అభ్యాసకులు తాము కనుగొన్న వాటిని ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. ఇలాంటి విధానం నేర్చుకోవడంలో మరియు బోధించడంలో ప్రతి ఒక్కరినీ చేర్చుకుంటుంది. (రక్షకుని విధానములో బోధించుట, 24–27 చూడండి.)

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 03

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 109:12–13; 110:1–7

దేవాలయము ప్రభువు యొక్క మందిరము.

  • మీరు మరియు మీ పిల్లలు మీ ఇంటి గురించి మీకు నచ్చిన విషయాలను మాట్లాడవచ్చు. తర్వాత, దేవాలయము ఎలా ప్రతిష్ఠించబడి ప్రభువు యొక్క మందిరముగా మారుతుందనే దాని గురించి మాట్లాడడానికి మీరు కర్ట్‌లాండ్ దేవాలయము యొక్క చిత్రాన్ని చూడవచ్చు మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 109:12–13; 110:1–7 ను ఉపయోగించవచ్చు. ప్రభువు యొక్క మందిరము గురించి మీకు నచ్చిన విషయాలను ఒకరితో ఒకరు పంచుకోండి.

    2:17

    Chapter 39: The Kirtland Temple Is Dedicated: January–March 1836

  • బహుశా ఒక స్నేహితుడు మీ ఇంటిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడని మీరు మరియు మీ పిల్లలు ఊహించవచ్చు. మన ఇల్లు ఏదో తెలుసుకోవడానికి మన స్నేహితులకు మనమెలా సహాయపడగలము? దేవాలయము ప్రభువు యొక్క మందిరము అని మనకెలా తెలుసు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 109: 12–13 చూడండి).

రోమ్ ఇటలీ దేవాలయం దగ్గర క్రీస్తు విగ్రహం

సిద్ధాంతము మరియు నిబంధనలు 110

యాజకత్వ తాళపుచెవుల ద్వారా రక్షకుడు తన జనులను దీవిస్తున్నారు.

  • దేవాలయాన్ని దర్శించిన పరలోక దూతల గురించి మీ పిల్లలకు చెప్పడానికి మీరు ఈ వారపు ప్రోత్సాహకార్యక్రమ పేజీని ఉపయోగించవచ్చు. ఈ నమూనా చివరన ఉన్న చిత్రాన్ని కూడా మీరు ఉపయోగించవచ్చు.

    1:17

    The Kirtland Temple

  • కర్ట్‌లాండ్ దేవాలయంలో జరిగిన దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి, మీరు మరియు మీ పిల్లలు తాళపుచెవులు చేసే వాటి గురించి మాట్లాడవచ్చు. బహుశా మీ పిల్లలు తాళపుచెవులు పట్టుకొని తాళం వేసి ఉన్న తలుపు తెరిచినట్లు నటించవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 110:11–16లో తాళపుచెవులు అనే పదము కనుగొనడానికి వారికి సహాయపడండి మరియు ఈ తాళపుచెవులు తెరిచే దీవెనల గురించి మాట్లాడండి. యాజకత్వ తాళపుచెవులు ఆయన సంఘమును నడిపించడానికి దేవుని అనుమతి అని మీరు వివరించవచ్చు. ప్రభువు మనకు యాజకత్వ తాళపుచెవులను ఇచ్చినందుకు మీ కృతజ్ఞతను పంచుకోండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 110:15

నా హృదయాన్ని నా పూర్వీకుల వైపు త్రిప్పాలని ప్రభువు నన్ను కోరుతున్నారు.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 110:15 ను కలిసి చదివిన తరువాత, మీ హృదయాన్ని మీ పూర్వీకుల వైపు త్రిప్పడానికి సహాయపడిన ఒక అనుభవాన్ని మీ పిల్లలకు చెప్పండి. కుటుంబ చరిత్ర గురించి మీరు కలిసి ఒక పాట పాడవచ్చు.

  • వారి పూర్వీకులవైపు మీ పిల్లల “హృదయాలను త్రిప్పుటకు” ఏది సహాయపడవచ్చు? FamilySearch.org/discovery వద్ద మీరు కొన్ని సరదా ఆలోచనలను కనుగొనవచ్చు. దేవాలయ విధులు అవసరమైన పూర్వీకులను గుర్తించడానికి మీరు కలిసి పనిచేయవచ్చు. మనము ఈ పని చేయాలని యేసు ఎందుకు కోరుతున్నారు?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

కర్ట్‌లాండ్ దేవాలయంలో అగుపించిన మోషే, ఎలియాసు మరియు ఏలీయా

Vision in the Kirtland Temple [కర్ట్‌లాండ్ దేవాలయములో దర్శనము], గ్యారీ ఈ. స్మిత్ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ