“సెప్టెంబరు 22–28: ‘దేవుని కుమారుని క్రమము’: సిద్ధాంతము మరియు నిబంధనలు 106–108,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 106–108,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
సెప్టెంబరు 22–28: “దేవుని కుమారుని క్రమము”
సిద్ధాంతము మరియు నిబంధనలు 106–108
మొదటిసారి చూసినప్పుడు, సిద్ధాంతము మరియు నిబంధనలు 107 ప్రభువు యొక్క సంఘం కొరకు యాజకత్వ స్థానాలను నాయకత్వ నిర్మాణంలోకి ఏర్పాటు చేయడానికి సంబంధించినదని అనిపిస్తుంది. ఈ బయల్పాటు ప్రచురించబడే సమయానికి, కొద్దిమంది నాయకులతో అప్పటికే సంఘ సభ్యత్వము దాని సామర్థ్యాన్ని మించిపోయింది. ప్రథమ అధ్యక్షత్వము, పన్నెండుమంది అపొస్తలుల సమూహము, డెబ్బది, బిషప్పులు మరియు సమూహ అధ్యక్షత్వాల పాత్రలు మరియు బాధ్యతలను సంక్షేపముగా వర్ణించడం నిశ్చయంగా అవసరము మరియు సహాయకరము. కానీ, సంఘ నాయకత్వము ఎలా ఏర్పాటు చేయబడాలనే దానికి మించి 107వ ప్రకరణములో దైవిక ఉపదేశానికి సంబంధించినది ఎంతో ఉంది. ఇక్కడ, ప్రభువు తన శక్తి మరియు అధికారము, “దేవుని కుమారుని క్రమముననుసరించి పరిశుద్ధ యాజకత్వము” (3వ వచనము) గురించి మనకు బోధిస్తారు. యాజకత్వము యొక్క ఉద్దేశ్యము “సంఘము యొక్క ఆత్మీయ దీవెనలన్నింటి యొక్క తాళపుచెవులను కలిగియుండుట” అయ్యున్నది, తద్వారా దేవుని పిల్లలందరికి “పరలోకములు తెరువబడియుండగలవు” మరియు “తండ్రియైన దేవుడు, నూతన నిబంధనకు మధ్యవర్తియైన యేసు క్రీస్తు సహవాసమును, సన్నిధిని వారు ఆనందించగలరు” (18–19 వచనములు). తన యాజకత్వం గురించి మనకు బోధించడంలో, రక్షకుడు తన గురించి మరియు మనం ఆయన వద్దకు ఎలా రాగలమనే దాని గురించి బోధిస్తున్నారు.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 106; 108
సేవచేయడానికి ఆయన నన్ను పిలిచినప్పుడు ప్రభువు నాకు మద్దతునిస్తారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 106 మరియు108 లో, ఆయన సంఘములో సేవ చేయడానికి పిలువబడిన ఇద్దరు సభ్యులకు ప్రభువు సలహా మరియు వాగ్దానములిచ్చారు. మీరు ఆయన ఉపదేశాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, మీరు ప్రభువును సేవించడానికి మీ స్వంత అవకాశాలు—బహుశా పరిచర్య నియామకం, సంఘ పిలుపు, మీ కుటుంబంలో బాధ్యతలు లేదా మంచి చేయడానికి ఆధ్యాత్మిక ప్రేరేపణల గురించి ఆలోచించవచ్చు.
ఈ అధ్యాయాలలో మీకు ప్రభువు యొక్క సందేశం ఏమైయుండవచ్చని మీరు భావిస్తున్నారు? ఏ వాక్యభాగాలు మీకు ప్రత్యేకంగా అర్థవంతమైనవిగా కనిపిస్తున్నాయి? పరిగణించవలసినవి కొన్ని ఇక్కడున్నాయి:
-
ఆయనను సేవించగలిగేలా ప్రభువు మీకు “కృపను [లేదా దైవిక సహాయమును], ధైర్యమును ఎప్పుడు ఇచ్చారు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 106:8).
-
“మీ పనులన్నింటిలో” ఇతరులను బలపరచడం అంటే ఏమిటని మీరనుకుంటున్నారు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 108:7).
ప్రభువును సేవించే అవకాశాలను అంగీకరించడానికి మీ వారసులను—లేదా భవిష్యత్తులో మిమ్మల్ని— ప్రోత్సహించడానికి ఒక లేఖ రాయడాన్ని పరిగణించండి. సిద్ధాంతము మరియు నిబంధనలు 106, 108 మరియు మీ స్వంత అనుభవాల నుండి మీరు నేర్చుకొనే సత్యాలను మీ లేఖలో చేర్చండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 107:1-4, 18-20
యాజకత్వము అనేది “దేవుని కుమారుని క్రమముననుసరించి ఉండును.”
మెల్కీసెదెకు యాజకత్వము యొక్క అసలు పేరును మనకు బోధించడం ద్వారా (1–4 వచనములు చూడండి) “యాజకత్వంపై ఆయన బయల్పాటును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 107, ప్రకరణ శీర్షిక) ప్రభువు మొదలుపెడతారు. అది తెలుసుకోవడం ఎందుకు ముఖ్యమైనదని మీరు అనుకుంటున్నారు? ఈ పేరు యాజకత్వం గురించి మీరు భావించే విధానమును ఎలా ప్రభావితం చేస్తుంది?
ప్రత్యేకించి 18–20 వచనములలో, మీరు యాజకత్వం గురించి చదివేటప్పుడు ఈ ఆలోచనలను మనస్సులో ఉంచుకోండి. “పరలోకములు తెరువబడియుండుట” అనగా అర్థమేమిటి? “తండ్రియైన దేవుడు మరియు యేసు సహవాసమును, సన్నిధిని ఆనందించుట” అనగా అర్థమేమిటి? రక్షకుని యాజకత్వ శక్తి మరియు అధికారం వీటన్నిటిని మీకు ఎలా అందుబాటులో ఉంచుతాయి?
ఆల్మా 13:2, 16; సిద్ధాంతము మరియు నిబంధనలు 84:19-27 కూడా చూడండి.
యేసు క్రీస్తుపై దృష్టిసారించండి. “యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తలో బోధించుటకు చాలా విషయాలు ఉన్నాయి—సూత్రాలు, ఆజ్ఞలు, ప్రవచనాలు మరియు లేఖన కథలు. కానీ ఇవన్నీ ఒకే చెట్టు కొమ్మలు, ఎందుకంటే వీటన్నింటికీ ఒకే ఉద్దేశ్యము కలదు: జనులందరూ క్రీస్తు యొద్దకు వచ్చి, ఆయనలో పరిపూర్ణులగుటకు సహాయము చేయుట (జేరమ్ 1:11; మొరోనై 10:32 చూడండి). కాబట్టి మీరు ఏమి బోధిస్తున్నప్పటికీ, మీరు నిజంగా యేసు క్రీస్తు గురించి మరియు ఆయన వలె మారడం గురించి బోధిస్తున్నారని గుర్తుంచుకోండి” (రక్షకుని విధానములో బోధించుట, 6). ఉదాహరణకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 107లో మీరు యాజకత్వం గురించి బోధిస్తున్నప్పుడు—నేర్చుకుంటున్నప్పుడు—“రక్షకుని గురించి మనం ఏమి నేర్చుకుంటున్నాం?” అని తరచుగా అడగండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 107:22
ప్రభువు యొక్క సేవకులు “సంఘము యొక్క నమ్మకము, విశ్వాసము, ప్రార్థనలచేత బలపరచబడతారు.”
ప్రభువు యొక్క సేవకులను మీ నమ్మకము, మీ విశ్వాసము, మీ ప్రార్థనలచేత బలపరచడం అంటే అర్థమేమిటని మీరనుకుంటున్నారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 107:23–24, 33–35, 38, 91–92
ప్రవక్తలు మరియు అపొస్తలులు యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తారు.
1835లో క్రొత్తగా పిలువబడిన పన్నెండుమంది అపొస్తలుల సమూహముతో జోసెఫ్ స్మిత్ 107వ ప్రకరణమును పంచుకున్నారు (ప్రకరణ శీర్షికను చూడండి). 23–24, 33–35, 38 వచనములలో వారి పిలుపు గురించి ప్రభువు వారికి ఏమి బోధించారు? ఆయన సజీవ అపొస్తలుల బోధన మరియు పరిచర్య ద్వారా యేసు క్రీస్తు గురించి మీ సాక్ష్యం ఎలా బలపడింది?
91–92 వచనములలో ప్రభువు తన సీనియర్ అపొస్తలుడైన సంఘ అధ్యక్షుడి గురించి బోధిస్తారు. ఆయన “మోషే వలె” ఎట్లున్నాడు? (లేఖన దీపిక, “Moses,” సువార్త గ్రంథాలయము చూడండి).
సిద్ధాంతము మరియు నిబంధనలు 107:27-31, 85-89
ప్రభువు తన పనిని సలహాసభల ద్వారా నెరవేరుస్తారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 107:27–31, 85–89 లో సలహాసభల గురించి ప్రభువు బోధించిన దానిని గమనించండి. ఏది సలహాసభను ప్రభావవంతముగా చేస్తుంది? మీ సంఘ పిలుపులో, మీ ఇంటిలో లేదా మీ ఇతర బాధ్యతలలో ఈ సూత్రాలను మీరు ఎలా అన్వయించవచ్చు?
ప్రధాన చేతిపుస్తకము, 4.3–4.4, సువార్త గ్రంథాలయము కూడా చూడండి.
కుటుంబాలను కలిసి ఆలోచన చేయమని ప్రభువు ఆహ్వానిస్తున్నారు.
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 107:18–20
యేసు క్రీస్తు తన యాజకత్వ శక్తి ద్వారా నన్ను దీవిస్తారు.
-
మీరు మరియు మీ పిల్లలు కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 107:18–19 చదివినప్పుడు, “ఆత్మీయ దీవెనలన్నీ” అనే వాక్యభాగాన్ని నొక్కిచెప్పండి. బహుశా మీరు మరియు మీ పిల్లలు యాజకత్వం నుండి వచ్చే ఆశీర్వాదాలను జాబితా చేయవచ్చు. మీరు దానితో ఒక ఆటను రూపొందించవచ్చు—ఎవరు పొడవైన జాబితాను తయారు చేయగలరో చూడండి. ఈ ఆశీర్వాదాలను సూచించడానికి మీ పిల్లలు చిత్రాలను కూడా గీయవచ్చు లేదా కనుగొనవచ్చు (ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ చూడండి). అప్పుడు మీరు యాజకత్వ విధులు (బాప్తిస్మము లేదా సంస్కారము వంటివి) దేవుని ఆశీర్వాదాలను పొందడంలో మనకు ఎలా సహాయపడతాయో మాట్లాడవచ్చు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 107:21–26, 33–35, 91–92
ప్రభువు యొక్క ఎన్నుకోబడిన సేవకులు ఆయన సంఘమును నడిపిస్తారు.
-
లియహోనా యొక్క ప్రతీ సమావేశ సంచిక ప్రధాన అధికారుల చిత్రాల పేజీని కలిగియుంటుంది. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 107:21–26, 33–35, 91–92లో వారి బాధ్యతల గురించి చదువుతున్నప్పుడు, మీ పిల్లలతో పాటు ఈ చిత్రాలను చూడడాన్ని పరిగణించండి. ప్రభువు వారికి ఈ బాధ్యతలు ఇచ్చినందుకు మీరు ఎందుకు కృతజ్ఞతతో ఉన్నారనే దాని గురించి మీరు మరియు మీ పిల్లలు మాట్లాడవచ్చు.
-
ChurchofJesusChrist.org బహుశా మీ పిల్లలలో ప్రతి ఒక్కరూ ఈ నాయకులలో ఒకరి గురించి తెలుసుకోవచ్చు మరియు అతని లేదా ఆమె గురించి ఒకరికొకరు బోధించవచ్చు. ఈ నాయకులు యేసు క్రీస్తు యొక్క నిజమైన సేవకులని మీకు ఎలా తెలుసో ఒకరితో ఒకరు పంచుకోండి.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 107:22ని కలిసి చదివిన తర్వాత, మీరు మరియు మీ పిల్లలు ప్రథమ అధ్యక్షత్వము యొక్క చిత్రాన్ని పట్టుకుని, వారిని ప్రభువు సేవకులుగా మీరు ఆమోదించే మార్గాలను పంచుకోవచ్చు.
ప్రథమ అధ్యక్షత్వము
సిద్ధాంతము మరియు నిబంధనలు 108:3
నా నిబంధనలను జీవించడంలో నేను జాగ్రత్తగా ఉండగలను.
-
ఈ వచనం గురించి సంభాషణను ప్రారంభించడానికి, జాగ్రత్తగా శ్రద్ధ వహించాల్సిన ఒక పనిని, చిందకుండా ఒక కప్పును నింపడం వంటిదానిని చేయమని మీరు మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. మనం జాగ్రత్తగా లేనప్పుడు ఏమి జరుగుతుంది? తర్వాత మనం జాగ్రత్తగా ఏమి చేయాలని ప్రభువు కోరుతున్నారనే దానిని కనుగొనడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 108:3ను మీరు చదవవచ్చు. మనం దేవునితో ఏ “ప్రమాణాలు” (వాగ్దానాలు లేదా నిబంధనలు) చేస్తాము? వాటిని పాటించడంలో మనం మరింత జాగ్రత్తగా ఎలా ఉండగలం? సహోదరి బెక్కీ క్రేవన్ గారి సందేశం “జాగ్రత్తకు ప్రతిగా తేలికగా తీసుకొనుట” (లియహోనా, మే 2019, 9–11)లో మీ పిల్లలు తమ నిబంధనలను పాటించేలా ప్రేరేపించగలవని మీరు భావించే భాగాలను మీరు పంచుకోవచ్చు. మీరు నిబంధనలను పాటించడం గురించి ఒక పాట కూడా పాడవచ్చు.
జాగ్రత్తగా నీరు పోయడాన్ని జాగ్రత్తగా మన నిబంధనలను పాటించడంతో పోల్చవచ్చు.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.