Doctrine and Covenants 2025
సెప్టెంబరు 8–14: “ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి”: సిద్ధాంతము మరియు నిబంధనలు 98–101


సెప్టెంబరు 8–14: ‘ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి’: సిద్ధాంతము మరియు నిబంధనలు 98–101,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 98–101,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

మిస్సోరిలోని పరిశుద్ధులపై దాడిచేస్తున్న అల్లరిమూకలు

సి.సి.ఎ. క్రిస్టెన్సన్ (1831–1912), Saints Driven from Jackson County Missouri (మిస్సోరిలోని జాక్సన్ కౌంటీ నుండి పరిశుద్ధులు తరుమబడ్డారు), c.1878, tempera on muslin, 77¼×113 inches (సుమారు 1878, 77¼×113 అంగుళాల బట్ట మీద శాశ్వతచిత్రం). బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, సి.సి.ఎ. క్రిస్టెన్సన్ యొక్క మనుమల బహుమానము, 1970.

సెప్టెంబరు 8–14: “ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి”

సిద్ధాంతము మరియు నిబంధనలు 98–101

1830లలో పరిశుద్ధులకు మిస్సోరిలోని ఇండిపెండెన్స్ నిజంగా వాగ్దానదేశము. అది సీయోను యొక్క “కేంద్ర ప్రదేశము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 57:3)—భూమిపై దేవుని పట్టణము—మరియు అక్కడ పరిశుద్ధుల సమావేశం రెండవ రాకడకు ఒక ఉత్తేజకరమైన ఆలాపన. కానీ ఆ ప్రాంతంలో వారి పొరుగువారు దానిని భిన్నంగా చూసారు. దేవుడు ఆ ప్రాంతాన్ని పరిశుద్ధులకు ఇచ్చారనే ఆరోపణను వారు అంగీకరించలేదు మరియు అపరిచితులు అనేకమంది అంత త్వరగా ఆ ప్రాంతానికి తరలిరావడం వల్ల కలిగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలతో వారు అసౌకర్యంగా భావించారు. అసౌకర్యం త్వరలోనే హింస మరియు దౌర్జన్యంగా మారింది. 1833లో, సంఘ ముద్రణ కార్యాలయము ధ్వంసం చేయబడింది మరియు పరిశుద్ధులు వారి గృహాలను విడిచిపెట్టడానికి బలవంతం చేయబడ్డారు.

జోసెఫ్ స్మిత్ 800 మైళ్ళ దూరంలో కర్ట్‌లాండ్‌లో ఉన్నారు మరియు ఈ వార్త ఆయనను చేరడానికి కొన్ని వారాలు పట్టింది. కానీ, ఏమి జరుగుతున్నదో ప్రభువుకు తెలుసు మరియు పరిశుద్ధులను ఓదార్చే శాంతి మరియు ప్రోత్సాహక సూత్రాలను —మనం హింసను ఎదుర్కొన్నప్పుడు, నీతివంతమైన మన కోరికలు నెరవేరనప్పుడు లేదా ఏదో ఒక రకంగా, చివరకు మన అనుదిన శ్రమలు “[మన] మేలు కొరకు పనిచేయునని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 98:3) మనకు గుర్తుచేయబడడం అవసరమైనప్పుడు కూడా మనకు సహాయపడగల సూత్రాలను ఆయన తన ప్రవక్తకు బయల్పరిచారు.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 98:1–3, 11–14, 22; 101:1–16, 22–31, 36

సెమినరీ చిహ్నము
నా శ్రమలు నా మేలు కొరకు పనిచేయగలవు.

జీవితంలో మన సవాళ్ళలో కొన్ని మన స్వంత ఎంపికల వలన కలుగుతాయి. మిగిలినవి ఇతరుల ఎంపికల వలన కలుగుతాయి. కొన్నిసార్లు మర్త్యత్వములో భాగమైన విషయాలు జరుగుతాయి. మనం దేవుని వైపు తిరిగినప్పుడు, కారణంతో సంబంధం లేకుండా దైవిక ఉద్దేశ్యాలను నెరవేర్చడానికి ప్రతికూలత సహాయపడగలదు.

1833లో మిస్సోరిలోని పరిశుద్ధుల విషయంలో ఇది నిజము మరియు నేడు మన విషయంలో ఇది నిజము. సిద్ధాంతము మరియు నిబంధనలు 98 మరియు 101లో పరిశుద్ధులకు ప్రభువు చెప్పిన దానిని మీరు చదివినప్పుడు, మీరు కలిగియుండగల వివిధ శ్రమలు లేదా కష్టాలకు ఆయన సందేశము ఎలా అన్వయించబడుతుందో ధ్యానించండి. మీకు సహాయం చేయడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలు మరియు వనరులున్నాయి.

ఒక కష్టము దీని ఫలితమైతే:

  • వ్యక్తిగత ఎంపికలు: మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 98:11–12; 101:1–9లో ఏ సలహాను—మరియు వాగ్దానాలను—కనుగొంటారు? పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు గురించి ఈ వచనాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? మీరు ఏమి చేయాలని దేవుడు కోరుతున్నారని మీరు భావిస్తున్నారు?

  • ఇతరుల ఎంపికలు: మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 98:1–3, 22; 101:10–16, 22లో ఏ ఓదార్పును కనుగొంటారు? హింస, బెదిరింపు లేదా దౌర్జన్యానికి మనం ఎలా స్పందించాలని ప్రభువు కోరుకుంటున్నారు? ప్రభువుపై మీ నమ్మకాన్ని ఎలా ఉంచాలనే దాని గురించి ఈ వచనాలు ఏమి బోధిస్తాయి?

  • మర్త్యత్వపు శ్రమలు: మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 98:1–3; 101:22–31, 36 నుండి ఏ దృష్టికోణాన్ని పొందుతారు? మీ కష్టాల నుండి మీరు ఏమి నేర్చుకుంటున్నారు? దేవుని సహాయాన్ని ఆహ్వానించడానికి మీరేమి చేస్తున్నారు? ఆయన మీకెలా సహాయపడుతున్నారు?

“వేటితో మీరు శ్రమలను అనుభవించిరో, అవన్నియు మీ మేలుకొరకు పనిచేయునట్లు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 98:3) దేవుడు ఎలా చేయగలరో ఎక్కువగా తెలుసుకోవడానికి, ఎల్డర్ ఆంటోని డి. పర్కిన్స్ గారి సందేశము “ఓ మా దేవా, బాధపడుచున్న నీ పరిశుద్ధులను జ్ఞాపకము చేసుకొనుము” (లియహోనా, నవ. 2021, 103–5) అధ్యయనం చేయడాన్ని పరిగణించండి. మీ సవాళ్ళను ఎలా చూడమని రక్షకుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడేలా అతని సందేశంలో మీరు ఒక గద్యభాగం కొరకు చూడవచ్చు. మీ కష్టాలు మీ మంచి కోసం లేదా దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి ఏయే మార్గాల్లో కలిసి పనిచేశాయి?

రోమా 8:28; 2 నీఫై 2:2; సిద్ధాంతము మరియు నిబంధనలు 90:24 కూడా చూడండి.ChurchofJesusChrist.org

2:40

Trial of Adversity

4:17

Feeling the Lord's Love and Goodness in Trials

5:2

The Refiner's Fire

సిద్ధాంతము మరియు నిబంధనలు 98:23–48

ఆయన మార్గములో సమాధానాన్ని వెదకమని ప్రభువు నన్ను కోరుతున్నారు.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “యేసు క్రీస్తు అనుచరులు ప్రపంచమంతా అనుసరించేలా ఆదర్శప్రాయముగా ఉండాలి. ప్రస్తుతం మీ హృదయాలలో మరియు మీ జీవితాలలో చెలరేగుతున్న వ్యక్తిగత సంఘర్షణలను అంతం చేయడానికి మీరు చేయగలిగినదంతా చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను” (“ఆత్మీయ వేగము యొక్క శక్తి,” లియహోనా, మే 2022, 97).

సిద్ధాంతము మరియు నిబంధనలు 98:23–48లో ఉన్న ప్రతిదీ ఇతరులతో మీ వ్యక్తిగత సంభాషణలకు అన్వయించబడనప్పటికీ, మీ జీవితంలో వ్యక్తిగత సంఘర్షణలను ముగించడానికి మిమ్మల్ని నడిపించేలా ఏ సూత్రాలను మీరు కనుగొంటారు? శాంతి లేదా క్షమాపణ గురించిన ఒక పాటలో మీరు అదనపు సత్యాలను కనుగొనవచ్చు.

యేసు క్రీస్తు యొక్క వర్ణచిత్రము

Christ and the Rich Young Ruler [క్రీస్తు మరియు ధనవంతుడైన యౌవన అధికారి] నుండి వివరణ, హీన్రిచ్ హాఫ్‌మన్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 99–100

తనను సేవించేవారి పట్ల ప్రభువు శ్రద్ధ వహిస్తారు.

99 మరియు 100వ ప్రకరణములలోని బయల్పాటులు, ముఖ్యమైన సంఘ బాధ్యతలను కలిగి ఉన్నప్పటికీ వారి కుటుంబాల గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులకు ఇవ్వబడ్డాయి. వారికి సహాయపడగలిగేలా ఈ బయల్పాటులో మీరు ఏమి కనుగొంటారు? ఈ బయల్పాటులో ప్రభువు మీ కొరకు కలిగియున్న సందేశమేది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 101:43–65

దేవుని సలహాను అనుసరించడం నన్ను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 101:43–62లోని ఉపమానము పరిశుద్ధులు సీయోను నుండి తరిమివేయబడుటకు ప్రభువు ఎందుకు అనుమతించారో వివరిస్తుంది. మీరు ఈ వచనాలను చదువుతున్నప్పుడు, ఉపమానములోని సేవకులకు, మీకు మధ్య మీరు ఏవైనా పోలికలను చూస్తున్నారా? “[మీ] రక్షణ కొరకు సరియైన, మంచి మార్గంలో నడిపించబడుటకు మీరు సమ్మతిస్తున్నారని” (63–65 వచనాలు చూడండి) దేవునికి మీరెలా చూపగలరు?

వృత్తాంతాలను లేదా ఉపమానాలను నటించి చూపండి. కొన్నిసార్లు వారు వివరించే వ్యక్తుల స్థానంలో మనల్ని మనం ఉంచుకున్నప్పుడు లేఖనాలలోని కథలు మరియు ఉపమానాల నుండి నేర్చుకోవడం మరియు వాటితో సంబంధం కలిగి ఉండడం సులభం. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 101:43–62 బోధిస్తున్నట్లయితే, ఉపమానాన్ని ఎవరైనా బిగ్గరగా చదువుతుండగా నటించమని మీరు అభ్యాసకులను ఆహ్వానించవచ్చు. పదాలకు అభినయాలు చేర్చడం ద్వారా మీరు ఏ అంతర్దృష్టులను పొందుతారు?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 03

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 98:1–3

యేసు క్రీస్తు నా శ్రమలను దీవెనలుగా మార్చగలరు.

  • వారి వయస్సు పిల్లలు ఎదుర్కొనే కొన్ని సవాళ్ళ గురించి మీరు మీ పిల్లలను అడగడం ద్వారా చర్చను ప్రారంభించవచ్చు. తర్వాత మీరు కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 98:1–3 చదవవచ్చు మరియు యేసు క్రీస్తు శ్రమలను దీవెనలుగా ఎలా మార్చగలరనే దాని గురించి మాట్లాడవచ్చు. ఆయన మీ శ్రమలను దీవెనలుగా ఎలా మార్చారనే ఉదాహరణలను మీరు మీ పిల్లలతో పంచుకోవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 98:39–40

క్షమించడానికి రక్షకుడు నాకు సహాయం చేస్తారు.

గమనిక: మీరు మీ పిల్లలకు క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను బోధిస్తున్నప్పుడు, ఎవరైనా వారిని బాధపెడితే, వారు ఎల్లప్పుడూ విశ్వసనీయ పెద్దలకు చెప్పాలని కూడా వారు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి.

  • మీరు మరియు మీ పిల్లలు ఈ పరిశుద్ధులు ఎలా భావించి ఉండవచ్చు అనే దాని గురించి మాట్లాడవచ్చు. తర్వాత వారు ఏమి చేయాలని ప్రభువు కోరుతున్నారనే దానిని కనుగొనడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 98: 23, 39–40ని మీరు కలిసి చదవవచ్చు. మీరు ఎవరినైనా క్షమించవలసివచ్చిన సమయాల గురించి మరియు రక్షకుడు మీకు ఎలా సహాయం చేసారు అనే దాని గురించి మీరు మరియు మీ పిల్లలు మాట్లాడవచ్చు.

  • మీరు మీ పిల్లలకు సంతోషకరమైన ముఖం మరియు విచారకరమైన ముఖం యొక్క చిత్రాలను కూడా చూపించవచ్చు. ఎవరైనా నిర్దయగా ఉన్న సందర్భాల గురించి మాట్లాడండి మరియు ప్రతిస్పందించడానికి మార్గాలను సూచించండి. సంబంధిత ముఖాన్ని చూపడం ద్వారా ప్రతీ స్పందన వారికి సంతోషాన్ని కలిగిస్తుందో లేదా విచారాన్ని కలిగిస్తుందో ఎంచుకోవడానికి మీ పిల్లలకు సహాయపడండి. మనతో మంచిగా ఉండని వారిని కూడా మనం క్షమించాలని యేసు ఎందుకు కోరుకుంటున్నారు?

2:42

మిస్సోరీలో కష్టము: అపాయకరమైన సమయాల్లో విశ్వాసాన్ని బలంగా నిలుపుకొనుట

2:10

Chapter 35: The Saints Leave Jackson County, Missouri: September–December 1833

సిద్ధాంతము మరియు నిబంధనలు 101:16, 23–32

యేసు క్రీస్తు నాకు సమాధానాన్ని తీసుకురాగలరు.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 101:16 చదివిన తర్వాత, మనం నిశ్చలంగా ఉన్నప్పుడు మరియు యేసు గురించి ఆలోచిస్తున్నప్పుడు—ఉదాహరణకు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా సంస్కారము తీసుకుంటున్నప్పుడు వచ్చే శాంతియుత భావాలను గుర్తించడంలో మీ పిల్లలకు సహాయపడండి. భక్తితో కూడిన గౌరవము గురించి ఒక పాటను కూడా మీరు కలిసి పాడవచ్చు. మన గృహములో ఆయన సమాధానమును మనము ఎలా భావించగలము?

  • యేసు క్రీస్తు మళ్ళీ వచ్చినప్పుడు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మీ పిల్లలు ఆసక్తి కలిగి ఉండవచ్చు. కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 101:23–32 చదవండి మరియు ఆయన వచ్చినప్పుడు మనకు సంతోషాన్ని కలిగించేలా ఈ వచనాలలో వారు కనుగొన్న విషయాల గురించి మాట్లాడండి. మనకు కష్టంగా ఉన్నప్పుడు ఈ విషయాల గురించి తెలుసుకోవడం ఎందుకు ఉపయోగకరంగా ఉంటుంది?

బిడ్డను హత్తుకుంటున్న క్రీస్తు

యేసు క్రీస్తు మరలా వచ్చినప్పుడు శాంతిని, ఆనందాన్ని తెస్తారు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ప్రారంభ కడవరి-దిన పరిశుద్ధులను హింసిస్తున్న అల్లరిమూకల వర్ణచిత్రము

Missouri Burning [దహనమవుతున్న మిస్సోరి], గ్లెన్ ఎస్. హాప్కిన్సన్ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ