Doctrine and Covenants 2025
సెప్టెంబరు 15–21: “అనేక శ్రమల తరువాత దీవెనలు కలుగును”: సిద్ధాంతము మరియు నిబంధనలు 102–105


సెప్టెంబరు 15–21: ‘అనేక శ్రమల తరువాత దీవెనలు కలుగును’: సిద్ధాంతము మరియు నిబంధనలు 102–105,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 102–105,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

సీయోను దళము

సి.సి.ఎ. క్రిస్టెన్సన్ (1831–1912), Zion’s Camp [సీయోను దళము], c. 1878, tempera on muslin, 78 x 114 inches(సుమారు 1878, బట్టమీద శాశ్వత చిత్రం, 78×114 అంగుళాలు). బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, సి.సి.ఎ. క్రిస్టెన్సన్ యొక్క మనుమల బహుమానము, 1970.

సెప్టెంబరు 15–21: “అనేక శ్రమల తరువాత దీవెనలు కలుగును”

సిద్ధాంతము మరియు నిబంధనలు 102–105

మిస్సోరిలోని జాక్సన్ కౌంటీలో తమ సహోదర సహోదరీలు వారి ఇళ్ళ నుండి తరిమివేయబడ్డారని విని కర్ట్‌లాండ్‌లోని పరిశుద్ధులు చాలా బాధపడ్డారు. అప్పుడు, “సీయోను విమోచన శక్తితో వస్తుందని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 103:15) ప్రభువు ప్రకటించినప్పుడు, అది ప్రోత్సాహకరంగా ఉండియుండవచ్చు. వారి హృదయాలలో ఆ వాగ్దానంతో 200 మందికి పైగా పురుషులు, సుమారు 25 మంది స్త్రీలు, పిల్లలు ఇశ్రాయేలు దళము అని పిలువబడిన దానిలో చేరారు, తరువాత అది సీయోను దళముగా పేరొందింది. వారి నియమిత కార్యము మిస్సోరికి వెళ్ళి, సీయోనును విమోచించడం.

దళములోని సభ్యులకు సీయోనును విమోచించడం అంటే పరిశుద్ధులను వారి స్థలాలకు పునఃస్థాపించడమని అర్థము. కానీ వారు జాక్సన్ కౌంటీకి చేరుకోవడానికి కొంచెం ముందు, సీయోను దళమును విచ్ఛినం చేయమని ప్రభువు జోసెఫ్ స్మిత్‌కు చెప్పారు. దళంలో కొంతమంది సభ్యులు గందరగోళంలో పడ్డారు మరియు కలవరపడ్డారు; ఈ ప్రయాణం విఫలమైనదని మరియు ప్రభువు యొక్క వాగ్దానాలు నెరవేరలేదని అనిపించింది. అయినప్పటికీ, ఇతరులు దానిని భిన్నంగా చూసారు. వెళ్ళగొట్టబడిన పరిశుద్ధులు వారి స్థలాలను, ఇళ్ళను తిరిగి పొందనప్పటికీ, ఆ అనుభవం కొంతవరకు సీయోనుకు “విమోచనను” తెచ్చింది మరియు అది “శక్తితో వచ్చింది”. సీయోను దళములో విశ్వాసులైన సభ్యులలో అనేకులు తరువాత సంఘ నాయకులయ్యారు, ఆ అనుభవము దేవుని శక్తియందు, జోసెఫ్ స్మిత్ యొక్క దైవిక పిలుపుయందు మరియు సీయోను—అనగా సీయోను ప్రదేశమందే కాక, దేవుని జనులైన సీయోను యందు వారి విశ్వాసాన్ని బలపరచిందని వారు సాక్ష్యమిచ్చారు. విఫలమైనదిగా కనిపించే ఈ కార్యము యొక్క విలువను ప్రశ్నించే బదులు, మనం అన్నిటిని అర్థం చేసుకోలేక పోయినప్పటికీ, రక్షకుడిని అనుసరించడమే అసలైన కార్యమని వారు నేర్చుకున్నారు. చివరకు, ఈవిధంగా సీయోను విమోచించబడుతుంది.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 102:12–23

సభ్యత్వ సలహాసభల యొక్క ఉద్దేశ్యం ఏమిటి?

102వ ప్రకరణము ఒహైయోలోని కర్ట్‌లాండ్‌లో సమావేశము యొక్క ముఖ్యాంశాలను కలిగియుంది, అక్కడ సంఘము యొక్క మొదటి ఉన్నత సలహామండలి ఏర్పాటు చేయబడింది. గంభీరమైన తప్పులు చేసిన వారి కోసం సభ్యత్వ సలహాసభలు జరుపబడినప్పుడు, ఉన్నత సలహామండళ్ళు అనుసరించే విధానాలను 12–23 వచనములలో ప్రభువు వివరించారు.

అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బాల్లర్డ్ ఇలా బోధించారు: “సంఘ [సభ్యత్వ] సలహాసభలు ఎందుకు జరుపబడతాయని కొన్నిసార్లు సభ్యులు అడుగుతారు. మూడు ముఖ్య ఉద్దేశాలున్నాయి: అతిక్రమకారుని ఆత్మను కాపాడుట, అమాయకులను రక్షించుట, సంఘము యొక్క స్వచ్ఛత, నిజాయితీ మరియు మంచి పేరును కాపాడుట” (“A Chance to Start Over: Church Disciplinary Councils and the Restoration of Blessings,” Ensign, Sept. 1990, 15).

సిద్ధాంతము మరియు నిబంధనలు 103:1–12, 36; 105:1–19

సీయోను కేవలం నీతి సూత్రాలపై నిర్మించబడగలదు.

పరిశుద్ధులు మిస్సోరిలో తమ వాగ్దాన స్థలాన్ని ఎందుకు కోల్పోయారు? అనేక కారణాలు ఉండవచ్చు—కనీసం ఒకటి, “నా జనుల అపరాధములు” అని ప్రభువు చెప్పారు. అది కాకపోతే, సీయోను “విమోచించబడియుండేది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 105:2). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 103:1–12, 36; 105:1–19 చదువుతున్నప్పుడు, మిస్సోరిలో సీయోను స్థాపనను ఆటంకపరచిన విషయాలు మరియు దానికి సహాయపడగల విషయాలు కొన్నింటిని మీరు గమనించవచ్చు. మీ హృదయములో, ఇంటిలో మరియు సమాజములో సీయోనును స్థాపించడానికి మీకు సహాయపడగలిగేలా మీరేమి నేర్చుకుంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 103:12–13, 36; 105:1–6, 9–19

సెమినరీ చిహ్నము
విశ్వాసపు పరీక్షల తరువాత దీవెనలు వస్తాయి.

అనేక విధాలుగా, సీయోను దళములో పాల్గొనడం ఒక విశ్వాసపు పరీక్ష. ప్రయాణము సుదీర్ఘమైనది, వాతావరణం వేడిగలది మరియు కొన్నిసార్లు అన్నపానీయాలు కరువయ్యేవి. వారు అన్నిటిని సహించిన తర్వాత, పరిశుద్ధులను వారి స్థలానికి తిరిగి తీసుకురావడంలో సీయోను దళము ఇప్పటికీ విఫలమైంది. సీయోను దళము‌లో అతని లేదా ఆమె అనుభవంతో ప్రభువుపై విశ్వాసం కదిలించబడిన ఒక సభ్యునికి లేఖ రాసే అవకాశం మీకు లభించిందని ఊహించండి. ఈ వ్యక్తిని ప్రోత్సహించడానికి మీరు ఏమి చెప్పగలరు? సహాయపడగలిగేలా సిద్ధాంతము మరియు నిబంధనలు 103:5–7, 12–13, 36; 105:1–6, 9–19లో ఏ సత్యాలను మీరు కనుగొంటారు?

అప్పుడు మీరు సీయోను దళము వంటి శ్రమ యొక్క మరింత ఆధునిక ఉదాహరణ గురించి ఆలోచించవచ్చు—అంటే కష్టపడి పనిచేసే సువార్తికుడు, కానీ అతని లేదా ఆమె ప్రయత్నాల కారణంగా ఎవరూ సంఘములో చేరరు. మీరు చదివిన దానిపై ఆధారపడి, అతని లేదా ఆమె నియమితకార్యము ఇప్పటికీ విజయవంతమైందని చూడడానికి ఆ సువార్తికునికి మీరు ఎలా సహాయం చేస్తారు?

“అనేక శ్రమల తర్వాత” ప్రభువు మిమ్మల్ని ఎలా దీవించారు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 103:12).

1 నీఫై 11:16–17; ఆల్మా 7:11–12; సిద్ధాంతము మరియు నిబంధనలు 6:33–36; 84:88; 101:35–36 కూడా చూడండి.

బయల్పాటుల యొక్క చారిత్రక సందర్భాన్ని అధ్యయనం చేయడం ద్వారా సిద్ధపడండి. సిద్ధాంతము మరియు నిబంధనలు లోని బయల్పాటుల నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం అవి బోధించే సూత్రాలను అర్థం చేసుకోవడానికి మరియు అన్వయించుకోవడానికి మీకు సహాయపడగలదు. ఈ వనరులలో చాలా వాటికి రండి, నన్ను అనుసరించండి లింకులను అందిస్తుంది.

అ.సం.రా.లోని మిస్సోరిలో నది

లిటిల్ ఫిషింగ్ నది తీరప్రాంతాలలో సీయోను దళము నివసించింది.

శ్రమల యొక్క ఉద్దేశ్యం ఏమిటి?

శ్రమల యొక్క ఉద్దేశ్యం గురించి ఎల్డర్ ఓర్సన్ ఎఫ్. విట్నీ యొక్క సలహాను పరిగణించండి: “మనం అనుభవించే బాధ, మనం అనుభవించే ఏ శ్రమ వృధా కాదు. అది మన విద్యకు, సహనం, విశ్వాసం, దృఢత్వం మరియు వినయం వంటి లక్షణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. మనం భరించేవన్నీ మరియు మనం సహించేవన్నీ, ముఖ్యంగా మనం ఓపికగా భరించినప్పుడు, మన స్వభావాలను నిర్మిస్తాయి, మన హృదయాలను శుద్ధి చేస్తాయి, మన ఆత్మలను విస్తరింపజేస్తాయి మరియు మనల్ని మరింత మృదువుగా, దాతృత్వం కలిగియుండేలా, దేవుని పిల్లలు అని పిలువబడడానికి మరింత యోగ్యులుగా చేస్తాయి … దుఃఖం మరియు బాధలు, శ్రమలు మరియు కష్టాల ద్వారానే మనం ఇక్కడ పొందడానికి వచ్చిన విద్యను పొందుతాము మరియు అది మనల్ని మరింతగా పరలోకంలో ఉన్న మన తండ్రిలా మరియు తల్లిలా తయారుచేస్తుంది” (in Spencer W. Kimball, Faith Precedes the Miracle [1972], 98).

సిద్ధాంతము మరియు నిబంధనలు 104:11–18, 78–83

ప్రభువు నన్ను “భూలోక దీవెనలపై గృహనిర్వాహకుడిగా” చేసారు.

మిస్సోరిలోని శ్రమలకు అదనంగా, 1834లో సంఘము అధికమొత్తంలో అప్పులు మరియు ఖర్చులతో ఆర్థికపరమైన కష్టాలను ఎదుర్కొంది. 104వ ప్రకరణములో సంఘము యొక్క ఆర్థిక పరిస్థితిపై ప్రభువు ఉపదేశమిచ్చారు. మీ స్వంత ఆర్థిక నిర్ణయాలకు 11–18 మరియు 78–83 వచనములలోని సూత్రాలను మీరెలా అన్వయించగలరు?

20:32

Treasure in Heaven: The John Tanner Story

3:42

The Labor of His Hands

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 103:9

యేసును అనుసరించుట ద్వారా నేను “లోకమునకు వెలుగుగా” ఉండగలను.

  • మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 103:9 చదువుతున్నప్పుడు, మీరు మీ పిల్లలను లైట్ బల్బు, కొవ్వొత్తి లేదా మరొక కాంతి వనరు యొక్క చిత్రాలను పట్టుకోవడానికి ఆహ్వానించవచ్చు. మనము యేసు క్రీస్తును అనుసరిస్తున్నప్పుడు, మనము ఇతరులకు ఒక వెలుగుగా ఎలా ఉండగలము?

వెలుగుతున్న కొవ్వొత్తి

నేను యేసు క్రీస్తును అనుసరించినప్పుడు, నేను ఇతరులకు వెలుగుగా ఉండగలను.

సిద్ధాంతము మరియు నిబంధనలు 104:13–18

నేను కలిగియున్న దానిని అవసరంలో ఉన్న జనులతో పంచుకోమని ప్రభువు నన్ను కోరుతున్నారు.

  • దేవుడు వారికిచ్చిన ఆశీర్వాదాల జాబితా (ఆహారం, దుస్తులు, ప్రతిభ, విశ్వాసం మరియు ఇల్లు వంటివి) చేయడానికి మీరు మీ పిల్లలకు కొన్ని నిమిషాలు ఇవ్వాలనుకోవచ్చు. వీలైనన్నింటిని జాబితా చేయమని వారిని ప్రోత్సహించండి. తర్వాత ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం వెదుకుతూ, సిద్ధాంతము మరియు నిబంధనలు 104: 13–18ని మీరు కలిసి చదవవచ్చు: అన్నింటికి నిజమైన యజమాని ఎవరు? వీటితో మనము ఏమి చేయాలని ఆయన కోరుతున్నారు? ఎవరైనా మీకు అవసరమైన వాటిని ఇచ్చిన అనుభవాలను మీరు మరియు మీ పిల్లలు పంచుకోవచ్చు.

    2:8

    The Coat

సిద్ధాంతము మరియు నిబంధనలు 104:42

నేను ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు, ప్రభువు నన్ను దీవిస్తారు.

  • 104వ ప్రకరణములో ప్రభువు తన ఆజ్ఞలను విశ్వాసంతో పాటించే వ్యక్తులకు అనేకసార్లు “విస్తారమైన దీవెనలు” వాగ్దానమిచ్చారు. “విస్తారమైన” అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడేందుకు, మీరు ఒక వృత్తాన్ని గీసి, వృత్తా‌ల సంఖ్యను గుణించడంలో మీకు సహాయం చేయమని మీ పిల్లలను అడగవచ్చు-రెండు, ఆపై నాలుగు, ఎనిమిది, ఆపై పదహారు మొదలైనవి. మీరు వృత్తా‌లను జోడించిన ప్రతిసారీ, పరలోక తండ్రి వారికిచ్చిన ఒక ఆశీర్వాదం గురించి ఆలోచించడంలో మీ పిల్లలకు సహాయపడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 105:38–40

నేను సమాధానపరచువానిగా ఉండగలను.

  • సీయోను దళము యొక్క కథను తెలుసుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయడానికి మీరు “Chapter 36: Zion’s Camp” (Doctrine and Covenants Stories, 135–39లో) పంచుకోవచ్చు. సీయోను దళము నుండి మనం నేర్చుకోగల పాఠాల గురించి మాట్లాడడానికి నిర్ణీత సమయాల్లో ఆగండి—ఉదాహరణకు, మనం వాదించుకోవడం మరియు పోరాడడం కంటే శాంతియుతంగా, కలిసి పనిచేయాలని ప్రభువు కోరుకుంటున్నారు. (రస్సెల్ ఎమ్. నెల్సన్, “సమాధానపరచువారు కావాలి,” లియహోనా, మే 2023, 98–101 కూడా చూడండి).

  • మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 105:38–40ని కూడా చదవవచ్చు మరియు “శాంతి” అనే పదం విన్న ప్రతిసారీ పిల్లలను లేచి నిలబడమని అడగవచ్చు. దయలేని వ్యక్తులతో శాంతిని నెలకొల్పాలని ప్రభువు పరిశుద్ధులను కోరుకున్నారని వివరించండి. సమాధానపరచువారిగా ఉండేందుకు మీ పిల్లలు చేయగలిగిన విషయాల గురించి ఆలోచించడంలో సహాయపడండి మరియు కొన్ని సందర్భాలను నటించి చూపడానికి వారిని ఆహ్వానించండి.

4:24

ఇశ్రాయేలు సమాజము: ప్రభువును నమ్మడం నేర్చుకొనుట

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

సీయోను దళము యొక్క వర్ణచిత్రము

Zion’s Camp (Zion’s Camp at Fishing River) [సీయోను దళము (ఫిషింగ్ నది వద్ద సీయోను దళము)], జూడిత్ ఎ. మెహ్ర్ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ