“సెప్టెంబరు 1–7: ‘సీయోను రక్షణ కొరకు’: సిద్ధాంతము మరియు నిబంధనలు 94–97,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 94–97,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
Kirtland Temple [కర్ట్‌లాండ్ దేవాలయము], ఆల్ రౌండ్స్ చేత
సెప్టెంబరు 1–7: “సీయోను రక్షణ కొరకు”
సిద్ధాంతము మరియు నిబంధనలు 94–97
“కొండమీద [అతనికి] చూపబడిన మాదిరిచొప్పున” (హెబ్రీయులకు 8:5; నిర్గమకాండము 25:8–9 కూడా చూడండి) ఒక గుడారమును నిర్మించమని ప్రభువు మోషేను ఆజ్ఞాపించారు. ఇశ్రాయేలీయుల అరణ్య శిబిరము మధ్యలో గుడారము ఉండవలెను (సంఖ్యాకాండము 2:1–2 చూడండి).
“లోకరీతిగా కాకుండా, నేను చూపించు విధానములో దేవాలయాలను నిర్మించాలని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 95:13–14; 97:10 కూడా చూడండి) 1833లో ప్రభువు జోసెఫ్ స్మిత్‌ను ఆజ్ఞాపించారు. అరణ్యములోని గుడారము వలె, దేవాలయము కర్ట్‌లాండ్‌కు కేంద్రబిందువుగా ఉండాలి (సిద్ధాంతము మరియు నిబంధనలు 94:1 చూడండి).
నేడు దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అవి మన పట్టణాలకు కేంద్రబిందువుగా ఉండనప్పటికీ, మన జీవితాల్లో కేంద్రబిందువుగా ఉండవలసిన క్రీస్తు వైపుకు అవి మనకు దారిచూపుతాయి. చూడడానికి ప్రతి దేవాలయము భిన్నంగా ఉన్నప్పటికీ, వాటిలో మనము ఒకే దైవిక నమూనాను—దేవుని సన్నిధిలోనికి మనల్ని తిరిగి తీసుకువచ్చే పరలోక ప్రణాళికను నేర్చుకుంటాము. పవిత్ర విధులు మరియు నిబంధనలు “లోకరీతిగా కాకుండా” దేవుడు మనకు చూపించు విధానములో మనల్ని క్రీస్తుతో కలుపుతాయి మరియు మన కుటుంబాలను బలపరుస్తాయి.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 94; 97:10-17
నేను “పూర్తిగా ప్రభువుకు అంకితం” కాగలను.
సిద్ధాంతము మరియు నిబంధనలు 94లో, కర్ట్‌లాండ్‌లో పరిపాలక భవనాలను—ఒక కార్యాలయము మరియు ముద్రణాలయము నిర్మించడం గురించి ప్రభువు సూచనలను ఇస్తారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 94:2–12లో ఈ భవనాల గురించి ప్రభువు చెప్పిన దానిలో మిమ్మల్ని ఏది ఆకట్టుకుంది? 97:10–17లో దేవాలయం గురించి ఆయన చెప్పిన దానితో ఇది ఎలా పోల్చబడుతుంది?
మీ దృష్టిలో “పూర్తిగా ప్రభువుకు అంకితం” కావడమంటే అర్థమేమిటి?
ప్రభువు తాను ప్రేమించిన వారిని గద్దించును.
95వ ప్రకరణములోని బయల్పాటు పొందబడినప్పుడు, దేవుని మందిరాన్ని నిర్మించమని ప్రభువు పరిశుద్ధులను ఆదేశించినప్పటి నుండి దాదాపు ఐదు నెలలు గడిచాయి (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:117–19 చూడండి)—మరియు వారు ఇంకా ప్రారంభించలేదు. ఈ బయల్పాటులో ప్రభువు వారిని ఎలా సరిదిద్దారో గమనించండి. ప్రేరేపిత దిద్దుబాటు కోసం మీరు కనుగొన్న సూత్రాల జాబితాను కూడా మీరు తయారు చేయవచ్చు. ప్రభువు తన పరిశుద్ధులను సరిదిద్దిన విధానం నుండి మీరు ఆయన గురించి ఏమి నేర్చుకుంటారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 121:43–44 కూడా చూడండి.
God Loves His Children
సిద్ధాంతము మరియు నిబంధనలు 95:8, 11–17; 97:10–17
దేవాలయము ప్రభువు యొక్క మందిరము.
కర్ట్‌లాండ్‌లో ప్రభువు మందిరాన్ని నిర్మించనందుకు గద్దించబడిన తర్వాత, వారు నిర్మించగలుగునట్లు ఒక గోధుమ పొలంలో సంఘ నాయకులు స్థలాన్ని ఎన్నుకున్నారు. ప్రవక్త యొక్క అన్న హైరం స్మిత్ వెంటనే పరుగెత్తుకు వెళ్ళి, కొడవలి తెచ్చి పొలాన్ని శుభ్రం చేయసాగాడు. “ప్రభువు మందిరాన్ని నిర్మించడానికి మేము సిద్ధపడుతున్నాము మరియు నేను ఆ పని చేయడంలో అందరికంటే ముందు ఉండాలని నిశ్చయించుకున్నాను” అని అతడు చెప్పాడు (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 271, 273). దేవాలయాన్ని నిర్మించడానికి హైరం ఎందుకంత ఉత్సాహంగా ఉన్నాడని మీరనుకుంటున్నారు? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 95:8, 11–17; 97:10–17 చదువుతున్నప్పుడు, దీని గురించి ధ్యానించండి.
మన కాలంలో, ప్రభువు “మనం దేవాలయాలను నిర్మించే వేగాన్ని పెంచుతున్నారు” (రస్సెల్ ఎమ్. నెల్సన్,“దేవాలయంపై దృష్టిసారించండి,” లియహోనా, నవ. 2022, 121). యేసు క్రీస్తు యొక్క సంఘము ఇన్ని దేవాలయాలను ఎందుకు నిర్మిస్తుందని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మీరు ఏమి చెబుతారు? వీటిలో సాధ్యమైన జవాబుల కొరకు చూడండి:
-
క్రొత్త దేవాలయాలను ప్రకటిస్తున్న అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి సందేశాలు (“ఇదే సమయం,” లియహోనా, మే 2022, 126 వంటివి) చూడండి.
What Is a Temple?
కర్ట్‌లాండ్ దేవాలయాన్ని నిర్మించడానికి పరిశుద్ధులు చేసిన ప్రయత్నాలను దేవాలయంలో ప్రభువుతో అర్థవంతమైన అనుభవాల కోసం సిద్ధపడడానికి మీరు చేసే ప్రయత్నాలతో మీరు పోల్చవచ్చు. ప్రభువు యొక్క పరిశుద్ధ మందిరం పట్ల హైరం స్మిత్ భావించిన అదే ఆవశ్యకతను మీరు ఎలా చూపించగలరు? ఉదాహరణకు, హైరం పొలాన్ని శుభ్రం చేసినట్లుగా మీరు ఏమి చేయగలరు? మీరు ఏ త్యాగాలు చేయాలని ప్రభువు కోరుకుంటున్నారని మీరు భావిస్తున్నారు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 97:12 చూడండి).
కర్ట్‌లాండ్ దేవాలయము కొరకు స్థలాన్ని శుభ్రం చేస్తున్న హైరం స్మిత్.
సిద్ధాంతము మరియు నిబంధనలు 97:8–9
“వారు నా చేత అంగీకరించబడుదురు.”
ఒక సమూహం లేదా బృందంలో మీరు అంగీకరించబడిన లేదా అంగీకరించబడని సమయం గురించి ఆలోచించండి. ప్రభువు చేత అంగీకరించబడడం అంటే ఏమిటని సిద్ధాంతము మరియు నిబంధనలు 97:8–9 బోధించే దాని నుండి అది ఎలా సారూప్యంగా లేదా భిన్నంగా ఉంది? 9వ వచనములోని రూపకంతో ప్రభువు మీకు ఏమి బోధించడానికి ప్రయత్నిస్తున్నారని మీరు భావిస్తున్నారు?
నేర్చుకోవడం మరియు బోధించడం కోసం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించండి. “పరిశుద్ధాత్మ … మీకు సమస్తమును బోధించును” (యోహాను 14:26) అని యేసు వాగ్దానమిచ్చారు. కాబట్టి మీరు మీ స్వంతంగా లేదా ఇతరులతో నేర్చుకుంటున్నా, ఆత్మను ఆహ్వానించడానికి ప్రాధాన్యతనివ్వండి. పవిత్రమైన సంగీతం, ప్రార్థన మరియు ప్రేమతో కూడిన పరస్పర చర్యలు పరిశుద్ధాత్మ మీకు సత్యాన్ని బోధించే శాంతియుతమైన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడతాయి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 97:18–28
సీయోను అనగా “హృదయశుద్ధి గలవారు.”
1830లలో పరిశుద్ధులకు సీయోను అనేది ఒక ప్రదేశము. 97వ ప్రకరణములోని బయల్పాటులో, “హృదయశుద్ధి గల” (21వ వచనము) జనులను వర్ణించడానికి ప్రభువు నిర్వచనాన్ని విస్తరించారు. మీరు 18–28 వచనములు చదువుతున్నప్పుడు, సీయోను అనే పదాన్ని చదివినప్పుడు మీరు ప్రత్యామ్నాయంగా ఈ నిర్వచనాన్ని ఉంచవచ్చు. హృదయశుద్ధి గలవారిగా ఉండుట అనగా మీకు గల అర్థమేమిటి?
మోషే 7:18 కూడా చూడండి.
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 95:8; 97:10–17
దేవాలయము ప్రభువు యొక్క మందిరము.
-
95 మరియు 97 ప్రకరణముల నేపథ్యం కొరకు, మీరు మీ పిల్లలతో Doctrine and Covenants Stories for Young Readersలో “The Kirtland Temple” (Gospel Library; see also Saints, 1:210) ను పంచుకోవచ్చు. మీ పిల్లలు కర్ట్‌లాండ్ దేవాలయాన్ని (కట్టెలు కొట్టడం, మేకులు కొట్టడం, గోడలకు రంగులు వేయడం మరియు మొదలైనవి) నిర్మించడంలో సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ఆనందించవచ్చు. మనము దేవాలయాలను నిర్మించాలని ప్రభువు ఎందుకు కోరుకుంటున్నారో మీ పిల్లలకు బోధించడానికి మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 95:8 చదివేటప్పుడు, ఈ నమూనాలో ఉన్నటువంటి కర్ట్‌లాండ్ దేవాలయ చిత్రాన్ని కూడా మీరు వారికి చూపించవచ్చు.
The Kirtland Temple
-
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 97:15– 16ని కలిసి చదివిన తర్వాత, దేవాలయం మీకెందుకు ప్రత్యేకమైనది అనేదాని గురించి మీరు మరియు మీ పిల్లలు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. మీ పిల్లలకు ప్రభువు మందిరం పట్ల గౌరవం కలిగేలా సహాయం చేయడానికి మీరు కలిసి ఒక పాట కూడా పాడవచ్చు. దేవాలయం ఎందుకు పవిత్రమైనది?
సిద్ధాంతము మరియు నిబంధనలు 97:1–2, 8–9, 21
సీయోను అనగా “హృదయశుద్ధి గలవారు.”
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 97:21లో శుద్ధమైన పదానికి అర్థం ఏమిటో గ్రహించడానికి మీ పిల్లలకు సహాయం చేయడానికి, మీరు కలిసి ఒక గ్లాసుడు శుభ్రమైన నీటిని చూడవచ్చు మరియు దానిని అశుద్ధంగా మార్చేలా (మురికి లేదా మిరియాలు వంటివి) నీటిలో ఏదైనా కలపవచ్చు. నీరు శుద్ధంగా ఉండడం ఎందుకు ముఖ్యమైనది? అప్పుడు మీ పిల్లలు 21వ వచనమును చదవవచ్చు మరియు శుద్ధమైన అనే పదం మీద తమ వ్రేలు పెట్టవచ్చు. మన హృదయాలు శుద్ధిగా ఉండడం అంటే అర్థమేమిటి? 1–2, 8–9 వచనములు కొన్ని ఉపాయాలను అందించవచ్చు. మన హృదయాలను శుద్ధంగా చేయడానికి రక్షకుడు ఎలా సహాయం చేస్తారు?
హృదయమందు శుద్ధిగా ఉండాలని పరలోక తండ్రి నన్ను కోరుతున్నారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 97:8–9
ఆయనతో చేసిన నిబంధనలను నిలుపుకొనే వారిని ప్రభువు దీవిస్తారు.
-
మనము బాప్తిస్మం తీసుకున్నప్పుడు లేదా దేవాలయంలో ఉన్నప్పుడు ప్రభువుతో ఎలాంటి నిబంధనలు చేస్తామో మీ పిల్లలకు తెలుసా? మోషైయ 18:9–10, 13 లేదా ప్రధాన చేతిపుస్తకము, 27.2 చదవడం ద్వారా వారితో ఆ నిబంధనలను పునర్వీక్షించడాన్ని పరిగణించండి. “త్యాగము ద్వారా [మీ] నిబంధనలను పాటించడానికి” మీరు ఎలా ప్రయత్నిస్తున్నారో ఒకరితో ఒకరు పంచుకోండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 97:8).
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 97:9 వివరించే వాటి చిత్రాలను గీయమని మీరు మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. వారు తమ చిత్రాలను పంచుకుంటున్నప్పుడు, మీరు మీ నిబంధనలను పాటించినందుకు ప్రభువు మిమ్మల్ని ఎలా దీవించారో మాట్లాడండి. ఆ దీవెనలు “శుద్ధమైన నీటికాలువ ప్రక్కన నాటబడిన ఫలవంతమైన చెట్టు” వలె ఎలా ఉన్నాయి?
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.