Doctrine and Covenants 2025
ఆగష్టు 25–31: “ఆయన సంపూర్ణత్వమును పొందుము”: సిద్ధాంతము మరియు నిబంధనలు 93


“ఆగష్టు 25–31: ‘ఆయన సంపూర్ణత్వమును పొందుము’: సిద్ధాంతము మరియు నిబంధనలు 93,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 93,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు

I See the Son of Man [నేను మనుష్య కుమారుని చూస్తున్నాను] నుండి వివరణ, వాల్టర్ రానె చేత

ఆగష్టు 25–31: “ఆయన సంపూర్ణత్వమును పొందుము”

సిద్ధాంతము మరియు నిబంధనలు 93

“మీరు ఒక నిచ్చెన ఎక్కుతున్నప్పుడు, మీరు తప్పకుండా క్రింద నుండి మొదలుపెట్టి పైకి చేరేవరకు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలి; సువార్త సూత్రముల విషయములో కూడా అంతే—మీరు తప్పకుండా మొదటి దానితో మొదలుపెట్టి, ఉన్నతస్థితి యొక్క సూత్రాలన్నీ నేర్చుకొనే వరకు ముందుకు సాగాలి” అని జోసెఫ్ స్మిత్ బోధించారు (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 268).

కొన్నిసార్లు ఆ ఉన్నతస్థితి యొక్క నిచ్చెన అసాధ్యమైనదిగా అనిపించవచ్చు, కాని రక్షకుని నిరంతర సహాయంతో మనం పైకి ఎదగడానికి పుట్టాము. మనలో మనం ఎన్ని పరిమితులను చూసినా, పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడు మనలో మహిమకరమైనదేదో, దేవుని వంటిదేదో చూస్తున్నారు. యేసు క్రీస్తు “ఆదియందు తండ్రితో ఉన్నట్లే మీరు కూడా ఉన్నారు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:21, 23). ఆయన “సంపూర్ణత్వమును పొందువరకు కృప వెంబడి కృపయందు కొనసాగినట్లు, మీరు కృప వెంబడి కృపను పొందెదరు” (13, 20 వచనములు). పునఃస్థాపించబడిన సువార్త దేవుని యొక్క నిజమైన స్వభావము గురించి బోధిస్తుంది, అలాగే అది మీ నిజమైన స్వభావము మరియు గమ్యము గురించి కూడా బోధిస్తుంది. “తగిన కాలమందు ఆయన సంపూర్ణత్వమును పొందగల” (19వ వచనము) సామర్థ్యముతోనున్న దేవుని నిజమైన బిడ్డ మీరు.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 93

యేసు క్రీస్తు వలె నేను మహిమపరచబడగలను మరియు దేవుని యొక్క “సంపూర్ణత్వము”ను పొందగలను.

“దేవుని స్వభావాన్ని మనుషులు గ్రహించలేనట్లయితే, వారు తమనుతాము గ్రహించలేరు,” అని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించారు (Teachings: Joseph Smith, 40). సిద్ధాంతము మరియు నిబంధనలు 93 చదవడం ద్వారా మీరు రక్షకుని గురించి నేర్చుకుంటున్నప్పుడు, మీ గురించి కూడా మీరు నేర్చుకొనే దాని కొరకు చూడండి. ఉదాహరణకు, 3, 12–13, 21 మరియు 26 వచనముల నుండి ఆయన గురించి మీరేమి నేర్చుకుంటారు? 20, 23 మరియు 28–29 వచనములలో మీ గురించి మీరు అటువంటి ఏ సత్యాలను కనుగొంటారు? (1 యోహాను 3:2; 3 నీఫై 27:27 కూడా చూడండి). ఈ ప్రకరణములోని సత్యాలను అర్థం చేసుకోవడానికి మరియు అన్వయించుకోవడానికి క్రింది ప్రశ్నలు మీకు సహాయపడవచ్చు:

  • “కృప వెంబడి కృపను పొందుట” మరియు “కృప వెంబడి కృపయందు కొనసాగుట” అనగా అర్థమేమిటని మీరు భావిస్తున్నారు? (12–13 వచనములు).

  • మీరు ఎదగడానికి మరియు నేర్చుకోవడానికి దేవుడు మీకు ఎలా సహాయం చేస్తారనే దాని గురించి ఈ ప్రకరణములో మీరు ఏమి కనుగొంటారు? దీనిని తెలుసుకోవడం ఇతరులను మరియు మిమ్మల్ని మీరు ఆదరించే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

  • “ఏవిధముగా ఆరాధించవలెనో మరియు … దేనిని ఆరాధించవలెనో” అనే దాని గురించి మీరు ఏమి నేర్చుకుంటారు? (19వ వచనము).

సిద్ధాంతము మరియు నిబంధనలు 93:1–39

సెమినరీ చిహ్నము
వెలుగు, సత్యము దేవుని మహిమయైయున్నది.

ఈ బయల్పాటులో మహిమ, వెలుగు మరియు సత్యము తరచు చెప్పబడ్డాయని మీరు గమనించవచ్చు. ప్రత్యేకించి మీరు 20–39 వచనములు చదువుతున్నప్పుడు, ఈ భావాల గురించి మీరు నేర్చుకొనే సత్యాల జాబితా తయారుచేయండి. ఇటువంటి ఒక పట్టిక తయారు చేయడం మీకు సహాయపడవచ్చు:

వచనము

నేనేమి నేర్చుకుంటాను

ధ్యానించవలసిన ప్రశ్నలు

వచనము

24

నేనేమి నేర్చుకుంటాను

ధ్యానించవలసిన ప్రశ్నలు

లోకములో అనేక మోసాలున్నాయి. నేను సత్యాన్ని ఎలా తెలుసుకోగలను? (జేకబ్ 4:13 కూడా చూడండి).

వచనము

28

నేనేమి నేర్చుకుంటాను

ధ్యానించవలసిన ప్రశ్నలు

వచనము

36

నేనేమి నేర్చుకుంటాను

దేవుడు సత్యము మరియు వెలుగు గల వ్యక్తి.

ధ్యానించవలసిన ప్రశ్నలు

వచనము

37

నేనేమి నేర్చుకుంటాను

ధ్యానించవలసిన ప్రశ్నలు

చెడు ప్రభావాలను ఎదిరించగలిగిన వారు నాకు ఎవరు తెలుసు? వారు దీన్ని ఎందుకు చేయగలుగుతున్నారు?

వచనము

నేనేమి నేర్చుకుంటాను

ధ్యానించవలసిన ప్రశ్నలు

వచనము

నేనేమి నేర్చుకుంటాను

ధ్యానించవలసిన ప్రశ్నలు

వచనము

సిద్ధాంతము మరియు నిబంధనలు 50:24 కూడా చూడండి.

నేనేమి నేర్చుకుంటాను

ధ్యానించవలసిన ప్రశ్నలు

అధిక వెలుగు మరియు సత్యమును వెదకడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా దేనిని మీరు ఈ వచనాలలో కనుగొంటారు? వెలుగు మరియు సత్యము అనేవి ఎందుకు యేసు క్రీస్తుకు మంచి పేర్లు? (యోహాను 8:12; 14:6 చూడండి) ఈ సత్యాలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

20, 22, 28, 33–35 వచనములలో మీరు మీ నిత్య గమ్యము గురించిన వాగ్దానాలను కూడా గమనించవచ్చు ఈ వాగ్దానాలకు మరియు వెలుగును పొందడానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?

6:40

Light and Truth, Part 1

6:52

Light and Truth, Part 2

దేవాలయములో కిటికీ

“వెలుగు, సత్యము దేవుని మహిమయైయున్నది.”

సిద్ధాంతము మరియు నిబంధనలు 93:40–50

“నీ ఇంటిని నీవు చక్కబెట్టుకోవలెను.”

“నీ ఇంటిని నీవు చక్కబెట్టుకోవలెను” (43వ వచనము) అనే ఆజ్ఞ అల్మారాలు మరియు సామాను గదులు నిర్వహించడం గురించి కాదు, కానీ బోధించడం—మరియు నేర్చుకోవడం—“వెలుగు మరియు సత్యము” (42వ వచనము) గురించినది. ఈ సలహాను అనుసరించడానికి మీరెలా ప్రయత్నిస్తున్నారో పరిగణించండి. ఏ సవాళ్ళను మీరు ఎదుర్కొంటారు? సిద్ధాంతము మరియు నిబంధనలు 93 లోని ఏ సత్యాలు సహాయపడగలవు?

ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ గారి ద్వారా ఈ బోధనల నుండి మీరు ఏ అంతర్దృష్టులను పొందుతారు?

“నా కార్యాలయంలో గోధుమ పొలాల అందమైన వర్ణచిత్రం ఉంది. వర్ణచిత్రం అనేది వేర్వేరు కుంచె గీతల యొక్క విస్తారమైన సేకరణ—ఒంటరిగా ఏదీ చాలా ఆసక్తికరంగా లేదా ఆకట్టుకునేదిగా ఉండదు. నిజానికి, మీరు కాన్వాస్‌కు దగ్గరగా నిలబడితే, మీరు చూడగలిగేది పసుపు, బంగారు మరియు గోధుమ రంగు పెయింట్‌లతో సంబంధం లేని మరియు ఆకర్షణీయం కాని గీతలు మాత్రమే. అయితే, మీరు క్రమక్రమంగా కాన్వాస్ నుండి దూరంగా వెళ్ళినప్పుడు, అన్ని వేర్వేరు కుంచె గీతలు ఒకదానితో ఒకటి మిళితం అవుతాయి మరియు గోధుమ పొలము యొక్క అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. అనేక సాధారణ, వేర్వేరు కుంచె గీతలు ఆకర్షణీయమైన మరియు అందమైన వర్ణచిత్రాన్ని రూపొందించడానికి కలిసి పనిచేస్తాయి.

“ప్రతి కుటుంబ ప్రార్థన, కుటుంబ లేఖన అధ్యయనం యొక్క ప్రతి భాగము మరియు ప్రతి కుటుంబ గృహ సాయంకాలము మన ఆత్మల వస్త్రముపై కుంచెతో గీయబడిన ఒక గీత వంటిది. ఏ ఒక్క సంఘటన చాలా ఆకట్టుకునేదిగా లేదా చిరస్మరణీయమైనదిగా కనిపించకపోవచ్చు. కానీ ఏవిధంగా పసుపు, బంగారు మరియు గోధుమ రంగుల గీతలు ఒకదానికి ఒకటి చక్కగా ఇమిడిపోయి ఒక గొప్ప ఆకర్షణీయమైన కళాఖండాన్ని ఉత్పత్తి చేస్తాయో, అదేవిధంగా నిలకడగా మనం చేసే చిన్న చిన్న పనులు ప్రాముఖ్యమైన ఆత్మీయ ఫలితాలకు దారితీస్తాయి. ‘కాబట్టి, మంచి చేయుట యందు విసుగులేకయుండుడి, ఏలయనగా మీరు ఒక గొప్ప కార్యమునకు పునాది వేయుచున్నారు. చిన్నవిషయముల నుండి గొప్ప సంగతులు సంభవించును’ [సిద్ధాంతము మరియు నిబంధనలు 64:33]. మన వ్యక్తిగత జీవితంలో ఒక గొప్ప పనికి పునాది వేసేటప్పుడు మరియు మన స్వంత ఇళ్ళలో మనం మరింత శ్రద్ధగా మరియు ఆతురతగా ఉన్నప్పుడు స్థిరత్వం అనేది ఒక ముఖ్య సూత్రం” (“More Diligent and Concerned at Home,” Liahona, Nov. 2009, 19–20).

హెన్రీ బి. ఐరింగ్, “ప్రభువు ఆత్మ నివసించే గృహము,” లియహోనా, మే 2019, 22–25 కూడా చూడండి.

కలిసి ప్రార్థిస్తున్న ఒక కుటుంబం

“[తమ] పిల్లలను వెలుగునందు, సత్యమునందు” పెంచాలని ప్రభువు తల్లిదండ్రులను ఆజ్ఞాపించారు.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 93:2–21

యేసు క్రీస్తు లోకము యొక్క వెలుగు మరియు జీవమైయున్నారు.

  • రక్షకుని చిత్రాన్ని చూపించి, యేసు క్రీస్తు గురించి తెలుసుకోవడం మరియు అనుసరించడం ఎందుకు ముఖ్యం అని మీ పిల్లలను అడగడం గురించి ఆలోచించండి. అప్పుడు మీరు ఒక ముఖ్యమైన కారణాన్ని కనుగొనడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 93:19 కలిసి చదవవచ్చు.

  • 93వ ప్రకరణములో క్రీస్తు గురించి మీకు స్ఫూర్తినిచ్చేవి మరియు వాటిని కనుగొనడంలో మరియు అర్థం చేసుకోవడంలో మీ పిల్లలకు సహాయపడే అనేక సత్యాలను మీరు ఎంచుకోవాలనుకోవచ్చు. మీరు ఎంచుకున్న ప్రతి సత్యం కోసం, మీరు కలిసి వచనాన్ని చదివేటప్పుడు వినడానికి మీ పిల్లలకు ఒక పదాన్ని లేదా వాక్యభాగాన్ని ఇవ్వవచ్చు. ఉదాహరణకు, యేసు క్రీస్తు:

    1:18

    Chapter 33: A Revelation about Jesus Christ: May 1833

క్రీస్తు యొక్క వర్ణచిత్రము

Light of the World [లోకమునకు వెలుగు] నుండి వివరణ, హావర్డ్ లియోన్ చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 93:23, 29, 38

నేను భూమిపైకి రాకముందు నేను పరలోక తండ్రితో జీవించాను.

  • “ఆదియందు” మనం దేవునితో జీవించామని (23, 29, 38 వచనములు చూడండి) రక్షకుడు 93వ ప్రకరణములో మూడుసార్లు నొక్కిచెప్పారు. మీ పిల్లలు దీనిని కనుగొనడంలో సహాయపడేందుకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 93:23, 29, 38 చదవమని మరియు వారి గురించి ఈ వచనాలలో పునరావృతం చేయబడిన సత్యము కొరకు చూడమని మీరు వారిని ఆహ్వానించవచ్చు. మనం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని పరలోక తండ్రి ఎందుకు కోరుకుంటున్నారు? మనము పుట్టకముందు పరలోక తండ్రితో మన జీవితం గురించి వారికి ఏమి తెలుసని కూడా మీరు మీ పిల్లలను అడగవచ్చు. మరింత నేర్చుకోవడానికి వారికి సహాయపడేందుకు, వారితోపాటు క్రింది లేఖన గద్యభాగములలో ఒకటి లేదా ఎక్కువ చదవండి: యిర్మీయా 1:5; సిద్ధాంతము మరియు నిబంధనలు 138:53–56; మోషే 3:5; అబ్రాహాము 3:22–26.

సిద్ధాంతము మరియు నిబంధనలు 93:24–39

నేను దేవునికి లోబడినప్పుడు నేను వెలుగును, సత్యమును పొందుతాను.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 93 లో విధేయత గురించిన సత్యాలను అన్వయించడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, కాగితపు ముక్కలపై ఈ ప్రకరణము నుండి కొన్ని లేఖన సూచికలను వ్రాయడాన్ని పరిగణించండి. వేరే కాగితపు ముక్కలపై, ఈ వచనాలలో ప్రతీఒక్కటి బోధించే సత్యాలను వ్రాయండి. మీ పిల్లలు వచనాలను చదవడానికి మరియు లేఖన సూచికలతో సత్యాలను జతపరచడానికి కలిసి పని చేయవచ్చు. ఉదాహరణలు వీటిని కలిగి ఉండవచ్చు:

    • 24వ వచనము: సత్యమనగా, గతము, ప్రస్తుతము మరియు భవిష్యత్తులో నిజముగా ఉన్న సంగతుల గురించి తెలుసుకోవడం.

    • 28వ వచనము: నేను ఆజ్ఞలను పాటించినప్పుడు, నేను వెలుగును, సత్యమును పొందగలను.

    • 37వ వచనము: నేను వెలుగును, సత్యమును కలిగియున్నప్పుడు నేను చెడును ఎదిరించగలను.

    • 39వ వచనము: నేను అవిధేయునిగా ఉన్నప్పడు, నేను వెలుగును, సత్యమును కోల్పోతాను.

    మీరు ప్రభువు ఆజ్ఞలను పాటించినందున మీరు తెలుసుకున్న సత్యాల ఉదాహరణలను మీరు పంచుకోవాలనుకోవచ్చు.

మీ పిల్లల వయస్సుకు అనుగుణంగా మార్చండి. మీ పిల్లల అవసరాలు మరియు సామర్థ్యాలు మీకు తెలుసు; వారి అవసరాలకు అనుగుణంగా ప్రోత్సాహకార్యక్రమ ఉపాయాలను మార్చడానికి సంకోచించకండి. ఉదాహరణకు, ఈ ప్రోత్సాహకార్యక్రమంలో, మీరు చిన్న పిల్లలకు బోధిస్తున్నట్లయితే, 93వ ప్రకరణము నుండి ఒక సాధారణ సత్యంపై దృష్టి పెట్టడం మంచిది.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

తోరా నుండి క్రీస్తు బోధిస్తున్న పెయింటింగ్

Light and Truth [వెలుగు మరియు సత్యము], సైమన్ డ్యూయీ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ