“ఆగష్టు 11–17: ‘ఒక దేవుని మందిరమును స్థాపించుడి’: సిద్ధాంతము మరియు నిబంధనలు 88,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 88,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
ఈ గదిలోనే ప్రవక్తల పాఠశాల జరిగింది.
ఆగష్టు 11–17: “ఒక దేవుని మందిరమును స్థాపించుడి”
సిద్ధాంతము మరియు నిబంధనలు 88
తన ప్రవక్తలకు విస్తృతమైన బయల్పాటులు ఇవ్వడం ద్వారా, అప్పుడప్పుడు ప్రభువు తన అపారమైన “మహత్యము మరియు ప్రభావము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:47) యొక్క చిన్న క్షణదర్శనాన్ని మనకిస్తారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 88 అటువంటి ఒక బయల్పాటు—వెలుగు, మహిమ మరియు రాజ్యములకు సంబంధించినది, దానితో సరిపోల్చినప్పుడు మన భూలోక సమస్యలు అల్పమైనవిగా కనిపించేలా అది చేయగలదు. వాటన్నిటిని మనం అర్థం చేసుకోలేకపోయినప్పటికీ, నిత్యత్వమునకు సంబంధించి మనమిప్పుడు గ్రహించగలిగిన దానికంటే ఎంతో ఎక్కువ ఉన్నదని మాత్రము మనం తెలుసుకోగలుగుతాము. మనల్ని భయపెట్టడానికో లేదా తక్కువ చేసి చూపించడానికో ప్రభువు ఈ గొప్ప మర్మముల గురించి మాట్లాడలేదు. వాస్తవానికి, “ఒక దినము వచ్చును, మీరు అప్పుడు దేవుడిని కూడా చూచెదరు” (49వ వచనము; వివరణ చేర్చబడింది) అని ఆయన వాగ్దానం చేసారు. బహుశా ఈ ఉన్నతమైన అంతమునకే ప్రభువు కర్ట్‌లాండ్‌లోని తన పరిశుద్ధులను ప్రవక్తల పాఠశాల నెలకొల్పమని ప్రేరేపించారు. “మిమ్ములను మీరు ఏర్పాటు చేసుకొనుడి,” అని ఆయన చెప్పారు. “అవసరమైన ప్రతిదానిని సిద్ధపరచుకొనుడి; … ఒక దేవుని మందిరమును స్థాపించుడి” (119వ వచనము). దేవుని పరిశుద్ధ మందిరములోనే—మన ఇళ్ళలోనే—ఇతర ప్రదేశాలలో కంటే ఎక్కువగా ఆయన మర్త్య లోకమును మించి మన దృష్టిని పైకెత్తగలరు, “తన ముఖము యొక్క ముసుగును [మన] యెదుట తొలగించి,” “సిలెస్టియల్ మహిమను సహించుటకు” మనల్ని సిద్ధపరచగలరు (68, 22 వచనాలు).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
యేసు క్రీస్తు నాకు శాంతిని అందిస్తారు.
“సమస్త జనముల మీద యుద్ధము వ్యాపించునని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 87:2) హెచ్చరించిన కొద్ది రోజుల తర్వాత, జోసెఫ్ స్మిత్ “ఒలీవ ఆకు” అని పిలిచిన ఒక బయల్పాటును ప్రభువు ఇచ్చారు, అది శాంతికి సాంప్రదాయ చిహ్నం (సిద్ధాంతము మరియు నిబంధనలు 88, ప్రకరణ శీర్షిక; ఆదికాండము 8:11 కూడా చూడండి). మీరు ఈ వారం సిద్ధాంతము మరియు నిబంధనలు 88 అధ్యయనం చేస్తున్నప్పుడు, మీ కొరకు ప్రభువు యొక్క శాంతి సందేశాలను అన్వేషించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:6–67
వెలుగు మరియు ధర్మశాస్త్రము యేసు క్రీస్తు నుండి వస్తాయి.
వెలుగు మరియు ధర్మశాస్త్రము అనే పదాలు 88వ ప్రకరణములో అనేకసార్లు ఉదహరించబడ్డాయి. 6–67 వచనములలో ఈ పదాలను మీరు కనుగొనిన వచనాలను గుర్తించండి లేదా గమనించండి మరియు వెలుగు, ధర్మశాస్త్రము—మరియు యేసు క్రీస్తు గురించి మీరు నేర్చుకున్న దానిని వ్రాయండి. వెలుగును పొందడానికి మరియు “క్రీస్తు ధర్మశాస్త్రాన్ని” జీవించడానికి మీరు ఏమి చేయాలని ప్రేరేపించబడ్డారు? (21వ వచనము).
యెషయా 60:19; యోహాను 1:1–9; 3 నీఫై 15:9; తిమోతి జె. డైచెస్, “వెలుగు వెలుగును హత్తుకొనును,” లియహోనా, మే 2021, 112–15; షారన్ యుబాంక్, “క్రీస్తు: అంధకారములో ప్రకాశించు వెలుగు,” లియహోనా, మే 2019, 73–76 కూడా చూడండి.
లేఖనాలు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని కలిగియున్నాయి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:62–64
“నా యొద్దకు రండి.”
ఈ వచనాల్లోని వాగ్దానాలు నిజమని మీకు ఏ అనుభవాలు చూపించాయి? క్రీస్తు యొద్దకు “వచ్చుటకు” మీరు తీసుకొనే తదుపరి చర్య ఏమిటి?
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:67–76
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా నేను శుద్ధునిగా మారగలను.
88వ ప్రకరణము (68, 74 వచనములు) లో “మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి” అనే ప్రభువు యొక్క ఆజ్ఞ రెండుసార్లు కనిపిస్తుంది. ఈ వాక్యభాగానికి అర్థం ఏమిటని మీరనుకుంటున్నారు? లేఖన దీపికలో “Sanctification” క్రింద కొన్ని గద్యభాగాలను మీరు పునర్వీక్షించవచ్చు (సువార్త గ్రంథాలయము). మనం ఏవిధంగా పరిశుద్ధపరచబడతాము? ఈ ప్రశ్న సిద్ధాంతము మరియు నిబంధనలు 88:67–76 యొక్క మీ అధ్యయనాన్ని నడిపించనివ్వండి మరియు మీరు పొందే ఆత్మీయ అంతరార్థములను నమోదు చేయండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:77-80, 118-26
“అధ్యయనము ద్వారా, విశ్వాసము ద్వారా నేర్చుకొనుటకు ప్రయత్నించుడి.”
కర్ట్‌లాండ్‌లో “ప్రవక్తల పాఠశాల” స్థాపించమని ప్రభువు పరిశుద్ధులతో చెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:137). 88వ ప్రకరణములోని ఉపదేశములో అధికభాగము దానిని ఎలా చేయాలో వారికి బోధించింది. ఈ సూచన మీ స్వంత జీవితంలో “ఒక అభ్యాసమందిరాన్ని స్థాపించడానికి” (119వ వచనము) కూడా మీకు సహాయపడగలదు. వాస్తవానికి, మీరు 77–80 మరియు 118–26 వచనములను “సువార్త నేర్చుకొనుటకు కేంద్రముగా మరియు “విశ్వాస మందిరముగా” మీ గృహమును [లేదా మీ జీవితమును] పునర్నిర్మించుటకు” (రస్సెల్ ఎమ్. నెల్సన్, “మార్గదర్శకులైన కడవరి-దిన పరిశుద్ధులగుట,” లియహోనా, నవ. 2018, 113) నమూనా చిత్రంగా చూడవచ్చు. మీరు అన్వయించుకోవాలని భావించే ఈ వచనాలలోని వాక్యభాగాలతో సహా మీ వ్యక్తిగత “పునర్నిర్మాణం” ఎలా ఉంటుందో చిత్తుగా వ్రాసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
ఇది ఈ ప్రశ్నలను అన్వేషించడానికి కూడా సహాయపడవచ్చు: అభ్యాసం మరియు విద్య ప్రభువుకు ఎందుకు ముఖ్యమైనవి? నేను ఏమి చదువుకోవాలని ఆయన కోరుకుంటున్నారు? నేను ఎలా నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నారు? 77–80 వచనములలో ఈ ప్రశ్నలకు జవాబుల కొరకు చూడండి.
“అధ్యయనము ద్వారా, విశ్వాసము ద్వారా కూడా” నేర్చుకొనుట అనగా అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (118వ వచనము). ఎల్డర్ మథియాస్ హెల్డ్ గారి సందేశము, “ఆత్మ ద్వారా జ్ఞానమును వెదకుట” నుండి ఏ అంతరార్థములను మీరు పొందుతారు? (లియహోనా, మే 2019, 31-33).
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:33
పరలోక తండ్రి మంచి బహుమానాలిస్తారు.
-
వారికివ్వబడిన బహుమానాలు—వారు సంతోషంగా స్వీకరించినవి మరియు వారు స్వీకరించని వాటి గురించి మాట్లాడమని మీ పిల్లలను అడగడం ద్వారా సిద్ధాంతము మరియు నిబంధనలు 88:33 గురించి మీరు చర్చను ప్రారంభించవచ్చు. బహుశా వారు ఆనందంతో బహుమానాన్ని అందుకుంటున్నట్లు నటించవచ్చు. అప్పుడు మీరు పరలోక తండ్రి మనకు ఇచ్చే బహుమానాల గురించి మాట్లాడవచ్చు (పరిశుద్ధాత్మ వరము వంటివి). ఈ బహుమానాలను మనం ఆనందంతో ఎలా స్వీకరిస్తాం?
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:63
నేను రక్షకుడిని వెదికితే, నేను ఆయనను కనుగొంటాను.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:63 మీ పిల్లలు తమ జీవితాల్లో ప్రభువు ఉనికిని కోరుకునేలా ప్రోత్సహించడానికి కొన్ని సరదా కార్యకలాపాలను ప్రేరేపించే అభినయ పదాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు, మీరు మరియు మీ పిల్లలు “శ్రద్ధతో నన్ను వెదకుడి, మీరు నన్ను కనుగొందురు” (వివరణ చేర్చబడింది) లేదా “తట్టుడి, మీకది తెరువబడును” అనే వాక్యభాగాన్ని చర్చించడానికి ఒక ఆట గురించి ఆలోచించగలరా?
పిల్లలకు వైవిధ్యం కావాలి. బహుళ ఇంద్రియాల ప్రమేయం ఉన్నప్పుడు చాలామంది పిల్లలు ఉత్తమంగా నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకునేటప్పుడు వారి దృష్టి, వినికిడి మరియు స్పర్శ ఇంద్రియాలను ఉపయోగించడంలో సహాయపడే మార్గాలను కనుగొనండి. కొన్ని సందర్భాలలో, మీరు వారి వాసన మరియు రుచి యొక్క వివేకాన్ని ఉపయోగించడానికి మార్గాలను కూడా కనుగొనవచ్చు!” (రక్షకుని విధానములో బోధించుట, 32).
-
“నా యొద్దకు రండి” అనే రక్షకుని ఆహ్వానాన్ని నొక్కి చెప్పడానికి, మీరు ఒక పిల్లవాడిని గదికి ఒకవైపున యేసు చిత్రాన్ని (ఈ నమూనా చివర ఉన్న చిత్రం వంటిది) పట్టుకోమని అడగవచ్చు మరియు మిగిలిన పిల్లలు మరోవైపు నిలబడతారు. రక్షకునికి దగ్గరవడానికి వారు చేయగల విషయాల గురించి మీ పిల్లలు ఆలోచించినప్పుడు, వారు చిత్రం వైపు ఒక అడుగు వేయవచ్చు మరియు చిత్రాన్ని పట్టుకున్న పిల్లవాడు ఇతర పిల్లల వైపు ఒక అడుగు వేయవచ్చు. మీరు రక్షకునికి ఎలా దగ్గరవుతారు మరియు ఆయన మీకు ఎలా దగ్గరవుతారు అనే దాని గురించి మీ పిల్లలతో మాట్లాడండి. మీరు వారితో కలిసి ఈ అంశంపై ఒక పాట కూడా పాడవచ్చు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:77–80, 118
నేను నేర్చుకోవాలని పరలోక తండ్రి కోరుతున్నారు.
-
వారు పాఠశాలలో లేదా ప్రాథమికలో నేర్చుకుంటున్న వాటి గురించి మీకు చెప్పమని మీ పిల్లలను అడగండి. మీరు నేర్చుకుంటున్న వాటి గురించి కూడా మీరు పంచుకోవచ్చు. అప్పుడు మీరు ఏమిటి, ఎందుకు మరియు ఎలా అనే పదాలను మీ పిల్లలకు చూపవచ్చు. మనము దేని గురించి నేర్చుకోవాలని ప్రభువు కోరుతున్నారనే దానిని కనుగొనడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 88:77–79 ను పరిశోధించడానికి వారికి సహాయపడండి. మనం నేర్చుకోవాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి 80వ వచనములో మరియు మనం ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవడానికి 118వ వచనములో కలిసి చూడండి.
“అధ్యయనము ద్వారా, విశ్వాసము ద్వారా నేర్చుకొనుటకు ప్రయత్నించుడి.”
సిద్ధాంతము మరియు నిబంధనలు 88:119
మన ఇల్లు దేవాలయము వలె పరిశుద్ధముగా ఉండగలదు.
-
మీరు మీ పిల్లలతో సిద్ధాంతము మరియు నిబంధనలు 88:119 చదువుతున్నప్పుడు, “ఇల్లు” అనే పదం విన్న ప్రతిసారీ వారు తమ చేతులతో దేవాలయ శిఖరాన్ని తయారు చేయవచ్చు. జోసెఫ్ స్మిత్ మరియు పరిశుద్ధులు ఒక దేవాలయాన్ని లేదా “దేవుని మందిరమును” నిర్మించాలని పరలోక తండ్రి కోరుకున్నారని వివరించండి.
-
వారి ఇంటిని వివరించే ఏడు పదాలను ఎంచుకోమని మీరు మీ పిల్లలను అడగవచ్చు. అప్పుడు, సిద్ధాంతము మరియు నిబంధనలు 88:119లో, ప్రభువు తన ఇంటిని వివరించడానికి ఉపయోగించే ఏడు పదాలను కనుగొనడంలో వారికి సహాయపడండి. మన ఇంటిని “దేవుని మందిరము”గా మనమెలా చేసుకోగలము?
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.