Doctrine and Covenants 2025
ఆగష్టు 18–24: “వాగ్దానముతో కూడిన సూత్రము”: సిద్ధాంతము మరియు నిబంధనలు 89–92


“ఆగష్టు 18–24: ‘వాగ్దానముతో కూడిన సూత్రము’: సిద్ధాంతము మరియు నిబంధనలు 89–92,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 89–92,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

కలిసి వంట చేస్తున్న జంట

ఆగష్టు 18–24: “వాగ్దానముతో కూడిన సూత్రము”

సిద్ధాంతము మరియు నిబంధనలు 89–92

ప్రవక్తల పాఠశాలలో, ఇశ్రాయేలు పెద్దలకు భూమి మీద దేవుని రాజ్యమును నిర్మించడం గురించి ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించారు. వారు ఆత్మీయ సత్యాలను చర్చించారు, కలిసి ప్రార్థించారు, ఉపవాసమున్నారు మరియు సువార్తను ప్రకటించడానికి సిద్ధపడ్డారు. కానీ అక్కడి వాతావరణం నేడు మనకు అసాధారణంగా కనిపించవచ్చు మరియు ఎమ్మా స్మిత్‌కు కూడా అది సరైనదిగా అనిపించలేదు. ఈ సమావేశాలప్పుడు, పురుషులు పొగత్రాగి, పొగాకు నమిలేవారు, ఆ కాలంలో అది అసాధారణమైనది కాదు, కానీ దానివలన చెక్క నేలల మీద మరకలు పడి, గాలిలో గాఢమైన వాసన ఉండేది. ఎమ్మా తన విచారాలను జోసెఫ్‌తో పంచుకుంది మరియు జోసెఫ్ ప్రభువును అడిగారు. ఫలితంగా, పొగ మరియు పొగాకు మరకలను మించిన ఒక బయల్పాటు వచ్చింది. అది రాబోయే తరాల కొరకు, పరిశుద్ధులకు, “వాగ్దానముతో కూడిన సూత్రము”ను, అనగా శారీరక ఆరోగ్యమును, “జ్ఞానమును,” “జ్ఞానము యొక్క గొప్ప నిధులను” వాగ్దానమిచ్చింది (సిద్ధాంతము మరియు నిబంధనలు 89:3, 19).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 89

సెమినరీ చిహ్నము
శరీరమందు, ఆత్మయందు ఆరోగ్యంగా ఉండడానికి నాకు సహాయపడేందుకు ప్రభువు నాకు జ్ఞానవాక్యమునిచ్చారు.

ప్రవక్తల పాఠశాలలోని పెద్దలు జోసెఫ్ స్మిత్ మొదటిసారి జ్ఞానవాక్యమును చదువగా వినినప్పుడు, వారు వెంటనే “వారి పొగాకు డబ్బాలను, గొట్టాలను మంటల్లోకి విసిరివేసారు” (Saints, 1:168). ప్రభువుకు విధేయులు కావడానికి వారి సమ్మతిని వారు చూపాలనుకున్నారు. జ్ఞానవాక్యము వద్దని వారించే పదార్థాలను బహుశా మీ జీవితం నుండి మీరు ఇదివరకే “విసిరివేసియుండవచ్చు”, కానీ ఈ బయల్పాటు నుండి మీరు ఇంకేమి నేర్చుకోగలరు? ఈ ఉపాయాలను పరిగణించండి:

  • ఈ బయల్పాటును “వాగ్దానముతో కూడిన సూత్రము”గా (3వ వచనము)—నిర్ణయాలు తీసుకోవడాన్ని నడిపించే శాశ్వత సత్యాలుగా పరిగణించండి. మీ నిర్ణయాలను నడిపించగలిగేలా మీరు కనుగొను సూత్రాలేవి? ప్రభువు ఏ దీవెనలను వాగ్దానం చేస్తున్నారు? (18–21 వచనములు చూడండి). మీ జీవితంలో ఆ వాగ్దానాలను ఆయన ఏ విధంగా నెరవేర్చారు?

  • “రహస్యముగా దుష్టాలోచనలు చేయు మనుష్యుల హృదయాలలో ఉండు … దుష్టత్వము మరియు ప్రణాళికలకు” ఎటువంటి ఉదాహరణలను మీరు చూసారు? (4వ వచనము). ఈ బయల్పాటుకు అదనంగా, ఈ చెడులను జయించడానికి లేదా తప్పించుకోవడానికి మీకు సహాయపడేలా ప్రభువు ఇచ్చినదేమిటి?

  • ప్రభువు గురించి ఈ బయల్పాటు మీకేమి బోధిస్తుంది? జ్ఞానవాక్యము సిద్ధాంతము మరియు నిబంధనలు 29: 34–35తో ఎలా సంబంధం కలిగియుంది?

  • మీ శరీరముపట్ల బాగా శ్రద్ధ వహించడానికి ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?

మీరు జ్ఞానవాక్యాన్ని ఎందుకు జీవిస్తున్నారో ఇతరులకు వివరించడానికి మీరు అవకాశాలు కలిగియుండవచ్చు మరియు భవిష్యత్తులో మీరు మరిన్ని అవకాశాలు కలిగియుండవచ్చు. రక్షకుడు, మన శరీరాల పవిత్రత మరియు ఇతర ఆధ్యాత్మిక సత్యాల గురించి సాక్ష్యమివ్వడానికి మీరు ఈ అవకాశాలను ఎలా ఉపయోగించవచ్చో పరిగణించండి.

1 కొరింథీయులకు 6:19–20 కూడా చూడండి.

4:40

Principles and Promises

సూత్రాల ద్వారా నేర్చుకోండి మరియు బోధించండి. చేయవలసినవి మరియు చేయకూడని వాటి జాబితాలను సృష్టించే బదులు, క్రీస్తుయందు మన కర్తృత్వాన్ని మరియు విశ్వాసాన్ని సాధన చేయడానికి మనం సూత్రాల ప్రకారం జీవించవచ్చు. ఉదాహరణకు, జ్ఞానవాక్యానికి సంబంధించి ఇలాంటి సూత్ర-ఆధారిత ప్రశ్నలను పరిగణించండి: జ్ఞానవాక్యానికి లోబడడానికి కష్టపడే వ్యక్తికి ఏ సూత్రాలు ప్రోత్సాహాన్ని ఇవ్వగలవు? జ్ఞానవాక్యాన్ని పాటిస్తున్నప్పటికీ నాకు ఆరోగ్య సమస్యలున్నప్పుడు ఏ సూత్రాలు నన్ను ఓదార్చగలవు?

యోగా చేస్తున్న స్త్రీ

మన శరీరాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని పరలోక తండ్రి మనల్ని కోరుతున్నారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 90:1–17

“రాజ్యపు తాళపుచెవులను” ప్రథమ అధ్యక్షత్వము కలిగియుంటారు.

90వ ప్రకరణములో, ఇప్పుడు మనం ప్రథమ అధ్యక్షత్వము అని పిలిచే దాని సభ్యులైన జోసెఫ్ స్మిత్, సిడ్నీ రిగ్డన్ మరియు ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ యొక్క “పరిచర్య మరియు అధ్యక్షత్వము” (12వ వచనము) గురించి ప్రభువు ఉపదేశాలిచ్చారు. 1–17 వచనముల నుండి ప్రథమ అధ్యక్షత్వము గురించి మీరేమి నేర్చుకుంటారు? ప్రథమ అధ్యక్షత్వము యొక్క సభ్యుల నుండి ఇటీవలి సందేశాలను పునర్వీక్షించండి. “ఈ సంఘము మరియు రాజ్యము యొక్క వ్యవహారములన్నిటిని సక్రమములో ఉంచడానికి” వారు ఏమి చేస్తారు? (16వ వచనము). అవి మీకు “తేలికైన విషయాలు” కావని మీరెలా చూపగలరు? (5వ వచనము).

ఈ వచనాలలోని బోధనలకు సంబంధించి ప్రవక్తల గురించి ఒక పాటను పాడడం లేదా పదాలను చదవడం గురించి ఆలోచించండి. ప్రథమ అధ్యక్షత్వము యొక్క సేవ పరలోక తండ్రికి మరియు యేసు క్రీస్తుకు దగ్గరవ్వడానికి మీకు ఎలా సహాయపడింది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 90:24

“(నా) మేలుకొరకు సమస్తము సమకూడి జరుగును.”

సిద్ధాంతము మరియు నిబంధనలు 90:24లో ప్రభువు యొక్క వాగ్దానానికి సాక్ష్యమిచ్చేవిధంగా మీరు కలిగియున్న అనుభవాలను ధ్యానించండి. మీ అనుభవాలను నమోదు చేసి, వాటిని ఒక కుటుంబ సభ్యుడు లేదా ప్రియమైన వారితో—అభయము లేదా ప్రోత్సాహము అవసరమైన వారెవరితోనైనా పంచుకోవడాన్ని పరిగణించండి. మీరు ఇంకా నిర్దిష్ట దీవెనల కొరకు వేచిచూస్తున్నట్లయితే, ఏవిధంగా “మీ మేలుకొరకు సమస్తము సమకూడి జరుగునో” చూడడానికి మీరు వేచియున్నప్పుడు, విశ్వాసంగా నిలిచియుండేందుకు మీరు ఏమి చేయగలరో ధ్యానించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 90:28–31

వియెన్నా జాక్వెస్ ఎవరు?

వియెన్నా జాక్వెస్ మస్సాచుసెట్స్‌లో 1787, జూన్ 10న జన్మించింది. చెప్పుకోదగినంత ఆర్థిక వనరులు కలిగియున్న విశ్వాసముగల స్త్రీ అయిన వియెన్నా మొదటిసారి 1831లో సువార్తికులను కలిసింది. వారి సందేశము నిజమని ఒక ఆత్మీయ సాక్ష్యాన్ని పొందిన తర్వాత, ఆమె కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తను కలవడానికి ప్రయాణమైంది, అక్కడ ఆమె బాప్తిస్మము పొందింది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 90:28–31లో ప్రభువు ఆమెకిచ్చిన ఉపదేశానికి వియెన్నా లోబడింది. అంతకుముందు కర్ట్‌లాండ్‌లో ఆమె ఇచ్చిన విరాళాలతో కలిపి ప్రభువుకు ఆమె సమర్పించినది ఒక క్లిష్ట సమయములో సంఘానికి వచ్చింది, ఆ సమయంలో నాయకులు కర్ట్‌లాండ్ దేవాలయాన్ని నిర్మించడానికి స్థలము కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వియెన్నా తన జీవితమంతా “సోమరిగానుండక, విశ్వాసముగా” ఉంది మరియు చివరకు సాల్ట్ లేక్ లోయలో “సమాధానముతో ఆమె స్థిరపడగలిగింది” (31వ వచనము), అక్కడ ఆమె 96వ యేట మరణించింది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 91

“ఆత్మ సత్యమును ప్రత్యక్షపరచును.”

మనమందరం “సత్యమైన అనేక సంగతులు” మరియు “సత్యము కాని అనేక విషయాలు” గల సందేశాలను ఎదుర్కొంటాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 91:1–2). మీరు ఎదుర్కొనే సందేశాలలోని సత్యాన్ని గుర్తించడంలో మీకు సహాయపడగలిగేలా 91వ ప్రకరణములో మీరు ఏ సలహాను కనుగొంటారు? సత్యం మరియు దోషం మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి ఆత్మ మీకు ఎలా సహాయపడ్డారు?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 02

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 89

జ్ఞానవాక్యము శరీరమందు, ఆత్మయందు ఆరోగ్యంగా ఉండడానికి నాకు సహాయపడుతుంది.

  • 89వ ప్రకరణమును పరిచయం చేయడానికి, బహుశా మీరు మరియు మీ పిల్లలు ఒక దేవాలయ చిత్రాన్ని చూడవచ్చు లేదా మన శరీరాలు మన ఆత్మల కొరకు దేవాలయాల వలె ఉన్నాయని బోధించడానికి శారీరక ఆరోగ్యం గురించి ఒక పాట పాడవచ్చు. మీ పిల్లలు తమ శరీరాలపట్ల శ్రద్ధ చూపే మార్గాలను నటించి చూపడంలో సహాయపడండి.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 89:10–17లోని ప్రభువు ఆజ్ఞల గురించి తెలుసుకోవడానికి, మీరు మరియు మీ పిల్లలు మన శరీరాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం తినగలిగేవి లేదా చేయగలిగే మంచి విషయాల చిత్రాలను గీయవచ్చు లేదా చూడవచ్చు (ఈ నమూనా చివరిలో ఉన్న చిత్రం మరియు ప్రోత్సాహ కార్యక్రమ పేజీని చూడండి). ఏమి ఉపయోగించకూడదని ప్రభువు మనలను హెచ్చరించారు? మన శరీరాలపట్ల మనం శ్రద్ధ చూపాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నారు?

    2:56

    జ్ఞానవాక్యము: ప్రభువు యొక్క ఆరోగ్య చట్టము

  • ఆల్కహాల్ లేదా డ్రగ్స్‌తో శోధనలకు లోనైనప్పుడు వారు ఏమి చేయాలో ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని ఎల్డర్ గ్యారీ ఈ. స్టీవెన్‌సన్ యువతకు సలహా ఇచ్చారు. ఆయన ఇలా బోధించారు: “శోధన మీపై తక్కువ నియంత్రణను కలిగియుంటుందని మీరు కనుగొంటారు. మీరు ఎలా స్పందిస్తారు మరియు మీరేమి చేస్తారో ఇదివరకే మీరు నిర్ణయాన్ని చేసారు. శోధనను మీరు ఎదుర్కొన్న ప్రతీసారి మీరు నిర్ణయము చేయనవసరం లేదు” (“మీ యాజకత్వ వ్యూహగ్రంథము,” లియహోనా, మే 2019, 48). సిద్ధాంతము మరియు నిబంధనలు 89:4ను మరియు ఎల్డర్ స్టీవెన్‌సన్ గారి వ్యాఖ్యానాన్ని కలిసి చదివిన తర్వాత, జ్ఞానవాక్యాన్ని జీవించడానికి ఇప్పుడు—వారి జీవితాంతం—మీ పిల్లలు ఎలా నిర్ణయించుకోగలరనే దాని గురించి వారితో చర్చించండి. ఒక స్నేహితుడితో సహా ఎవరైనా జ్ఞానవాక్యానికి విరుద్ధంగా ఏదైనా వారికి అందజేస్తే వారు ఎలా స్పందిస్తారో కూడా మీరు నటించి చూపవచ్చు. మనము జ్ఞానవాక్యమును పాటించినప్పుడు ప్రభువు మనల్ని ఎలా దీవిస్తారు? (18–21 వచనములను చూడండి).

సముద్రతీరంలో ఆడుకుంటున్న పిల్లలు

మన శరీరాలు దేవుడిచ్చిన బహుమానాలు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 90:5

నన్ను నడిపించడానికి మరియు రక్షించడానికి దేవుడు నాకు ప్రవక్తలను ఇస్తారు.

  • మీరు ప్రాచీన ప్రవక్తల చిత్రాలను చూడవచ్చు లేదా ఒక పాట పాడవచ్చు. దేవుడు తన ప్రవక్తల ద్వారా తన పిల్లలను ఎలా ఆశీర్వదించారు? మనం దేవుని ప్రవక్తల మాట ఎందుకు వినాలి? (సిద్ధాంతము మరియు నిబంధనలు 90:5 చూడండి). అప్పుడు మీరు మరియు మీ పిల్లలు జీవించి ఉన్న ప్రవక్త చిత్రాన్ని చూసి, ఆయన ద్వారా ప్రభువు మనకు బోధించిన లేదా హెచ్చరించిన కొన్ని విషయాలను పంచుకోవచ్చు. మనం ప్రవక్తను ఎలా అనుసరించగలము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 91

ఏది నిజమో తెలుసుకోవడానికి ఆత్మ నాకు సహాయం చేయగలడు.

  • ఈ బయల్పాటు ఎందుకు ఇవ్వబడిందో మీ పిల్లలకు అర్థం చేసుకోవడానికి మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 91 యొక్క ప్రకరణ శీర్షికను సంక్షిప్తపరచవచ్చు. అప్పుడు వారు మీడియా వంటి ప్రదేశాల గురించి ఆలోచించగలరు, అక్కడ మనం “సత్యమైన అనేక సంగతులు” మరియు “సత్యముకాని అనేక విషయాలు” (1–2 వచనములు) కనుగొనవచ్చు. 4–6 వచనములు పరిశుద్ధాత్మ గురించి మనకు ఏమి బోధిస్తాయి? ఏది సరైనదో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు ఎలా సహాయం చేస్తారు?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ఫలము

“అన్నిరకముల ధాన్యములు, అలాగే ద్రాక్షాఫలములు మనుష్యుని ఆహారమునకు మంచివే.”

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ