Doctrine and Covenants 2025
ఆగష్టు 4–10: “పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుడి”: సిద్ధాంతము మరియు నిబంధనలు 85–87


“ఆగష్టు 4–10: ‘పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుడి’: సిద్ధాంతము మరియు నిబంధనలు 85–87,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 85–87,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

దేవాలయాన్ని సమీపిస్తున్న కుటుంబము

ఆగష్టు 4–10: “పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుడి”

సిద్ధాంతము మరియు నిబంధనలు 85–87

సాధారణంగా క్రిస్మస్ రోజు, “భూమి మీద సమాధానము” (లూకా 2:14 చూడండి) వంటి సందేశాలను ధ్యానించే సమయము. కానీ 1832, డిసెంబరు 25న జోసెఫ్ స్మిత్ మనసంతా యుద్ధ భయముతో నిండిపోయింది. అప్పుడే దక్షిణ కరోలినా, సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వాన్ని వ్యతిరేకించి యుద్ధానికి సిద్ధమవుతోంది. మరియు ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ప్రభువు బయల్పరిచారు: “సమస్త జనముల మీద యుద్ధము వ్యాపించును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 87:2) అని ఆయన ప్రకటించారు. ఈ ప్రవచనము అతి త్వరలో నెరవేరబోతున్నట్లు అనిపించింది.

కానీ అప్పుడది జరుగలేదు. కొద్ది వారాలలోపు, దక్షిణ కరోలినా మరియు సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వాలు సంధి కుదుర్చుకున్నాయి మరియు యుద్ధము తప్పిపోయింది. కానీ బయల్పాటు ఎల్లప్పుడూ మనం కోరుకున్న సమయంలో లేదా ఆశించిన విధంగా నెరవేర్చబడదు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత, జోసెఫ్ స్మిత్ మతం కోసం చంపబడిన చాలా కాలానికి దక్షిణ కరోలినా తిరుగుబాటు చేసింది మరియు పౌర యుద్ధం మొదలైంది. నేడు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధము “భూమి దుఃఖించునట్లు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 87:6) చేయడాన్ని కొనసాగిస్తోంది. ఈ బయల్పాటు యొక్క విలువ విపత్తు ఎప్పుడు వస్తుందని ఊహించడంలో తక్కువగాను, అది వచ్చినప్పుడు ఏమి చేయాలని బోధించడంలో ఎక్కువగాను ఉంది. 1831, 1861 మరియు 2021లో ఉపదేశము ఒక్కటే: “పరిశుద్ధ స్థలములలో మీరు కదలక నిలిచియుండుడి” (8వ వచనము).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 85:1–2

“చరిత్రను వ్రాసియుంచాలని” ప్రభువు నన్ను కోరుతున్నారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 85:1–2లో వివరించబడిన “చరిత్ర”లో ప్రభువు ఏమి చేర్చాలనుకుంటున్నారో గమనించండి తన పరిశుద్ధులు చరిత్రను వ్రాసియుంచాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? మీకు మరియు భవిష్యత్ తరాలకు ఒక దీవెనగా ఉండునట్లు మీ “జీవనశైలి, [మీ] విశ్వాసము మరియు పనుల” గురించి మీరేమి నమోదు చేయగలరు? వ్యక్తిగత చరిత్రను వ్రాసియుంచడం క్రీస్తునొద్దకు వచ్చుటకు మీకేవిధంగా సహాయపడవచ్చు?

ChurchofJesusChrist.org.

3:6

Turning Hearts

సిద్ధాంతము మరియు నిబంధనలు 85:6

ఆత్మ “మిక్కిలి నిమ్మళమైన స్వరము”తో మాట్లాడును.

సిద్ధాంతము మరియు నిబంధనలు 85:6లో ఆత్మను వర్ణించడానికి జోసెఫ్ స్మిత్ ఉపయోగించిన పదాలను ధ్యానించండి. ఆత్మ యొక్క స్వరము ఏ విధంగా “మిక్కిలి నిమ్మళముగా” ఉంది? జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన ఈ అదనపు వర్ణనలను పరిగణించండి: సిద్ధాంతము మరియు నిబంధనలు 6:22–24; 8:2–3; 9:7–9; 11:12–13; 128:1. ఆత్మ మీతో ఎలా మాట్లాడును?

లూకా 24:32; మోషైయ 5:2; ఆల్మా 32:28; హీలమన్ 5:30; సిద్ధాంతము మరియు నిబంధనలు 6:22–23; 11:12–13 కూడా చూడండి.

వస్తు పాఠములను ఉపయోగించండి. వారు నేర్చుకుంటున్న దానికి సంబంధించిన వస్తుపాఠాన్ని చూసినప్పుడు లేదా అందులో పాల్గొన్నప్పుడు జనులు సువార్త పాఠాన్ని బాగా గుర్తుంచుకుంటారు. ఉదాహరణకు, ఆత్మ యొక్క మిక్కిలి నిమ్మళమైన స్వరము గురించి బోధించేటప్పుడు, మీరు మృదువైన, పవిత్రమైన సంగీతం యొక్క రికార్డింగును వినిపించవచ్చు మరియు అభ్యాసకులు సంగీతం తమకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది మరియు మనసును చెదరగొట్టు శబ్దాలున్నప్పుడు వినడానికి ఎంత కష్టంగా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడవచ్చు. ఇది మన జీవితంలో మిక్కిలి నిమ్మళమైన స్వరాన్ని వినకుండా చేసే పరధ్యానాల గురించిన చర్చకు దారితీయగలదు.

లేఖనములను చదువుతున్న యువతి

లేఖనములు ఆత్మ యొక్క స్వరాన్ని మిక్కిలి నిమ్మళమైన స్వరముగా వర్ణిస్తాయి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 86

అంత్యదినాలలో నీతిమంతులు క్రీస్తునొద్దకు సమకూర్చబడ్డారు.

మత్తయి 13:24–30, 37–43లో కనుగొనబడు గోధుమలు మరియు గురుగుల ఉపమానం యొక్క వివరణను సిద్ధాంతము మరియు నిబంధనలు 86 కలిగియుంది. మీరు ఈ ఉపమానం యొక్క అర్థం గురించి తెలుసుకున్నప్పుడు, ఇలాంటి పట్టికను పూరించడాన్ని పరిగణించండి:

చిహ్నములు

సాధ్యమైన అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

చిహ్నములు

విత్తులు విత్తేవారు

సాధ్యమైన అర్థాలు

ప్రవక్తలు మరియు అపొస్తలులు

ధ్యానించవలసిన ప్రశ్నలు

ప్రవక్తలు మరియు అపొస్తలులు ఎలాంటి “విత్తనాలను” నాటుతారు?

చిహ్నములు

శత్రువు

సాధ్యమైన అర్థాలు

సాతాను

ధ్యానించవలసిన ప్రశ్నలు

ప్రభువు పనిని ఆపడానికి అపవాది ఎలా ప్రయత్నిస్తాడు?

చిహ్నములు

సాధ్యమైన అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

చిహ్నములు

సాధ్యమైన అర్థాలు

ధ్యానించవలసిన ప్రశ్నలు

పరిగణించవలసిన అదనపు ప్రశ్నలు కొన్ని ఇక్కడున్నాయి:

  • ఉపమానము యొక్క అర్థం చెప్పిన తర్వాత, ప్రభువు యాజకత్వము, పునఃస్థాపన మరియు తన జనుల రక్షణ గురించి మాట్లాడారు (8–11 వచనములు చూడండి). ఈ విషయాలు మరియు గోధుమలు, గురుగుల ఉపమానము మధ్య ఏ సంబంధాలను మీరు చూస్తున్నారు?

  • “అన్యజనులకు వెలుగుగా” మరియు “[ప్రభువు యొక్క] జనులకు రక్షకునిగా” ఉండుటలో మీ పాత్ర ఏమిటి? (11వ వచనము).

సిద్ధాంతము మరియు నిబంధనలు 87

సెమినరీ చిహ్నము
“పరిశుద్ధ స్థలములలో” సమాధానము కనుగొనబడును.

87వ ప్రకరణమములోని ప్రవచనము చివరి రోజుల్లో యుద్ధానికి సంబంధించిన భౌతిక ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది. అయితే ఈ బయల్పాటులోని సలహా ఆధ్యాత్మిక ప్రమాదాలకు కూడా వర్తిస్తుంది. క్రింది వంటి ప్రశ్నలను ధ్యానించండి:

  • ప్రవచనం అనేది దేవుని నుండి ఒక ప్రవక్తకు, తరచుగా భవిష్యత్తు గురించి వచ్చే బయల్పాటు. ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తలు ఇచ్చిన ప్రవచనాలకు కొన్ని ఉదాహరణలు ఏవి? (యోహాను 3:14; మోషైయ 3:5; హీలమన్ 14:2–6 చూడండి). అవి ఎలా నెరవేర్చబడ్డాయి? (లూకా 23:33; మత్తయి 15:30–31; 3 నీఫై 1:15–21 చూడండి).

  • దేవుని ప్రవక్తల ప్రవచనాలను అంగీకరించడం వల్ల కలిగే దీవెనలేవి?

ఆ ఆలోచనలను దృష్టిలో ఉంచుకుని, 87వ ప్రకరణము చదవండి. (కొంత చారిత్రక సందర్భం కోసం, మీరు ఈ నమూనా యొక్క పరిచయాన్ని కూడా చదవాలనుకోవచ్చు.) ఈ బయల్పాటు మరియు అది నెరవేరిన విధానం నుండి ప్రవచనం గురించి మీరు ఏమి నేర్చుకుంటారు? ప్రవచనం తక్షణమే నెరవేరనందున దానిపై అనుమానం ఉన్న వ్యక్తికి మీరు ఏమి చెబుతారు?

8వ వచనములో ప్రభువు ఏ సలహా ఇస్తారు? మీరు సమాధానమును, భద్రతను కనుగొనే మీ “పరిశుద్ధ స్థలములు” ఏవి? ఏది ఒక స్థలమును పరిశుద్ధముగా చేస్తుంది? భౌతిక ప్రదేశాలకు అదనంగా, బహుశా శాంతిని అందించగల పరిశుద్ధ సమయాలు, పరిశుద్ధ అభ్యాసాలు లేదా పరిశుద్ధ ఆలోచనలు గలవు. ఉదాహరణకు, దేవుని ప్రవక్తల మాటలు మీకు ఎలా పరిశుద్ధ స్థలంగా ఉండగలవు? ఈ స్థలముల నుండి “కదలకయుండడం” అంటే అర్థమేమిటి?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 03

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 85:6

ఆత్మ “మిక్కిలి నిమ్మళమైన స్వరము”తో మాట్లాడును.

  • పరిశుద్ధాత్మ వారితో మాట్లాడినప్పుడు వారికెలా తెలుస్తుందని ఎవరైనా అడిగితే మీ పిల్లలు ఏమి చెబుతారు? సిద్ధాంతము మరియు నిబంధనలు 85:6లో జోసెఫ్ స్మిత్ ఆత్మ యొక్క స్వరాన్ని వివరించిన ఒక మార్గం గురించి చదవడానికి వారిని ఆహ్వానించండి. అప్పుడు వారు చిన్న స్వరంతో వినడం మరియు మాట్లాడడం సాధన చేయవచ్చు. ఆత్మ మీతో మిక్కిలి నిమ్మళమైన స్వరంతో మాట్లాడినప్పటి అనుభవాలను కూడా మీరు పంచుకోవచ్చు.

  • ఆత్మను తరచుగా అనుభూతి చెందడానికి మన జీవితాల నుండి ఏ పరధ్యానాలను మనం తొలగించవచ్చు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 86

దేవుని జనులను సమకూర్చడంలో నేను సహాయం చేయగలను.

  • 86వ ప్రకరణము లో వివరించబడిన ఉపమానమును అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, మీరు గోధుమల యొక్క అనేక చిన్న చిత్రాలు లేదా రేఖాచిత్రాలను సిద్ధం చేయవచ్చు మరియు వాటిని గది చుట్టూ దాచవచ్చు. మీ పిల్లలకు గోధుమలు, గురుగుల ఉపమానాన్ని వివరించండి (మత్తయి 13:24–30 చూడండి) మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 86:1–7లో ప్రభువు యొక్క వ్యాఖ్యానాన్ని కలిసి చదవండి. అప్పుడు మీ పిల్లలు గోధుమల యొక్క దాచిన చిత్రాలను సేకరించి, యేసు క్రీస్తు యొద్దకు వారు “సమకూర్చగల” వారి పేరును వాటిపై వ్రాయవచ్చు. యేసు క్రీస్తు యొద్దకు జనులను సమకూర్చడం అంటే అర్థమేమిటి? మనం దీన్ని చేయగల కొన్ని మార్గాలేవి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 86:11

నేను ఇతరులకు వెలుగుగా ఉండగలను.

  • మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 86:11ను చర్చిస్తున్నప్పుడు మీ పిల్లలను అడగగలిగే కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి: వెలుగు మనల్ని ఎలా దీవిస్తుంది? మనకు వెలుగు లేనప్పుడు ఎలా ఉంటుంది? మనం ఇతరులకు వెలుగుగా ఎలా ఉండగలం? మనం “[యేసు] మంచితనంలో కొనసాగగల” మరియు దానిని ఇతరులతో పంచుకోగల మార్గాల గురించి ఆలోచించేలా మీ పిల్లలకు సహాయం చేయండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 87:6, 8

నేను “పరిశుద్ధ స్థలములలో నిలిచియుండగలను.”

  • కడవరి దినాల్లో జరుగుతాయని ప్రభువు చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 87:6ను కలిసి చదవండి. అప్పుడు మీరు మరియు మీ పిల్లలు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్ళ గురించి మీరు మాట్లాడవచ్చు. 8వ వచనములో, కష్ట సమయాల్లో మనం ఏమి చేయగలమని ప్రభువు చెప్పారు?

  • ఆధ్యాత్మిక ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సహాయపడే పరిశుద్ధ స్థలాలు, పరిశుద్ధ ఆలోచనలు మరియు పరిశుద్ధ చర్యల జాబితాను రూపొందించడంలో మీ పిల్లలకు సహాయపడండి.

    5:36

    Standing in Holy Places

    4:36

    Stand Ye in Holy Places - Bloom Where You’re Planted

తన బిడ్డకు దేవాలయాన్ని చూపుతున్న తల్లి

దేవాలయం ఒక పరిశుద్ధ ప్రదేశం.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

పొలములో గోధుమలు

ప్రభువు తన జనులను గోధుమల వలె సమకూరుస్తారు.

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ