Doctrine and Covenants 2025
పునఃస్థాపన స్వరములు: సీయోను దళం


“పునఃస్థాపన స్వరములు: సీయోను దళం,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సీయోను దళం,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

పునఃస్థాపన స్వరముల చిహ్నము

పునఃస్థాపన స్వరములు

సీయోను దళం

సీయోను దళం జాక్సన్ కౌంటీలోని పరిశుద్ధులకు వారి స్థలాలను ఎన్నడూ పునఃస్థాపించనందున, అనేకమంది తమ ప్రయత్నం విఫలమైనదని భావించారు. అయినప్పటికీ, సీయోను దళంలో పాల్గొన్నవారిలో అనేకులు వారి అనుభవాన్ని తలచుకుని, ప్రభువు వారి జీవితాల్లో మరియు ఆయన రాజ్యంలో ఉన్నతమైన ఉద్దేశ్యాలను ఎలా నెరవేర్చారో చూసారు. వారి సాక్ష్యాలలో కొన్ని ఇక్కడున్నాయి:

జోసెఫ్ స్మిత్

One drawing in pencil, charcoal and ink on paper.  A left profile, head/shoulders portrait of Joseph Smith; drawn basically in charcoal, highlighted with white paint and black ink.  titled at bottom "Jospeh Smith the Prophet."  Signed at left shoulder "Drawn from the most authentic sources by Dan Weggeland"  A drawn border surrounds it.  No date apparent.

సీయోను దళం ఏర్పడిన 40 ఏళ్ళ తర్వాత, జోసెఫ్ స్మిత్ క్రింది విధంగా చెప్పారని ఆ దళ సభ్యుడైన జోసెఫ్ యంగ్ నివేదించాడు:

“సహోదరులారా, మీరు మిస్సోరిలో యుద్ధం చేయనందున మీలో కొంతమంది నాపై కోపంగా ఉన్నారు; కానీ, మీరు యుద్ధం చేయాలని దేవుడు కోరలేదని నేను మీతో చెప్తున్నాను. తమ జీవితాలను అర్పించి, అబ్రాహాము చేసినట్లుగా గొప్ప త్యాగాన్ని చేసిన పురుషుల సమూహము నుండి ఆయన వారిని ఎంచుకుంటే తప్ప, భూమిపై నున్న దేశాలకు సువార్త ద్వారాలను తెరవడానికి పన్నెండుమంది మరియు వారి అడుగుజాడలను అనుసరించడానికి వారి మార్గనిర్దేశంలో డెబ్బదిమందితో ఆయన తన రాజ్యాన్ని వ్యవస్థీకరించలేకపోయారు.

“ఇప్పుడు, తన పన్నెండుమందిని మరియు తన డెబ్బదిమందిని ప్రభువు దక్కించుకున్నారు, డెబ్బదుల యొక్క ఇతర సమూహాలు పిలువబడతాయి, వారు త్యాగము చేస్తారు మరియు ఇప్పుడు త్యాగాలు చేయనివారు, అర్పణలు చేయనివారు ఇకముందు వాటిని చేస్తారు.”

బ్రిగమ్ యంగ్

Photograph of Brigham Young in stately side pose.

“మేము మిస్సోరి చేరుకున్నప్పుడు ప్రభువు తన సేవకుడైన జోసెఫ్‌తో మాట్లాడి, ‘నేను నీ అర్పణను అంగీకరించానని’ చెప్పారు మరియు మేము మరలా తిరిగివచ్చే అవకాశాన్ని కలిగియున్నాము. మిస్సోరికి వెళ్ళి, ఏమీ సాధించకుండానే తిరిగిరావడానికి తమ పనుల్లో ఉన్నవారిని పిలవడంలో లాభమేమి ఉందని నేను తిరిగివచ్చినప్పుడు అనేకమంది స్నేహితులు నన్ను అడిగారు. ‘అది ఎవరికి లాభం చేకూర్చింది?’ అని వారడిగారు. ‘అది చేయబడాలని ప్రభువు ఆజ్ఞాపించియుంటే, ఈ విధంగా చేయడంలో ఆయన ఉద్దేశ్యమేమిటి?’ … నాకు బాగానే చెల్లించబడింది—అధిక వడ్డీతో సహా చెల్లించబడింది—అవును, ప్రవక్తతోపాటు ప్రయాణించడం ద్వారా నేను పొందిన జ్ఞానంతో పొంగిపొరలునట్లు నిండుకొలతతో నేను కొలవబడ్డానని నేను ఆ సహోదరులకు చెప్పాను.”

విల్ఫర్డ్ ఉడ్రఫ్

Portrait of Wilford Woodruff. He is depicted wearing a black suit, vest and bow tie, seated in a red chair and resting one arm on the arm rest and the other on a table.

“దేవుని ప్రవక్తతోపాటు నేను సీయోను దళంలో ఉన్నాను. ఆయనతో దేవుని వ్యవహారాలను నేను చూసాను. దేవుని శక్తి ఆయనతో ఉండడం నేను చూసాను. ఆయన ఒక ప్రవక్తయని నేను చూసాను. ఆ నియమితకార్యంలో దేవుని శక్తి చేత ఆయనకు ప్రత్యక్షపరచబడినది నా దృష్టిలో మరియు ఆయన సూచనలను అందుకున్న వారందరి దృష్టిలో చాలా విలువైనది.”

“సీయోను దళం యొక్క సభ్యులు పిలువబడినప్పుడు, మాలో అనేకమంది ఒకరినొకరు ఎప్పుడూ చూసుకోలేదు; మేము అపరిచితులము మరియు చాలామంది ఎన్నడూ ప్రవక్తను చూడలేదు. జొన్నలు జల్లెడలో జల్లించబడినట్లు, దేశమంతటా మేము చెల్లాచెదురు చేయబడ్డాము. మేము యువకులము మరియు ఆనాడు వెళ్ళి, సీయోనును విమోచించడానికి పిలువబడ్డాము, మేము చేయవలసినదంతా విశ్వాసంతో చేయాలి. వివిధ రాష్ట్రాల నుండి మేము కర్ట్‌లాండ్‌లో సమకూడాము మరియు మాకు దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి సీయోనును విమోచించేందుకు వెళ్ళాము. అబ్రాహాము పనులను అంగీకరించినట్లే, ప్రభువు మా పనులను అంగీకరించారు. ‘మీరు ఏమి చేసారు?’ అని అనేకసార్లు విశ్వాసభ్రష్టులు మరియు అవిశ్వాసులు ప్రశ్నించినప్పటికీ, మేము గొప్ప పనిని సాధించాము. మరేవిధంగాను మేము ఎన్నడూ సంపాదించలేని అనుభవాన్ని మేము సంపాదించాము. ప్రవక్త ముఖాన్ని చూసే అవకాశం మాకు కలిగింది మరియు ఆయనతో వెయ్యి మైళ్ళు ప్రయాణించడానికి, ఆయనతో దేవుని ఆత్మ పనిచేయడాన్ని, యేసు క్రీస్తు యొక్క బయల్పాటులు ఆయనకు రావడాన్ని మరియు ఆ బయల్పాటుల యొక్క నెరవేర్పును చూడడానికి మాకు అవకాశం కలిగింది. ఆనాడు దేశమంతటి నుండి రెండు వందలమంది పెద్దలను సమకూర్చి, ఆయన యేసు క్రీస్తు సువార్తను బోధించడానికి మమ్మల్ని ప్రపంచంలోనికి పంపారు. నేను సీయోను దళంతో వెళ్ళకపోయినట్లయితే, నేడు నేనిక్కడ ఉండేవాడిని కాదు (సాల్ట్ లేక్ సిటీలో పన్నెండుమంది సమూహములో సేవచేస్తూ). … అక్కడికి వెళ్ళడం ద్వారా మేము సువార్తను బోధించడానికి వెంటనే అవకాశమివ్వబడ్డాము మరియు ప్రభువు మా పనులను అంగీకరించారు. మా శ్రమలు, హింసలన్నిటిలో తరచు మా జీవితాలను పణంగా పెట్టి మేము పనిచేయవలసి వచ్చింది మరియు విశ్వాసంతో జీవించవలసి వచ్చింది.”

“సీయోను దళంలో ప్రయాణించడం వలన (మేము) పొందిన అనుభవం బంగారం కంటే ఎంతో విలువైనది.”

వివరణలు

  1. In Joseph Young Sr., History of the Organization of the Seventies (1878), 14.

  2. “Discourse,” Deseret News, Dec. 3, 1862, 177.

  3. In Conference Report, Apr. 1898, 29–30; see also Teachings of Presidents of the Church: Wilford Woodruff (2004), 135.

  4. “Discourse,” Deseret News, Dec. 22, 1869, 543; see also Teachings: Wilford Woodruff, 138.

  5. Deseret News: Semi-Weekly, July 27, 1880, 2; see also Teachings: Wilford Woodruff, 138.