Doctrine and Covenants 2025
అక్టోబరు 20–26: “ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు?”: సిద్ధాంతము మరియు నిబంధనలు 121–123


“అక్టోబరు 20-26: ‘ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు?’: సిద్ధాంతము మరియు నిబంధనలు 121–123,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 121–123,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

లిబర్టీ చెరసాలలో జోసెఫ్ స్మిత్

Liberty Jail [లిబర్టీ చెరసాల], వెల్డన్ ఆండెర్సెన్ చేత

అక్టోబరు 20–26: “ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు?”

సిద్ధాంతము మరియు నిబంధనలు 121–123

మిస్సోరిలోని లిబర్టీలో చెరసాల క్రింది భాగము “చీకటికొట్టుగా” పేరొందింది. గోడలు మందంగా, రాతినేల చల్లగా, మురికిగా ఉండి, అక్కడ ఇచ్చే కొద్ది ఆహారము క్రుళ్ళిపోయి ఉండేది మరియు పైకప్పు దగ్గరనున్న రెండు సన్నని కిటికీ చువ్వల మధ్య నుండి మాత్రమే వెలుతురు వచ్చేది. 1838–39 యొక్క చలికాలంలో జోసెఫ్ స్మిత్ మరియు ఇతరులు ఈ ప్రదేశంలో నాలుగు నెలలు నిరుత్సాహంతో గడిపారు. ఈ సమయంలో, పరిశుద్ధులు పడుతున్న బాధ గురించి నిరంతరం జోసెఫ్ సమాచారాన్ని అందుకున్నారు. ఫార్‌ వెస్ట్ యొక్క శాంతి మరియు ఆశావాదం కొద్దినెలలే నిలిచింది, ఇప్పుడు మరలా పరిశుద్ధులు నిరాశ్రయులయ్యారు, అరణ్యంలోనికి తరుమబడి మళ్ళీ ప్రారంభించడానికి మరొక ప్రదేశాన్ని వెదుకుతున్నారు—ఈసారి వారి ప్రవక్త చెరసాలలో ఉన్నారు.

అయినప్పటికీ, ఆ దీనస్థితిలోనున్న చెరసాలలో కూడా “పరలోకము నుండి జ్ఞానము క్రుమ్మరించబడింది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:33). “ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు?” అనే జోసెఫ్ ప్రశ్న స్పష్టంగా మరియు శక్తివంతంగా జవాబివ్వబడింది: “భయపడకుము … , ఏలయనగా దేవుడు నిరంతరము నీకు తోడైయుండును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1; 122:9).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1–10, 23–33; 122

దేవునితో, ప్రతికూలత “[నా] మేలు కొరకైయుండగలదు.”

మనము లేదా మనం ప్రేమించేవారు బాధపడుతున్నప్పుడు, మన గురించి దేవుడికి తెలుసా అని ఆశ్చర్యపోవడం అతిసాధారణం. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1–6 చదువుతున్నప్పుడు, జోసెఫ్ స్మిత్‌కు కలిగినటువంటి ప్రశ్నలు లేదా భావాలు మీకు కలిగిన సమయాల గురించి ఆలోచించండి. మీకు అలాంటి ప్రశ్నలు లేదా భావాలు కలిగినప్పుడు మీకు సహాయపడేలా ప్రభువు యొక్క జవాబు నుండి మీరేమి కనుగొంటారు? ఉదాహరణకు, 7–10, 26–33 వచనములలో ఆయన వాగ్దానమిస్తున్న దీవెనలను గమనించండి. “సహించడం” అంటే అర్థమేమిటని మీరనుకుంటున్నారు? దీనిని చేయడానికి రక్షకుడు మీకేవిధంగా సహాయపడతారు?

మీరు 122వ ప్రకరణము చదువుతున్నప్పుడు, మీ ప్రతికూలతలను మీరు ఏవిధంగా చూడాలని ప్రభువు కోరుతున్నారో పరిగణించండి. మీ శ్రమల నుండి కలిగిన అనుభవాలు మరియు అవి “[మీ] మేలు కొరకు” (7వ వచనము) ఎలా ఉండవచ్చో మీరు ధ్యానించవచ్చు.

క్వింటిన్ ఎల్. కుక్, “కష్ట కాలములలో వ్యక్తిగత శాంతి,” లియహోనా, నవ. 2021, 89–92 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 121:34–46

సెమినరీ చిహ్నము
నిజమైన శక్తి మరియు ప్రభావం “నీతి సూత్రాలపై” ఆధారపడి ఉన్నాయి.

ప్రాపంచిక శక్తి బలవంతంగా పరిశుద్ధులను మిస్సోరి నుండి బయటకు మరియు జోసెఫ్ స్మిత్‌ను జైలులోకి నెట్టింది. కానీ జోసెఫ్ అక్కడ ఉన్నప్పుడు, ప్రభువు అతనికి వేరే రకమైన శక్తి గురించి బోధించారు: ఆయన శక్తి, “పరలోక శక్తులు.” సిద్ధాంతము మరియు నిబంధనలు 121:34–46లో ఆ శక్తి గురించి చదవడం ఆ శక్తిని ఎలా పొందాలో మరియు ఇతరులను ఆశీర్వదించడానికి దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. పరలోక శక్తులు మరియు ప్రాపంచిక శక్తి అని పేరు పెట్టబడిన నిలువు వరుసలతో మీరు నేర్చుకున్న వాటిని మీరు పట్టికలో నమోదు చేయవచ్చు. ఈ రెండు రకాల శక్తి ఎలా భిన్నంగా ఉంటుంది? ప్రభువు యొక్క శక్తి గురించిన ఈ వర్ణనలు ఆయన గురించి మీకు ఏమి బోధిస్తాయి?

మీరు 41వ వచనములో ప్రభావం అనే పదాన్ని కూడా ధ్యానించవచ్చు. బహుశా కుటుంబ సంబంధంలో, పాఠశాలలో, పనిలో లేదా సంఘ నియామకంలో మీరు మంచి ప్రభావం చూపాలని కోరుకునే కొన్ని పరిస్థితులు ఏవి? దేవుడు తన పిల్లలను ఎలా ప్రభావితం చేస్తారనే దాని గురించి 41-46 వచనముల నుండి మీరేమి నేర్చుకుంటారు? ఇలాంటి వాక్యాన్ని పూర్తి చేయడం ద్వారా మీరు నేర్చుకున్న వాటిని మీరు సంగ్రహించవచ్చు: “మంచి కోసం ప్రభావితం చేయడానికి, నేను చేస్తాను.”

జెఫ్రీ ఆర్. హాలండ్, “లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుటలేదు,” లియహోనా, మే 2021, 35–38 కూడా చూడండి.

9:14

"The Powers of Heaven"

ఒక పదబంధాన్ని ఎంచుకుని దానిని లోతుగా అధ్యయనం చేయండి. 45-46 వచనాలలో వివరించబడిన అద్భుతమైన ఆశీర్వాదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మీకు ప్రత్యేకంగా కనిపించే పదబంధాన్ని మీరు ఎంచుకోవచ్చు మరియు దానిని లోతుగా అధ్యయనం చేయవచ్చు. ఉదాహరణకు, అలంకరించు అనే పదానికి అర్థం ఏమిటి మరియు సుగుణము మీ ఆలోచనలను ఎలా అలంకరించగలదు? లేదా మీరు మంచుబిందువు చిత్రాన్ని కనుగొని మొక్కలపై మంచుబిందువు ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవచ్చు. ప్రభువు తన సిద్ధాంతాన్ని బోధించే విధానాన్ని ఇది ఎలా పోలి ఉంటుంది? మీరు కనుగొన్న వాటిని సంఘములో మీ స్నేహితులతో సహా మీ కుటుంబం లేదా స్నేహితులతో పంచుకోండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 122:8

నన్ను ఉద్ధరించగలుగునట్లు యేసు క్రీస్తు అన్నిటికంటే హీనమైన వాటిని అనుభవించారు.

యేసు క్రీస్తు “[అన్నిటికంటే] హీనమైన వాటిని అనుభవించెను” అంటే అర్థమేమిటని మీరనుకుంటున్నారు? ఈ వాక్యభాగాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే కొన్ని అదనపు వచనాలు ఇక్కడ ఉన్నాయి: యెషయా 53:3–4; హెబ్రీయులకు 2:17–18; 1 నీఫై 11:16–33; ఆల్మా 7:11–13. మీరు నేర్చుకున్న దానిపై ఆధారపడి, సిద్ధాంతము మరియు నిబంధనలు 122:8 ని మీ స్వంత పదాలలో తిరిగి చెప్పడాన్ని పరిగణించండి. అన్నిటికంటే హీనమైన వాటిని అనుభవించినందుకు యేసు క్రీస్తుకు మీరు మీ కృతజ్ఞతను ఎలా చూపించగలరు?

అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ నుండి వచ్చిన ఈ అంతర్దృష్టి మీ అవగాహనను ఎలా ప్రభావితం చేస్తుంది? “అన్నిటికంటే హీనమైన వాటిని అనుభవించిన తరువాత, [యేసు క్రీస్తు] మనలను ఉద్ధరించడానికి మరియు మన కష్టాలను సహించడానికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి సంపూర్ణంగా ఉంచబడ్డారని కూడా మనం చెప్పవచ్చు”(“Strengthened by the Atonement of Jesus Christ,” Liahona, Nov. 2015, 64).

గెత్సేమనేలో బాధననుభవిస్తున్న యేసు క్రీస్తు

Not My Will But Thine [నా చిత్తము కాదు, మీ చిత్తమే] నుండి వివరణ, వాల్టర్ రానె చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 123

“మన సామర్థ్యము మేరకు అన్నింటిని సంతోషముతో చేయుదము.”

సిద్ధాంతము మరియు నిబంధనలు 123:7–8లో, జోసెఫ్ స్మిత్ పరిశుద్ధులు హింసించబడడంతో సహా బాధలకు దారితీసిన తప్పుడు నమ్మకాలను సూచించాడు. 1839 మార్చిలో, భయంకరమైన వారి పరిస్థితిని మార్చడానికి పరిశుద్ధులు చేయగలిగినది ఏమీ లేదనిపించియుండవచ్చు. కానీ లిబర్టీ చెరసాల నుండి వ్రాసిన తన లేఖలలో, వారు చేయగలిగిన దాని గురించి జోసెఫ్ వారితో చెప్పారు: “అన్నిటి జ్ఞానమును [సేకరించి], దేవుని రక్షణను చూచుటకు మిక్కిలి నిశ్చయముతో నిలిచియుండుము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 123:1, 17). నేటి ప్రపంచంలో ఉన్న సమస్యలను మీరు పరిగణించినప్పుడు, “[మీ] సామర్థ్యము మేరకు” వాటిని పరిష్కరించగల విధానాల గురించి ఆలోచించండి (12, 17 వచనములు). మరియు అకారణంగా “చిన్న విషయాలు” విస్మరించవద్దు (15వ వచనము). ఈ విషయాలను “సంతోషముతో” చేయడం ఎందుకు ముఖ్యము? (17వ వచనము).

ఈ లేఖలో జోసెఫ్ అడిగిన వృత్తాంతాలలో అనేకము ప్రభుత్వానికి సమర్పించబడ్డాయి మరియు Times and Seasons (టైమ్స్ అండ్ సీజన్స్) అనే నావూ వార్తాపత్రికలో 11 వరుస భాగాలుగా ప్రచురించబడ్డాయి (see “A History, of the Persecution, of the Church of Jesus Christ, of Latter Day Saints in Missouri, December 1839–October 1840,” [josephsmithpapers.org]).

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 03

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1–9; 122:7–9

దేవునితో, నా శ్రమలు నా మేలు కొరకైయుండగలవు.

  • తర్వాత మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 121:1–9 ను కలిసి చదవవచ్చు మరియు జోసెఫ్ శాంతిని అనుభవించడానికి రక్షకుడు ఎలా సహాయం చేసారో మీరు మాట్లాడవచ్చు. కష్ట సమయాల్లో సైతం మనం ఏవిధంగా రక్షకుని యందు శాంతిని కనుగొంటాము?

    2:36

    లిబర్టీ చెరసాల: కష్ట సమయాల్లో ప్రభువును కనుగొనుట

    62:4

    Joseph Smith: The Prophet of the Restoration

  • మన శ్రమలు “[మన] మేలు కొరకే” (సిద్ధాంతము మరియు నిబంధనలు 122:7) అని మీ పిల్లలు గుర్తించడంలో సహాయపడడానికి, మనం బరువుగా ఉన్న వస్తువును మోసినప్పుడు మన కండరాలు ఎలా పెరుగుతాయనే దాని గురించి మీరు వారితో మాట్లాడవచ్చు. మీరు ఒక భారీ వస్తువును ఎత్తడానికి కూడా వారిని ఆహ్వానించవచ్చు. తర్వాత—మనం సహాయం కోసం ప్రభువు వైపు తిరిగినప్పుడు, కష్ట సమయాలను ఎదుర్కోవడం మన ఆత్మలు ఎదగడానికి ఎలా సహాయపడగలదు అనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు. మీ జీవితం నుండి కొన్ని ఉదాహరణలను పంచుకోండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 121:34–46

నీతి “పరలోక శక్తులను” తెస్తుంది.

  • బహుశా ఒక పోలిక “పరలోక శక్తులను” అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు దేవుని శక్తిని విద్యుచ్ఛక్తితో పోల్చవచ్చు. శక్తిని పొందడం నుండి ఒక విద్యుత్తు ఉపకరణమును ఏది నిరోధిస్తుంది? ఏది మన ఆధ్యాత్మిక శక్తిని తగ్గిస్తుంది? ఏది పెంచుతుంది? (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:34–46లో పదాలు మరియు వాక్యభాగాల కొరకు చూడండి; ప్రధాన చేతిపుస్తకము, 3.5, 3.6, సువార్త గ్రంథాలయము కూడా చూడండి.)

సిద్ధాంతము మరియు నిబంధనలు 122:7–9

నేను అనుభవిస్తున్నది యేసు క్రీస్తుకు తెలుసు.

  • మీ పిల్లలతో కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 122:7–9 చదివిన తరువాత, కష్టమైన సమయంలో రక్షకుడు మీతో ఉన్నట్లు మీరు భావించిన ఒక అనుభవాన్ని మీరు పంచుకోవచ్చు. మీరు యేసు క్రీస్తు గురించి ఒక పాటను కలిసి పాడవచ్చు మరియు యేసు క్రీస్తు మనకు సహాయం చేయగలరని సాక్ష్యమివ్వవచ్చు, ఎందుకంటే మనం ఎలా భావిస్తామో ఆయనకు తెలుసు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 123:15-17

చిన్న విషయాలు కూడా దేవుని సేవలో పెద్ద మార్పును కలిగిస్తాయి.

  • మీ పిల్లలకు సిద్ధాంతము మరియు నిబంధనలు 123:15–17 అర్థం చేసుకోవడంలో సహాయపడేందుకు, మీరు వారితో ఒక పెద్ద ఓడ మరియు చిన్న చుక్కాని చిత్రాన్ని పంచుకోవచ్చు లేదా “నా సువార్త సూత్రములు” (లియహోనా, మే 2021, 125–26) లో ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ గారి వివరణను వారితో పంచుకోవచ్చు. అప్పుడు మీరు మన కుటుంబం మరియు స్నేహితులకు మనము సంతోషంగా సేవ చేయగల చిన్న మార్గాల గురించి మాట్లాడవచ్చు.

15:0

“The Principles of My Gospel”

సముద్రంలో ఓడ యొక్క ఉదాహరణ

పెద్ద ఓడ యొక్క చిన్న చుక్కానిలా, మన చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పును కలిగించగలవు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

లిబర్టీ చెరసాలలో ఒక బయల్పాటును నమోదు చేస్తున్న జోసెఫ్ స్మిత్

Joseph Smith in Liberty Jail [లిబర్టీ చెరసాలలో జోసెఫ్ స్మిత్], గ్రెగ్ ఓల్సన్ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ