“అక్టోబరు 13–19: ‘అతని ఎదుగుదల కంటె అతని త్యాగము నాకు పవిత్రమైనది’: సిద్ధాంతము మరియు నిబంధనలు 115–120,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 115–120,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
Far West, Missouri [మిస్సోరిలోని ఫార్ వెస్ట్], ఆల్ రౌండ్స్ చేత
అక్టోబరు 13–19: “అతని ఎదుగుదల కంటె అతని త్యాగము నాకు పవిత్రమైనది”
సిద్ధాంతము మరియు నిబంధనలు 115–120
మిస్సోరిలోని ఫార్ వెస్ట్‌లో పరిశుద్ధుల నూతన కూడిక ప్రదేశం గురించి వారు సానుకూల దృక్పథంతో ఉండడానికి కారణం ఉంది. పట్టణం త్వరితగతిన పెరుగుతోంది, ప్రదేశం సమృద్ధిగా కనబడింది మరియు కొద్దిదూరంలో ఆడమ్-ఓన్డై-అహ్‌మన్ ఉన్నది, అది గతంలో మరియు భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మిక ప్రత్యేకత గల ప్రదేశం (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:53–56; 116 చూడండి). అయినప్పటికీ, వారు కోల్పోయిన దాని గురించి ఆలోచించకుండా ఉండడం పరిశుద్ధులకు కష్టమైయుండి ఉండవచ్చు. సీయోనుకు కేంద్రమైన ఇండిపెండెన్స్ నుండి తరిమివేయబడడమే కాకుండా, కేవలం రెండు సంవత్సరాల తర్వాత వారి ప్రియమైన దేవాలయాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులు ఓహైయోలోని కర్ట్‌లాండ్‌కు పారిపోవలసి వచ్చింది. ఆ సమయంలో సంఘము వెలుపల ఉన్న శత్రువులు మాత్రమే కాకుండా—పన్నెండుమంది అపొస్తలుల సమూహములో నలుగురు సభ్యులతో సహా అనేకమంది ప్రముఖ సభ్యులు జోసెఫ్ స్మిత్‌కు వ్యతిరేకంగా తిరిగి ఇబ్బందులు కలుగజేస్తున్నారు.
విశ్వాసులు తాము కోల్పోయిన వాటిపై దృష్టి పెట్టే బదులు, ఈసారి ఫార్ వెస్ట్‌లో సీయోనును నిర్మించడం కొనసాగించారు. ఒక క్రొత్త దేవాలయం కొరకు వారు ప్రణాళికలు వేసారు. నలుగురు కొత్త అపొస్తలులు పిలువబడ్డారు. దేవుని కార్యము చేయడమంటే అర్థం మీరు ఎన్నడూ పడిపోరని కాదు, దానర్థం మీరు “మళ్ళీ లేస్తారని” పరిశుద్ధులు నేర్చుకున్నారు. మీరు కొన్ని త్యాగాలు చేయవలసి వచ్చినప్పటికీ, ఆ త్యాగాలు దేవునికి పవిత్రమైనవి, “(మీ) ఎదుగుదల కంటె … ఎక్కువ పవిత్రమైనవి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 117:13).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 115:3–6
సంఘము యొక్క పేరు ప్రభువుకు ముఖ్యమైనది.
సంఘము యొక్క పేరు “గొప్ప ప్రాముఖ్యత కలిగిన విషయము” (“సంఘము యొక్క సరియైన పేరు,” లియహోనా, నవ. 2018, 87) అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ అన్నారు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 115:4–6 చదువుతున్నప్పుడు, ఇది ఎందుకు నిజమో ఆలోచించండి. సంఘము యొక్క పేరుకు, దాని పనికి మరియు నియమిత కార్యానికి గల సంబంధమేమిటి?
3 నీఫై 27:1–11 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 115:5–6
సీయోను మరియు ఆమె స్టేకులు “తుఫాను నుండి రక్షణను” అందిస్తాయి.
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 115:5–6 లో శక్తివంతమైన భావన చదివినప్పుడు, ఆయన సంఘ సభ్యునిగా మీరు నెరవేర్చాలని ప్రభువు కోరుకుంటున్న పాత్రను పరిగణించండి. ఉదాహరణకు, “లేచి ప్రకాశించుటకు” లేదా “జనములకు ఒక ప్రమాణముగా ఉండునట్లు” మీరు ఏమి చేయవచ్చు? (5వ వచనము). మీ చుట్టూ ఏ ఆధ్యాత్మిక తుఫానులను మీరు గమనిస్తారు? సమకూర్పు ద్వారా మీరు “రక్షణ” ఎలా కనుగొంటారు? (6వ వచనము).
రక్షకుని సంఘము తుఫానులో ఒక వెలుగు మరియు రక్షణ కాగలదు.
నా త్యాగాలు ప్రభువుకు పవిత్రమైనవి.
మీరు న్యూయెల్ కె. విట్నీ లేదా అతని భార్య ఎలిజబెత్ అని ఊహించుకోండి, వారు కర్ట్‌లాండ్‌లో సుసంపన్నమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు, ఆపై అక్కడి నుండి వెళ్లిపోవాలని కోరబడ్డారు. ఈ త్యాగము చేయడానికి మీకు సహాయపడేలా సిద్ధాంతము మరియు నిబంధనలు 117:1–11లో మీరేమి కనుగొంటారు? దేవుని కోసం మీరు ఎలాంటి త్యాగాలు చేస్తారు? దేవుడు ఎవరు మరియు ఆయన ఏమి చేస్తారు అనే దాని గురించి ఈ వచనాలు మీకు ఏమి బోధిస్తాయి?
ఆలీవర్ గ్రాంగర్ అడుగబడిన త్యాగము విట్నీల నుండి భిన్నంగా ఉంటుంది: కర్ట్‌లాండ్‌లో నిలిచియుండి, సంఘము యొక్క ఆర్థిక వ్యవహారాలను పరిష్కరించమని ప్రభువు ఆయనను నియమించారు. నిజాయితీగా ఆయన సంఘానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఆయన చివరికి అంత విజయవంతం కాలేదు. సిద్ధాంతము మరియు నిబంధనలు 117:12–15లో ఉన్న ప్రభువు యొక్క మాటలు ఆయన మిమ్మల్ని అడిగిన వాటికి ఎలా అన్వయించబడతాయో పరిగణించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 119–20
నా దశమ భాగం దేవుని రాజ్యాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది.
119 మరియు 120 ప్రకరణముల లోని సూచనలు దశమభాగము అంటే ఏమిటో స్పష్టం చేస్తాయి: ప్రతీ సంవత్సరం మన వృద్ధిలో (లేదా ఆదాయంలో) “పదవ వంతును” మనం విరాళంగా ఇస్తాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 119:4 చూడండి). కానీ ఈ బయల్పాటు ఒక నిర్వచనం ఇవ్వడం కంటే ఎక్కువ చేస్తుంది. దశమభాగము “సీయోను ప్రదేశమును పవిత్రపరచును” అని ప్రభువు పరిశుద్ధులతో చెప్పారు. మరియు ఈ ధర్మశాస్త్రము లేకుండా, “అది మీకు … సీయోను ప్రదేశముగా ఉండదు” (6వ వచనము) అని ఆయన చెప్పారు. ఈ విధంగా దశమభాగం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దశమభాగాన్ని చెల్లించడం మిమ్మల్ని మరింత పవిత్రంగా, సీయోను కోసం మరింత సిద్ధం చేయడానికి ఎలా సహాయపడుతుంది?
ప్రభువు సేవకులు దశమభాగపు నిధులను ఎలా ఉపయోగిస్తున్నారనే దాని గురించి ఈ బయల్పాటుల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? సిద్ధాంతము మరియు నిబంధనలు 120లో “నా వారితో నేను పలికిన మాటల వలన” అనే వాక్యభాగం గురించి మీకు ప్రత్యేకంగా అనిపించినదేమిటి?
ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ దశమభాగం ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి మరియు ఈ చట్టాన్ని పాటించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాల గురించి “The Windows of Heaven” (లియహోనా, నవ. 2013, 19–20)లో సహాయకర వివరణ ఇచ్చారు. మీరు ఆయన సందేశాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు క్రింది ప్రశ్నలు సహాయపడవచ్చు:
The Windows of Heaven
-
సంఘానికి చెల్లించిన తర్వాత దశమభాగం ఎలా ఉపయోగించబడుతుందో ఎవరు నిర్ణయిస్తారు?
-
దశమభాగము దేనికి ఉపయోగించబడుతుంది?
-
దశమభాగాన్ని చెల్లించడం వల్ల ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి? ఉదాహరణకు, దశమభాగాన్ని చెల్లించడం పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో మీ సంబంధాన్ని ఏయే మార్గాల్లో బలపరుస్తుంది?
-
ఎల్డర్ బెడ్నార్ గారి ఆహ్వానం నుండి మీరు ఏమి నేర్చుకోగలరు?
-
ప్రభువు యొక్క దశమభాగ చట్టంపై తమ విశ్వాసాన్ని పెంచుకోవడానికి మీరు ఇతరులకు ఎలా సహాయపడగలరు?
మలాకీ 3:8–12 కూడా చూడండి.
వారు నేర్చుకుంటున్న వాటిని అన్వయించడంలో ఇతరులకు సహాయపడండి. ఒక వ్యక్తి దశమభాగం చెల్లించాలనుకున్నప్పుడు కూడా, కొన్నిసార్లు ఎలా చేయాలో వారికి తెలియదు. మీరు మీ కుటుంబానికి లేదా తరగతికి బోధిస్తున్నట్లయితే, ఆన్‌లైన్‌లో లేదా దశమభాగం మరియు ఇతర కానుకల కాగితంతో దశమభాగాన్ని ఎలా చెల్లించాలో వివరించడానికి కొంత సమయాన్ని వెచ్చించండి. (రక్షకుని విధానములో బోధించుట, 27 చూడండి.)
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 115:4–5
యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘానికి నేను చెందియున్నాను.
-
మీ పిల్లలు సంఘము యొక్క పేరును తెలుసుకోవడానికి మరియు అది ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవడంలో సహాయపడడానికి, వారిలో ఎవరైనా సంఘము యొక్క పూర్తి పేరు చెప్పగలరా అని అడగండి. సిద్ధాంతము మరియు నిబంధనలు 115:4 నుండి అప్పుడు మీరు వారికి పేరును చూపించి, మీతో పాటు వారు దానిని మళ్ళీ మళ్ళీ చెప్పేలా చేయవచ్చు. మీరు చేస్తున్నప్పుడు, ముఖ్యమైన పదాలను మరియు అవి ఎందుకు ముఖ్యమైనవి అని సూచించడాన్ని పరిగణించండి.
Chapter 43: Jesus Christ Names His Church: April 1838
సిద్ధాంతము మరియు నిబంధనలు 115:4–6
నా ఉదాహరణ ఇతరులు క్రీస్తు వద్దకు రావడానికి మరియు రక్షణ కనుగొనడానికి సహాయపడవచ్చు.
-
“జీవితపు తుఫానుల” నుండి “రక్షణ” (6వ వచనము) అవసరమయ్యేవారు మరియు కష్టపడుతున్న వ్యక్తులు మీ పిల్లలకు తెలిసి ఉండవచ్చు. ఈ వ్యక్తులకు వారెలా సహాయపడగలరు? సిద్ధాంతము మరియు నిబంధనలు 115:5లో లేచి అనే పదాన్ని మీరు చదివినప్పుడు, నిలబడమని మీ పిల్లలను ఆహ్వానించడాన్ని పరిగణించండి. మీరు ప్రకాశించుడి అని చదివినప్పుడు వారు సూర్యకాంతి కిరణాల వలె తమ వ్రేళ్ళను చాపవచ్చు. మన వెలుగు యేసు క్రీస్తు నుండి వస్తుందని మీ పిల్లలకు గుర్తు చేయండి మరియు ఆయన వలె వారు “ప్రకాశించే” మార్గాల గురించి ఆలోచించడంలో వారికి సహాయపడండి.
-
మీ పిల్లలు సిద్ధాంతము మరియు నిబంధనలు 115:6ను వర్ణించే చిత్రాన్ని గీయవచ్చు. ఉదాహరణకు, వారు సంఘ భవనంలో ఆశ్రయం పొందుతున్న వ్యక్తులతో తుఫానును గీయవచ్చు. తుఫాను దేనిని సూచిస్తుంది? రక్షకుని సంఘము ఎలా సహాయాన్ని అందిస్తుంది? అవసరంలో ఉన్న ఒక స్నేహితుడు, కుటుంబ సభ్యుడు లేదా పొరుగువారి గురించి ఆలోచించడంలో మీ పిల్లలకు సహాయపడండి. యేసు క్రీస్తు సంఘములో సహాయం కనుగొనడానికి వారిని మనం ఎలా ఆహ్వానించవచ్చు?
నా త్యాగాలు ప్రభువుకు పవిత్రమైనవి.
-
మీ పిల్లలను న్యూయెల్ కె. విట్నీగా నటించమని ఆహ్వానించండి. తమ విజయవంతమైన ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ప్రదేశానికి వెళ్ళమని ప్రభువు వారిని అడిగితే వారు ఎలా భావిస్తారు? మీరు కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 117:1–11 చదువుతున్నప్పుడు, మీ పిల్లలు ప్రభువుకు విధేయత చూపే విశ్వాసాన్ని కలిగి ఉండడానికి సహాయపడేది ఏదైనా విన్నప్పుడు మిమ్మల్ని ఆపమని వారిని అడగండి. ప్రభువుకు లోబడడానికి మనం ఏ త్యాగాలు చేస్తాము? ఆయన మనల్ని ఎలా దీవిస్తారు?
Chapter 41: Trouble in Kirtland: 1837–1838
సిద్ధాంతము మరియు నిబంధనలు 119–20
పరలోక తండ్రి తన పిల్లలను దీవించడానికి దశమభాగాన్ని ఉపయోగిస్తారు.
-
మీరు బోధించే చాలామంది పిల్లలు డబ్బు సంపాదించడానికి మరియు దశమభాగం చెల్లించడానికి వయస్సులో చాలా చిన్నవారై ఉండవచ్చు, కానీ ప్రపంచమంతటా ప్రభువు పనికి దశమభాగం ఎలా దోహదపడుతుందో వారు అర్థం చేసుకోవడం మంచిది. దశమభాగం అంటే ఏమిటో అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడడానికి ఈ నమూనా చివరిలో ఉన్న చిత్రాలు మరియు ప్రోత్సాహకార్యక్రమ పేజీని ఉపయోగించడాన్ని పరిగణించండి. తన పిల్లలను ఆశీర్వదించడానికి పరలోక తండ్రి దశమభాగాన్ని ఎలా ఉపయోగిస్తారు? దశమభాగ చట్టం గురించి మరియు అది మిమ్మల్ని ఎలా ఆశీర్వదించిందనే దాని గురించి మీ భావాలను పంచుకోండి.
Chapter 44: Tithing: July 1838
మనము దశమభాగము చెల్లించినప్పుడు, మనం యేసు క్రీస్తునందు మన విశ్వాసాన్ని చూపుతాము.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.