Doctrine and Covenants 2025
పునఃస్థాపన స్వరములు: ఆత్మీయ ప్రత్యక్షతలు మరియు కర్ట్‌లాండ్ దేవాలయము


“పునఃస్థాపన స్వరములు: ఆత్మీయ ప్రత్యక్షతలు మరియు కర్ట్‌లాండ్ దేవాలయము,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“ఆత్మీయ ప్రత్యక్షతలు మరియు కర్ట్‌లాండ్ దేవాలయము,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

పునఃస్థాపన స్వరముల చిహ్నము

పునఃస్థాపన స్వరములు

ఆత్మీయ ప్రత్యక్షతలు మరియు కర్ట్‌లాండ్ దేవాలయము

కర్ట్‌లాండ్ దేవాలయము యొక్క వర్ణచిత్రము

క్రిందివి ప్రతిష్టాపన సమయంలో మరియు తరువాత జరిగిన ఇతర సమావేశాల్లో కర్ట్‌లాండ్ దేవాలయంలో ఉన్న కడవరి-దిన పరిశుద్ధుల మాటలు. పెంతెకొస్తు దినమున “ఉన్నతము నుండి శక్తితో వారు దీవించబడినప్పుడు” ప్రాచీన పరిశుద్ధులు అనుభవించిన దానితో అనేకమంది తమ అనుభవాలను పోల్చారు (లూకా 24:49; అపొస్తలుల కార్యములు 2:1–4; సిద్ధాంతము మరియు నిబంధనలు 109:36–37 కూడా చూడండి).

ఎలైజా ఆర్. స్నో

Portrait photograph of Eliza R. Snow seated in a chair.

“ఆ ప్రతిష్ఠాపన వేడుకల గురించి తిరిగి చెప్పవచ్చు, కానీ చిరస్మరణీయమైన ఆ దినము యొక్క పరలోక ప్రత్యక్షతలను ఏ మర్త్య భాష వర్ణించలేదు. అక్కడున్న వారందరు దైవ సన్నిధిని గుర్తించినప్పటికీ, కొందరికి దేవదూతలు కనిపించారు మరియు ప్రతి హృదయం ‘అవ్యక్త ఆనందంతో, సంపూర్ణ మహిమతో’ నింపబడింది.”

సిల్వియా కట్లర్ వెబ్

“నా చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకటి దేవాలయ ప్రతిష్ఠాపన. మా నాన్న మమ్మల్ని ఒడిలో కూర్చోబెట్టుకొని, మేము ఎందుకు వెళ్తున్నామో మరియు దేవునికి ఒక మందిరాన్ని ప్రతిష్ఠించడం అంటే అర్థమేమిటో మాకు చెప్పారు. ఆ సమయంలో నేను చాలా చిన్నపిల్లనైనప్పటికీ, ఆ సందర్భం నాకు స్పష్టంగా గుర్తుంది. నేను గతంలోకి చూసి, అప్పుడు నేను చూసినట్లుగా ప్రవక్త జోసెఫ్ పరలోకం వైపు చేతులు చాపి నిలబడడాన్ని, పాలిపోయిన ఆయన ముఖాన్ని, చిరస్మరణీయమైన ఆనాడు ఆయన మాట్లాడుతుండగా ఆయన చెంపలపై కారిన కన్నీళ్ళను చూడగలను. దాదాపు అందరూ కన్నీళ్ళు కారుస్తున్నట్లు అనిపించింది. మందిరము జనులతో ఎంతగా నిండియున్నదంటే, ఎక్కువమంది పిల్లలు పెద్దవాళ్ళ ఒడిలో కూర్చున్నారు; మా అక్క నాన్న ఒడిలో, నేను అమ్మ ఒడిలో కూర్చున్నాము. మేము ధరించిన దుస్తులు కూడా నాకు జ్ఞాపకమున్నాయి. దాని ప్రత్యేకతనంతా అర్థం చేసుకోవడానికి నేను చాలా చిన్నదానిని, కానీ కాలం గడిచేకొద్దీ అది నాకు స్పష్టమైంది మరియు అక్కడ ఉండగలిగినందుకు నేనెంతో కృతజ్ఞరాలిని.”

ఆలీవర్ కౌడరీ

Head and shoulder portrait of Oliver Cowdery in suit and tie.

“సాయంత్రం ప్రభువు మందిరంలో నేను సంఘము యొక్క అధికారులను కలుసుకున్నాను. ఆత్మ క్రుమ్మరింపబడింది—ఒక గొప్ప మేఘము క్రిందికి వచ్చి, మందిరంపై నిలిచినట్లు మరియు వీచుచున్న బలమైన గాలివలె మందిరమును నింపుతున్నట్లు నేను దేవుని మహిమను చూసాను. వారు ఇతర భాషలు మాట్లాడుతూ, ప్రవచించినప్పుడు … అనేకమందిపై అగ్ని నిలిచినట్లుగా అగ్నిజ్వాలల వంటి నాలుకలను కూడా నేను చూసాను.”

బెంజమిన్ బ్రౌన్

“అనేక దర్శనములు కనిపించాయి. మేఘంపైన సూర్యుడు బంగారంలా మెరుస్తున్నప్పుడు ఉన్నంత ప్రకాశవంతంగా ఒక దిండు లేదా మబ్బు మందిరంపై నిలిచినట్లు ఒకరు చూసారు. ముగ్గురు వ్యక్తులు మెరుస్తున్న తాళపుచెవులను, అలాగే మెరుస్తున్న గొలుసును చేతిలో పట్టుకొని గదిలో పరిభ్రమించడం ఇతరులిద్దరు చూసారు.”

ఓర్సన్ ప్రాట్

Portrait engraving of Orson Pratt

“దేవుడు అక్కడున్నాడు, ఆయన దూతలు అక్కడున్నారు మరియు జనుల మధ్య పరిశుద్ధాత్మ ఉన్నాడు … వారు శిరస్సు నుండి పాదాల వరకు పరిశుద్ధాత్మ శక్తి మరియు ప్రేరేపణలతో నింపబడ్డారు.”

నాన్సీ నయోమి అలెగ్జాండర్ ట్రేసీ

“దేవాలయం పూర్తయి, ప్రతిష్ఠించబడినప్పుడు … నా జీవితంలో ఉన్న రెండు అతి సంతోకరమైన రోజులవి. ‘The Spirit of God Like a Fire is Burning (దేవుని ఆత్మ అగ్ని వలె మండుచున్నది)’ అనే కీర్తన సందర్భానికి తగినట్లుగా కూర్చబడింది. పరలోక ప్రభావము ఆ మందిరంపై నిలిచియున్నది అనేది నిజంగా వాస్తవము. … అది భూతల స్వర్గమని నేను భావించాను.”

వివరణలు

  1. ఎడ్వర్డ్ డబ్ల్యు. టుల్లిడ్జ్, The Women of Mormondom (1877), 95 లో.

  2. కార్ల్ రిక్స్ ఆండర్సన్, Joseph Smith’s Kirtland: Eyewitness Accounts (1996), 182–83 లో.

  3. ఆలీవర్ కౌడరీ డైరీ, మార్చి 27, 1836, సంఘ చరిత్ర గ్రంథాలయము, సాల్ట్ లేక్ సిటీ.

  4. ఆయన భార్య శారాకు బెంజమిన్ బ్రౌన్ లేఖ, సుమారు ఏప్రిల్ 1836, బెంజమిన్ బ్రౌన్ కుటుంబ సేకరణ, సంఘ చరిత్ర గ్రంథాలయము, సాల్ట్ లేక్ సిటీ; విరామచిహ్నాలు మరియు అక్షరాలు ఆధునీకరించబడినవి.

  5. ఓర్సన్ ప్రాట్, “Remarks,” Deseret News, జన. 12, 1876, 788.

  6. రిఛర్డ్ ఈ. టర్లీ మరియు బ్రిట్టని ఎ. చాప్మన్, సంచికలు, Women of Faith in the Latter Days (2011), 1:442 లో.