Doctrine and Covenants 2025
మే 26–జూన్ 1: “విశ్వాసము, నీతి, తెలివి గల గృహనిర్వాహకుడు”: సిద్ధాంతము మరియు నిబంధనలు 51–57


“మే 26–జూన్ 1: ‘విశ్వాసము, నీతి, తెలివి గల గృహనిర్వాహకుడు’: సిద్ధాంతము మరియు నిబంధనలు 51–57,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 51–57,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

పొలము దున్నుతున్న వ్యక్తి

First Furrow [మొదటి నాగలిచాలు], జేమ్స్ టేలర్ హార్వుడ్ చేత

మే 26–జూన్ 1: “విశ్వాసము, నీతి, తెలివి గల గృహనిర్వాహకుడు”

సిద్ధాంతము మరియు నిబంధనలు 51–57

1830లో సంఘ సభ్యులకు, పరిశుద్ధులను సమకూర్చుట మరియు సీయోను పట్టణాన్ని నిర్మించుట వంటి ఆత్మీయమైన, అదేవిధంగా భౌతికమైన కార్యాలు, వాటితోపాటు చేయవలసిన ఆచరణాత్మకమైన విషయాలు అనేకమున్నాయి: పరిశుద్ధులు స్థిరపడగలిగేలా ఒకరు భూములను కొనాలి. ఒకరు పుస్తకాలను, ఇతర ప్రచురణలను ముద్రించాలి. మరొకరు సీయోనులో ఉన్నవారి కోసం వస్తువులు అందించడానికి ఒక అంగడి తెరవాలి. సిద్ధాంతము మరియు నిబంధనలు 51–57లో నమోదు చేయబడిన బయల్పాటులలో, ఈ పనులు నిర్వహించమని ప్రభువు జనులను నియమించి, ఆదేశించారు.

కానీ సీయోనులో ఇటువంటి విషయాలలో నైపుణ్యాలు అవసరమైనప్పటికీ, సీయోను జనులుగా—ఆయన జనులుగా పిలువబడేందుకు ఆత్మీయంగా యోగ్యులు కావాలని ప్రభువు తన పరిశుద్ధులను కోరుకున్నారని కూడా ఈ బయల్పాటులు బోధిస్తాయి. నలిగిన ఆత్మ కలిగి, మనకు నియమించబడిన బాధ్యతలలో “స్థిరముగా నిలిచియుండి,” “విశ్వాసము, నీతి, తెలివి గల గృహనిర్వాహకునిగా” అవ్వమని మనలో ప్రతీ ఒక్కరిని ఆయన పిలుస్తున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 51:19; 52:15; 54:2 చూడండి). మన భౌతిక నైపుణ్యాలతో సంబంధం లేకుండా మనం దానిని చేయగలిగినట్లయితే, సీయోనును నిర్మించడానికి ప్రభువు మనల్ని ఉపయోగించగలరు.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 51

విశ్వాసము, నీతి, తెలివి గల గృహనిర్వాహకునిగా అవ్వమని ప్రభువు నన్ను కోరుతున్నారు.

మీరు 1831లో సంఘ సభ్యులైనట్లయితే, బిషప్పు ద్వారా మీ ఆస్థిని సంఘానికి అప్పగించి, సమర్పణ చట్టాన్ని జీవించడానికి మీరు ఆహ్వానించబడియుండేవారు. ఎక్కువ సందర్భాలలో మీరు విరాళమిచ్చిన దానిని ఆయన మీకు తిరిగి ఇస్తారు, కొన్నిసార్లు అదనంగా కొంత ఇస్తారు. కానీ ఇకపై అది మీరు కలిగియున్న ఆస్తి మాత్రమే కాదు—అది మీ గృహనిర్వాహకత్వము.

నేటి పద్ధతులు వేరు, కానీ సూత్రాలు ఇప్పటికీ ప్రభువు కార్యానికి ముఖ్యమైనవి. మీరు 51వ ప్రకరణము చదువుతున్నప్పుడు, దేవుడు మీకు అప్పగించిన వాటి గురించి ఆలోచించండి. (19వ వచనము)లో “గృహనిర్వాహకుడు” మరియు (5వ వచనము)లో “ప్రతిష్ఠించిన” అనే పదాలు మీపై దేవుని అంచనాల గురించి ఏమి సూచిస్తున్నాయి?

అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ ఇలా వివరించారు: “సంఘములో గృహనిర్వాహకత్వము అనేది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక లేదా తాత్కాలిక నమ్మకము, దానికి జవాబుదారీతనం ఉంటుంది. అన్ని విషయాలు ప్రభువుకు చెందినవి కాబట్టి, మన శరీరాలు, మనస్సులు, కుటుంబాలు మరియు ఆస్తులపై మనం గృహనిర్వాహకులం. (సిద్ధాంతము మరియు నిబంధనలు 104:11-15 చూడండి.) నమ్మకమైన గృహనిర్వాహకుడు నీతియుక్తమైన ఆధిపత్యాన్ని చలాయించేవాడు, తన కోసం శ్రద్ధ వహిస్తాడు, పేదలు మరియు అవసరంలో ఉన్నవారిని చూసుకుంటాడు” (“Welfare Services: The Gospel in Action,” Ensign, Nov. 1977, 78).

5:1

The Law of Consecration

సిద్ధాంతము మరియు నిబంధనలు 52:9–11, 22–27

నేను ఎక్కడికి వెళ్ళినా ఇతరులను క్రీస్తు వద్దకు రమ్మని ఆహ్వానించగలను.

ప్రభువు అనేకమంది సంఘ నాయకులను మిస్సోరికి పంపినప్పుడు, ప్రయాణంలో గడిపిన సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మరియు “మార్గం వెంబడి ప్రకటించమని” వారికి చెప్పారు (25–27 వచనములు). “మార్గం వెంబడి” లేదా మీ జీవితంలోని సాధారణ సంఘటనల సమయంలో మీరు సువార్తను ఎలా పంచుకోగలరు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 52:14–19

సెమినరీ చిహ్నము
మోసాన్ని నివారించడానికి ప్రభువు నాకు సహాయం చేస్తారు.

అనేకమంది ఆత్మీయ ప్రత్యక్షతల గురించి వాదిస్తుండడంతో, ప్రారంభ పరిశుద్ధులు మోసపోవడం గురించి చింతించారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 52:14లో ప్రభువు వారికిచ్చిన హెచ్చరికలేవి? ఆయన పరిష్కారమేమిటి? (14–19 వచనములు చూడండి).

నమూనా అనేది ఒక సాధారణ, ఊహాజనిత మార్గంలో పునరావృతమయ్యే విషయం. ఉదాహరణలలో సరి సంఖ్యల ద్వారా లెక్కించడం లేదా ప్రతిరోజూ సూర్యుడు ఉదయించడం మరియు అస్తమించడం వంటివి ఉంటాయి. మీరు ఆలోచించగల ఇతర మాదిరులు ఏవి? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 52:14–19 వెదుకుతున్నప్పుడు, మోసాన్ని నివారించడానికి ప్రభువు యొక్క నమూనాను గుర్తించండి. “నలిగిన” అనేది వినయం మరియు పశ్చాత్తాపం యొక్క భావాన్ని సూచిస్తుందని గమనించడానికి ఇది సహాయపడవచ్చు; “సాత్వీకము” సౌమ్యత మరియు స్వీయ నియంత్రణను సూచిస్తుంది; మరియు “బోధించు” అంటే ఉపదేశించడం, మెరుగుపరచడం లేదా నిర్మించడం. ప్రభువు నమూనాలో ఈ లక్షణాలు, అలాగే విధేయత కూడా ఉన్నాయని మీరు ఎందుకు భావిస్తున్నారు? మోసాన్ని నివారించడానికి మీరు ఈ నమూనాను ఎలా అన్వయించవచ్చు?

కష్టమైన పదాలను నిర్వచించండి. సువార్త గ్రంథాలయ యాప్‌లో, మీరు ఒక పదాన్ని నొక్కి పట్టుకుని, ఆపై “నిర్వచించు” ఎంచుకోవచ్చు. అప్పుడు మీరు ఆ పదం యొక్క నిర్వచనానికి తీసుకెళ్ళబడతారు. మీకు తెలియని పదాలు లేదా మీరు బాగా అర్థం చేసుకోవాలనుకునే సుపరిచితమైన పదాలు కనిపించినప్పుడు దీన్ని ప్రయత్నించండి.

మన కాలంలోని మోసాలకు కొన్ని ఉదాహరణలు ఏవి? మనం మోసపోతున్నప్పుడు మనమెలా తెలుసుకోగలము?

గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, “నన్ను మోసగించకు,” లియహోనా, నవ. 2019, 93–96 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 54

ఇతరుల ఎంపికల చేత నేను బాధించబడినప్పుడు, నేను ప్రభువు తట్టు తిరుగగలను.

మీరు ఆధారపడిన వ్యక్తి తమ నిబద్ధతలను పాటించనప్పుడు మీరు ఎప్పుడైనా నిరాశకు గురయ్యారా? న్యూయార్క్‌లోని కొలిస్విల్‌ నుండి వచ్చిన పరిశుద్ధులకు ఇది జరిగింది, వారు ఒహైయోలోని లేమన్ కోప్లి యొక్క స్థలంలో స్థిరపడాలని భావించారు. ఈ అనుభవం నుండి తెలుసుకోవడానికి, 54వ ప్రకరణము యొక్క శీర్షికను సమీక్షించడాన్ని పరిగణించండి. మీకు కొలిస్విల్‌ పరిశుద్ధుల‌లో ఒక స్నేహితుడు ఉన్నట్లయితే, వారితో పంచుకోవడానికి 54వ ప్రకరణములో మీరు ఏ సలహాను కనుగొనగలరు?

లేమన్ కోప్లి పొలము

లేమన్ కోప్లి పొలము

సిద్ధాంతము మరియు నిబంధనలు 56:14–20

హృదయశుద్ధి గలవారు ధన్యులు.

ఈ వచనాలలో ప్రభువు ధనవంతులు మరియు బీదవారు ఇరువురితో మాట్లాడారు; ఈ రెండు సమూహాలకు ఆయనిచ్చిన ఉపదేశాన్ని పోల్చి చూడడం ఆసక్తికరంగా ఉండవచ్చు. ఈ వచనాలలో ఉన్నదేది వ్యక్తిగతంగా మీకు సంబంధించినదని భావిస్తున్నారు?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 51:9

నేను నిజాయితీగా ఉండగలను.

  • నిజాయితీగా ఉండడం అంటే ఏమిటో తెలుసుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయడానికి, మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 51:9ని కలిసి చదవవచ్చు మరియు నిజాయితీగా ఉండాలనే నిర్ణయాలను ఎదుర్కొనే పిల్లల కథలను పంచుకోవచ్చు. ఈ కథలను మరింత ఆసక్తికరంగా చేయడానికి మీరు చిత్రాలు, మేజోళ్ళ తోలుబొమ్మలు లేదా కాగితపు బొమ్మలను ఉపయోగించవచ్చు. మనం నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రభువు మనల్ని ఏవిధంగా దీవిస్తారు?

  • మీ పిల్లలతో ఒక ఆట ఆడడం గురించి ఆలోచించండి. తర్వాత, అందులో ఎవరైనా మోసం చేస్తే ఆట ఎలా ఉండియుండేదని చర్చించండి. ఒకరితోనొకరు “నిజాయితీగా వ్యవహరించడం” ఎందుకు ముఖ్యము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 52:10; 53:3; 55:1

హస్తనిక్షేపణము ద్వారా నేను పరిశుద్ధాత్మ వరమును పొందుతాను.

  • హస్తనిక్షేపణము ద్వారా పరిశుద్ధాత్మ వరమును పొండడం గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 51:57 లో చాలాసార్లు ప్రస్తావించబడింది. ఈ విధి గురించి మీ పిల్లలకు బోధించడానికి ఇది మంచి అవకాశం కావచ్చు. ఉదాహరణకు, వారు నిర్ధారించబడుతున్న పిల్లల చిత్రాన్ని చూడవచ్చు మరియు చిత్రంలో ఏమి జరుగుతుందో వివరించవచ్చు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 52:10; 53:3; 55:1 చదువుతున్నప్పుడు, “చేతులుంచడం” లేదా “హస్తనిక్షేపణము” అని వారు వినినప్పుడు చప్పట్లు కొట్టమని వారిని అడగండి.

  • పరిశుద్ధాత్మ గురించి మీరు ఒక పాట పాడవచ్చు. పాటలో పరిశుద్ధాత్మ వరము గురించి బోధించే పదాలు మరియు వాక్యభాగాలను కనుగొనడంలో మీ పిల్లలకు సహాయం చేయండి.

    నిర్ధారించబడుతున్న బాలుడు

సిద్ధాంతము మరియు నిబంధనలు 52:14–19

నేను మోసపోకుండా సహాయం చేయడానికి దేవుడు ఒక నమూనాను కలిగి ఉన్నారు.

  • మోసాన్ని నివారించేందుకు ప్రభువు యొక్క నమూనా గురించి బోధించడానికి, ప్రకృతిలో, రంగురంగుల దుప్పట్లు లేదా దుస్తులలో, లేదా రోజువారీ జీవితంలో నమూనాల ఉదాహరణలను కనుగొనడంలో పిల్లలకు సహాయపడడం ద్వారా మీరు ప్రారంభించవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 52:14–15 లో ప్రభువు ఇచ్చిన నమూనాను కనుగొనడంలో వారికి సహాయపడండి. ఈ వచనాలలో గల ఏవైనా తెలియని పదాలను వారు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి. సత్యాన్ని గుర్తించడానికి మనం ఈ నమూనాను ఎలా ఉపయోగించవచ్చు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 54:4–6

నేను ఎల్లప్పుడు నా నిబంధనలను పాటించాలి.

  • మీ స్వంత మాటల్లో, లేమన్ కోప్లి స్థలం‌లో నివసించడానికి వచ్చిన పరిశుద్ధులకు ఏమి జరిగిందో మీ పిల్లలతో పంచుకోండి (54వ ప్రకరణము యొక్క శీర్షిక చూడండి). మీ పిల్లలు ఒహైయోకు వచ్చిన సంఘ సభ్యునిగా నటించవచ్చు. లేమన్ తన నిబంధనను ఉల్లంఘించిన తర్వాత వారు ఎలా భావించియుండవచ్చు? మన నిబంధనలను లేదా వాగ్దానాలను నిలబెట్టుకోవడం గురించి ఇది మనకు ఏమి బోధిస్తుంది? తమ నిబంధనలను పాటించే వారి కొరకు గల దీవెనలను కనుగొనడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 54:6ను కలిసి చదవండి.

3:16

నైట్లు మరియు ఇతరులు సీయోను వద్ద సమకూడుతారు: ప్రభువు యొక్క పిలుపుకు విధేయులగుట

సిద్ధాంతము మరియు నిబంధనలు 55:1–4

దేవుడు నాకు ఇచ్చిన దీవెనలను ఇతరులను దీవించడానికి నేను ఉపయోగించగలను.

  • 55వ ప్రకరణమును పరిచయం చేయడానికి, విలియం డబ్ల్యు. ఫెల్ప్స్ సువార్త గురించి తెలుసుకుని సంఘములో చేరిన వార్తాపత్రిక ప్రచురణకర్త అని మీరు వివరించాలనుకోవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 55:1–4ను మీ పిల్లలతోపాటు చదవండి మరియు విలియం ఏమి చేయాలని దేవుడు కోరుకున్నారో కనుగొనడానికి వారికి సహాయపడండి. ఆయన విలియం యొక్క ప్రతిభను ఎలా ఉపయోగించాలని ప్రణాళిక చేశారు? తన పిల్లలను దీవించడానికి మన ప్రతిభను ఉపయోగించమని దేవుడు మనల్ని ఎలా ఆహ్వానిస్తారనే దాని గురించి ఇది చర్చకు దారితీయవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

తమ వస్తువులను సమర్పిస్తున్న పరిశుద్ధులు

Bishop Partridge Receives Consecration [సమర్పణను అందుకొంటున్న బిషప్పు పార్ట్రిడ్జ్], ఆల్బిన్ వెసెల్కా చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ