Doctrine and Covenants 2025
జూన్ 16–22: “హృదయమును, సిద్ధమైన మనస్సును ప్రభువు కోరును”: సిద్ధాంతము మరియు నిబంధనలు 64–66


“జూన్ 16–22: ‘హృదయమును, సిద్ధమైన మనస్సును ప్రభువు కోరును’: సిద్ధాంతము మరియు నిబంధనలు 64–66,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 64–66,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

మిస్సోరిలోని డేవిస్ కౌంటీ

మిస్సోరిలోని డేవిస్ కౌంటీ

జూన్ 16–22: “హృదయమును, సిద్ధమైన మనస్సును ప్రభువు కోరును”

సిద్ధాంతము మరియు నిబంధనలు 64–66

1831 ఆగష్టులో, తీక్షణమైన ఎండలో అనేకమంది పెద్దలు మిస్సోరిలోని సీయోను పట్టణము నుండి కర్ట్‌లాండ్‌కు తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికులు ఎండ వేడిమితో అలసియుండడంతో త్వరలోనే ఆందోళనలు గొడవలుగా మారాయి. ప్రేమ, ఐక్యత మరియు శాంతితో కూడిన పట్టణమైన సీయోనును నిర్మించడానికి సుదీర్ఘకాలము పడుతుందేమో అనిపించియుండవచ్చు.

అదృష్టవశాత్తూ, సీయోనును నిర్మించడానికి—1831లో మిస్సోరిలో లేదా నేడు మన హృదయాలలో, కుటుంబాలలో మరియు వార్డులలో—మనము పరిపూర్ణంగా ఉండనవసరము లేదు. బదులుగా, “మీరైతే మనుష్యులందరిని క్షమించవలసిన అవసరమున్నది,” అని ప్రభువు చెప్పారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 64:10). “హృదయమును, సిద్ధమైన మనస్సును” ఆయన కోరును (34వ వచనము). మరియు సహనమును, శ్రద్ధను ఆయన కోరును, ఎందుకనగా “మంచి చేయుట యందు విసుగులేకయున్న” వారిచేత సాధించబడిన “చిన్న విషయాల” పునాదిపై సీయోను నిర్మించబడుతుంది (33వ వచనము).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 64:1–11

సెమినరీ చిహ్నము
“ఒకరినొకరు క్షమించండి.”

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 64:1–11 చదువుతున్నప్పుడు, క్రింది వాటిని పరిగణించండి:

  • ప్రభువు మిమ్మల్ని క్షమించిన సమయం గురించి ఆలోచించండి. మీరు ఎలా భావించారు?

  • మీరు క్షమించవలసిన వారెవరైనా ఉన్నారా? ఇతరులను క్షమించడం ఎందుకంత కష్టమైనది? ఈ కష్టాలను జయించడానికి మీకేది సహాయపడుతుంది?

  • క్షమాపణ గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 64:1–11లోని ఏ సత్యాలు మీకు ముఖ్యమైనవిగా అనిపించాయి? “అందరిని క్షమించమని” ప్రభువు మనల్ని ఎందుకు ఆజ్ఞాపించారని మీరనుకుంటున్నారు? (10వ వచనము).

మీరు క్షమించడానికి కష్టపడుతున్నట్లయితే, ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ గారి సందేశము “సమాధానపరచు పరిచర్య” (లియహోనా, నవ. 2018, 77–79) లేదా క్రిస్టిన్ ఎమ్. యీ గారి సందేశము “బూడిదకు ప్రతిగా పూదండ: క్షమాపణ యొక్క స్వస్థపరచు దారి” (లియహోనా, నవ. 2022, 36–38) అధ్యయనం చేయడాన్ని పరిగణించండి. క్షమించడానికి క్రీస్తు మీకెలా సహాయపడగలరు అనే దాని గురించి మీరేమి నేర్చుకుంటారు?

క్షమించడానికి కుటుంబ సంబంధాలు అనేక అవకాశాలను అందించగలవు. మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి. మీరు ఎవరిని క్షమించాలి? మనము ఒకరినొకరం క్షమించుకోనప్పుడు, మనమెలా “శ్రమనొందెదము” (8వ వచనము)? క్షమాపణ మీ కుటుంబ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

8:24

Forgiveness: My Burden Was Made Light

హత్తుకుంటున్న తండ్రీ కొడుకులు

“మీరు ఒకరినొకరు క్షమించుకొనవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 64:9).

సిద్ధాంతము మరియు నిబంధనలు 64:31–34

నా “హృదయమును, సిద్ధమైన మనస్సును” ప్రభువు కోరును.

మీరు సాధించాలని ప్రయత్నిస్తున్న “మంచినంతటిని చేయడం”లో మీరెప్పుడైనా “విసుగు” చెందారా? సిద్ధాంతము మరియు నిబంధనలు 64:31–34 లో మీ కోసం ప్రభువు సందేశము కొరకై చూడండి. ఆయన “గొప్ప కార్యమును” జరిగించడానికి మీరు ఏమి చేయాలని పరలోక తండ్రి కోరుతున్నారు?

33వ వచనమును వివరించే వస్తుపాఠం గురించి ఆలోచించండి—మొజాయిక్ లేదా ఇటుక భవనం వంటి చిన్న వస్తువులతో రూపొందించబడిన పెద్ద వాటి గురించి. దేవుని గొప్ప పనికి “[పునాది] వేయడానికి” మీరు ప్రతిరోజూ ఏ “చిన్న పనులు” చేయవచ్చు? ప్రభువు మీకు ఇచ్చిన “గొప్ప పని”కి కొన్ని ఉదాహరణలు ఏమిటి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 64:31–34

“హృదయము మరియు సిద్ధమైన మనస్సు”

“హృదయము మరియు సిద్ధమైన మనస్సు” అనే వాక్యభాగానికి ఎల్డర్ డొనాల్డ్ ఎల్. హాల్‌స్ట్రామ్ ఈ సాధ్యమైన అర్థాన్ని సూచించారు:

“హృదయం ప్రేమ మరియు నిబద్ధతకు ప్రతీక. మనం ప్రేమించే వారి కోసం మనం త్యాగాలు చేస్తాం మరియు మరే ఇతర కారణాల వల్ల భరించని బాధలను భరిస్తాం. ప్రేమ లేకపోతే, మన నిబద్ధత క్షీణిస్తుంది. …

“‘సిద్ధమైన మనస్సు’ కలిగి ఉండడం అంటే మన శ్రేష్ఠమైన కృషిని మరియు అత్యుత్తమ ఆలోచనను అందించడం మరియు దేవుని జ్ఞానాన్ని వెదకడం. మన అత్యంత అంకితమైన జీవితకాల అధ్యయనం నిత్య స్వభావం గల విషయాలపై ఉండాలని ఇది సూచిస్తుంది. దానర్థం దేవుని వాక్యాన్ని వినడానికి మరియు దానిని పాటించడానికి మధ్య అవినాభావ సంబంధం ఉండాలి” (“The Heart and a Willing Mind,” Ensign, June 2011, 31–32).

సిద్ధాంతము మరియు నిబంధనలు 64:41–43

సీయోను “జనులకు ఒక ధ్వజముగా నుండును.”

ధ్వజము అనగా “ఒక జెండా లేదా పతాకము, ఒక ఉద్దేశము లేదా గుర్తింపు కొరకు జనులు ఐక్యతతో దాని చుట్టూ సమకూడుతారు” (లేఖనదీపిక, “ధ్వజము,” సువార్త గ్రంథాలయము). సీయోను—లేదా ప్రభువు యొక్క సంఘము—మీ కొరకు ఒక ధ్వజము వలె ఎట్లున్నది? జనులను దీవించడానికి ఒక ధ్వజము వలె నిలబెట్టబడిన వాటి యొక్క ఈ ఇతర మాదిరులను పరిగణించండి: సంఖ్యాకాండము 21:6–9; మత్తయి 5:14–16; ఆల్మా 46:11–20. సిద్ధాంతము మరియు నిబంధనలు 64:41–43లో ప్రభువు సీయోనును వర్ణించు ఇతర విధానాల కొరకు చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 65

భూమిపై ఉన్న దేవుని రాజ్యం రక్షకుడు తిరిగి రావడానికి ప్రపంచాన్ని సిద్ధం చేస్తుంది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 65 కడవరి దినాలలో ప్రభువు సంఘము యొక్క నియమితకార్యము గురించి స్ఫూర్తిదాయకమైన వివరణను ఇస్తుంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం చూస్తూ ఈ ప్రకరణమును శోధించడాన్ని పరిగణించండి: తన రాజ్యం భూమిపై ఏమి సాధించాలని ప్రభువు కోరుకుంటున్నారు? సహాయం చేయడానికి నేను ఏమి చేయాలని ఆయన కోరుకుంటున్నారు?

1:7

Prepare Today for the Second Coming

సిద్ధాంతము మరియు నిబంధనలు 66

నా హృదయ తలంపులను ప్రభువు ఎరుగును.

సంఘములో చేరిన కొంతకాలానికి విలియం ఈ. మెక్‌లెలిన్ తన కొరకు దేవుని చిత్తాన్ని బయల్పరచమని జోసెఫ్ స్మిత్‌ను అడిగాడు. జోసెఫ్ దానిని ఎరుగలేదు, కానీ విలియం ఐదు వ్యక్తిగత ప్రశ్నలు కలిగియున్నాడు, ప్రభువు తన ప్రవక్త ద్వారా వాటికి జవాబిస్తారని అతడు ఆశించాడు. విలియం కలిగియున్న ప్రశ్నలు మనకు తెలియదు, కానీ అతనికి ఉద్దేశించబడిన బయల్పాటైన ఇప్పటి సిద్ధాంతము మరియు నిబంధనలు 66, విలియం “పూర్తిగా తృప్తి చెందేలా” ప్రతి ప్రశ్నకు జవాబిచ్చిందని మనకు తెలుసు (“William McLellin’s Five Questions,” in Revelations in Context, 138).

మీరు 66వ ప్రకరణము చదువుతున్నప్పుడు, విలియం మెక్‌లెలిన్ మరియు అతని చింతలు, అతని హృదయ భావాల గురించి ప్రభువుకు ఏమి తెలుసో ఆలోచించండి. ఆయన మిమ్మల్ని ఎరుగునని ప్రభువు మీకెలా చూపారు? మీరు గోత్రజనకుని దీవెనను కలిగియున్నట్లయితే, దానిని చదవడాన్ని పరిగణించండి. మీరు చదివినప్పుడు, మీ పట్ల దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ ఏవిధముగా సహాయపడ్డాడు?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 03

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 64:7–10

నేను ప్రతీ ఒక్కరిని క్షమించాలని యేసు క్రీస్తు కోరుతున్నారు.

గమనిక: “అందరినీ క్షమించు” అనే ప్రభువు ఆజ్ఞ గురించి మీరు మీ పిల్లలకు బోధిస్తున్నప్పుడు, క్షమించడం అంటే మనల్ని బాధపెట్టడానికి జనులను అనుమతించడం కాదని మీరు స్పష్టం చేయాలనుకోవచ్చు. ఎవరైనా వారిని బాధపెట్టినా లేదా అనుచితంగా తాకినా విశ్వసనీయ పెద్దలకు చెప్పమని వారిని ప్రోత్సహించండి.

  • మీ పిల్లలతో సిద్ధాంతము మరియు నిబంధనలు 64:10 చదివిన తర్వాత, ఎవరినైనా క్షమించడం అంటే ఏమిటో వారితో మాట్లాడండి. మీరు కొన్ని సాధారణ ఉదాహరణలను పంచుకోవచ్చు. క్షమాపణను సాధన చేయడానికి బహుశా వారు ఈ ఉదాహరణలను నటించి చూపవచ్చు.

  • ఇతరులను క్షమించడం గురించి చెల్లెలు లేదా తమ్ముడికి వారు ఎలా బోధిస్తారో ప్రణాళిక చేయమని మీరు మీ పిల్లలను అడగవచ్చు. వారు బోధిస్తున్నప్పుడు వారు ఉపయోగించగలిగేలా సిద్ధాంతము మరియు నిబంధనలు 64:7–10లో వాక్యభాగాలను కనుగొనడానికి వారికి సహాయపడండి.

  • క్షమాపణ గురించి ఒక పాట పాడండి. ఇతరులను క్షమించడం గురించి ఈ పాట మనకేమి బోధిస్తుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 64:33

దేవుని “గొప్ప కార్యము చిన్న విషయాల”పై నిర్మించబడుతుంది.

  • చిన్న భాగాలతో రూపొందించబడిన పజిల్ లేదా రగ్గు వంటి కొన్ని వస్తువులను మీరు మీ పిల్లలకు చూపించవచ్చు. తర్వాత మీరు కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 64:33 చదువవచ్చు. దేవుని “గొప్ప కార్యము” ఏమిటి? సహాయం చేయడానికి మనం చేయగల “చిన్న విషయాలు” ఏవి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 64:34

నేను నా హృదయంతో మరియు మనస్సుతో యేసును అనుసరించగలను.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 64:34 నుండి మీరు మీ పిల్లల కొరకు చదివినప్పుడు, మీరు “హృదయం” మరియు “మనస్సు” అని చదివేటప్పుడు మీ హృదయం మరియు తల వైపు చూపవచ్చు మరియు మీతోపాటు దీన్ని చేయమని పిల్లలను ఆహ్వానించవచ్చు. మన హృదయాలను (కోరికలు) మరియు మనస్సులను (ఆలోచనలు) మనం రక్షకునికి ఎలా ఇవ్వగలం?

యేసు క్రీస్తు యొక్క మాదిరిని నొక్కి చెప్పండి. మీరు చదువుతున్నప్పుడు లేదా బోధించేటప్పుడు రక్షకుని ఉదాహరణను ఎలా నొక్కి చెప్పవచ్చో పరిగణించండి. ఉదాహరణకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 64:34 గురించి బోధించేటప్పుడు, రక్షకుడు తన హృదయం (కోరికలు) మరియు మనస్సు (ఆలోచనలు) పరలోకమందున్న తన తండ్రికి ఎలా ఇచ్చారు అనే దాని గురించి మీరు మీ పిల్లలతో మాట్లాడవచ్చు. (రక్షకుని విధానములో బోధించుట6 చూడండి.)

సిద్ధాంతము మరియు నిబంధనలు 66

నేనెవరో ప్రభువుకు తెలుసు మరియు ఆయన నన్ను ప్రేమిస్తున్నారు.

  • విలియం ఈ. మెక్‌లెలిన్‌ ప్రభువు కొరకు ఐదు ప్రశ్నలు కలిగియున్నాడని అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడండి. విలియం యొక్క ప్రశ్నలు ఏమిటో తెలియకపోయినా జోసెఫ్ స్మిత్ ఈ ప్రశ్నలకు సమాధానాలు అందుకున్నాడు. మీరు ఏమి చేయాలని ఆయన కోరుకుంటున్నారో ప్రభువు మీకు చూపించిన సమయం గురించి మీ పిల్లలకు చెప్పండి మరియు ఆయన నిర్దేశాన్ని అనుసరించడం ద్వారా వచ్చిన దీవెనల గురించి మాట్లాడండి. అప్పుడు మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 66:4ని కలిసి చదివి, వారు ఏమి చేయాలని ప్రభువు కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి అవకాశాలను వెదకమని మీ పిల్లలను ఆహ్వానించవచ్చు.

    రక్షకుని రెండవ రాకడ

    The Second Coming [రెండవ రాకడ] నుండి వివరణ, కెవిన్ కీలి చేత

సిద్ధాంతము మరియు నిబంధనలు 65

యేసు క్రీస్తును స్వీకరించడానికి ప్రపంచాన్ని సిద్ధం చేయడానికి నేను సహాయం చేయగలను.

  • మీ పిల్లలు రక్షకుని రెండవ రాకడ చిత్రాన్ని చూస్తున్నప్పుడు, వారు ఏమి చూస్తున్నారో లేదా ఈ సంఘటన గురించి వారికి ఏమి తెలుసో వివరించమని వారిని అడగండి. మీరు మీ పిల్లలకు సిద్ధాంతము మరియు నిబంధనలు 65లో కనుగొనడానికి రెండవ రాకడ గురించి పదాలు మరియు వాక్యభాగాలను కూడా ఇవ్వవచ్చు. ఈ పదాలు మరియు వాక్యభాగాలు మనకు ఏమి బోధిస్తాయి? రక్షకుడు తిరిగి రావడం కోసం మనం ఎలా సిద్ధపడవచ్చు?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ఒక స్త్రీని క్షమిస్తున్న రక్షకుడు

Forgiven [క్షమించబడెను], గ్రెగ్ ఓల్సెన్ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ