Doctrine and Covenants 2025
జూన్ 23–29: “ఈ భూలోకమంతటనున్న ఐశ్వర్యమంత విలువైనవి”: సిద్ధాంతము మరియు నిబంధనలు 67–70


జూన్ 23–29: ‘ఈ భూలోకమంతటనున్న ఐశ్వర్యమంత విలువైనవి’: సిద్ధాంతము మరియు నిబంధనలు 67–70,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 67–70,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

ఆజ్ఞల గ్రంథము యొక్క వ్రాతప్రతి

జూన్ 23-29: “ఈ భూలోకమంతటనున్న ఐశ్వర్యమంత విలువైనవి”

సిద్ధాంతము మరియు నిబంధనలు 67–70

1828 నుండి 1831 వరకు ప్రవక్త జోసెఫ్ స్మిత్ ప్రభువు నుండి అనేక బయల్పాటులు పొందారు, అందులో వ్యక్తుల కొరకు దైవిక ఉపదేశము, సంఘమును నిర్వహించడంపై సూచనలు, కడవరి దినముల యొక్క దర్శనములు మరియు నిత్యత్వము యొక్క అనేక ప్రేరేపిత సత్యాలు ఉన్నాయి. కానీ పరిశుద్దులలో అనేకమంది వాటిని చదవలేదు. బయల్పాటులు ఇంకా ప్రచురించబడలేదు మరియు అందుబాటులో ఉన్న కొన్ని ప్రతులు విడి కాగితాల మీద చేతితో వ్రాసినవి, అవి సభ్యుల మధ్య వ్యాపించాయి మరియు సువార్తికుల చేత చూట్టూ తీసుకొనిపోబడ్డాయి.

తర్వాత, 1831 నవంబరులో, బయల్పాటుల ప్రచురణ గురించి చర్చించడానికి జోసెఫ్ సంఘ నాయకుల సభ ఏర్పాటు చేసారు. ప్రభువు యొక్క చిత్తమును వెదికిన తర్వాత, ఈ నాయకులు ఆజ్ఞల గ్రంథము—నేటి సిద్ధాంతము మరియు నిబంధనలకు పూర్వగ్రంథము యొక్క ప్రచురణ కొరకు ప్రణాళికలు చేసారు. ప్రతీఒక్కరు జీవించియున్న ప్రవక్త ద్వారా బయల్పరచబడిన దేవుని వాక్యమును తమకైతాము త్వరలో చదవగలుగుతారు, “మన రక్షకుని రాజ్యపు మర్మముల తాళపుచెవులు మరలా మనుష్యునికి ఇవ్వబడెను“ అనడానికి అది స్పష్టమైన సాక్ష్యము. ఇవి మరియు ఇతర కారణాలనేకము మూలంగా, అప్పటి మరియు ఇప్పటి పరిశుద్ధులు ఈ బయల్పాటులను “ఈ భూలోకమంతటనున్న ఐశ్వర్యమంత విలువైనవి”గా యెంచుతారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 70, ప్రకరణ శీర్షిక).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 67:1–9; 68:3–6

పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడినప్పుడు ప్రభువు యొక్క సేవకులు ఆయన చిత్తమును మాట్లాడతారు.

జోసెఫ్ స్మిత్ ద్వారా పొందబడిన బయల్పాటులను ప్రచురించాలనే నిర్ణయం చాలా సులువైనదిగా కనబడుతుంది, కానీ అది మంచి ఆలోచన అని కొందరు ప్రారంభ సంఘ నాయకులు నమ్మలేదు. ఒక ఆందోళన, బయల్పాటులను వ్రాయడానికి జోసెఫ్ స్మిత్ ఉపయోగించిన భాషలోని దోషములకు సంబంధించినది. ఆ ఆందోళనకు జవాబుగా 67వ ప్రకరణములోని బయల్పాటు వచ్చింది. ప్రభువు యొక్క ప్రవక్తలు మరియు బయల్పాటుల గురించి 1–9 వచనాల నుండి మీరేమి నేర్చుకుంటారు? 68:3–6 నుండి ఏ అదనపు అంతరార్థములను మీరు పొందుతారు?

దేవుడు తన సేవకులకు ఇచ్చే బయల్పాటులు నిజమని మీకైమీరు ఎలా తెలుసుకున్నారు? ప్రభువు తన సేవకులలో ఒకరి ద్వారా మీతో మాట్లాడుతున్నారని మీరు భావించినప్పటి అనుభవాలను కూడా మీరు ధ్యానించవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 68:4 చూడండి). ఏదైనా చెప్పడానికి మీరు “పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడినట్లు” (3వ వచనము) ఎప్పుడు భావించారు? ప్రభువు ఏవిధంగా “మీ ప్రక్కన నిలిచారు”? (6వ వచనము).

ఆజ్ఞల గ్రంథము ముద్రించబడడానికి ముందు, పుస్తకంలోని బయల్పాటులు నిజమని అనేకమంది సంఘ నాయకులు వ్రాతపూర్వక సాక్ష్యంపై సంతకం చేశారు. josephsmithpapers.org

సిద్ధాంతము మరియు నిబంధనలు 67:10–14

“సహనముతో కొనసాగుడి.”

అసూయ, భయము మరియు గర్వము ప్రభువుకు దగ్గర కాకుండా మనల్ని ఎలా నిరోధిస్తాయి? మనం “[ఆయన్ని] చూడగలిగేలా మరియు [ఆయన] ఉన్నారని తెలుసుకొనగలిగేలా” మనం “ప్రకృతి సంబంధియైన మనుష్యుడిని” లేదా “ఐహిక మనస్సు గలవాడి”ని ఎలా అధిగమించగలము? (12వ వచనము; మోషైయ 3:19 కూడా చూడండి). “మీరు పరిపూర్ణులగువరకు సహనముతో కొనసాగుటకు” మిమ్మల్ని ప్రేరేపించేలా ఈ వచనాలలో మీరేమి కనుగొంటారు? (13వ వచనము).

సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25–31

సెమినరీ చిహ్నము
నా ఇంటిని యేసు క్రీస్తుపై కేంద్రీకరించడానికి నేను సహాయం చేయగలను.

సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25–31లో ప్రభువు యొక్క మాటలు ప్రత్యేకించి తల్లిదండ్రులకు సూచించబడినవి, కానీ మీరు తల్లిదండ్రులు అయినా, కాకపోయినా యేసు క్రీస్తు యొక్క సిద్ధాంతంపై మీ ఇంటిని కేంద్రీకరించడంలో మీ వంతు చేయడానికి మీరు ఆయన సలహాను ఉపయోగించవచ్చు. ఇంటిలో బోధించబడాలి అని ప్రభువు చెప్పిన సూత్రాలలో కొన్ని క్రింద జాబితా చేయబడ్డాయి. వీటిలో ప్రతీ ఒక్కదానిని క్రీస్తు-కేంద్రీకృత గృహము—మీరిప్పుడు నివసిస్తున్న గృహము లేదా మీ భవిష్యత్ గృహము యొక్క పునాదిలో భాగంగా ఎలా చేయగలరో పరిగణించండి. అందించబడిన వనరులు మరియు ప్రశ్నలు సహాయపడగలవు.

  • పశ్చాత్తాపము: ఆల్మా 36:17–20ని అధ్యయనం చేయండి మరియు ఆల్మా తండ్రి అతనికి రక్షకుని ప్రాయశ్చిత్త నియమితకార్యము గురించి బోధించినందువల్ల అతడు క్లిష్ట పరిస్థితిలో ఎలా దీవించబడ్డాడో గమనించండి. యేసు క్రీస్తు వైపు తిరిగి, పశ్చాత్తాపపడేలా మీ కుటుంబాన్ని ప్రేరేపించడంలో మీరు ఎలా సహాయపడగలరు? (2 నీఫై 25:26 కూడా చూడండి).

  • క్రీస్తు నందు విశ్వాసము: క్రీస్తు లేచియున్నాడు; ఆయనయందు విశ్వాసం పర్వతములను కదిలించును (లియహోనా, మే 2021, 103) లో విశ్వాసాన్ని వృద్ధిచేయడానికి అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి ఐదు సూచనలను చదవండి. ఈ సూచనలు మీ కుటుంబంలో విశ్వాస సంస్కృతిని ఎలా సృష్టించగలవో ఆలోచించండి.

  • బాప్తిస్మము: మోషైయ 18:8–10, 13లో వివరించబడిన బాప్తిస్మపు నిబంధనను పునర్వీక్షించండి. ఈ నిబంధనను నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ కుటుంబాన్ని ఎలా బలపరుస్తాయి?

  • పరిశుద్ధాత్మ వరము: For the Strength of Youth: A Guide for Making Choices లోని 17–19 పేజీల లో ఉన్న ఆహ్వానాలను అధ్యయనం చేయండి. మీ ఇంటిలోనికి పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ఆహ్వానించడానికి ఏమి చేయాలని ప్రేరేపించబడినట్లు మీరు భావిస్తున్నారు?

  • 3 నీఫై 18:15–21 లో రక్షకుడు వాగ్దానం చేసిన దీవెనలేవి?

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25–31 లో మీరు కనుగొనే ఇతర సూత్రాలు:

క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలకు కుటుంబ సభ్యులు మద్దతు ఇవ్వని వ్యక్తికి మీరు ఏ సలహా ఇస్తారు?

కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” సువార్త గ్రంథాలయము; డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, “యేసు క్రీస్తే తల్లిదండ్రుల బలము,” లియహోనా, మే 2023, 55–59 కూడా చూడండి.

కలిసి నేర్చుకుంటున్న కుటుంబము

సిద్ధాంతము మరియు నిబంధనలు 69:1

“నమ్మకముగా, యథార్థముగా” నుండు స్నేహితులు యేసు క్రీస్తును అనుసరించడానికి నాకు సహాయం చేస్తారు.

ఈ వచనంలో వివరించబడిన నియామకము‌లో ఆలీవర్ కౌడరీతో పాటు “నమ్మకముగా, యథార్థముగా” నుండు ఒకడు వెళ్ళడం “[ప్రభువు] యందు వివేకమైనది” అని మీరెందుకు అనుకుంటున్నారు? ఈ సూత్రము మీకు ఎలా అన్వయించవచ్చు?

అభ్యాసకులు ఒకరినొకరు ఉద్ధరించడంలో సహాయపడండి. మీ తరగతి లేదా కుటుంబంలోని ప్రతీ వ్యక్తి సాక్ష్యం, అంతర్దృష్టులు మరియు సువార్త జీవించే అనుభవాల యొక్క గొప్ప వనరు. ఒకరితో ఒకరు పంచుకోవడానికి మరియు ఉద్ధరించడానికి వారిని ఆహ్వానించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 70:1–4

ప్రభువు ఇచ్చిన బయల్పాటులకు నేను జవాబుదారీగా ఉన్నాను.

బయల్పాటుల ప్రచురణను చూసుకొనే బాధ్యతను ప్రభువు నిర్దిష్టమైన పెద్దలకు ఇచ్చారు. ఆ ప్రత్యేక బాధ్యత మీకు లేనప్పటికీ, “బయల్పాటులకు, ఆజ్ఞలకు” మీ గృహనిర్వాహకత్వము లేదా బాధ్యత ఏమిటి? (3వ వచనము).

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 67

సిద్ధాంతము మరియు నిబంధనలు నాకు యేసు క్రీస్తు గురించి బోధిస్తుంది.

  • జోసెఫ్ స్మిత్ యొక్క బయల్పాటులు పుస్తకంలో ఎలా ముద్రించబడ్డాయో మీ పిల్లలకు చెప్పండి. ఈ సంవత్సరం ఇప్పటివరకు సిద్ధాంతము మరియు నిబంధనల నుండి యేసు క్రీస్తు గురించి మీరు నేర్చుకున్న కొన్ని విషయాలను గుర్తు చేసుకోవడానికి వారికి సహాయపడండి. మీరు సిద్ధాంతము మరియు నిబంధనల నుండి మీకు ఇష్టమైన కొన్ని వచనాలను కూడా ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.

    4:28

    మేరీ మరియు కారొలైన్ రోలిన్స్: లేఖనాల పట్ల గాఢమైన ప్రేమ

  • మీరు మీ పిల్లలకు బైబిలు, మోర్మన్ గ్రంథము, సిద్ధాంతము మరియు నిబంధనలు, గొప్ప వెలగల ముత్యమును కూడా చూపవచ్చు మరియు అవి ఎలా భిన్నంగా ఉన్నాయి మరియు అవి ఎలా సారూప్యంగా ఉన్నాయి అనే దాని గురించి వారితో మాట్లాడవచ్చు (లేఖన దీపికలో ఈ పుస్తకాల వర్ణనలను చూడండి). లేఖనాలు నిజమని మనమెలా తెలుసుకోగలము? ప్రభువు జోసెఫ్ స్మిత్‌కిచ్చిన బయల్పాటుల గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 67:4, 9 నుండి మనమేమి నేర్చుకుంటాము?

లేఖనాలను చదువుతున్న పిల్లలు

సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25–31

నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు నేను బాప్తిస్మము పొందగలను.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 68:27లో, ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవడానికి ఎంత వయస్సు కలిగి ఉండాలో ప్రభువు పేర్కొన్నారు. ఆయన చెప్పినది కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడండి. మనము బాప్తిస్మం తీసుకోవాలని యేసు ఎందుకు కోరుతున్నారు? బాప్తిస్మము గురించి ఒక పాట సహాయపడవచ్చు. చిత్రాలు లేదా 25–31 వచనాలు (లేదా రెండూ) ఉపయోగించి, పిల్లలు నేర్చుకోవాలని ప్రభువు కోరుకుంటున్న విషయాలను కనుగొనడంలో మీ పిల్లలకు సహాయపడండి.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 69 యొక్క ప్రకరణ శీర్షికలో ప్రభువు ఆలీవర్ కౌడరీకి ఇచ్చిన నియామకము గురించి మీ పిల్లలతో కలిసి చదవండి. 1వ వచనములో ప్రభువు ఇచ్చిన ఉపదేశమేమిటి? “నమ్మకముగా, యథార్థముగానుండు” జనులతో ఉండుట ఎందుకు ముఖ్యము? బహుశా మీ పిల్లలు వారికి తెలిసిన “నమ్మకముగా, యథార్థముగానున్న” ఒకరి గురించి చెప్పవచ్చు. రక్షకునిలా నమ్మకముగా, యథార్థముగా ఉండడానికి మీ పిల్లలను ప్రోత్సహించే ఒక పాటను కలిసి పాడండి. ప్రభువు పట్ల మనం నమ్మకముగా, యథార్థముగా ఉన్నామని మనమెలా నిశ్చయపరచగలము? మనం నమ్మకముగా, యథార్థముగా ఉన్నప్పుడు ఇతరులను దీవించడానికి ఆయన మనల్ని ఎలా ఉపయోగించగలరు?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ముద్రణాలయము

సిద్ధాంతము మరియు నిబంధనలకు ముందుగా వచ్చిన ఆజ్ఞల గ్రంథము ఇటువంటి ముద్రణాలయములోనే ముద్రించబడింది.

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ