Doctrine and Covenants 2025
జూన్ 2–8: “ఆతృతతో ఒక మంచి కార్యములో నిమగ్నమైయుండవలెను”: సిద్ధాంతము మరియు నిబంధనలు 58–59


“జూన్ 2–8: ‘ఆతృతతో ఒక మంచి కార్యములో నిమగ్నమైయుండవలెను’: సిద్ధాంతము మరియు నిబంధనలు 58– 59,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 58–59,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

1830లలో మిస్సోరిలోని ఇండిపెండెన్స్

Independence, Missouri, 1831 [మిస్సోరిలోని ఇండిపెండెన్స్, 1831], ఆల్ రౌండ్స్ చేత

జూన్ 2–8: “ఆతృతతో ఒక మంచి కార్యములో నిమగ్నమైయుండవలెను”

సిద్ధాంతము మరియు నిబంధనలు 58–59

సంఘ పెద్దలు మొదటిసారి సీయోను పట్టణము యొక్క స్థలము—మిస్సోరిలోని ఇండిపెండెన్స్ చూచినప్పుడు, అది వారు ఆశించినట్లు లేదు. పరిశుద్ధుల యొక్క బలమైన సమూహంతో వృద్ధిచెందుతున్న శ్రామిక సమాజాన్ని కనుగొంటామని కొందరు అనుకున్నారు. బదులుగా అత్యల్ప జనాభా గల దూరప్రాంతాన్ని, వారు అలవాటుపడ్డ నాగరికత లేకపోవడాన్ని మరియు పరిశుద్ధులకు బదులుగా సరిహద్దులలో క్రొత్తగా వచ్చిన మొరటు మనుషుల నివాసాలను వారు కనుగొన్నారు. సీయోనుకు రమ్మని మాత్రమే ప్రభువు వారిని అడగడం లేదని—దానిని నిర్మించమని ఆయన వారిని కోరుతున్నారని స్పష్టమైంది.

మనము ఆశించినదానికి, వాస్తవానికి సంబంధం లేనప్పుడు, 1831లో ప్రభువు పరిశుద్ధులకు చెప్పిన దానిని మనం జ్ఞాపకం చేసుకోగలము: “మీ దేవుని ప్రణాళికను, అనేక శ్రమల తరువాత కలుగు మహిమను మీ సహజ నేత్రాలతో ప్రస్తుతము మీరు చూడలేరు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:3). అవును, జీవితం శ్రమలతోను, దుష్టత్వముతోను నిండియున్నది, కానీ మనము “అధికమైన నీతిని నెరవేర్చగలము; ఎందుకనగా శక్తి (మనలో) ఉన్నది” (27–28 వచనములు).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 58:1–5; 59:23

“అనేక శ్రమల తరువాత దీవెనలు కలుగును.”

వారి జీవితకాలాల్లో సీయోనులా, పరిశుద్ధులందరూ సమకూడగల ప్రదేశంగా జాక్సన్ కౌంటీ వికసిస్తుందని పరిశుద్ధులు ఆశించారు. అయినప్పటికీ, జాక్సన్ కౌంటీలో వారి కాలము శ్రమలతో నిండియుంది. కొద్ది సంవత్సరాలలోనే వారు విడిచివెళ్ళడానికి మరియు “సీయోను విమోచన కొరకు కొద్దికాలము వేచియుండడానికి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 105:9) బలవంతము చేయబడ్డారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 58:1–5లో ప్రభువు మాటల నుండి మీరు శ్రమలు లేదా సవాళ్ళ గురించి ఏమి నేర్చుకుంటారు? కొన్ని దీవెనలు శ్రమ తరువాత మాత్రమే వస్తాయని మీరెందుకు అనుకుంటున్నారు? శ్రమ తరువాత మీరు పొందిన దీవెనలేవి?

మీకు నిరీక్షణనిచ్చేలా సిద్ధాంతము మరియు నిబంధనలు 59:23 నుండి మీరేమి నేర్చుకుంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 58:26–29

నా “ఇష్టపూర్వకముగా” నేను “అధికమైన నీతిని నెరవేర్చగలను”.

ఈ వచనాలపై మీ అధ్యయనంలో భాగంగా, మీరు “ఆతృతగా నిమగ్నమైయున్న” కొన్ని కార్యముల జాబితా తయారు చేయవచ్చు. వాటిలో అన్నీ “మంచి కార్యములేనా”? “అధికమైన నీతిని నెరవేర్చడానికి” మీరు ఏమి చేయగలరో ధ్యానించండి—మరియు దానిని చేయడానికి లక్ష్యాలను నిర్దేశించుకోండి.

“[మీ] ఇష్టపూర్వకముగా అనేక కార్యములు” చేయాలని ప్రభువు మిమ్మల్ని ఎందుకు కోరుతున్నారు? మీరు “అన్ని విషయాలలో బలవంతం” చేయబడితే ఫలితం ఏమవుతుంది? ఈ సూత్రం గురించి మీ గ్రహింపుకు 2 నీఫై 2:27 ఏమి జతచేస్తుంది?

డేల్ జి. రెన్లండ్, “ఈ దినమున మీరు ఎంచుకోండి,” లియహోనా, నవ. 2018, 104–6 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 58:42–43

సెమినరీ చిహ్నము
నేను పశ్చాత్తాపపడినప్పుడు ప్రభువు నన్ను క్షమిస్తారు.

పశ్చాత్తాపపడిన వారిని పూర్తిగా క్షమించమని సిద్ధాంతము మరియు నిబంధనలు 58:42లో నున్న ప్రభువు వాగ్దానం స్ఫూర్తిదాయకంగా ఉంది, అయితే ఇది కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది: పశ్చాత్తాపపడడం అంటే ఏమిటి? నేను పశ్చాత్తాపపడ్డానో లేదో నాకు ఎలా తెలుస్తుంది? అదృష్టవశాత్తూ, ప్రభువు ఇలా కొనసాగించారు, “దీని ద్వారా మీరు తెలుసుకోవచ్చు…” (43వ వచనము).

పశ్చాత్తాపం గురించి జనులు కొన్నిసార్లు ఎదుర్కొనే కొన్ని అదనపు ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. మీరు క్రింద ఇవ్వబడిన సూచించబడిన వనరులను అధ్యయనం చేస్తున్నప్పుడు ఆత్మ మీకు ఏమి బోధిస్తాడు?

నా పాపాలను ఒప్పుకోవడం నాకు పశ్చాత్తాపపడడానికి ఎలా సహాయపడుతుంది? కీర్తన 32:1–5; సామెతలు 28:13; మోషైయ 27:34–37; ఆల్మా 39:12–13 చూడండి.

నేను నా పాపాలను విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నేను తప్పులు చేస్తూనే ఉన్నాను. నా పశ్చాత్తాపం ఇంకా చెల్లుతుందా? బ్రాడ్లీ ఆర్. విల్కాక్స్, “యోగ్యత అంటే లోపాలు లేకపోవడం కాదు,” లియహోనా, నవ. 2021, 61–67 చూడండి.

5:27

Daily Restoration

మనము రక్షకునికి “చెందిన” వారమని మనము ఎలా చూపగలము? టాడ్ ఆర్. క్యాలిస్టర్, “యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము,” లియహోనా, మే 2019, 85–87, ప్రత్యేకించి “2. పాపము” అనే శీర్షిక గల విభాగాన్ని చూడండి.

మీరు పశ్చాత్తాపము గురించి For the Strength of Youth: A Guide for Making Choices (8–9 పేజీల) లోని “ప్రశ్నలు మరియు జవాబులు” లో మరిన్ని అంతర్దృష్టులను కనుగొనగలరు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 59

పోలీ నైట్ ఎవరు?

పోలీ నైట్ మరియు ఆమె భర్త జోసెఫ్ నైట్ సీ., జోసెఫ్ స్మిత్ యొక్క ప్రవచనాత్మక పిలుపును మొదట నమ్మిన వారిలో ఉన్నారు. పోలీ మరియు జోసెఫ్‌లు మోర్మన్ గ్రంథ అనువాద కార్యములో ప్రవక్తకు ముఖ్యమైన సహకారాన్ని అందించారు. ఒహైయోలోని పరిశుద్ధులతో సమకూడడానికి నైట్ కుటుంబము న్యూయార్క్‌‌లోని కొలిస్విల్‌ను విడిచివెళ్ళారు, తరువాత మిస్సోరిలోని జాక్సన్ కౌంటీకి వెళ్ళాలని ఆజ్ఞాపించబడ్డారు. వారు ప్రయాణిస్తున్నప్పుడు పోలీ ఆరోగ్యం క్షీణించసాగింది, కానీ ఆమె చనిపోకముందు సీయోనును చూడాలని ఆమె నిశ్చయించుకుంది. ఆమె మరణించడానికి ముందు కొద్దిరోజులే ఆమె మిస్సోరిలో ఉంది (Saints, 1:127–28, 132–33 చూడండి). ఆమె చనిపోయిన రోజు సిద్ధాంతము మరియు నిబంధనలు 59 పొందబడింది, 1 మరియు 2 వచనాలు ప్రత్యేకంగా ఆమె గురించి చెప్తున్నట్లు అనిపిస్తుంది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 59:4-19

ఆజ్ఞలు ఒక దీవెన.

“ఆజ్ఞలతో … దీవించబడెదరు” (4వ వచనము) అనగా అర్థమేమైయుండవచ్చని మీరనుకుంటున్నారు? 5–19 వచనములలోని ఆజ్ఞలలో ప్రతీదానిని పాటించడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రభువు మిమ్మల్ని ఎలా దీవిస్తారో పరిగణించండి.

మీరు నేర్చుకొనే దానిని పంచుకోండి. అనేక సందర్భాల్లో, మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు మీరు పొందే ఆధ్యాత్మిక అంతర్దృష్టులు మీ కుటుంబం, స్నేహితులు మరియు వార్డు సభ్యుల విశ్వాసాన్ని బలపరుస్తాయి. మీ అనుభవాలు, భావాలు మరియు యేసు క్రీస్తు గురించి మీ సాక్ష్యాన్ని వారితో పంచుకోండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 59:9–19

సబ్బాతు అనేది ప్రభువు యొక్క దినము.

సీయోనులోని పరిశుద్ధులను “మరిన్ని ఆజ్ఞలతో” దీవిస్తానని వాగ్దానం చేసిన తర్వాత, ప్రత్యేకించి ఒక ఆజ్ఞ: ఆయన “పరిశుద్ధ దినమును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 59:4, 9) గౌరవించాలనే ఆజ్ఞ గురించి ప్రభువు ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 59:9–19 చదువుతున్నప్పుడు, ఈ పరిశుద్ధులు సీయోనును నిర్మించాలని కోరినప్పుడు సబ్బాతును గౌరవించడం వారికి ఎందుకంత ముఖ్యమైయుండవచ్చో ధ్యానించండి. అది మీకెందుకు విలువైనది?

ప్రభువు ఉద్దేశించిన విధంగా మీరు సబ్బాతుదినమును ఉపయోగిస్తున్నారా లేదా అని కూడా మీరు ధ్యానించవచ్చు. “ఇహలోక మాలిన్యము అంటకుండా” (9వ వచనము) ఉండేందుకు సబ్బాతుదినమును పరిశుద్ధముగా ఆచరించడం మీకెలా సహాయపడుతుంది? “మహోన్నతునికి మీ భక్తిని చూపుటకు” (10వ వచనము) మీరేమి చేయగలరు?

సంస్కారము

సబ్బాతు దినమును వివరించడానికి “సంతోషము,” “ఆనందము,” మరియు “సంతోషకరము” వంటి పదాలను ప్రభువు ఉపయోగించడాన్ని మీరు గమనించవచ్చు. మీకు సబ్బాతు దినమున ఆనందాన్ని కలిగించేది ఏమిటి? ప్రభువు యొక్క దినమును ఎందుకు గౌరవించాలని మీరు ఎంచుకున్నారో ఎవరికైనా ఎలా వివరిస్తారు?

ఆదికాండము 2:2–3; యెషయా 58:13–14 కూడా చూడండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 02

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 58:26-28

పరలోక తండ్రి నాకు ఎన్నుకునే శక్తిని ఇచ్చారు.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 58:26–28ని కలిసి చదవడం వల్ల మీకు మరియు మీ పిల్లలకు మంచి చేయడాన్ని ఎంచుకోవడానికి పరలోక తండ్రి మనకు ఇచ్చిన శక్తి గురించి మాట్లాడే అవకాశం లభిస్తుంది. మీరు చేసిన వివిధ ఎంపికల గురించి మరియు ఫలితంగా ఏమి జరిగిందనే దాని గురించి మీరు ఒకరికొకరు చెప్పుకోవచ్చు. బహుశా మీ పిల్లలు వారి అనుభవాన్ని చిత్రించాలనుకోవచ్చు.

  • మీరు ఒక కాగితంపై ఒక వైపు ఎంపికను మరియు మరొక వైపు పర్యవసానమును వ్రాయవచ్చు మరియు మన ఎంపికలు మరియు వాటి పర్యవసానాలు విడదీయరానివని వివరించడానికి ఈ కాగితాన్ని ఉపయోగించవచ్చు. బహుశా మీ పిల్లలు కొన్ని ఎంపికలను జాబితా చేయవచ్చు మరియు వాటి నుండి వచ్చే పరిణామాల గురించి మాట్లాడవచ్చు. తర్వాత మీరు కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 58:27–28 చదువవచ్చు మరియు “అధిక నీతిని నేరవేర్చే” ఎంపికలు లేదా మంచి పరిణామాల గురించి మాట్లాడవచ్చు. మనం మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పరలోక తండ్రి మనల్ని ఏవిధంగా దీవిస్తారు లేదా “ప్రతిఫలమిస్తారు”? (28వ వచనము).

సిద్ధాంతము మరియు నిబంధనలు 59:7, 18–21

“అన్ని విషయములలో నీవు నీ ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేయవలెను.”

  • మీరు మరియు మీ పిల్లలు విహారానికి వెళ్ళడం లేదా ప్రకృతి చిత్రాలను చూడడం, “కంటికి ఇంపుగా ఉండి … హృదయమునకు ఆనందము కలుగజేసే” (18వ వచనము) విషయాలను గమనించడం వంటివి చేస్తున్నప్పుడు ఈ వచనాలను చదవడం గురించి ఆలోచించండి. లేదా వారు కృతజ్ఞతలు తెలిపే వాటి చిత్రాలను గీయడానికి మీరు మీ పిల్లలను ఆహ్వానించవచ్చు మరియు వారి చిత్రాల గురించి వారిని మీకు చెప్పనివ్వండి. ఈ విషయాల కొరకు మనం మన కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?

తేనెపిట్ట మరియు పువ్వులు

మనకు ఆనందాన్ని కలిగించడానికి ప్రభువు ఎన్నో అందమైన వస్తువులను సృష్టించారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 59:9–12

సబ్బాతు అనేది ప్రభువు యొక్క దినము.

  • ప్రభువును ఆరాధించి, ఆనందాన్ని పొందేందుకు ఆదివారం మనం ఏమి చేయవచ్చు? సిద్ధాంతము మరియు నిబంధనలు 59:9–12 మరియు ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీలో ఉపాయాలను కనుగొనడంలో మీ పిల్లలకు సహాయపడండి. సబ్బాతునాడు మనం చేసే పనులను (ఈ నమూనా‌లో ఉన్న సంస్కారము యొక్క చిత్రాలు వంటివి) సూచించడానికి వారు చిత్రాలు లేదా వస్తువులను కూడా కనుగొనవచ్చు. పరలోక తండ్రికి మరియు యేసు క్రీస్తుకు సన్నిహితంగా భావించేందుకు ఈ విషయాలు మనకు ఎలా సహాయపడతాయి?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

సంస్కారము తీసుకోవడానికి సిద్ధపడుట

మార్టి మేజర్ చేత వివరణ

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ