Doctrine and Covenants 2025
మే 19–25: “దేవుని నుండి కలిగినది వెలుగైయున్నది”: సిద్ధాంతము మరియు నిబంధనలు 49–50


“మే 19-25: ‘దేవుని నుండి కలిగినది వెలుగైయున్నది’: సిద్ధాంతము మరియు నిబంధనలు 49–50,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 49–50,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

సూర్యోదయం

మే 19-25: “దేవుని నుండి కలిగినది వెలుగైయున్నది”

సిద్ధాంతము మరియు నిబంధనలు 49–50

రక్షకుడు మన “మంచి కాపరి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:44). కొన్నిసార్లు గొర్రెలు దారి తప్పుతాయని, అడవిలో అనేక అపాయములున్నాయని ఆయనకు తెలుసు. కాబట్టి, ఆయన మనలను ప్రేమతో తన సిద్ధాంతం యొక్క భద్రత వైపు నడిపిస్తారు. “లోకమంతా వ్యాపించి, ప్రపంచమును మోసపుచ్చుచున్న అబద్ధ ఆత్మల” (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:2) వంటి అపాయాల నుండి ఆయన మనల్ని దూరంగా నడిపిస్తారు. తరచు ఆయనను అనుసరించడమంటే అర్థము, తప్పుడు ఆలోచనలు లేదా ఆచారాలను నమ్మకపోవడం. ఇది లేమన్ కోప్లి మరియు ఒహైయోలోని ఇతరుల విషయంలో నిజము. వారు పునఃస్థాపించబడిన సువార్తను అంగీకరించినప్పటికీ, ఇంకా కొన్ని తప్పుడు విశ్వాసాలను పట్టుకొని వ్రేలాడుతున్నారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 49లో, వివాహము మరియు రక్షకుని రెండవ రాకడ వంటి విషయాల గురించి లేమన్ యొక్క పూర్వ నమ్మకాలను సరిచేసిన సత్యాలను ప్రభువు ప్రకటించారు. పరివర్తన చెందినవారు ఒహైయోలో “(వారు) గ్రహింపజాలని ఆత్మలను పొందినప్పుడు,” ఆత్మ యొక్క నిజమైన ప్రత్యక్షతలను ఎలా తెలుసుకోవాలో ప్రభువు వారికి బోధించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:15). మంచి కాపరి మనతో సహనముగా నున్నాడు, ఆయన “చిన్న పిల్లలు” “కృపయందును, సత్యము యొక్క జ్ఞానమందును వృద్ధిచెందవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 50:40).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 49; 50:24

ఆయన సువార్త యొక్క సత్యాలను హత్తుకోవాలని యేసు క్రీస్తు నన్ను కోరుతున్నారు.

సంఘములో చేరకముందు లేమన్ కోప్లి, క్రీస్తు రెండవ దర్శనమందు విశ్వసించువారి ఐక్య సమాజము అని, షేకర్స్ అని కూడా పిలువబడిన మత సమూహములో భాగమైయుండెను. లేమన్‌తో మాట్లాడిన తర్వాత, షేకర్స్ బోధనలలో కొన్నింటి గురించి జోసెఫ్ స్మిత్ ప్రభువును స్పష్టత కోరారు. 49వ ప్రకరణములోని బయల్పాటుతో ప్రభువు స్పందించారు. ప్రకరణము యొక్క శీర్షికలో షేకర్స్ నమ్మకాలలో కొన్ని పేర్కొనబడ్డాయి.

షేకర్స్ యొక్క నమ్మకాలను సరిచేయడానికి 49వ ప్రకరణములో ప్రభువు ఏమి బోధించారు? ఆయన సత్యం యొక్క సంపూర్ణతను కలిగియుండని వ్యక్తుల పట్ల ఆయన ప్రేమ మరియు శ్రద్ధ యొక్క ఈ బయల్పాటులో మీరు ఏ రుజువును చూస్తున్నారు? ప్రేమ మరియు శ్రద్ధతో మీరు వారిని ఎలా సమీపించగలరు?

2వ వచనములో ప్రభువు గమనించిన దాని గురించి మిమ్మల్ని ఆకట్టుకున్నదేది? మీరు చలనచిత్రంలో కొంత భాగాన్ని మాత్రమే చూసినప్పుడు, పజిల్‌లోని ఒక భాగాన్నే చూసినప్పుడు లేదా వాదన యొక్క ఒక వైపు మాత్రమే విన్నప్పుడు జరిగే దానితో మీరు దీన్ని పోల్చవచ్చు. ప్రభువు యొక్క హెచ్చరిక సిద్ధాంతము మరియు నిబంధనలు 50:24తో ఎలా సంబంధం కలిగియుంది? ప్రభువు నుండి అధిక వెలుగును పొందడానికి మీరు ఏమి చేస్తున్నారో పరిగణించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 49:15–17

సెమినరీ చిహ్నము
స్త్రీ పురుషుల మధ్య వివాహము దేవుని ప్రణాళికకు ఆవశ్యకమైనది.

పరలోక తండ్రి ప్రణాళికను అణగద్రొక్కే ప్రయత్నంలో, సాతాను వివాహం గురించి గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. మరోవైపు, ప్రభువు తన ప్రవక్తల ద్వారా వివాహం గురించి సత్యాన్ని బయల్పరుస్తూనే ఉన్నారు. ఈ సత్యములో కొంత మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 49:15–17; ఆదికాండము 2:20–24; 1 కొరింథీయులకు 11:11; మరియు “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” లో కనుగొనగలరు. మీరు కనుగొనే సత్యాలను జాబితా చేయండి. దేవుని ప్రణాళికకు వివాహము ఎందుకు అంత ముఖ్యమైనది?

“యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త మర్త్య జీవితంలో మరియు నిత్యత్వములో రెండిటిలో స్త్రీ, పురుషుల మధ్య పూర్తి భాగస్వామ్యము యొక్క సూత్రమును ప్రకటిస్తుంది” అని ఎల్డర్ యులిసెస్ సోవారెస్ బోధించారు (“ప్రభువుతో భాగస్వామ్యములో,” లియహోనా, నవ. 2022, 42). “స్త్రీ, పురుషుల మధ్య భాగస్వామ్యమును బలపరచు” సూత్రముల కొరకు చూస్తూ, మీరు ఆయన సందేశాన్ని చదువవచ్చు. మీ జీవితంలో ఈ సూత్రాలను మీరు ఎలా అన్వయించగలరు? వివాహం ఎందుకు ముఖ్యమని వేరే విశ్వాసము గల వారొకరు మిమ్మల్ని అడిగినట్లయితే, మీరెలా స్పందిస్తారు? ఈ అవగాహన కొరకు మీరు ఎందుకు కృతజ్ఞత కలిగియున్నారు?

2:36

Renaissance of Marriage

వ్యక్తుల పరిస్థితుల పట్ల సున్నితంగా ఉండండి. సంతోషకరమైన వివాహం మరియు కుటుంబ జీవితం యేసు క్రీస్తు సువార్తలో ఆదర్శవంతమైనవి అయినప్పటికీ, మనమందరం మర్త్యత్వములో ఉన్నప్పుడు ఈ దీవెనలను పొందలేము. ఈ అంశాన్ని చర్చిస్తున్నప్పుడు, వివిధ వ్యక్తిగత మరియు కుటుంబ పరిస్థితుల పట్ల, ప్రత్యేకించి నిత్య వాగ్దానాలు నెరవేరడం కోసం “ప్రభువు కొరకు కనిపెట్టుకొనియున్న” వ్యక్తుల పట్ల సున్నితంగా ఉండండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 98:1–3 చూడండి).

దేవాలయము వెలుపల కుటుంబము

సిద్ధాంతము మరియు నిబంధనలు 50

ప్రభువు యొక్క బోధనలు నన్ను సాతాను మోసాల నుండి కాపాడగలవు.

ఒహైయోలో క్రొత్తగా పరివర్తన చెందినవారు లేఖనాలలో వాగ్దానం చేయబడిన ఆత్మీయ ప్రత్యక్షతలను పొందడానికి ఆతృతగా ఉన్నారు. కానీ సాతాను కూడా వారిని మోసం చేయడానికి ఆతృతగా ఉండెను. పరిశుద్ధాత్మ యొక్క నిజమైన ప్రత్యక్షతలను ఎలా గుర్తించాలో అర్థం చేసుకోవడానికి ఈ సభ్యులకు సహాయం చేయమని మిమ్మల్ని అడిగితే, మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 50లోని ఏ సూత్రాలను పంచుకుంటారు? (ప్రత్యేకించి, 22–25, 29–34, 40–46 వచనములు చూడండి). సత్యం మరియు దోషం మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి రక్షకుడు మీకు ఎలా సహాయం చేశారు?

1 కొరింథీయులకు 14:1-28; 2 తిమోతి 3:13-17 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 50:13–24

ఆత్మ చేత బోధకులు మరియు అభ్యాసకులు కలిపి బోధించబడతారు.

యేసు క్రీస్తు సువార్తను జీవించడం గృహములో మరియు సంఘములో బోధకులుగా, అభ్యాసకులుగా ఉండడానికి అనేక అవకాశాలను అందిస్తుంది. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 50:13–24 చదవడానికి ఒక విధానమేదనగా, ఒక బోధకుడు మరియు ఒక అభ్యాసకుని చిత్రాన్ని గీయడం. వారి ప్రక్కన ఈ వచనాలలో సువార్త అభ్యాసము మరియు బోధన గురించి మీకు బోధించే పదాలు మరియు వాక్యభాగాలను జాబితా చేయడం. బోధన మరియు అభ్యాసములో ఆత్మ యొక్క ప్రాముఖ్యతను మీకు బోధించిన అనుభవాలను మీరెప్పుడు కలిగియున్నారు? ఒక సువార్త అభ్యాసకునిగా మరియు బోధకునిగా మీ ప్రయత్నాలను మెరుగుపరచుకోవడానికి మీరు ఏమి చేయగలరో ఆలోచించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 50:23–25

“దేవుని నుండి కలిగినది వెలుగైయున్నది”

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 50: 23–25లో రక్షకుని మాటలు ధ్యానించేటప్పుడు, మీరు మీ జీవితంలో దేవుని వెలుగును ఎలా పొందుతారో మరియు మీరు ఎలా “చీకటిని తరిమివేస్తారో” ఆలోచించండి. ఉదాహరణకు, ఈ వచనాలు మీ సమయాన్ని ఎలా గడపాలి? ఏ వినోదం లేదా మీడియా కోసం వెతకాలి? ఏ సంభాషణలలో పాల్గొనాలనే దాని గురించి మీ ఎంపికలకు ఎలా మార్గనిర్దేశం చేస్తాయి? ఈ వచనాలు మీకు ఏ ఇతర నిర్ణయాలలో సహాయపడతాయి?

పిల్లల విభాగపు చిహ్నము 03

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 49:12–14

నేను యేసు క్రీస్తును అనుసరించగలను.

  • ఈ వచనాల్లోని సూత్రాలను మీ పిల్లలకు బోధించడానికి, మీరు నాలుగు కాగితపు పాదముద్రలు మరియు యేసు క్రీస్తుపై విశ్వాసం, పశ్చాత్తాపం, బాప్తిస్మము మరియు పరిశుద్ధాత్మను పొందడాన్ని సూచించే నాలుగు చిత్రాలను సిద్ధం చేయవచ్చు (ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీలోని చిత్రాలను చూడండి). మీ పిల్లలు పాదముద్రలను, వాటి ప్రక్కన చిత్రాలను నేలపై ఉంచవచ్చు. అప్పుడు మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 49:12–14ను చదువుతుండగా వారు వంతులవారీగా ఆ పాదముద్రలపై నడవవచ్చు. మనం ఈ చిత్రాలలోని విషయాలను చేసినప్పుడు, మనం యేసు క్రీస్తును అనుసరిస్తున్నామని దీని అర్థమని వారు గ్రహించడానికి సహాయపడండి.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 49:12–14ను అపొస్తలుల కార్యములు 2:38 మరియు నాల్గవ విశ్వాస ప్రమాణముతో పోల్చమని కూడా మీరు మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. ఏ పోలికలను వారు కనుగొంటారు? ఈ సత్యాలు ఎందుకు ముఖ్యమైనవి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 49:15–17

స్త్రీ పురుషుల మధ్య వివాహము దేవుని ప్రణాళికకు ఆవశ్యకమైనది.

  • ఈ వచనాలను పరిచయం చేయడానికి, షేకర్స్ ఒక మత సమూహం అని, వివాహం చేసుకోకూడదని వారు నమ్ముతారని మీరు వివరించవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 49 యొక్క ప్రకరణ శీర్షిక చూడండి). సిద్ధాంతము మరియు నిబంధనలు 49:15–17లో వివాహం గురించి ప్రభువు బోధించిన విషయాలను కనుగొనమని మీ పిల్లలను ఆహ్వానించండి. “వివాహం దేవుని చేత నియమించబడింది” అనగా అర్థమేమిటి? బహుశా మీరు “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” లోని మొదటి మూడు పేరాలను కలిసి చదువవచ్చు. అప్పుడు, వివాహం మరియు కుటుంబం పరలోక తండ్రికి ఎందుకు ముఖ్యమనే దాని గురించి మాట్లాడవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 50:23-25

“దేవుని నుండి కలిగినది వెలుగైయున్నది”

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 50:23–25ను పరిచయం చేయడానికి, చీకటి వెలుగుల మధ్య తేడా గురించి మీ పిల్లలతో మాట్లాడండి. వెలుగు మనకు ఎందుకు అవసరము? మీరు కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 50:23–25 చదువవచ్చు. మనం దేవుని వెలుగును పొందే విధానాలు మరియు మనం చీకటిని తరిమివేయగల విధానాల గురించి మాట్లాడండి. తర్వాత, వారి ఆత్మీయ వెలుగు గురించి ఒక పాటను కూడా మీరు కలిసి పాడవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 50:40–46

యేసు క్రీస్తు నా మంచి కాపరి.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 50:40–46 చదివిన తర్వాత, ఈ నమూనా చివర ఉన్న రక్షకుని చిత్రాన్ని చూపించి, ఇటువంటి ప్రశ్నలు మీరు అడగవచ్చు: ఒక గొర్రెల కాపరి తన గొర్రెల గురించి ఎలా భావిస్తాడు? రక్షకుడు మనకు ఏలాగు కాపరి వంటివాడు?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

మంచి కాపరి

Gentle Shepherd [సున్నితమైన కాపరి], యాంగ్‌సుంగ్ కిమ్ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ