“మే 5–11: ‘వాగ్దానములన్నియు నెరవేరును’: సిద్ధాంతము మరియు నిబంధనలు 45,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 45,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
మే 5-11: “వాగ్దానములన్నియు నెరవేరును”
సిద్ధాంతము మరియు నిబంధనలు 45
ప్రకరణము యొక్క శీర్షిక ప్రకారము, “పరిశుద్ధుల ఆనందమునకై” 45వ ప్రకరణములోని బయల్పాటు పొందబడింది. మరియు ఈ బయల్పాటు గురించి ఆనందించడానికి చాలా ఉంది. దీనిలో తండ్రి యెదుట మనల్ని గూర్చి బ్రతిమాలుతానని రక్షకుడు తన మృదువైన వాగ్దానాన్ని ఇస్తారు (3–5 వచనములు చూడండి). “[ఆయన] యెదుట మార్గమును సిద్ధపరచుటకు … ఒక దూత” (9వ వచనము) వలె, ఆయన శాశ్వతమైన నిబంధనను లోకములోనికి పంపడం గురించి ఆయన చెప్తారు. మరియు మహిమకరమైన ఆయన రెండవ రాకడ గురించి ఆయన ప్రవచిస్తారు. కొంతవరకు ఆయన రాకడకు ముందు జరగబోయే ప్రమాదాల కారణంగా, ఇవి కష్టకాలములు (34వ వచనము చూడండి) అని కూడా చెప్తూ రక్షకుడు ఇవన్నీ చేస్తారు. కానీ ఆ ప్రమాదం, ఆ చీకటి ఆశల వెలుగును ఆర్పేటంత బలంగా లేదు. “చీకటిలో ప్రకాశించు వెలుగును నేనే” అని “నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని ప్రభువు ప్రకటించారు (7వ వచనము). ఆనందంతో—ఆయన ఎలాంటి సలహా, హెచ్చరికలు మరియు సత్యం ఇవ్వాలనుకున్నా—ఈ బయల్పాటును పొందడానికి అది ఒక్కటే కారణం.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 45:1–5
తండ్రి యెదుట యేసు క్రీస్తు నా న్యాయవాది.
మనం దేవుని ముందు సరిపోనట్లుగా లేదా అనర్హులుగా భావించినప్పుడు, సిద్ధాంతము మరియు నిబంధనలు 45:1–5లో నున్న రక్షకుని మాటల నుండి మనం భరోసా పొందవచ్చు. మీరు ఈ వచనాలను పరిశోధించినప్పుడు, ఇటువంటి ప్రశ్నలను పరిగణించండి:
-
ఈ వచనాలలోని పదాలు లేదా వాక్యభాగాలలో మీకు ప్రత్యేకంగా అర్థవంతంగా అనిపించినవి ఏవి?
-
ఒక వ్యక్తికి లేదా కారణానికి బహిరంగంగా మద్దతు ఇచ్చే లేదా సిఫార్సు చేసే వ్యక్తిని న్యాయవాది అంటారు. ఈ వచనముల ప్రకారము, యేసు క్రీస్తు మీ కొరకు దీనిని ఎలా చేస్తారు? దీనిని చేయడానికి ఆయనను అర్హునిగా చేసేదేది?
-
రక్షకుడు తండ్రికి చెప్పిన మాటలలో మిమ్మల్ని ఏది ఆకట్టుకుంది? (4–5 వచనములు).
మన న్యాయవాదియైన యేసు క్రీస్తు గురించి “నేడు మీరు కోరుకొనుడి” (లియహోనా, నవ. 2018, 104–5) లో ఎల్డర్ డేల్ జి. రెన్‌లండ్ బోధించిన దానిని కూడా మీరు చదువవచ్చు. ఎల్డర్ రెన్‌లండ్ ప్రకారము, రక్షకుని ఉద్దేశము లూసిఫరు ఉద్దేశముతో ఎలా పోల్చబడుతుంది?
ఈ క్రింది గద్యభాగాలు న్యాయవాదిగా రక్షకుని పాత్ర గురించి మీ అవగాహనకు తోడ్పడవచ్చు. మీరు వాటిని చదివినప్పుడు, మీరు ఇతరులతో పంచుకోగల వాక్యభాగాలు లేదా సత్యాలను వ్రాయడాన్ని పరిగణించండి: 2 నీఫై 2:8–9; మోషైయ 15:7–9; మొరోనై 7:27–28; సిద్ధాంతము మరియు నిబంధనలు 29:5; 62:1. ఈ వాక్యభాగాలు మీకు ఎందుకు అర్థవంతమైనవి?
The Mediator
సిద్ధాంతము మరియు నిబంధనలు 45:9–10
సువార్త అనేది దేశాలకు ప్రమాణము వంటిది.
పూర్వకాలంలో, ధ్వజము అనేది యుద్ధములోనికి తీసుకువెళ్ళే పతాకము, దళాలను సమీకరించడానికి మరియు ఏకీకృతం చేయడానికి ఉపయోగించబడేది. ప్రమాణము అనేది ఇతర విషయాలను కొలవగల ఉదాహరణ లేదా నియమము కూడా. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 45:9–10 చదువుతున్నప్పుడు, ప్రభువుతో మీ నిబంధనలు ఏవిధంగా మీకు ఒక ప్రమాణం వంటివో ధ్యానించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 45:11–75
యేసు క్రీస్తు మహిమయందు తిరిగి వస్తారు.
ప్రభువు యొక్క రెండవ రాకడ “మహాదినము”గా మరియు “భయంకరము”గా వర్ణించబడింది (మలాకీ 4:5). సిద్ధాంతము మరియు నిబంధనలు 45లో, రెండు వర్ణనలు సరిపోయినట్లు అనిపిస్తాయి. ఈ బయల్పాటులో ప్రభువు యొక్క రాకడ గురించి గంభీరమైన హెచ్చరికలు మరియు ఆశాజనక వాగ్దానాలు ఉన్నాయి. మీరు 11–75 వచనములను చదివినప్పుడు, క్రీస్తు నందు భయానికి బదులు విశ్వాసంతో రెండవ రాకడ కొరకు మీరెలా సిద్ధపడగలరో ధ్యానించండి. మీరు కనుగొన్న దానిని ఇటువంటి పట్టికలో నమోదు చేయండి:
|
ప్రవచనము లేదా వాగ్దానము |
నేనేమి చేయగలను |
|---|---|
ప్రవచనము లేదా వాగ్దానము చీకటిలో కూర్చున్న వారికి (సువార్త) వెలుగు వస్తుంది (28వ వచనము) | నేనేమి చేయగలను వెలుగును స్వీకరించండి—మరియు దానిని పంచుకోండి (29వ వచనము) |
ప్రవచనము లేదా వాగ్దానము | నేనేమి చేయగలను |
ప్రవచనము లేదా వాగ్దానము | నేనేమి చేయగలను |
ప్రవచనము లేదా వాగ్దానము | నేనేమి చేయగలను |
Men's Hearts Shall Fail Them
సిద్ధాంతము మరియు నిబంధనలు 45:31–32, 56–57
నేను “పరిశుద్ధ స్థలములలో నిలిచియుండగలను” మరియు కదలకయుందును.
ప్రభువు యొక్క రాకడ కొరకు సిద్ధపడడం గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 45:31–32, 56–57లో మీరేమి నేర్చుకుంటారు? ఏవి మీ “పరిశుద్ధ స్థలములు”? “కదలక నిలిచియుండుట” అనగా అర్థమేమిటి? మీరు ఉన్నచోటును మరింత పరిశుద్ధంగా మీరెలా చేయగలరు?
ఉపమానంలోని నూనెను సత్యము మరియు పరిశుద్ధాత్మతో పోల్చుతూ, ప్రభువు పదిమంది కన్యల ఉపమానాన్ని ప్రస్తావించారని గమనించండి. దానిని మనస్సులో ఉంచుకొని, మత్తయి 25:1–13లోని ఉపమానాన్ని చదవడాన్ని పరిగణించండి. ఏ అంతరార్థములను మీరు పొందుతారు?
Parable of the Ten Virgins [పదిమంది కన్యకల ఉపమానము], డాన్ బర్ చేత
సిద్ధాంతము మరియు నిబంధనలు 45:11–15, 66–71
సీయోను దేవుని పరిశుద్ధుల కొరకు సురక్షిత ప్రదేశము.
సీయోనును, నూతన యెరూషలేమును నిర్మించడానికి జోసెఫ్ స్మిత్ కాలంలోని పరిశుద్ధులు ఆతృతగా ఉన్నారు (ఈథర్ 13:2–9; మోషే 7:18, 62–64 చూడండి). సిద్ధాంతము మరియు నిబంధనలు 45:11–15, 66–71 నుండి సీయోను—హనోకు కాలం నాటి ప్రాచీన పట్టణము మరియు కడవరి-దిన పట్టణము రెండింటి గురించి మీరేమి నేర్చుకుంటారు? నేడు సీయోనును స్థాపించాలనే ఆజ్ఞ మనం ఎక్కడ నివసించినా దేవుని రాజ్యాన్ని స్థాపించడాన్ని సూచిస్తుంది. మీరున్నచోట సీయోనును నిర్మించడానికి సహాయపడేందుకు మీరేమి చేయగలరు?
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 45:3-5
తండ్రి యెదుట యేసు క్రీస్తు నా న్యాయవాది.
-
న్యాయవాది అనగా మరొక వ్యక్తికి మద్దతు ఇచ్చే వ్యక్తి అని మీ పిల్లలు అర్థం చేసుకోవడంలో మీరు సహాయం చేయాలనుకోవచ్చు. అప్పుడు మీరు వారికి తెలిసి న్యాయవాదిగా ఉన్న ఉదాహరణల గురించి మాట్లాడవచ్చు (స్నేహితునికి మద్దతివ్వడం వంటివి). మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 45:3–5ను కలిసి చదువుతున్నప్పుడు, మన న్యాయవాది ఎవరో మరియు ఆయన మనకు ఎలా సహాయం చేస్తున్నారో కనుగొనడంలో మీ పిల్లలకు సహాయం చేయండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 45:32
నేను “పరిశుద్ధ స్థలములలో నిలిచియుండగలను.”
-
గది చుట్టూ ఇల్లు, సంఘ భవనం మరియు దేవాలయ చిత్రాలను ఉంచడం సరదాగా ఉండవచ్చు. అప్పుడు మీరు ఈ స్థలాలను వివరించే ఆధారాలను మీ పిల్లలకు ఇవ్వవచ్చు మరియు మీరు వివరిస్తున్న చిత్రం దగ్గర నిలబడమని వారిని ఆహ్వానించవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 45:32 నుండి మొదటి వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు కదలకుండా నిలబడమని వారిని అడగండి. దేవుడు మనకిచ్చు కొన్ని “పరిశుద్ధ స్థలములు” ఏవి? “పరిశుద్ధ స్థలములలో నిలిచియుండడం మరియు … కదలకుండా ఉండడం” అంటే ఏమి జరిగినా, అన్ని సమయాలలో సరైనదాన్ని ఎంచుకోవడం అని మీ పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయపడండి. మన ఇంటిని మరింత పరిశుద్ధ స్థలముగా మనమెలా చేసుకోగలము?
సిద్ధాంతము మరియు నిబంధనలు 45:9
యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రపంచానికి ఒక ప్రమాణం.
-
పూర్వకాలంలో, ధ్వజము అనేది యుద్ధములోనికి తీసుకువెళ్ళే పతాకము లేదా జెండా అని మీరు మీ పిల్లలకు వివరించవచ్చు. ఎక్కడ సమకూడాలి, ఏమి చేయాలి అని తెలుసుకోవడానికి అది సైనికులకు సహాయపడింది. సిద్ధాంతము మరియు నిబంధనలు 45:9ని కలిసి చదవండి మరియు సువార్త ఏవిధంగా ప్రమాణం వంటిదో చర్చించండి. మీ పిల్లలు రక్షకుని గురించి తమ భావాలను వ్యక్తపరిచే చిత్రాలు లేదా పదాలతో సహా వారి స్వంత ప్రమాణం లేదా జెండాను తయారు చేసుకోవడాన్ని ఆనందించవచ్చు.
సువార్త అనేది ఒక ప్రమాణము లేదా పతాకము లేదా జెండా వంటిది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 45:44–45
యేసు క్రీస్తు మరలా వస్తారు.
-
రెండవ రాకడకు ముందు జరిగే విధ్వంసం పిల్లలను భయపెట్టవచ్చు. యేసు క్రీస్తు వైపు దారిచూపడం విశ్వాసంతో ఎదురుచూడడంలో వారికి సహాయపడుతుంది! తాత లేదా స్నేహితుని వంటి ప్రత్యేక వ్యక్తులు ఎవరైనా సందర్శించడానికి వచ్చినప్పుడు వారు ఎలా భావిస్తారనే దాని గురించి ఆలోచించమని వారిని ఆహ్వానించడాన్ని పరిగణించండి. వారు సందర్శన కోసం ఎలా సిధ్ధపడతారు? అప్పుడు మీరు రక్షకుని చిత్రాన్ని చూపించి, సిద్ధాంతము మరియు నిబంధనలు 45:44–45ను చదువవచ్చు. రక్షకుని రాకడ గురించి మీరు ఎలా భావిస్తున్నారో ఒకరితో ఒకరు పంచుకోండి.
-
రక్షకుని రెండవ రాకడ గురించి మీ పిల్లలు ఉత్సాహంగా భావించడంలో సహాయపడడానికి, మీరు 45వ ప్రకరణము నుండి కొన్ని ఆశాజనక వాగ్దానాలను కాగితంపై వ్రాయవచ్చు (ఉదాహరణకు, 44–45, 51–52, 55, 58–59, 66–71 వచనములు చూడండి). మీ పిల్లలకు కాగితాలు ఇవ్వండి మరియు మీరు వచనాలు చదువుతున్నప్పుడు వారు కలిగి ఉన్న వాగ్దానం ప్రస్తావించబడినప్పుడు చేయి పైకెత్తమని వారిని అడగండి. ఈ వాగ్దానాల అర్థం ఏమిటో చర్చించండి. రక్షకుని రెండవ రాకడ గురించి మీరు మీ పిల్లలతో కలిసి ఒక పాట కూడా పాడవచ్చు.
ఆత్మను గుర్తించడానికి మీ పిల్లలకు సహాయపడండి. మీరు మీ పిల్లలకు బోధించుచుండగా, మీరు పరిశుద్ధాత్మను అనుభవించినప్పుడు వారికి తెలియజేయండి. ఆయన ప్రభావాన్ని మీరు ఎలా గుర్తించారనే దాని గురించి మాట్లాడండి. ఉదాహరణకు, రక్షకుని గురించి పాట పాడుతున్నప్పుడు మీరు ప్రశాంతంగా లేదా ఆనందంగా భావించియుండవచ్చు.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.