“ఏప్రిల్ 28–మే 4: ‘నా సంఘమును పరిపాలించుటకు నా చట్టము’: సిద్ధాంతము మరియు నిబంధనలు 41–44,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 41–44,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
ఏప్రిల్ 28–మే 4: “నా సంఘమును పరిపాలించుటకు నా చట్టము”
సిద్ధాంతము మరియు నిబంధనలు 41–44
1830 మరియు 1831లో సంఘము వేగంగా అభివృద్ధి చెందింది, ముఖ్యంగా కర్ట్‌లాండ్‌లోని ఒహైయోలో క్రొత్త సభ్యుల రద్దీతో. ఈ పెరుగుదల పరిశుద్ధులకు ఉత్తేజకరంగా మరియు ప్రోత్సాహకరంగా ఉంది, అయితే ఇది కొన్ని సవాళ్ళను కూడా అందించింది. త్వరగా విస్తరిస్తున్న విశ్వాసుల సమూహాన్ని మీరు ఎలా ఏకం చేస్తారు? ప్రత్యేకంగా, వారు తమ పూర్వ విశ్వాసాల నుండి సిద్ధాంతాలు మరియు అభ్యాసాలను తీసుకువచ్చినప్పుడు మీరు ఏమి చేస్తారు? ఉదాహరణకు, 1831 ప్రారంభములో జోసెఫ్ స్మిత్ కర్ట్‌లాండ్‌కు చేరుకున్నప్పుడు, క్రొత్త నిబంధన క్రైస్తవులను అనుకరిస్తూ క్రొత్త సభ్యులు ఒక ప్రత్యేక ప్రయత్నంలో ఉమ్మడి ఆస్తిని పంచుకోవడాన్ని ఆయన కనుగొన్నారు (అపొస్తలుల కార్యములు 4:32–37 చూడండి). దీనిపై మరియు ఇతర అంశాలపై ప్రభువు కొన్ని ముఖ్యమైన దిద్దుబాట్లు మరియు స్పష్టీకరణలు చేసారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 42లో నమోదు చేయబడిన “నా సంఘమును పరిపాలించుటకు నా చట్టము” (59వ వచనము) అని ఆయన పిలిచిన ఒక బయల్పాటు ద్వారా ఎక్కువగా ఆయన దీనిని చేసారు. ఈ బయల్పాటులో, కడవరి దినాలలో ప్రభువు యొక్క సంఘాన్ని స్థాపించడంలో ప్రధానమైన సత్యాలను మనం నేర్చుకుంటాము. మరియు మనం నేర్చుకోవలసింది ఇంకా చాలా ఉందని తెలుసుకుంటాము: “నీవు అడిగినయెడల, బయల్పాటు వెంబడి బయల్పాటును, జ్ఞానము వెంబడి జ్ఞానమును నీవు పొందెదవు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61) అని ప్రభువు వాగ్దానము చేసారు.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
“ఎవడైతే నా ధర్మశాస్త్రమును పొంది, దానికి విధేయుడైయుండునో, అట్టివాడే నా శిష్యుడు.”
1831 ప్రారంభం నాటికి, పరిశుద్ధులు ఒహైయోలో సమకూడడం ప్రారంభించారు. అక్కడ బయల్పరుస్తానని ప్రభువు వాగ్దానం చేసిన చట్టాన్ని పొందడానికి వారు ఆతృతగా ఉన్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 38:32 చూడండి). కానీ ముందుగా, ఆయన చట్టాన్ని పొందడానికి ఆయన శిష్యులు ఎలా సిద్ధపడాలో ప్రభువు బోధించారు. దేవుని చట్టాన్ని పొందడంలో పరిశుద్దులకు సహాయపడిన ఏ సూత్రాలను సిద్ధాంతము మరియు నిబంధనలు 41:1–6లో మీరు కనుగొంటారు? ఆయన నుండి ఉపదేశాన్ని పొందడానికి ఈ సూత్రాలు మీకెలా సహాయపడవచ్చు?
ప్రభువు నాకు ఆజ్ఞలను ఇస్తారు, ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 42:1–72లో కనుగొనబడే బయల్పాటును ప్రవక్త పొందిన అతి ముఖ్యమైన బయల్పాటులలో ఒకటిగా పరిశుద్ధులు పరిగణించారు. ప్రచురించబడిన మొదటి బయల్పాటులలో ఇది ఒకటి. చాలా సంవత్సరాలు, పరిశుద్ధులు దీనిని “చట్టం” అని పిలిచారు. ప్రకరణములో ప్రభువు యొక్క ఆజ్ఞలు లేదా చట్టాలు అన్నీ లేనప్పటికీ, క్రొత్తగా పునఃస్థాపించబడిన సంఘానికి ఈ సూత్రాలు ఎందుకు ముఖ్యమైనవి అని ఆలోచించడం విలువైనదే. నేడు అవి మనకు ఎందుకు ముఖ్యమైనవి?
42వ ప్రకరణము చాలా పెద్దగా ఉన్నందున, మీరు ఈ క్రింది వాటి వంటి చిన్న భాగాలలో దానిని అధ్యయనం చేయవచ్చు. ప్రతీ దానిలో బోధించిన సూత్రాలను గుర్తించండి మరియు ఈ చట్టాలు ఆయన జనులపట్ల ప్రభువుకు గల ప్రేమకు ఎలా సంకేతంగా ఉన్నాయో పరిశీలించండి.
దేవుడు మనకు చట్టాలు మరియు ఆజ్ఞలు ఎందుకు ఇస్తారు? ఆజ్ఞలను తెలుసుకోవడం మరియు అనుసరించడం ద్వారా మీరు ఏయే మార్గాల్లో దీవించబడ్డారు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 42:30–42
“బీదలను జ్ఞాపకము చేసుకొనుము.”
42వ ప్రకరణములో బయల్పరచబడిన చట్టములో భాగంగా, ప్రాచీనకాలంలో క్రీస్తు యొక్క అనుచరుల వలె “వారి మధ్య బీదవారెవరు లేకుండా” (మోషే 7:18) ఎలా “అంతయు సమిష్టిగా” (అపొస్తలుల కార్యములు 2:44; 4 నీఫై 1:3) వారు కలిగియుండగలరోనని ప్రభువు తన పరిశుద్ధులకు బోధించారు. సమర్పణ చట్టమును పరిశుద్ధులు ఎలా జీవించారనే దాని గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 42:30-42 నుండి మీరేమి నేర్చుకుంటారు? (సమర్పించడం అంటే ఏదైనా ఒక పవిత్ర ప్రయోజనం కోసం పక్కన పెట్టడం అని అర్థం.)
ఈ రోజు మనకు “అంతయు సమిష్టిగా” లేనప్పటికీ, దేవాలయాలలో కడవరి దిన పరిశుద్ధులు సమర్పణ చట్టాన్ని జీవించడానికి నిబంధన చేస్తారు. దేవుడు మీకు ఇచ్చిన దానిని అవసరంలో ఉన్న జనులను దీవించడానికి మీరు ఎలా సమర్పించగలరు?
షారన్ యుబాంక్, “ఆయన మనల్ని ఉపయోగించాలని నేను ప్రార్థిస్తున్నాను,” లియహోనా, నవ. 2021, 53–56 కూడా చూడండి.
Christ and the Rich Young Ruler [క్రీస్తు మరియు ధనికుడైన యౌవన అధికారి], హీన్రిచ్ హాఫ్‌మన్ చేత
సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61, 65–68; 43:1–16
ఆయన సంఘాన్ని నడిపించడానికి—నన్ను నడిపించడానికి దేవుడు బయల్పాటునిస్తారు.
సంఘము బయల్పాటు చేత నడిపించబడుతున్నదని తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్న ఒక క్రొత్త సంఘ సభ్యునితో మీరు మాట్లాడుతున్నట్లు ఊహించుకోండి. ఆయన ప్రవక్త చేత ఆయన సంఘాన్ని నడిపించడానికి ప్రభువు యొక్క నమూనాను ఆమె లేదా అతనికి వివరించడానికి మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 43:1–16ను ఎలా ఉపయోగించగలరు? వ్యక్తిగత బయల్పాటును పొందడం గురించి బోధించడానికి మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61, 65–68ను ఎలా ఉపయోగించగలరు?
ప్రభువు నుండి ఆయన ఆత్మ ద్వారా మీరు పొందిన కొన్ని “శాంతికరమైన విషయాలు” మరియు సంతోషకరమైన విషయాలు ఏవి?
ప్రభువు మీతో ఎలా సంభాషిస్తారో వివరిస్తూ మీ స్వంత వీడియోను రూపొందించడాన్ని పరిగణించండి.
రస్సెల్ ఎమ్. నెల్సన్, “సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” లియహోనా, మే 2018, 93–96 కూడా చూడండి.
వస్తుపాఠములను ఉపయోగించండి. వస్తుపాఠాలు లేదా దృశ్య సహాయాలు సువార్త సత్యాలను బాగా అర్థం చేసుకోవడానికి మరియు వాటిని ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి మీరు బోధించే వ్యక్తులకు సహాయపడతాయి. ఉదాహరణకు, “బయల్పాటు వెంబడి బయల్పాటును, జ్ఞానము వెంబడి జ్ఞానమును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:61) పొందడం గురించి బోధించడానికి ముక్కలవారీగా సమీకరించబడిన ఒక పజిల్‌ని మీరు ఉపయోగించవచ్చు.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 41:5
శిష్యుడు అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని స్వీకరించి దానిని పాటించే వ్యక్తి.
-
యేసు క్రీస్తు శిష్యులుగా ఉండడం అంటే ఏమిటో మీ పిల్లలకు తెలియజేయడానికి, మీరు శిష్యుడు అనే పదం ఉండవలసిన చోటును ఖాళీగా ఉంచి, ఒక కాగితంపై సిద్ధాంతము మరియు నిబంధనలు 41:5 అని వ్రాయవచ్చు. తర్వాత వారు అక్కడ లేని పదం కోసం 5వ వచనములో చూడవచ్చు. ఈ వచనం ప్రకారం, యేసు క్రీస్తు శిష్యునిగా ఉండడం అంటే ఏమిటి? క్రీస్తుకు మంచి శిష్యులుగా ఉండేందుకు మనం ఎలా ప్రయత్నిస్తున్నాము?
సిద్ధాంతము మరియు నిబంధనలు 42:2
నేను ప్రభువుకు లోబడినప్పుడు నేను సంతోషంగా ఉంటాను.
-
జాగ్రత్తగా వినడం మరియు సూచనలను అనుసరించడం అవసరమైన ఆటను ఆడడాన్ని మీ పిల్లలు ఆనందించవచ్చు. ప్రభువును “విని, ఆలకించుడి, పాటించుడి” అంటే ఏమిటో మాట్లాడడానికి మీరు ఈ ఆటను ఉపయోగించవచ్చు (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:2). ఆయన మనకు ఇచ్చిన సూచనలేవి? ఆయన చట్టాలకు మరియు ఆజ్ఞలకు లోబడడం ద్వారా మనం ఎలా దీవించబడ్డాము?
-
మీరు ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీని మీ పిల్లలతో పూర్తిచేయవచ్చు. దేవుని చట్టాలకు లోబడుట గురించి ఒక పాటను కూడా మీరు పాడవచ్చు. దేవుని చట్టాలకు లోబడడం వల్ల మీకు ఎలా సంతోషం కలిగిందో ఒకరితో ఒకరు పంచుకోవడం గురించి ఆలోచించండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 42:38
ఇతరులకు నేను సేవ చేస్తున్నప్పుడు, నేను యేసు క్రీస్తుకు సేవ చేస్తున్నాను.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 42:38 చదివిన తరువాత, ఇతరులకు సేవ చేయడం ద్వారా యేసును ఎలా సేవించవచ్చో మీ పిల్లలు ఆలోచించేలా వారికి సహాయం చేయండి.
2:18Pass It On
-
మీరు మీ పిల్లలకు దశమ భాగం మరియు ఇతర అర్పణల కాగితాన్ని చూపించి, ఇతరులను దీవించేందుకు మనం కలిగియున్న దానిని ఇవ్వడానికి దానిని ఎలా ఉపయోగించాలో మాట్లాడవచ్చు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 43:1–7
ప్రవక్త మాత్రమే మొత్తం సంఘానికి బయల్పాటును పొందగలరు.
-
సాక్ష్యపు సమావేశంలో ఎవరైనా లేచి నిలబడి, అతను సంఘము మొత్తానికి బయల్పాటు అందుకున్నట్లు వార్డుకు చెప్పినట్లు ఊహించుకోవడానికి మీ పిల్లలను ఆహ్వానించండి (ఉదాహరణకు, మనం ఇకపై క్యారెట్లు తినకూడదు లేదా నీటికి బదులుగా మనం పాలతో చేతులు కడుక్కోవాలి అనే బయల్పాటు.) ప్రవక్తకి బదులుగా మనం ఆయన చెప్పేది వినాలి అని అతడు అంటాడు. అందులో తప్పేముంటుంది? ప్రభువు తన సంఘానికి ఆజ్ఞలను ఎలా ఇస్తారో కనుగొనడానికి అప్పుడు మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 43:1–7ను కలిసి చదువవచ్చు.
-
మీరు జీవించి ఉన్న ప్రవక్త చిత్రాన్ని చూపించి, ఆయన ఇటీవల బోధించిన విషయాన్ని పంచుకోవడానికి కూడా మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. వారికి సహాయం కావాలంటే, ఇటీవలి సర్వసభ్య సమావేశ సందేశం నుండి వీడియో క్లిప్ లేదా గద్యభాగాన్ని పంచుకోండి. నేడు జీవించియున్న ప్రవక్త ఉండడం ఎందుకు దీవెనకరమైనది?
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.