Doctrine and Covenants 2025
మే 12–18: “శ్రేష్టమైన బహుమానములను ఆసక్తితో వెదకుడి”: సిద్ధాంతము మరియు నిబంధనలు 46–48


“మే 12-18: ‘శ్రేష్టమైన బహుమానములను ఆసక్తితో వెదకుడి’: సిద్ధాంతము మరియు నిబంధనలు 46–48,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 46– 46,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

నది వద్ద కలుసుకొనుట

The Camp Meeting [దండు కలుసుకొనుట], వర్తింగ్టన్ విట్రెడ్జ్ చేత

మే 12-18: “శ్రేష్టమైన బహుమానములను ఆసక్తితో వెదకుడి”

సిద్ధాంతము మరియు నిబంధనలు 46–48

పార్లీ పి. ప్రాట్, ఆలీవర్ కౌడరీ, జిబా పీటర్సన్ మరియు పీటర్ విట్మర్ జూ. కర్ట్‌లాండ్‌ను వదిలి, సేవచేయడానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, పరివర్తన చెందిన వారిలో అత్యంత ఉత్సాహమున్నప్పటికీ అతికొద్ది అనుభవము లేదా నడిపింపు గల వందమందిని వారు విడిచివెళ్ళారు. వారికి సూచనిలిచ్చే చేతిపుస్తకాలు లేవు, నాయకత్వ శిక్షణా సమావేశాలు లేవు, సర్వసభ్య సమావేశ ప్రసారాలు లేవు—వాస్తవానికి, వారి దగ్గర పంచుకోవడానికి మోర్మన్ గ్రంథ ప్రతులు కూడా ఎక్కువ లేవు. ఆత్మ యొక్క అద్భుతమైన ప్రత్యక్షతలు, ప్రత్యేకించి క్రొత్త నిబంధనలో వివరించబడినవి వాగ్దానం చేయబడడం ద్వారా ఈ క్రొత్త విశ్వాసులలో అనేకమంది పునఃస్థాపించబడిన సువార్త వైపు ఆకర్షించబడ్డారు (ఉదాహరణకు, 1 కొరింథీయులకు 12:1–11 చూడండి.) కానీ ఆత్మ యొక్క నిజమైన ప్రత్యక్షతలను తెలుసుకోవడం అనేకమందికి కష్టతరమనిపించింది. ఈ గందరగోళాన్ని చూసి, జోసెఫ్ స్మిత్ సహాయం కొరకు ప్రార్థించారు. జనులు ఆత్మ యొక్క విషయాలను తరచు నిరాకరిస్తున్న లేదా నిర్లక్ష్యం చేస్తున్న ఈరోజు కూడా ప్రభువు యొక్క జవాబు అంతే విలువైనది. ఆత్మీయ ప్రత్యక్షతలు నిజమైనవని ఆయన పునరుద్ఘాటించారు. అవి ఏమిటో కూడా ఆయన స్పష్టం చేసారు: అవి ప్రియమైన పరలోక తండ్రి నుండి బహుమానములు, “(ఆయనను) ప్రేమించి, (ఆయన) ఆజ్ఞలన్నింటిని గైకొనువారు మరియు ఆవిధముగా చేయుటకు కోరువారి మేలు కొరకు అవి అనుగ్రహింపబడినవి” (సిద్ధాంతము మరియు నిబంధనలు 46:9).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 46:1–7

తన సంఘములో ఆరాధించుటకు కోరు వారందరిని రక్షకుడు స్వాగతిస్తారు.

మీ వార్డు ఆరాధనా సేవలలో మీ స్నేహితులు మరియు మీ పొరుగువారు స్వాగతించబడినట్లు భావిస్తున్నారని మీరనుకుంటున్నారా? మీ సంఘ సమావేశాలను, జనులు తిరిగి రావాలని కోరుకునే ప్రదేశాలుగా చేయడానికి మీరేమి చేస్తున్నారు? సిద్ధాంతము మరియు నిబంధనలు 46:1–7లో ఉన్న ప్రభువు యొక్క సలహాను మీరెలా అన్వయించగలరో ధ్యానించండి (2 నీఫై 26:24–28; 3 నీఫై 18:22–23 కూడా చూడండి).

మీరు మొదటిసారిగా సంఘ సేవలకు లేదా మరొక సమూహం యొక్క సమావేశానికి హాజరైన సమయం గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. మీరు స్వాగతించబడినట్లు భావించడంలో సహాయం చేయడానికి జనులు ఏమి చేసారు?

మొరోనై 6:5–9 కూడా చూడండి.

1:5

Welcome Comeuntochrist.org

సిద్ధాంతము మరియు నిబంధనలు 46:7–33

సెమినరీ చిహ్నము
ఇతరులను దీవించడానికి పరలోక తండ్రి నాకు ఆత్మీయ బహుమానాలిస్తారు.

ప్రారంభ పరిశుద్ధులు ఆత్మీయ బహుమానాలను నమ్మారు, కానీ వాటిని గుర్తించడానికి మరియు వాటి ఉద్దేశము గ్రహించడానికి వారికి కొంత సహాయం అవసరమైంది. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 46:7–33 లో ఆత్మ యొక్క బహుమానాల గురించి చదివినప్పుడు, “అవి [ఎందుకు] అనుగ్రహింపబడినవో” (8వ వచనము) ధ్యానించండి. ఈ బహుమానాలను ఇచ్చే దేవుని గురించి మీరేమి నేర్చుకుంటారు?

ఇవి లేదా ఇతర ఆత్మీయ బహుమానాలను ఉపయోగించే వ్యక్తుల గురించి మీరు చూసిన ఉదాహరణల గురించి మీరు ఆలోచించగలరా? అవి “దేవుని పిల్లలకు ఎలా మేలు చేస్తాయి”? (26వ వచనము). మీరు లేఖనాల్లో ఇటువంటి వివిధ ఆత్మీయ బహుమానాల ఉదాహరణలను గుర్తించగలరో లేదో కూడా మీరు చూడవచ్చు: 1 రాజులు 3:5–15; దానియేలు 2:26–30; అపొస్తలుల కార్యములు 3:1–8; హీలమన్ 5:17–19; మోర్మన్ 1:1–5; ఈథర్ 3:1–15; సిద్ధాంతము మరియు నిబంధనలు 6:10–12; మోషే 7:13.

ఆత్మీయ బహుమానాల గురించిన మీ అధ్యయనం దేవుడు మీకు ఏ బహుమానాలు ఇచ్చారో ఆలోచించడానికి మిమ్మల్ని నడిపించవచ్చు. ఆయన పిల్లలను దీవించడానికి మీరు ఈ బహుమానాలను ఎలా ఉపయోగించగలరు? మీరు గోత్రజనకుని దీవెనను కలిగియున్నట్లయితే, మీకివ్వబడిన బహుమానాలను బహుశా అది గుర్తించవచ్చు. ఎల్డర్ జాన్ సి. పింగ్రీ గారి సందేశము “మీ కొరకు నాకొక కార్యమున్నది” చదవడం మీరు ఆలోచించని బహుమానాలకు కూడా మీ మనస్సును తెరవవచ్చు (లియహోనా, నవ. 2017, 32–35).

మీరు ఆత్మీయ బహుమానాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే, ఎల్డర్ జువాన్ పాబ్లో విల్లార్ గారి సందేశం “మన ఆత్మీయ కండరాలకు వ్యాయామం” ప్రారంభంలో ఉన్న సారూప్యత సహాయపడగలదు (లియహోనా, మే 2019, 95). మీ ఆత్మీయ బహుమానాలను అభివృద్ధి చేయడంలో మీకు ఏ “వ్యాయామాలు” సహాయపడతాయి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 47

చరిత్రను వ్రాసియుంచాలని ప్రభువు తన సంఘమును కోరుతున్నారు.

సంఘము యొక్క చరిత్రను వ్రాసియుంచడానికి జాన్ విట్మర్ యొక్క పిలుపు దేవుని జనుల మధ్య గ్రంథకర్తల సుదీర్ఘ ఆచారాన్ని కొనసాగించింది. చరిత్రను వ్రాసియుంచడం ప్రభువుకు ఎందుకంత ముఖ్యమైనదని మీరనుకుంటున్నారు? మీరు 47వ ప్రకరణమును చదివేటప్పుడు దీనిని, అలాగే 2 నీఫై 29:11–12; మోషే 6:5; అబ్రాహాము 1:28, 31లో ఉన్న ఇటువంటి సూచనలను ధ్యానించండి. మీ జీవితం గురించి మీరు ఏమి వ్రాసియుంచాలని ప్రభువు కోరుతున్నారని మీరు అనుకుంటున్నారు?

FamilySearchలో, మీరు మీ జీవితం నుండి మరియు మీ పూర్వీకుల జీవితాల నుండి జ్ఞాపకాలు మరియు అనుభవాలను నమోదు చేయవచ్చు (FamilySearch.org చూడండి).

జాన్ విట్మర్

జాన్ విట్మర్

సిద్ధాంతము మరియు నిబంధనలు 47

నేను నా పిలుపును నెరవేర్చినప్పుడు పరిశుద్ధాత్మ నన్ను నడిపించగలడు.

అతని పిలుపు దేవుని నుండి వచ్చిందని అభయము కోరినప్పుడు జాన్ విట్మర్ భావించిన దానితో బహుశా మీరు సంబంధం కలిగి ఉండవచ్చు. ఆయన ఇచ్చే పిలుపులను నెరవేర్చడంలో నమ్మకాన్ని ప్రేరేపించడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 47లో జాన్ విట్మర్‌కు మరియు మీకు ప్రభువు ఏమి చెప్తున్నారు?

బోధకుని పాత్ర. బోధన అనేది కేవలం సమాచారాన్ని అందించడం కంటే చాలా ఎక్కువైనది. తరగతి సభ్యులు తమకుతాముగా సత్యాలను నేర్చుకోగలిగే మరియు కనుగొనగలిగే వాతావరణాన్ని సృష్టించడం మరియు వారు నేర్చుకున్న వాటిని ఒకరితో ఒకరు పంచుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి (రక్షకుని విధానములో బోధించుట26 చూడండి).

పిల్లల విభాగపు చిహ్నము 02

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 46:2–6

సంఘములో ఇతరులు స్వాగతించబడినట్లు భావించడానికి నేను సహాయపడగలను.

  • మీ పిల్లలతో సిద్ధాంతము మరియు నిబంధనలు 46:5 చదివిన తర్వాత, తన సంఘానికి వచ్చినప్పుడు జనులు ఎలా భావించాలని రక్షకుడు కోరుకుంటున్నారనే దాని గురించి మాట్లాడండి. మీ పిల్లలు సంఘములో ఒకరిని మొదటిసారి చూసినట్లుగా ఊహించుకోమని వారిని ఆహ్వానించండి. ఈ వ్యక్తి స్వాగతించబడినట్లు భావించడంలో సహాయపడే మార్గాలను సాధన చేయడంలో వారికి సహాయపడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 46:7–26

ఇతరులను దీవించడానికి పరలోక తండ్రి నాకు ఆత్మీయ బహుమానాలిస్తారు.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 46:13–26 లో వర్ణించబడిన ఆత్మీయ బహుమానాల గురించి నేర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు ఈ ఆలోచనను పరిగణించండి. మీరు బహుమానాలను కాగితపు ముక్కలపై వ్రాసి గది చుట్టూ దాచవచ్చు. మీ పిల్లలు ప్రతీ కాగితాన్ని కనుగొన్నప్పుడు, 46వ ప్రకరణములో ఆ బహుమానం ఎక్కడ పేర్కొనబడిందో కనుగొనడంలో వారికి సహాయపడండి. ప్రతీ బహుమానము, ఇతరులను దీవించడానికి ఎలా ఉపయోగించబడుతుందనే దాని గురించి వారితో మాట్లాడండి.

    2:19

    Chapter 20: Gifts of the Spirit: 8•March 1831

  • పరలోక తండ్రి వారికి ఇచ్చారని మీరు భావించే బహుమానాల గురించి మీ పిల్లలకు చెప్పండి మరియు వారు ఒకరిలో ఒకరు గమనించే బహుమానాల గురించి వారిని మాట్లాడనివ్వండి. సిద్ధాంతము మరియు నిబంధనలు 46:8–9, 26 ప్రకారం, పరలోక తండ్రి మనకు ఆత్మీయ బహుమానాలు ఎందుకిస్తారు? ఇతరులకు సహాయం చేయడానికి మన బహుమతులను మనమెలా ఉపయోగించవచ్చు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 47:1, 3

నేను నా చరిత్రను నమోదు చేయగలను.

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 47:1, 3లో జాన్ విట్మర్ ఏమి చేయాలని ప్రభువు కోరుకున్నారో మీ పిల్లలు కనుగొననివ్వండి. మీరు లేఖనాల నుండి ఇష్టమైన కథలను కూడా పరస్పరం పంచుకోవచ్చు. ఈ కథలను ఎవరో నమోదు చేసినందున మనకు వాటి గురించి తెలుసునని సూచించండి.

  • మీ పిల్లల వ్యక్తిగత చరిత్రలను నమోదు చేయడానికి మీరు వారిని ఎలా ప్రేరేపించవచ్చో పరిగణించండి. మీరు మీ వ్యక్తిగత దినచర్య పుస్తకము నుండి కొంత పంచుకోవచ్చు లేదా ఒక పూర్వీకుని గురించిన కథను పంచుకోవచ్చు (FamilySearch.org లేదా the Memories app చూడండి). దినచర్య పుస్తకంలో వ్రాయడానికి, “ఈ వారంలో జరిగినదేది నీ మనుమలు తెలుసుకోవాలని నువ్వు కోరుతున్నావు?” లేదా “ఈ వారం నీ జీవితంలో ప్రభువు యొక్క హస్తాన్ని నువ్వెలా చూసావు?” వంటి ప్రేరణలను మీరు అందించవచ్చు. చిన్నపిల్లలు వారి అనుభవాలను బొమ్మలుగా గీయవచ్చు లేదా వారి కథలను చెప్తూ మీరు వాటిని నమోదు చేయవచ్చు. “క్రమబద్ధమైన చరిత్ర” వ్రాసియుంచడం వలన ఏ దీవెనలు వస్తాయి? (సిద్ధాంతము మరియు నిబంధనలు 47:1).

దినచర్య పుస్తకంలో వ్రాస్తున్న బాలిక

సిద్ధాంతము మరియు నిబంధనలు 48:2–3

నాకు ఇవ్వబడిన దానిని పంచుకోవడం ద్వారా ఇతరులకు నేను సహాయపడగలను.

  • మీరు మీ పిల్లలతో సిద్ధాంతము మరియు నిబంధనలు 48:2–3 చదువుతున్నప్పుడు, జనులు తూర్పు నుండి ఒహైయోకు వస్తున్నారని మరియు నివసించడానికి వారికి స్థలం లేదని మీరు వివరించవలసి ఉంటుంది. సహాయం చేయడానికి పరిశుద్ధులు ఏమి చేయాలని ప్రభువు కోరారు? మీ పిల్లలు ఇతరులతో పంచుకోగలిగేలా దేవుడు వారికి ఇచ్చిన వాటి గురించి ఆలోచించడంలో వారికి సహాయపడండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ఒకరినొకరు పలకరించుకుంటున్న సంఘ సభ్యులు

రక్షకుని ఆరాధించాలనుకునే వారందరికీ ఆయన పరిశుద్ధుల సమావేశాలకు స్వాగతం.

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ