2024 రండి, నన్ను అనుసరించండి
జనవరి 12–18. “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను”: ఆదికాండము 1–2; మోషే 2–3; అబ్రాహాము 4–5


“జనవరి 12–18. ‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను’: ఆదికాండము 1–2; మోషే 2–3; అబ్రాహాము 4–5,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“జనవరి 12–18. ‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను’,” రండి, నన్ను అనుసరించండి: 2026

భూమి మరియు చంద్రుడు

జనవరి 12–18: “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను”

ఆదికాండము 1–2; మోషే 2–3; అబ్రాహాము 4–5

మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో అందమైనది, దివ్యమైనది అయినందున అది “నిరాకారముగాను, శూన్యముగాను,” “శూన్యముగా, నిర్మానుష్యముగా” ఉన్నప్పుడు భూమిని ఊహించుకోవడం కష్టము (ఆదికాండము 1:2; అబ్రాహాము 4:2). అస్తవ్యస్తముగా ఉన్నదాని నుండి దేవుడు దివ్యమైన దానిని తయారు చేయగలడనేది సృష్టి వృత్తాంతము మనకు బోధించే విషయాలలో ఒకటి. జీవితం అస్తవ్యస్తంగా అనిపించినప్పుడు దానిని జ్ఞాపకముంచుకోవడం సహాయపడుతుంది. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు సృష్టికర్తలు, మనతో వారి సృజనాత్మక కార్యము ముగియలేదు. మన జీవితాల్లోని అంధకార క్షణాల్లో వారు వెలుగును ప్రకాశింపజేయగలరు. మన శూన్యాన్ని వారు జీవముతో నింపగలరు. మనం ఉండవలసిన దైవిక జీవులుగా వారు మనల్ని మార్చగలరు. దేవుని స్వరూపమందు ఆయన పోలిక చొప్పున సృష్టించబడడానికి గల అర్థమదే (ఆదికాండము 1:26 చూడండి). ఆయన వలె మహోన్నతమైన, మహిమకరమైన, పరలోకజీవులుగా కాగల సామర్థ్యము మనకున్నది.

ఆదికాండమును సమీక్షించడానికి, లేఖన దీపికలో “ఆదికాండము” చూడండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

ఆదికాండము 1:1–25; మోషే 2:1–25; అబ్రాహాము 4:1–25

“నా అద్వితీయ కుమారుని ద్వారా వీటిని నేను సృజించితిని.”

లోకము ఎలా సృష్టించబడిందనే దాని గురించి మనకు పూర్తిగా తెలియకపోయినా, సృష్టి గురించి బయల్పరచాలని దేవుడు ఎంచుకున్న వాటిని గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆదికాండము 1:1–25; మోషే 2:1–25; అబ్రాహాము 4:1–25లో దాని గురించి ప్రభువు మీకేమి బోధిస్తున్నారు? ఈ విషయాలను మీరు తెలుసుకోవాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నారు? మీరు ఈ వృత్తాంతాలను ధ్యానిస్తున్నప్పుడు, అవి పరలోక తండ్రి, యేసు క్రీస్తు, లోకము మరియు మీ గురించి ఏమి బోధిస్తున్నాయో కూడా మీరు పరిగణించవచ్చు.

సృష్టికర్త పట్ల భక్తిని అనుభూతి చెందడానికి మీకు సహాయపడే ఆయన సృష్టి యొక్క చిత్రాలను మీరు కనుగొనవచ్చు. మీ సాక్ష్యముతో పాటు, ఈ చిత్రాలను ఇతరులతో పంచుకోవడం గురించి ఆలోచించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 101:32–34 కూడా చూడండి.

ఏదెను తోట యొక్క వర్ణచిత్రము

The Garden of Eden [ఏదెను తోట], గ్రాంట్ రామ్ని క్లాసన్ చేత

ఆదికాండము 1:26–27; మోషే 2:26–27; అబ్రాహాము 4:26-27

సెమినరీ చిహ్నము
నేను దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాను.

ఆదికాండము 1:26–27; మోషే 2:26–27; మరియు అబ్రాహాము 4:26–27ను మీరు చదువుతున్నప్పుడు, దేవుని “స్వరూపం” లేదా “పోలిక”లో పురుషునిగా మరియు స్త్రీగా సృష్టించబడడం అంటే ఏమిటో ఆలోచించండి. ఈ వచనాలలోని సత్యాలను గూర్చి తెలుసుకొనుట మీకు ఎందుకు ముఖ్యమైనది? ఉదాహరణకు, దేవుడిని, ఇతరులను మరియు మిమ్మల్ని మీరు చూసే విధానాన్ని ఈ సత్యాలు ఎలా ప్రభావితం చేస్తాయి? మీ గురించి మీకు ప్రతికూల భావాలు ఉన్నప్పుడు అవి మీకు ఎలా సహాయం చేస్తాయి?

ఈ ప్రశ్నల గురించి ఆలోచించడంలో మీకు సహాయపడడానికి, ఇలాంటి వాక్యాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి: “నేను దేవుని స్వరూపములో సృష్టించబడ్డానని నాకు తెలుసు కాబట్టి, … నేను ఎంచుకుంటాను.” యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు మార్గదర్శి (22–29 పేజీలు) లోని “మీ శరీరము పవిత్రమైనది” పునర్వీక్షించడం సహాయపడగలదు. మీ శరీరం పవిత్రమైనదని మీకు తెలుసని దేవునికి చూపించడానికి మీరు ఏదైనా చేయడానికి ఎంచుకోవడాన్ని పరిగణించండి.

మీరు ఇతరుల నుండి వినగలిగే సందేశాల నుండి ఇది ఎలా భిన్నంగా ఉంది?

2:51

God's Greatest Creation

దేవుని స్వరూపంలో సృష్టించబడడం అంటే మన ఆలోచనలు, భావాలు మరియు కోరికలు అన్నీ ఆయనచే ఆమోదించబడతాయని మరియు మనం మెరుగుపరచవలసిన అవసరం లేదని (లేదా చేయలేమని) కొందరు అనవచ్చు. దానికి మీరేమంటారు? మోషైయ 3:19 మరియు ఈథర్ 12:27 నుండి మీరు ఏ అంతర్దృష్టులను పొందుతారు?

ఆదికాండము 1:27–28; 2:18–25; మోషే 3:18, 21-24; అబ్రాహాము 5:14-18

స్త్రీ పురుషుల మధ్య వివాహం దేవునిచేత నియమించబడింది.

“శాశ్వతమైన యాజకత్వపు శక్తిచేత కాలము మరియు నిత్యత్వమంతటి కొరకు ఆదాము, హవ్వలు వివాహంలో జతచేయబడ్డారు” (Russell M. Nelson, “Lessons from Eve,” Ensign, Nov. 1987, 87). మీరు ఆదికాండము 1:27–28; 2:18–25; మోషే 3:18, 21–25; మరియు అబ్రాహాము 5:14–19 చదువుతున్నప్పుడు దీనిని ధ్యానించండి. దేవుడు దానికిచ్చిన పవిత్రతతో మీరు వివాహాన్ని ఎలా పరిగణించగలరు?

1 కొరింథీయులకు 11:11; “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన,” సువార్త గ్రంథాలయము కూడా చూడండి.

ఆదికాండము 1:28; మోషే 2:28; అబ్రాహాము 4:28

దేవుని సృష్టి పట్ల శ్రద్ధ చూపే బాధ్యత నాదే.

దేవుని సృష్టి పట్ల మన బాధ్యత గురించి ఆదికాండము 1:28; మోషే 2:28; మరియు అబ్రాహాము 4:28 ఏమి సూచిస్తాయి? సిద్ధాంతము మరియు నిబంధనలు 59:16–21; మరియు 104:13–18 మీ గ్రహింపుకు ఏమి జతచేస్తాయి?

జెరాల్డ్ కాస్సే, “మన భూలోక గృహనిర్వాహకత్వము,” లియహోనా, నవ. 2022, 57–59 కూడా చూడండి.

ఆదికాండము 2:2–3; మోషే 3:2–3; అబ్రాహాము 5:2–3

దేవుడు విశ్రాంతి దినమును ఆశీర్వదించి, పవిత్రపరచెను.

దేవుడు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా చేసారు మరియు మనము దానిని పరిశుద్ధంగా ఆచరించాలని అడుగుతున్నారు. మీరు ఆదికాండము 2:2–3; మోషే 3:2–3; మరియు అబ్రాహాము 5:2–3 చదువుతున్నప్పుడు, విశ్రాంతి దినమును మీ కొరకు “ఆశీర్వాదకరంగా” చేసే దాని గురించి ఆలోచించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 59:9–13 కూడా చూడండి.

0:50

Highlight: The Sabbath Is a Delight

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆదికాండము 1:1–25; మోషే 2:1–25; అబ్రాహాము 4:1–25

యేసు భూమిని సృష్టించారు.

  • సృష్టి గురించి నేర్చుకోవడాన్ని మీ పిల్లల కొరకు ఆహ్లాదకరంగా మీరెట్లు చేయగలరు? సృష్టి యొక్క ప్రతి దశలో చేయబడిన వాటి కొరకు బయట వెదకడానికి మీరు వారిని తీసుకువెళ్ళవచ్చు. మీ పిల్లలు యేసు సృష్టించిన వాటి చిత్రాలను కూడా చూడవచ్చు (పాత నిబంధన కథలు లో “భూమి యొక్క సృష్టి,” 8–12 చూడండి). సృష్టి గురించి చదివిన తర్వాత, యేసు క్రీస్తు గురించి మీరు ఎలా భావిస్తున్నారనే దాని గురించి మీరు మరియు మీ పిల్లలు మాట్లాడవచ్చు.

పిల్లలు తమ సృజనాత్మకతను వ్యక్తపరచనివ్వండి. “ఒక సువార్త సూత్రానికి సంబంధించినది ఏదైనా గీయడానికి, నిర్మించడానికి, రంగులు వేయడానికి లేదా వ్రాయడానికి మీరు పిల్లలను ఆహ్వానించినప్పుడు, ఆ సూత్రాన్ని బాగా అర్థం చేసుకోవడంలో మీరు వారికి సహాయపడతారు మరియు వారు నేర్చుకున్న వాటి గురించి వారికి స్పష్టమైన జ్ఞాపికలను అందిస్తారు” (రక్షకుని విధానములో బోధించుట32).

ఆదికాండము 1:26-27; మోషే 2:26-27; అబ్రాహాము 4:26-27

నేను దేవుని స్వరూపములో సృష్టించబడ్డాను.

  • మనమందరం దేవుని స్వరూపంలో సృష్టించబడ్డామని మీ పిల్లలు తెలుసుకున్నప్పుడు వారి స్వంత శరీరాలు మరియు ఇతరుల శరీరాల పట్ల భక్తి భావాన్ని మరియు మర్యాదను వారు పెంపొందించుకోగలరు. దీని అర్థం ఏమిటో వారు గ్రహించడంలో సహాయపడడానికి, మీరు వారి కోసం మోషే 2:26-27 చదివేటప్పుడు మీ పిల్లలు వారి స్వరూపాన్ని అద్దంలో లేదా చిత్రంలో చూసేలా మీరు చేయవచ్చు. పిల్ల జంతువులు తరచూ వాటి తల్లిదండ్రుల “సారూప్యం”లో ఎలా ఉంటాయో కూడా మీరు వారికి చూపించవచ్చు (ఉదాహరణకు, ఈ నమూనా‌లోని చిత్రాన్ని చూడండి). మీరు మీ పరలోక తండ్రి స్వరూపములో సృష్టించబడ్డారని తెలుసుకోవడం మీకెందుకు ముఖ్యమైనదనే దాని గురించిన సంభాషణకు ఇది దారితీయవచ్చు.

    ఎలుగుబంటి మరియు దాని పిల్లలు
  • మీరు, మీ పిల్లలు మానవ శరీర చిత్రాన్ని గీయడాన్ని మరియు ఆ చిత్రాలను పజిల్‌లా కత్తిరించడాన్ని ఆనందించవచ్చు. మీ పిల్లలు తమ పజిల్‌లను ఒకచోట చేర్చినప్పుడు, వారు తమ శరీరాల పట్ల కృతజ్ఞత కలిగియున్నారని పరలోక తండ్రికి చూపించే మార్గాల గురించి వారు మాట్లాడవచ్చు.

ఆదికాండము 2:2–3; మోషే 3:2–3; అబ్రాహాము 5:2–3

విశ్రాంతి దినము పరిశుద్ధమైనది.

  • మీరు మోషే 3:2–3 చదువుతున్నప్పుడు, దేవుడు ఏడవరోజు ఏమి చేసారో వినమని మీ పిల్లలను అడగండి. ఆదివారాన్ని పరిశుద్ధమైన రోజుగా మరియు ఇతర రోజుల కంటే భిన్నంగా చేయడానికి వారు చేయగలిగే పనుల చిత్రాలను కనుగొనడంలో లేదా గీయడంలో మీ పిల్లలకు సహాయపడండి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం మీకెందుకు ముఖ్యమైనదో పరస్పరం పంచుకోండి.

  • పరలోక తండ్రిని మరియు యేసును గౌరవించే పనులను వారు ఆదివారం నాడు ఎందుకు చేయాలని ఎంచుకున్నారో ఒక స్నేహితునికి వివరిస్తూ మీ పిల్లలు నటించి చూపడానికి సహాయపడండి. వారి వివరణలలో ఆదికాండము 2:2–3 ఉపయోగించమని సూచించండి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు పట్ల మన ప్రేమను ఎలా చూపుతుంది?

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

తాను ఏర్పాటు చేస్తున్న ప్రపంచంపై తన చేతులతో మేఘాలలో నిలబడిన యెహోవా

The Creation [సృష్టి], ఆన్నీ హెన్రీ నాడెర్ చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: యేసు భూమిని సృష్టించారు