“జనవరి 5–11. ‘ఇదియే నా కార్యమును మహిమయైయున్నది’: మోషే 1; అబ్రాహాము 3,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“జనవరి 5–11. “ఇదియే నా కార్యమును మహిమయైయున్నది,” రండి, నన్ను అనుసరించండి: 2026
జనవరి 5–11: “ఇదియే నా కార్యమును మహిమయైయున్నది”
మోషే 1; అబ్రాహాము 3
“ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను“ (ఆదికాండము 1:1) అనే పదాలతో బైబిలు ప్రారంభమవుతుంది. కానీ ఈ “ప్రారంభానికి” ముందు అక్కడ ఏమున్నది? ఎందుకు దేవుడు వీటన్నిటిని సృష్టించారు? ప్రవక్త జోసెఫ్ స్మిత్ ద్వారా ప్రభువు ఈ ప్రశ్నలపై స్పష్టతనిచ్చారు.
ఉదాహరణకు, “లోకము పుట్టక మునుపు” (అబ్రాహాము 3:22–28చూడండి) ఆత్మలుగా మన ఉనికి గురించి అబ్రాహాము చూసిన దర్శనమును ఆయన మనకు వివరించారు. మోషే గ్రంథము అని పిలువబడిన ఆదికాండము యొక్క మొదటి ఆరు అధ్యాయాల ప్రేరేపిత అనువాదము లేదా పునర్వీక్షణను కూడా ప్రభువు మనకు ఇచ్చారు—అది “ఆదియందు” అనేదానితో ప్రారంభం కాదు. బదులుగా అది మోషే కలిగియున్న ఒక అనుభవంతో మొదలవుతుంది, అది సృష్టి వృత్తాంతము కొరకు కొంత సమాచారాన్ని అందిస్తుంది. సంయుక్తంగా, ఈ కడవరి-దిన లేఖనాలు మనం పాత నిబంధన అధ్యయనాన్ని మొదలుపెట్టడానికి సరియైనవి, ఎందుకనగా అవి మనం పఠనాన్ని రూపొందించగల కొన్ని ప్రధానమైన ప్రశ్నలకు జవాబిస్తాయి: దేవుడు ఎవరు? మనం ఎవరము? దేవుని కార్యము ఏమిటి మరియు దానిలో మన స్థానము ఏమిటి? ఆదికాండము యొక్క తొలి అధ్యాయాలను మోషే మనవికి ప్రభువు యొక్క జవాబుగా చూడవచ్చు: “ఓ దేవా! నీ సేవకుని యెడల కరుణచూపి, ఈ భూమిని గూర్చి, దాని నివాసులను గూర్చి, అదేవిధముగా పరలోకములను గూర్చి నాకు చెప్పుము” (మోషే 1:36).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
దేవుని బిడ్డగా నేను దైవిక భవితవ్యాన్ని కలిగియున్నాను.
“ప్రభువు మీతో నేరుగా మాట్లాడుతున్నట్లయితే, ఆయన ముందుగా మీ నిజమైన గుర్తింపును మీరు తప్పకుండా అర్థం చేసుకొనేలా చేస్తారు” అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు (“Choices for Eternity” [worldwide devotional for young adults, May 2022], Gospel Library). తర్వాత అదే విషయంపై సాతాను మిమ్మల్ని గందరగోళానికి గురిచేయడానికి ప్రయత్నిస్తాడు. మోషే 1:4, 6లో మోషేకు దేవుని సందేశంలో మరియు మోషే 1:12లోని సాతాను సందేశాలలో ఈ నమూనా కోసం చూడండి. దేవుడు మరియు సాతాను మధ్య తేడాలను గూర్చి ఈ వచనముల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
“మీరు నిజంగా ఎవరు అనే దాని గురించి మీరు ఆలోచించే విధానం దాదాపుగా మీరు తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది” (“Choices for Eternity”) అని కూడా అధ్యక్షులు నెల్సన్ బోధించారు. దేవుని బిడ్డగా మీ గుర్తింపు ఇతర పేర్ల కంటే ముందు వస్తుంది కాబట్టి, మీరు చేసే ఎంపికల జాబితాను రూపొందించడాన్ని పరిగణించండి.
మోషే 1లోని ఏ అదనపు వచనాలు లేదా వాక్యభాగాలు మీ దైవిక విలువను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి?
Our True Identity
ప్రభువు యొక్క సహాయముతో, నేను సాతానును జయించగలను.
మోషే 1 స్పష్టంగా చూపునట్లు, శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవాలు అంటే అర్థం మనం మళ్ళీ శోధించబడమని కాదు. నిజానికి, ఈ అనుభవాలను అనుమానించేలా మనల్ని ప్రేరేపించడం సాతాను వ్యూహాలలో ఒకటి. 12–26 వచనాలలో సాతానుకు మోషే ఇచ్చిన జవాబు గురించి మీరు చదివినప్పుడు, మీరు పొందిన సాక్ష్యానికి యధార్థంగా నిలిచేందుకు మీకు సహాయపడేలా మీరు ఏమి నేర్చుకుంటారు? చివరకు సాతానును జయించడానికి మోషేకు సహాయం చేసినదేమిటి?
మోషే అనుభవం నుండి నేర్చుకోగల మరొక పాఠం ఏమిటంటే, సాతాను దేవుని సత్యం మరియు శక్తి యొక్క కల్పితాలతో మనల్ని శోధిస్తాడు. కృత్రిమ మొక్క లేదా శిశువు బొమ్మ వంటి కొన్ని నకిలీ వస్తువుల గురించి ఆలోచించండి. అవి నకిలీవని మీరు ఎలా చెప్పగలరు? తర్వాత, మిమ్మల్ని శోధించడానికి సాతాను నేడు ఉపయోగించే కల్పితాలను పరిగణించండి. అతని కల్పితాలను గుర్తించి, తిరస్కరించడం గురించి మోషే 1:13–18 నుండి మీరేమి నేర్చుకుంటారు? ప్రభువు మీకు ఎలా సహాయపడగలరు? (మోషే 1:24–26 చూడండి).
మత్తయి 4:1–11; గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, “నన్ను మోసగించకు,” లియహోనా, నవ. 2019, 93–96 కూడా చూడండి.
I Am a Son of God
గృహములో నేర్చుకోవడం అనేది ప్రణాళికాబద్ధంగా ఉంటుంది, కానీ ఆకస్మికంగా కూడా ఉంటుంది. “భోజనం తింటున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, ఆటలు ఆడుతున్నప్పుడు [లేదా] ప్రయాణిస్తున్నప్పుడు—కుటుంబంలో బోధనా అవకాశాలు తరచుగా అనధికారిక, అనుదిన క్షణాలలో సంభవిస్తాయి” (రక్షకుని విధానములో బోధించుట, 31). ఉదాహరణకు, మోషే 1లో మోషే సాతానును ఎలా ఎదిరించాడు అనే దాని గురించి చదవడంతో పాటు, మీరు విరోధి ప్రభావాన్ని ఎలా ఎదిరించారనే దాని గురించి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా రాత్రి భోజన సమయంలో కొన్ని క్షణాలు గడపవచ్చు.
నిత్యజీవము పొందడానికి నాకు సహాయపడడమే దేవుని కార్యమును మహిమయైయున్నది.
దేవుని సృష్టి గురించి దర్శనమును చూసిన తర్వాత, మోషే ప్రభువుతో ఇలా అన్నాడు: “నాకు చెప్పుము … ఇవన్నియు ఎందుకు ఈవిధముగానున్నవి” (మోషే 1:30). మోషే 1:31–39లో ప్రభువు జవాబు గురించి మిమ్మల్ని ప్రభావితం చేసేది ఏమిటి? రెండింటినీ నెరవేర్చడానికి యేసు క్రీస్తు ఎలా సహాయం చేస్తారు? అబ్రాహాము కూడా దర్శన అనుభవాన్ని కలిగియున్నాడు, అది అబ్రాహాము 3 లో నమోదు చేయబడింది. మోషే మనవికి జవాబివ్వడంలో సహాయపడేలా 24–26 వచనాలలో మీరేమి కనుగొంటారు?
నేను భూమిపై పుట్టకముందు ఆత్మగా జీవించాను.
మన పూర్వమర్త్య జీవితం గురించి మనకు చాలా తక్కువ తెలుసు. కానీ మనకు తెలిసిన వాటిలో చాలా వరకు అబ్రాహాము 3:22-28లోని అబ్రాహాము దర్శనం నుండి వచ్చాయి. మీరు ఈ వచనాలను చదువుతున్నప్పుడు, మీ గురించి మరియు యేసు క్రీస్తు గురించిన సత్యాలతో సహా మీరు కనుగొనే సత్యాల జాబితాను రూపొందించండి. ఈ సత్యాలు మీకు ఎందుకు విలువైనవి? అవి మీ జీవితంలో ఎలాంటి మార్పును కలిగిస్తాయి?
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
నేను దేవుని యొక్క బిడ్డను.
-
మోషే 1:4లో మోషేకు దేవుడిచ్చిన సందేశాన్ని మీరు కలిసి చదివిన తర్వాత, మీ పిల్లలు అద్దంలో వారి ప్రతిబింబాన్ని చూసుకునేలా చేసి, “నేను దేవుని బిడ్డను” అనే సందేశాన్ని వారికి ఇవ్వడాన్ని పరిగణించండి. అప్పుడు వారు ఒకరికొకరు అదే సందేశాన్ని ఇవ్వగలరు: “నువ్వు దేవుని బిడ్డవు.” మీరు వివిధ రకాల వ్యక్తుల చిత్రాలను కూడా కనుగొనవచ్చు మరియు ప్రతీ ఒక్కరిని చూపించి, “ఇది దేవుని బిడ్డ” అని చెప్పమని మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. మీరు దేవుని బిడ్డలని తెలుసుకోవడానికి ఎందుకు సంతోషిస్తున్నారో పరస్పరం పంచుకోండి. ఈ జ్ఞానం మీతో మరియు ఇతరులతో మీరు వ్యవహరించే విధానాన్ని ఎలా మారుస్తుంది?
-
మీరు మరియు మీ పిల్లలు మోషే 1:4లో మోషేకు దేవుడిచ్చిన సందేశాన్ని 12వ వచనములోని సాతాను సందేశంతో పోల్చవచ్చు. మీ పిల్లలకు దేవుడిచ్చే సందేశాలు మరియు సాతాను ఇచ్చే సందేశాల మధ్య తేడాను గుర్తించడంలో మీరు వారికి ఎలా సహాయం చేయగలరు?
Moses Sees Jehovah [మోషే యెహోవాను చూచును], జోసెఫ్ బ్రిక్కీ చేత (వివరణ)
నేను చేయడానికి పరలోక తండ్రి ఒక కార్యమును కలిగియున్నారు.
-
మీరు మీ పిల్లలతో కలిసి మోషే 1:6 చదువుతున్నప్పుడు, మోషే కొరకు దేవుడు కలిగియున్న “కార్యము” గురించి మీరు వారితో మాట్లాడవచ్చు. పరలోక తండ్రి సహాయంతో మోషే సాధించిన దానిని చూడడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు సువార్త కళా పుస్తకము, సంఖ్యలు 13–16 లేదా పాత నిబంధన కథలు, పేజీలు 64–84 ఉపయోగించడాన్ని పరిగణించండి. మనం చేయడానికి దేవుడు కలిగియున్న కార్యమేమిటి? (ఉదాహరణకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 11:20 చూడండి).
సాతాను శోధనలను నేను నిరోధించగలను.
-
మీరు మీ పిల్లలతో మోషే 1:12–26 చదువుతున్నప్పుడు, సాతానును ఎదిరించడానికి మోషే ఏమి చేసాడో కనుగొనడంలో వారికి సహాయపడండి (13, 15, 18, 20–22, 26 వచనములు చూడండి). శోధనను (ప్రార్థించడం, దూరంగా వెళ్ళిపోవడం లేదా సహాయం కోరడం వంటివి) నిరోధించడానికి వారు చేయగలిగిన పనులను చేయడం వారికి సరదాగా ఉండవచ్చు.
నేను భూమిపై పుట్టకముందు ఆత్మగా జీవించాను.
-
మన పూర్వమర్త్య జీవితం గురించి తెలుసుకోవడం నిత్య సత్యాల ఆధారంగా ఎంపికలు చేయడానికి మీ పిల్లలను ప్రేరేపించగలదు. దాని గురించి నేర్చుకోవడానికి వారికి సహాయపడేందుకు, మీరు అబ్రాహాము 3:22–28లో కనుగొనడానికి “లోకము రూపింపబడక ముందు,” “ఆత్మలు,” “భూలోకమును చేయుదుము” మరియు “పరీక్షించెదము” వంటి కొన్ని కీలక పదాలు మరియు వాక్యభాగాలను వారికి ఇవ్వవచ్చు. పరలోక తండ్రి మనల్ని భూమికి ఎందుకు పంపారు అనే దాని గురించి ఈ వచనాలు మనకు ఏమి బోధిస్తాయి?
-
బహుశా మీరు పదాలకు సరిపోయే చిత్రాలను గీయడానికి మీ పిల్లలను ఆహ్వానించవచ్చు.
-
దేవుడు కోరినది చేయాలా వద్దా అని వారు ఎన్నుకోవాల్సిన పరిస్థితుల గురించి ఆలోచించేలా మీ పిల్లలకు సహాయం చేయండి (అబ్రాహాము 3:25 చూడండి; యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు మార్గదర్శి కూడా చూడండి). ఈ పరిస్థితులకు సాధ్యమైన ప్రతిస్పందనలను వారిని సాధన చేయనివ్వండి. మనం తప్పు ఎంపిక చేసినప్పుడు రక్షకుడు మనకు ఎలా సహాయం చేయగలరు?
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.