“అక్టోబరు 6-12: ‘సమస్త సంగతులను మీ కొరకు నేను సమకూర్చెదను’: సిద్ధాంతము మరియు నిబంధనలు 111–114,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 111–114,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
అక్టోబరు 6–12: “సమస్త సంగతులను మీ కొరకు నేను సమకూర్చెదను”
సిద్ధాంతము మరియు నిబంధనలు 111–114
మీ విశ్వాసంలో మీరు నమ్మకంగా, భద్రతగా భావించి—తరువాత జీవితంలోని శ్రమలు మీ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు అంతకుముందు మీరు అనుభవించిన శాంతిని తిరిగి పొందడానికి మీరు కష్టపడుతున్నట్లు కనుగొన్న ఆత్మీయ అనుభవాన్ని మీరెప్పుడైనా కలిగియున్నారా? కర్ట్లాండ్లోని పరిశుద్ధులకు ఇటువంటిదే జరిగింది. కర్ట్‌లాండ్ దేవాలయ ప్రతిష్ఠాపనకు సంబంధించిన ఆత్మీయ క్రుమ్మరింపుల తర్వాత సంవత్సరం లోపే కష్టాలు మొదలయ్యాయి. ఆర్థిక సంక్షోభం, పన్నెండుమంది సమూహంలో విభేదాలు మరియు ఇతర శ్రమలు పూర్వ అనుభవాలు ఉన్నప్పటికీ కొంతమంది తమ విశ్వాసంలో సందేహించేలా చేసాయి.
మనం శ్రమలను తప్పించుకోలేము, కాబట్టి అవి మన విశ్వాసం మరియు సాక్ష్యాన్ని సందిగ్ధంలో పడేయకుండా ఎలా కాపాడుకోగలము? జవాబులో కొంతభాగం, కర్ట్లాండ్లో ప్రతికూలత పెరుగుతున్నప్పుడు సిద్ధాంతము మరియు నిబంధనలు 112లో ప్రభువు ఇచ్చిన సలహాలో కనుగొనబడవచ్చు. నా యెదుట మీ హృదయాలు శుద్ధిచేసుకొనుడి” (28వ వచనము), “తిరుగుబాటు చేయకుము” (15వ వచనము), “ఆ కార్యము కొరకు నీ నడుముకు దట్టీ కట్టుకొనుము” (7వ వచనము) మరియు “నిన్ను నీవు తగ్గించుకొనుము” (10వ వచనము) అని ప్రభువు చెప్పారు. మనం ఈ సలహాను పాటించినప్పుడు, ప్రతికూలత గుండా స్వస్థత మరియు సమాధానంలోకి ప్రభువు “(మనల్ని) చేయి పట్టుకొని నడిపిస్తారు” (10, 13 వచనములు చూడండి).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
ప్రభువు “సమస్త సంగతులను (నా) కొరకు సమకూర్చగలరు.”
1836 నాటికి ప్రభువు యొక్క కార్యము చేయడంలో సంఘము అధికమొత్తంలో అప్పులు కూడగట్టుకుంది. ఈ అప్పుల గురించి జోసెఫ్ స్మిత్ మరియు ఇతరులు చింతిస్తూ, వాటిని తీర్చడానికి మార్గాలను పరిగణించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 111 యొక్క ప్రకరణ శీర్షిక చూడండి).
మీరు 111వ ప్రకరణము చదివినప్పుడు, జోసెఫ్‌తో ప్రభువు చెప్పిన మాటలు మీకు మరియు మీరు చింతిస్తున్న విషయాలకు ఎలా అన్వయిస్తాయో పరిగణించండి. ఉదాహరణకు, “మీ అవివేక క్రియలకు అతీతముగా” (1వ వచనము) దేవుని ప్రేమను మీరెప్పుడు అనుభూతి చెందారు? ఆశించని “నిధులను” (10వ వచనము) కనుగొనడానికి ప్రభువు మీకెలా సహాయపడ్డారు? “సమస్త సంగతులను మీ కొరకు సమకూర్చడానికి” ఆయన ఏమి చేసారు (11వ వచనము)? “మీరు పొందగలిగినంత వేగముగా” అను వాక్యభాగము పరలోక తండ్రి గురించి మీకేమి బోధిస్తుంది?
మత్తయి 6:19–21, 33 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 112:3-15, 22
ఆయన చిత్తమును నేను వినయంగా వెదికినప్పుడు ప్రభువు నన్ను నడిపిస్తారు.
జోసెఫ్ స్మిత్ తనను సంప్రదించకుండానే, ఇంగ్లండులో సువార్త ప్రకటించడానికి తన సమూహములోని ఇద్దరు సభ్యులను పిలిచినందుకు పన్నెండుమంది అపొస్తలుల సమూహ అధ్యక్షుడైన థామస్ బి. మార్ష్ కలత చెందారు. అతను ప్రవక్తను కలిశాడు, ఆయన థామస్ తన బాధాకరమైన భావాలను పక్కన పెట్టడంలో సహాయపడే బయల్పాటు అందుకున్నారు. సిద్ధాంతము మరియు నిబంధనలు 112 లో ఆ బయల్పాటు నమోదు చేయబడింది.
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 112 చదువుతున్నప్పుడు ఈ సందర్భం గుర్తుంచుకోండి. థామస్ యొక్క బాధాకరమైన భావాలను నయం చేసినట్లు మీరు కనుగొన్నది ఏమిటి? 3–15 మరియు 22 వచనములలో ఇటువంటి ప్రశ్నలకు జవాబుల కోసం మీరు చూడవచ్చు: వినయము అనగా ఏమిటి? ప్రభువు నిన్ను “చేయి పట్టుకొని నడిపించును” అనగా అర్థమేమిటి? వినయంగా ఉండడం ప్రభువు యొక్క మార్గనిర్దేశం పొందడంలో మీకు సహాయపడుతుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎల్డర్ జోసెఫ్ డబ్ల్యు. సిటాటి గారి సందేశము, “శిష్యత్వము యొక్క మాదిరులు” (లియహోనా, నవ. 2022, 87-88) లో “వినయము యొక్క మాదిరి” లో మీరు అదనపు జవాబులను కనుగొనవచ్చు.
మీకు తెలిసిన ఒక వినయపూర్వకమైన వ్యక్తి గురించి ఆలోచించండి. వినయం చూపించడానికి ఈ వ్యక్తి ఏమి చేస్తాడు? వినయంగా ఉండడం గురించి మీరు రక్షకుని నుండి ఏమి నేర్చుకుంటారు? బహుశా ఆయన జీవితంలో ఆయన వినయం చూపించిన సందర్భాల చిత్రాలను మీరు కనుగొనవచ్చు.
మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు ప్రభువు చేత మార్గనిర్దేశం చేయబడినట్లు మీరు ఎప్పుడు భావించారు?
అభ్యాసకులను నిమగ్నం చేయండి. మీరు బోధించే వ్యక్తులు లేఖనాల్లోని సత్యాలను నేర్చుకోవడంలో చురుకుగా పాల్గొనేందుకు మీరు ఎలా సహాయపడగలరో ఆలోచించండి. ఉదాహరణకు, సిద్ధాంతము మరియు నిబంధనలు 112:10లో ప్రభువు ఏమి చెప్పారో అర్థం చేసుకోవడంలో వారికి సహాయం చేయడానికి, మీరు ఎవరికైనా కళ్ళగంతలు కట్టి, కుర్చీలు లేదా ఇతర వస్తువులతో కూడిన చిన్న అడ్డంకి చుట్టూ చేతితో అతనిని లేదా ఆమెను జాగ్రత్తగా నడిపించవచ్చు. ఈ నిరూపణ నుండి వినయం గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు?
సిద్ధాంతము మరియు నిబంధనలు 112:12-26, 28, 33-34
నిజంగా మారిన వారు యేసు క్రీస్తును తెలుసుకుంటారు.
1837లో కొంతమంది అపొస్తలులు ప్రవక్తకు వ్యతిరేకంగా మారిన వాస్తవం, మన సంఘ పిలుపుతో లేదా సువార్త గురించి మనకు ఎంత తెలుసనే దానితో సంబంధం లేకుండా, మనం యేసు క్రీస్తుపట్ల మన పరివర్తనను వ్యక్తిగతంగా పోషించుకుంటున్నట్లు నిశ్చయపరచుకోవాలి అనడానికి ఒక మంచి జ్ఞాపిక. బహుశా మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 112:12–26, 28, 33–34 చదవవచ్చు మరియు విశ్వాసం యొక్క పరీక్షను అధిగమించడానికి లేదా పూర్తిగా ప్రభువు వైపుకు మారడానికి మీకు సహాయపడే సత్యాల కోసం చూడవచ్చు. క్రీస్తుపట్ల తమ పరివర్తనను బలపరచుకోవడానికి ఇతరులకు సహాయం చేయడానికి మీరు కనుగొన్న వాటిని పంచుకోవాలని ప్రేరేపించబడినట్లు మీరు భావించవచ్చు.
జోసెఫ్ స్మిత్ “క్రీస్తు హస్తములలో ఒక సేవకుడు.”
యెష్షయి సంతతిలో ఒకరిని యెషయా “చిగురు” మరియు “వేరు” అని సూచించాడు (యెషయా 11:1, 10). 113వ ప్రకరణములో, ఈ వంశస్థుడు, క్రీస్తు యొక్క సేవకుడు, అంత్యదినాలలో ప్రభువు జనులను సమకూర్చడంలో సాధనమవుతాడని ప్రభువు వివరించారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 113:4, 6 చూడండి). ఈ ప్రవచనము ప్రవక్త జోసెఫ్ స్మిత్‌ను బాగా వర్ణిస్తుంది. కర్ట్లాండ్లో పరిశుద్ధులు సంక్షోభాన్ని అనుభవిస్తున్న సమయంలో ఇది మరియు 113వ ప్రకరణములోని ఇతర సత్యాలు వారిని ఎలా ప్రోత్సహించియుండవచ్చు? బలంగా నిలవడానికి మరియు నేడు ప్రభువు యొక్క కార్యములో పాల్గొనడాన్ని కొనసాగించడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా ఈ బయల్పాటులో మీరేమి కనుగొంటారు?
లేఖన దీపిక, “యెష్షయి,” సువార్త గ్రంథాలయము; 2 నీఫై 21:10–12; జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:40 కూడా చూడండి.
“యెష్షయి మొద్దు” నుండి “చిగురు” మరియు “వేర్లు” రావడం గురించి యెషయా వ్రాసాడు (యెషయా 11:1).
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 111:2, 10-11
దేవుని విషయాలు నాకు నిధులుగా ఉండవచ్చు.
-
మీరు నిధి అనే పదమును వినినప్పుడు మనస్సులోకి వచ్చే దానిని మీరు, మీ పిల్లలు చిత్రించవచ్చు. తర్వాత మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 111:2, 10–11ను కలిసి చదవవచ్చు మరియు భూలోక నిధులను ప్రభువు విలువైన వాటిగా యెంచే వాటితో పోల్చవచ్చు. (ఈ వారపు ప్రోత్సాహకార్యక్రమ పేజీ చూడండి.) దేవుని విషయాలను మనం ఎలా ఎక్కువ విలువైనవిగా పరిగణించగలము?
సిద్ధాంతము మరియు నిబంధనలు 112:10
ప్రభువు నన్ను చేయి పట్టుకొని నడిపిస్తారు మరియు నా ప్రార్థనలకు జవాబిస్తారు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 112:10ని కలిసి చదివిన తర్వాత, మీరు ఒకరినొకరు “చేయి పట్టుకొని” నడిపించే ఆటను కూడా ఆడవచ్చు (అడ్డంకులు ఉన్న దారి వంటివి). భౌతికంగా మనతో లేకపోయినా ప్రభువు మనల్ని “చేయి పట్టుకొని” ఎలా నడిపిస్తారు? మనల్ని నడిపించడానికి ప్రభువు ఎందుకు అవసరం? ప్రభువు మనల్ని నడిపిస్తున్నట్లు మనం ఎప్పుడు భావించాము?
-
మీరు లేదా మీ పిల్లలు సిద్ధాంతము మరియు నిబంధనలు 112:10లోని పదాలను వ్రాయవచ్చు మరియు మనం వినయంగా ఆయన వైపు తిరిగినప్పుడు ప్రభువు మనకు ఇచ్చే ఆశీర్వాదాల క్రింద గీత గీయవచ్చు. మీ పిల్లలు వినయంగా ప్రభువు సహాయం కోసం అడిగిన మరియు వారి ప్రార్థనలకు సమాధానాలు అందుకున్న లేదా ఏదైనా మంచి చేయడానికి నడిపించబడిన సమయాలను పంచుకోమని వారిని ప్రోత్సహించండి (మొరోనై 7:13, 16 చూడండి).
Arise and Walk [లేచి నడువుము] నుండి వివరణ, సైమన్ డ్యూయీ చేత
సిద్ధాంతము మరియు నిబంధనలు 112:11
ప్రతీఒక్కరిని ప్రేమించాలని యేసు నన్ను కోరుతున్నారు.
-
మీరు మరియు మీ పిల్లలు వంతులవారీగా “Chapter 41: Trouble in Kirtland” (Doctrine and Covenants Stories, 158–60లో) నుండి చదవవచ్చు. కర్ట్లాండ్లోని సమస్యలను కథలో ఎవరు మరింత దిగజార్చారు? వారిని బాగు చేసేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? తర్వాత మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 112:11 చదివి, ప్రతీఒక్కరిని ప్రేమించాలని యేసు మనల్ని ఎందుకు కోరుతున్నారు అనే దాని గురించి మాట్లాడవచ్చు. ఆయన పట్ల దయ చూపని వ్యక్తుల యెడల ఆయన ఎప్పుడు ప్రేమ చూపించారు? (ఉదాహరణకు, లూకా 23:34 చూడండి). ఇతరులను ప్రేమించడం గురించి ఒక పాటను కూడా మీరు పాడవచ్చు.
Chapter 41: Trouble in Kirtland: 1837–1838
సిద్ధాంతము మరియు నిబంధనలు 112:11-14, 24-26
నిజంగా మారిన వారు యేసు క్రీస్తును తెలుసుకుంటారు.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 112:24–26 చదివిన తరువాత, మీరు మరియు మీ పిల్లలు ఒకరి పేరు తెలుసుకోవడం మరియు వారిని తెలుసుకోవడం మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడవచ్చు. ప్రభువును తెలుసుకోవడం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి 11–14 వచనాల నుండి ఏ బోధనలు మనకు సహాయపడతాయి?
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.