Doctrine and Covenants 2025
జూలై 28–ఆగష్టు 3: “దైవత్వపు శక్తి”: సిద్ధాంతము మరియు నిబంధనలు 84


“జూలై 28–ఆగష్టు 3: ‘దైవత్వపు శక్తి’: సిద్ధాంతము మరియు నిబంధనలు 84,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“సిద్ధాంతము మరియు నిబంధనలు 84,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

మెల్కీసెదెకు యాజకత్వమును పొందుతున్న జోసెఫ్ స్మిత్

The Restoration of the Melchizedek Priesthood [మెల్కీసెదెకు యాజకత్వము యొక్క పునఃస్థాపన] నుండి వివరణ, లిజ్ లెమన్ స్విండిల్ చేత

జూలై 28–ఆగష్టు 3: “దైవత్వపు శక్తి”

సిద్ధాంతము మరియు నిబంధనలు 84

1829లో యాజకత్వము పునఃస్థాపించబడినప్పటి నుండి, ప్రభువు యొక్క పవిత్రమైన శక్తి చేత ప్రారంభ పరిశుద్ధులు దీవించబడ్డారు. నేడు మనమున్నట్లే, వారు కూడా యాజకత్వ అధికారము చేత బాప్తిస్మమివ్వబడి, నిర్ధారించబడి, సేవకు పిలువబడ్డారు. కానీ యాజకత్వ శక్తికి అవకాశం కలిగియుండడమనేది పూర్తిగా దానిని అర్థం చేసుకున్నట్లు కాదు, అయితే ప్రత్యేకించి రాబోయే దేవాలయ విధుల పునఃస్థాపనకు సంబంధించిన వాటిని తన పరిశుద్ధులు మరింత ఎక్కువగా అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకున్నారు. యాజకత్వంపై 1832 నాటి బయల్పాటు, నేటి సిద్ధాంతము మరియు నిబంధనలు 84, నిజంగా యాజకత్వం అంటే ఏమిటి అనే దాని గురించి పరిశుద్ధుల దృష్టిని విస్తరింపజేసింది. నేడు మనకోసం అది అలాగే చేయగలదు. ఏమైనప్పటికీ, “దేవుని జ్ఞానము యొక్క తాళపుచెవులను” కలిగియుండి, “దైవత్వపు శక్తిని” ప్రత్యక్షపరచి, “దేవుడైన తండ్రి ముఖమును చూచి, జీవించియుండుటకు” మనల్ని సిద్ధపరిచే దైవిక శక్తి గురించి నేర్చుకోవడానికి చాలా ఉంది (19–22 వచనములు).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:17-32

సెమినరీ చిహ్నము
దేవుని యొక్క యాజకత్వ శక్తి మరియు దీవెనలకు నేను అవకాశం కలిగియున్నాను.

యాజకత్వము అనే పదం గురించి మీరు ఆలోచించినప్పుడు, మనస్సులో ఏమి స్ఫురిస్తుంది? దేవుని యొక్క యాజకత్వ శక్తి మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

ఈ ప్రశ్నలను ధ్యానించిన తర్వాత, ఆయన యాజకత్వ శక్తి గురించి మీరు ఏమి తెలుసుకోవాలని ప్రభువు కోరుతున్నారనే దాని కొరకు చూస్తూ మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 84:17-32ను అధ్యయనం చేయవచ్చు. ఎవరైనా ఒకరికి యాజకత్వమును వర్ణించి, దాని ఉద్దేశాలను వివరించడానికి ఈ వచనాలను మీరెలా ఉపయోగించగలరో పరిగణించండి.

యాజకత్వ విధుల ద్వారా “దైవత్వపు శక్తి ప్రత్యక్షపరచబడును” అనేది మీరు కనుగొనే ఒక విషయము (19–21 వచనములు చూడండి). బహుశా మీరు పాల్గొనిన యాజకత్వ విధులను మీరు జాబితా చేయవచ్చు (ప్రధాన చేతిపుస్తకము, 18.1, 18.2 లోని జాబితాలు సహాయపడగలవు). ఈ విధులు—మరియు సంబంధిత నిబంధనలు—మీ జీవితంలోకి దేవుని శక్తిని ఏవిధంగా తెచ్చాయి? అవి లేకపోతే, మీ జీవితం ఎలా ఉండేది?

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “దేవునితో నిబంధనలు చేసి, ఆ నిబంధనలను గైకొని, యాజకత్వ విధులలో యోగ్యతతో పాల్గొను ప్రతీ స్త్రీ మరియు ప్రతీ పురుషుడు దేవుని యొక్క శక్తిని ప్రత్యక్షముగా అందుకోగలరు” (“ఆత్మీయ నిధులు,” లియహోనా, నవ. 2019, 77). “రక్షకుని శక్తిని [మీ] జీవితంలోకి ఆకర్షించగల” మార్గాలను అన్వేషిస్తూ అధ్యక్షులు నెల్సన్ సందేశాన్ని అధ్యయనం చేయడాన్ని పరిగణించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 25:10, 13, 15; 121:34–37, 41–46; ప్రధాన చేతిపుస్తకము, 3.6, సువార్త గ్రంథాలయము కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:31-44

యాజకత్వము అనేది ఒక ప్రమాణము మరియు నిబంధనతో పొందబడుతుంది.

యాజకత్వము యొక్క ప్రమాణము మరియు నిబంధన (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:31–44 చూడండి) ఒక యాజకత్వ స్థానానికి నియమించబడిన పరలోక తండ్రి కుమారుల కోసం ప్రత్యేక అన్వయాన్ని కలిగియుంది, అయితే ఈ వచనాలలో వాగ్దానం చేయబడిన అనేక ఆశీర్వాదాలు దేవుని పిల్లలందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ వాగ్దానాలు ఏమిటి, వాటిని పొందడానికి దేవుడు మనల్ని ఏమి చేయమని అడుగుతారు?

ఎల్డర్ పౌల్ బి. పైపర్ ఇలా బోధించారు: “యాజకత్వము యొక్క ప్రమాణము మరియు నిబంధనలో [సిద్ధాంతము మరియు నిబంధనలు 84:31-44], పొందు మరియు స్వీకరించు అనే క్రియాపదాలను ప్రభువు ఉపయోగించడం ఆసక్తికరము. నియమించు అనే క్రియాపదాన్ని ఆయన ఉపయోగించరు. దేవాలయములోనే స్త్రీ పురుషులు—కలిసి—అహరోను మరియు మెల్కీసెదెకు యాజకత్వములు రెండింటి దీవెనలను, శక్తిని పొందుతారు మరియు స్వీకరిస్తారు” (“Revealed Realities of Mortality,” Ensign, Jan. 2016, 21).

మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 84:31–44 చదువుతున్నప్పుడు, యాజకత్వమును “పొందు” మరియు “స్వీకరించు అంటే అర్థమేమిటో ధ్యానించండి. యాజకత్వ స్థానానికి నియమించబడడం నుండి ఇది ఎలా భిన్నంగా ఉంది? ఈ వచనాలలో ఇంకా ఏమి స్వీకరించమని ప్రభువు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు? మీరు దానిని ఎలా చేస్తున్నారు?

రక్షకుడిని, తండ్రిని, ఆయన సేవకులను మరియు ఆయన యాజకత్వ శక్తిని స్వీకరించడంలో మరింత విశ్వాసంగా ఉండేందుకు మిమ్మల్ని ప్రేరేపించేలా మీరేమి కనుగొంటారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 121:36-46 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:43-61

దేవుని వాక్యం ప్రకారం జీవించడం నా జీవితంలో వెలుగును, సత్యాన్ని తెస్తుంది.

నిలకడగా దేవుని వాక్యాన్ని మీరు అధ్యయనం చేయవలసిన అవసరాన్ని మీరు గ్రహించేలా సహాయపడే ఏ సత్యాలను మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 84:43-61లో కనుగొంటారు? ఈ వచనాలలో వెలుగు, చీకటి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి; మీరు “నిత్య జీవపు మాటలకు శ్రద్ధతో చెవియొగ్గడం” ఏవిధంగా మీ జీవితంలోకి వెలుగును, సత్యాన్ని మరియు “యేసు క్రీస్తు ఆత్మను” తెచ్చింది? (4345 వచనములు).

2 నీఫై 32:3 కూడా చూడండి.

సువార్త సూత్రాలను తెలిసిన విషయాలతో పోల్చండి. 43–44 వచనములలోని సత్యాలను వివరించే సారూప్యత గురించి మీరు ఆలోచించగలరా? ఉదాహరణకు, వంటకం తయారీ విధానంలోని అన్ని దశలను అనుసరించడం “దేవుని … ప్రతి మాట ద్వారా” జీవించడం వలె ఎట్లున్నది?

లేఖనాలను చదువుతున్న స్త్రీ

“నిత్య జీవపు మాటలకు శ్రద్ధతో చెవియొగ్గుడి.”

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:62–91

నేను ఆయన సేవలో ఉన్నప్పుడు, ప్రభువు నాతో ఉంటారు.

మీరు ఈ వచనాలను చదువుతున్నప్పుడు, తన సేవకులకు తాను సహకరిస్తానని ప్రభువు చెప్పిన విధానాలను మీరు గుర్తించవచ్చు. మీరు చేయాలని ఆయన అడిగిన పనికి ఈ వాగ్దానాలు ఎలా అన్వయించబడవచ్చు? ఉదాహరణకు, 88వ వచనములో ఉన్న వాగ్దానాలు మీ జీవితంలో ఎలా నెరవేర్చబడ్డాయి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:106-110

దేవుని కార్యానికి అందరూ సహకరించగలరు.

ప్రభువు తన పనిని ఎలా నెరవేరుస్తారనే దాని గురించి మీరు ఈ వచనాల నుండి ఏమి నేర్చుకుంటారు? మీరు ఏ సలహా మరియు ఆశీర్వాదాలను కనుగొంటారు? మీ కుటుంబంలోని వ్యక్తులతో సహా “ఆత్మయందు బలంగా” ఉన్న వారితో సేవ చేసినందున మీరు “సాత్వీకమంతటితో” ఎలా అభివృద్ధి చెందారు అనే దాని గురించి కూడా మీరు ఆలోచించవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 02

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:4–5

దేవాలయ విధులు నేను మళ్ళీ పరలోక తండ్రితో జీవించడానికి సిద్ధపడేందుకు సహాయం చేస్తాయి.

  • మీ పిల్లలు దేవాలయానికి వెళ్ళడానికి ఎదురుచూడడంలో సహాయపడడానికి, మీరు దేవాలయ చిత్రం నుండి ఒక పజిల్‌ని సృష్టించవచ్చు. ప్రతి ముక్క వెనుక భాగంలో, మనము దేవాలయంలో చేసే కార్యాలు అనగా పూర్వీకుల కోసం బాప్తిస్మము పొందడం, మన కుటుంబాలతో ముద్ర వేయబడడం మరియు దేవునితో నిబంధనలు చేయడం వంటి వాటిని మీరు వ్రాయవచ్చు. మీ పిల్లలతో కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 84:4–5 చదవండి మరియు ప్రభువు పరిశుద్ధులను నిర్మించమని ఆజ్ఞాపించిన వాటి కొరకు వినమని వారిని అడగండి. మీరు మరియు మీ పిల్లలు కలిసి పజిల్‌ను తయారు చేసినప్పుడు, దేవాలయంలోకి ప్రవేశించడానికి మనము చేయగలిగే విషయాలను ఒకరితో ఒకరు పంచుకోండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:19–22

యాజకత్వ విధుల ద్వారా పరలోక తండ్రి యొక్క శక్తిని నేను పొందగలను.

  • విధి అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయడానికి, వారితోపాటు Gospel Art Book, nos. 103–8, లేదా ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ వంటి అనేక యాజకత్వ విధుల చిత్రాలను చూడడం గురించి ఆలోచించండి ప్రతీ చిత్రములో జరుగుతున్న దానిని వివరించమని వాళ్ళని అడగండి. కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 84:19-22 చదవండి. మనం ఈ విధులను పొందాలని పరలోక తండ్రి ఎందుకు కోరుకుంటున్నారు? మీరు పొందిన విధులు మరియు మీరు చేసిన నిబంధనలను బట్టి మీరు దేవుని శక్తిని ఎలా అనుభవించారో మీ పిల్లలకు చెప్పండి. (అనుబంధం ఎ లేదా అనుబంధం బి లో “యాజకత్వ శక్తి, అధికారము మరియు తాళపుచెవులు” చూడండి.)

Young Couple Going to the Temple; GAK 609; GAB 120; Primary manual 2-32; Doctrine and Covenants 131:1-3; 132:4-7, 19-20
సంస్కారము తీసుకుంటున్న పిల్లలు

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:77

నేను యేసును అనుసరిస్తున్నందున నేను ఆయన స్నేహితుడిని.

  • కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 84:77 చదివిన తర్వాత, ఒక స్నేహితునిగా ఉండడం అంటే ఏమిటని మీ పిల్లలను అడగండి. మీకు ఉన్న మంచి స్నేహితుల గురించి మీరు మాట్లాడవచ్చు. మనం ఆయన స్నేహితులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారని యేసు మనకెలా చూపిస్తారు? మనకు కూడా అది కావాలని మనమెలా చూపించగలం?

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:88

పరలోక తండ్రి తన సేవకులకు సహాయం చేస్తారు.

  • సువార్తను స్వీకరించడానికి మీకు, మీ కుటుంబానికి లేదా మీ పూర్వీకులకు సువార్తికులు ఎలా సహాయం చేశారో వినడాన్ని మీ పిల్లలు ఆనందించవచ్చు. అప్పుడు మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 84:88లో సువార్తికులకు ప్రభువు చేసిన ప్రత్యేక వాగ్దానం గురించి చదవగలరు. బహుశా మీ పిల్లలు ఈ వచనానికి తగిన అభినయాల గురించి ఆలోచించవచ్చు. 88వ వచనములో వివరించిన విధంగా, మీరు ప్రభువును సేవిస్తున్నప్పుడు ఆయన మీతో ఉన్నట్లు భావించినప్పటి సమయం గురించి పంచుకోవడాన్ని పరిగణించండి. మీ పిల్లలు ఇప్పుడు సువార్తికులుగా ఉండగల మార్గాల గురించి ఆలోచించడంలో కూడా మీరు వారికి సహాయం చేయవచ్చు. యేసు క్రీస్తు గురించి మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏమి చెప్పాలో తెలుసుకోవడానికి పరలోక తండ్రి మనకు సహాయం చేస్తారని సాక్ష్యమివ్వండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

సూర్యాస్తమయంలో దేవాలయము

రోమ్ ఇటలీ దేవాలయము

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ