Doctrine and Covenants 2025
ఏప్రిల్ 14-20: “జీవించుచున్న వాడను నేనే, వధించబడిన వాడను నేనే”: ఈస్టర్


“ఏప్రిల్ 14–20: ‘జీవించుచున్న వాడను నేనే, వధించబడిన వాడను నేనే’: ఈస్టర్,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“ఈస్టర్,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

క్రైస్టస్ విగ్రహము

ఏప్రిల్ 14–20: “జీవించుచున్న వాడను నేనే, వధించబడిన వాడను నేనే”

ఈస్టర్

1836, ఏప్రిల్ 3 ఈస్టర్ ఆదివారము. క్రొత్తగా ప్రతిష్టించబడిన కర్ట్‌లాండ్ దేవాలయంలో సమకూడిన పరిశుద్ధులకు సంస్కారమును అందించడంలో సహాయపడిన తర్వాత, జోసెఫ్ స్మిత్ మరియు ఆలీవర్ కౌడరీలు దేవాలయంలోని తెర వెనుక ఒక నిశ్శబ్ద స్థలాన్ని కనుగొని, నిశ్శబ్ద ప్రార్థనలో మోకరించారు. అప్పుడు, క్రైస్తవులందరు ప్రతిచోట యేసు క్రీస్తు యొక్క పునరుత్థానమును జరుపుకుంటున్న ఈ పవిత్ర దినమున, తిరిగి లేచిన రక్షకుడు “జీవించుచున్న వాడను నేనే, వధించబడిన వాడను నేనే” (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:4) అని ప్రకటిస్తూ, తనకుతానుగా తన దేవాలయంలో ప్రత్యక్షమయ్యారు.

“జీవించుచున్న వాడు” యేసు క్రీస్తే అని చెప్పడంలో అర్థమేమిటి? ఆయన సమాధి నుండి లేచి గలిలయలోని తన శిష్యులకు కనిపించాడని మాత్రమే దానర్థం కాదు. దానర్థము, ఆయన నేటికీ జీవించియున్నారు. ఆయన నేడు ప్రవక్తల ద్వారా మాట్లాడతారు. నేడు ఆయన తన సంఘాన్ని నడిపిస్తారు. నేడు ఆయన గాయపడిన ఆత్మలను, విరిగిన హృదయాలను స్వస్థపరుస్తారు. కావున మనము జోసెఫ్ స్మిత్ యొక్క శక్తివంతమైన సాక్ష్యము యొక్క పదాలను ప్రతిధ్వనించగలము: “ఆయనను గూర్చి ఇవ్వబడిన అనేక సాక్ష్యముల తరువాత ఆయనను గూర్చి … మేమిచ్చు సాక్ష్యము: అదేమనగా ఆయన సజీవుడు!” (సిద్ధాంతము మరియు నిబంధనలు 76:22). ఈ బయల్పాటులలో మనం ఆయన స్వరాన్ని వినవచ్చు, మన జీవితాల్లో ఆయన హస్తానికి సాక్ష్యమివ్వవచ్చు మరియు “ఈ వాక్యం ఇచ్చే ఆనందాన్ని అనుభవించవచ్చు: ‘నా విమోచకుడు జీవించియున్నాడని నాకు తెలుసు!’” (Hymns, no. 136).

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సెమినరీ చిహ్నము
యేసు క్రీస్తు జీవించియున్నారు.

ప్రవక్త జోసెఫ్ స్మిత్ చూసినట్లుగా మనలో చాలామంది యేసు క్రీస్తును చూడలేదు. కానీ రక్షకుడు జీవించియున్నారని, మన విజయాలు మరియు పోరాటాలు ఆయనకు తెలుసునని మరియు అవసరమైన సమయాల్లో ఆయన మనకు సహాయం చేస్తారని ఆయన తెలుసుకున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. మీరు క్రింది ప్రశ్నలను ఆలోచిస్తూ, దానితో పాటు ఉన్న వనరులను అధ్యయనం చేస్తున్నప్పుడు జీవముతోనున్న క్రీస్తు గురించి మీ స్వంత సాక్ష్యాన్ని పరిగణించండి.

కంఠస్థం చేయడం నుండి శక్తి వస్తుంది. ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్ ఇలా వివరించారు: “లేఖనాలను కంఠస్థం చేయడం నుండి గొప్ప శక్తి రాగలదు. ఒక లేఖనాన్ని కంఠస్థం చేయడమనేది ఒక క్రొత్త స్నేహాన్ని సృష్టించడం వంటిది. అది అవసరమైన సమయంలో సహాయపడగల, ప్రేరేపణను ఓదార్పును ఇవ్వగల, అవసరమైన మార్పుకు కావలసిన ప్రేరణకు మూలాధారము కాగల క్రొత్త వ్యక్తిని కనుగొనడం వంటిది” (“The Power of Scripture,” Ensign, Nov. 2011, 6). రక్షకుని గురించి మీకు ప్రత్యేకించి అర్థవంతమైన లేఖనాన్ని—బహుశా అవసరమైన సమయంలో మీకు ఓదార్పునిచ్చే దానిని మీరు కనుగొంటే—దానిని కంఠస్థం చేయడాన్ని పరిగణించండి.

“జీవముతోనున్న క్రీస్తు” లోని సత్యాలను మీ హృదయంలో మరియు మనస్సులో స్వీకరించడానికి మీరు ఏమి చేయాలని ప్రేరేపించబడ్డారు?

2:5

Let Your Goals Be Guided by the Spirit

ఈరోజు రక్షకుడు మనలను ఎలా దీవిస్తున్నారు అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు ఒక కీర్తనను చదువుకోవచ్చు, వినవచ్చు లేదా పాడవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 6:34; 84:77; 98:18; 138:23లో కూడా బోధించబడిన సత్యాల కోసం ఈ కీర్తనలో వెదకడం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

యేసు క్రీస్తు మూలముగా నేను పునరుత్థానము చెందుతాను.

అతని తండ్రి మరియు ఇద్దరు సోదరులతో సహా ప్రియమైన వారు మరణించినప్పుడు దుఃఖించడం ఎలా ఉంటుందో జోసెఫ్ స్మిత్‌కు తెలుసు. జోసెఫ్ మరియు ఎమ్మా ఆరుగురు పిల్లలను సమాధి చేసారు, ప్రతి ఒక్కరు రెండు సంవత్సరాలకంటే తక్కువ వయస్సు వారు. దేవుడు ఇచ్చిన బయల్పాటుల నుండి, జోసెఫ్ మరియు ఎమ్మా నిత్య దృక్పథాన్ని పొందారు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 29:26–27; 42:45–46; 63:49; 88:14–17, 27–31; 93:33–34లో మరణం మరియు దేవుని నిత్య ప్రణాళిక గురించిన సత్యాల కోసం చూడండి. మీరు మరణమును చూసే దృష్టిని ఈ సత్యాలు ఎలా ప్రభావితం చేస్తాయి? మీరు జీవించే విధానాన్ని అవి ఎలా ప్రభావితం చేస్తాయి?

1 కొరింథీయులకు కూడా చూడండి.Easter.ChurchofJesusChrist.org

యేసు క్రీస్తు నా కొరకు ఒక “పరిపూర్ణ ప్రాయశ్చిత్తము”ను సాధించారు.

ఈస్టర్ సమయంలో రక్షకునిపై దృష్టి కేంద్రీకరించడానికి ఒక విధానము, సిద్ధాంతము మరియు నిబంధనలలో ఆయన ప్రాయశ్చిత్త త్యాగము గురించి బోధించే బయల్పాటులను చదవడం. వీటిలో కొన్ని సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–13; 19:16–19; 45:3–5; 76:69–70లో కనుగొనబడగలవు. ఈ వచనాలలో మీరు కనుగొనే సత్యాలను జాబితా చేయడాన్ని పరిగణించండి. మీ అధ్యయనాన్ని హెచ్చించడానికి, లూకా 22:39–44; 1 యోహాను 1:7; 2 నీఫై 2:6–9; మోషైయ 3:5–13, 17–18; మొరోనై 10:32–33ను పరిశోధించడం ద్వారా మీరు మీ జాబితాకు జతచేయవచ్చు.

మీ అధ్యయనమును నడిపించగల ప్రశ్నలు కొన్ని ఇక్కడున్నాయి:

  • యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము అంటే ఏమిటి?

  • యేసు క్రీస్తు మన కొరకు బాధపడడానికి మరియు మరణించడానికి ఎందుకు ఎంచుకున్నారు?

  • ఆయన త్యాగము యొక్క దీవెనలను పొందడానికి నేనేమి చేయాలి?

  • ఈ వచనాలను చదివిన తర్వాత యేసు క్రీస్తు గురించి నేనెలా భావిస్తాను?

8:48

The Savior Suffers in Gethsemane

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము 01

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

యేసు క్రీస్తు మూలముగా నేను పునరుత్థానము చెందుతాను.

  • పునరుత్థానం గురించి మీ పిల్లలకు బోధించడానికి, మీరు రక్షకుని మరణం మరియు పునరుత్థానము యొక్క చిత్రాలను వారికి చూపించడం ద్వారా ప్రారంభించవచ్చు. ఈ సంఘటనల గురించి వారికి తెలిసిన దానిని మీ పిల్లలను పంచుకోనివ్వండి.

  • మనం చనిపోయినప్పుడు (మన ఆత్మలు మరియు శరీరాలు వేరుచేయబడతాయి) మరియు మనం పునరుత్థానం చెందినప్పుడు (మన ఆత్మలు మరియు శరీరాలు తిరిగి ఏకమవుతాయి మరియు మన శరీరాలు పరిపూర్ణంగా, అమర్త్యంగా ఉంటాయి) ఏమి జరుగుతుందో మీ పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక వస్తుపాఠాన్ని పరిగణించండి. ఉదాహరణకు, మనము ఫ్లాష్‌లైట్ నుండి బ్యాటరీని లేదా కలం నుండి సిరా పాత్ర‌ను తీసివేసినప్పుడు ఏమి జరుగుతుంది? మరలా అవి తిరిగి ఏకమైనప్పుడు ఏమి జరుగుతుంది? (ఆల్మా 11:44–45 చూడండి.)

  • మరణించిన వారెవరినైనా మీ పిల్లలు ఎరుగుదురా? ఈ వ్యక్తుల గురించి కొంత వారిని పంచుకోనివ్వండి మరియు తర్వాత సిద్ధాంతము మరియు నిబంధనలు 138:17ను కలిసి చదవండి. మన ప్రియమైన వారు పునరుత్థానం చేయబడతారని మరియు మళ్ళీ శరీరాలను కలిగి ఉంటారని తెలుసుకోవడం ఎలా అనిపిస్తుందో ఒకరితో ఒకరు మాట్లాడుకోండి.

  • మీకు పెద్ద పిల్లలు ఉన్నట్లయితే, ఈ క్రింది భాగాలలో ఈస్టర్ సందేశాన్ని సంగ్రహించే వాక్యభాగాల కోసం వెదకడానికి మీరు వారిని ఆహ్వానించవచ్చు: సిద్ధాంతము మరియు నిబంధనలు 63:49; 88:14–17, 27; 138:11, 14–17. ఇతరులతో ఈ సందేశమును మనమేవిధముగా పంచుకోగలము?

క్రీస్తు యొక్క సమాధి మరియు పునరుత్థానము

ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ యేసు క్రీస్తును చూసారు.

  • జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:14–17; సిద్ధాంతము మరియు నిబంధనలు 76:11–24; 110:1–10లో నమోదు చేయబడినట్లుగా, యేసు క్రీస్తు జోసెఫ్ స్మిత్‌కు మరియు ఇతరులకు కనిపించిన మూడు వేర్వేరు సమయాల గురించి చదవడానికి మీరు, మీ పిల్లలు ఆసక్తి కలిగి ఉండవచ్చు. ఈ సంఘటనల చిత్రాలను మీ పిల్లలు ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీలో కూడా చూడవచ్చు. ఈ అనుభవాలలో ప్రతీదాని నుండి మనం యేసు క్రీస్తు గురించి ఏమి నేర్చుకుంటాము? జోసెఫ్ స్మిత్ మరియు ఇతరులు పునరుత్థానుడైన రక్షకుడిని చూసారని తెలుసుకోవడం ఎందుకు దీవెనకరమైనది?

యేసు క్రీస్తు మూలముగా నేను నా పాపాల కొరకు క్షమించబడగలను.

  • క్రీస్తు ద్వారా క్షమాపణ గురించి జోసెఫ్ స్మిత్ నేర్చుకున్న సత్యాలు మీ పిల్లలకు వారి తప్పులు మరియు పాపాల కొరకు వారు క్షమించబడగలరనే నిరీక్షణనివ్వగలవు. ఇటువంటి శీర్షికలతో పట్టికను రూపొందించడానికి మీ పిల్లలను ఆహ్వానించడాన్ని పరిగణించండి: రక్షకుడు నా కొరకు ఏమి చేసారు మరియు ఆయన క్షమాపణను పొందడానికి నేను తప్పక చేయవలసినదేమిటి. ఈ శీర్షికల క్రింద ఉన్న అంశాలను కనుగొనడానికి క్రింది వాక్యభాగాలను శోధించడంలో మీ పిల్లలకు సహాయపడండి: సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–13; 19:16–19; 45:3–5; 58:42–43. రక్షకుడు మన కోసం చేసిన దానికి మీ ఆనందాన్ని, కృతజ్ఞతను ఒకరితో ఒకరు పంచుకోండి.

3:4

The Shiny Bicycle

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

తిరిగి లేచిన క్రీస్తు మరియకు కనిపించుట

Christ and Mary at the Tomb [సమాధి వద్ద క్రీస్తు మరియు మరియ], జోసెఫ్ బ్రిక్కీ చేత

పిల్లల కొరకు ప్రోత్సాహకార్యక్రమ పేజీ