2024 రండి, నన్ను అనుసరించండి
డిసెంబరు 21–27. “ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు”: క్రిస్మస్


“డిసెంబరు 21–27. ‘ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు’: క్రిస్మస్,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026

“డిసెంబరు 21–27. ‘ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

నిద్రిస్తున్న శిశువైన యేసు

For unto Us a Child Is Born [ఏలయనగా మనకు శిశువు పుట్టెను], సైమన్ డ్యూయీ చేత

డిసెంబరు 21–27: “ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు”

క్రిస్మస్

పాత నిబంధన ఆసక్తిగా ఎదురుచూసే మానసిక స్థితిని కలిగియున్నది. ఆ విధంగా, అది కొంచెం క్రిస్మస్ సమయం వలె ఉన్నది. ఆదాము, హవ్వలతో ప్రారంభించి, పాత నిబంధన గోత్రజనకులు, ప్రవక్తలు, కవులు మరియు జనులు మెస్సీయ చేత క్రొత్తగా చేయబడి, విడిపించబడుటకు నిరీక్షణతో నింపబడిన మంచి రోజుల కోసం ఎదురు చూసారు. వారు ఐగుప్తులో లేదా బబులోనులో చెరలో ఉన్నప్పటికీ లేదా వారి స్వంత పాపము లేదా తిరుగుబాటు చేత చెరపట్టబడినప్పటికీ—ఇశ్రాయేలీయులకు ఆ నిరీక్షణ తరచుగా అవసరము. ప్రవక్తలు వారి అనుభవాలన్నిటి ద్వారా “చెరలోనున్న వారికి విడుదలను” (యెషయా 61:1) ఇచ్చుటకు ఒక మెస్సీయ, ఒక విమోచకుడు వచ్చునని వారికి జ్ఞాపకం చేసారు.

యేసు క్రీస్తు బేత్లెహేములో జన్మించినప్పుడు ఆ నిరీక్షణ నిజం కావడం ప్రారంభమైంది. ఇశ్రాయేలు యొక్క శక్తిమంతుడైన విమోచకుడు ఒక పశువులశాలలో జన్మించి, పశువుల తొట్టెలో పరుండబెట్టబడెను (లూకా 2:7 చూడండి). కానీ, ఆయన ప్రాచీన ఇశ్రాయేలు యొక్క విమోచకుడు మాత్రమే కాదు. ఆయన మిమ్మల్ని విడిపించడానికి—మీ బాధను భరించడానికి, మీ విచారములను వహించడానికి, మీ అతిక్రమములను బట్టి గాయపరచబడడానికి వచ్చారు, ఆవిధంగా ఆయన కొరడా దెబ్బలతో మీరు స్వస్థపరచబడగలరు (Iయెషయా 53:4–5 చూడండి). అందుకే క్రిస్మస్ ఇప్పటికీ ఆనందకరమైన ఎదురుచూపుతో నిండియున్నది. 2000 సంవత్సరాల క్రితం మెస్సీయ వచ్చారు మరియు మనము ఆయనను వెదకినప్పుడు ఆయన మన జీవితాలలోనికి రావడం కొనసాగిస్తారు.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

సెమినరీ చిహ్నము
నా విమోచకునియందు నేను ఆనందిస్తున్నాను.

యేసు క్రీస్తు లోకములోనికి తెచ్చే ఆనందము వలన క్రిస్మస్ ఆనందకరమైన సమయంగా పేరుపొందింది. రక్షకుడు జన్మించడానికి శతాబ్దాల ముందు, పాత నిబంధన ప్రవక్తలు కూడా రాబోయే మెస్సీయ గురించి మాట్లాడినప్పుడు ఆనందాన్ని అనుభవించారు. క్రింది గద్యభాగాలలో కొన్నింటిని చదవండి మరియు రక్షకుని నియమితకార్యము కొరకు ఎదురుచూసిన వారికి అవి ఎందుకు ప్రశస్థమైయుండవచ్చో ఆలోచించండి: కీర్తనలు 35:9; యెషయా 25:8–9; 44:21–24; 51:11; జెఫన్యా 3:14–20; మోషే 5:5–11. ఈ గద్యభాగాలు మీకు ఎందుకు ప్రశస్థమైనవి? ఆనందంగా ఉండడానికి ఈ లేఖనాలు ఏ కారణాలను సూచిస్తున్నాయి?

రాత్రి ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రము

యేసు క్రీస్తును జ్ఞాపకముంచుకోవడానికి చిహ్నములు నాకు సహాయపడతాయి.

క్రిస్మస్‌కు సంబంధించిన ఆచారాలలో అనేకము క్రీస్తుపై మన ఆసక్తిని కేంద్రీకరించడానికి మనకు సహాయపడగల చిహ్నరూపకమైన అర్థాలను కలిగియుండగలవు. ఈ సంవత్సరం మీరు పాత నిబంధనను అధ్యయనం చేసినప్పుడు, రక్షకుని గూర్చి అనేక చిహ్నములను మీరు గమనించియుండవచ్చు. క్రింద కొన్ని జాబితా చేయబడ్డాయి. వీటిని అధ్యయనం చేసి, ఆయన గురించి అవి బోధించే దానిని వ్రాయడాన్ని పరిగణించండి.

  • నక్షత్రము (సంఖ్యాకాండము 24:17; మత్తయి 2:2; ప్రకటన 22:16).

  • గొఱ్ఱెలకాపరి (కీర్తనలు 23; లూకా 15:4–7; యోహాను 10:11).

  • గొఱ్ఱెపిల్ల (ఆదికాండము 22:8; నిర్గమకాండము 12:5; 1 పేతురు 1:18–20).

  • నీరు (నిర్గమకాండము 17:1–6; యిర్మీయా 2:13; యెహెజ్కేలు 47:1–12; యోహాను 4:7–14).

  • బండ (1 సమూయేలు 2:2; 2 సమూయేలు 22:2–3; కీర్తనలు 118:22–23; యెషయా 28:16; ఎఫెసీయులకు 2:20).

  • శాఖ (యెషయా 11:1–2; యిర్మీయా 23:5; 33:15).

  • వెలుగు (కీర్తనలు 27:1; యెషయా 9:2; 60:19; మీకా 7:8; యోహాను 8:12).

యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చేలా లేఖనాలలో మీరు కనుగొన్న ఇతర చిహ్నములు, గద్యభాగాలు మరియు వృత్తాంతములేవి?

2 నీఫై 11:4; మోషైయ 3:14–15; మోషే 6:63 కూడా చూడండి.

“ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు పెట్టబడును.”

యేసు క్రీస్తు అనేక భిన్నమైన పేర్లు మరియు బిరుదులచేత సూచించబడ్డారు. క్రింది వచనాలలో బిరుదుల కొరకు చూడండి: కీర్తనలు 23:1; 83:18; యెషయా 7:14; 9:6; 12:2; 63:16; ఆమోసు 4:13; జెకర్యా 14:16; మోషే 7:53. మీరు ఆలోచించగల ఇతర పేర్లు ఏవి? క్రిస్మస్ కీర్తనలలో యేసు క్రీస్తును గూర్చి మీరు కనుగొన్న బిరుదులను జాబితా చేయడాన్ని కూడా మీరు ఆనందించవచ్చు. ప్రతీ బిరుదు ఆయన గురించి మీరు ఆలోచించే విధానమును ఎలా ప్రభావితం చేస్తుంది?

రాబోయే ఏడాది పొడవునా ఆయనను గుర్తుంచుకోవడంలో మీకు సహాయపడేలా రక్షకుని యొక్క ఒక బిరుదు లేదా పాత్రను ఎంచుకోవడం గురించి ఆలోచించండి.

క్వింటిన్ ఎల్. కుక్, “కష్ట కాలములలో వ్యక్తిగత శాంతి,” లియహోనా, నవ. 2021, 89–92 కూడా చూడండి.

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

పాత నిబంధన యేసు గురించి నాకు బోధిస్తుంది.

  • యేసు క్రీస్తు గురించి సంభాషణను ప్రారంభించడానికి ఉపయోగించగలిగేలా మీరు మరియు మీ పిల్లలు కొన్ని క్రిస్మస్ అలంకరణలను కలిగి ఉండవచ్చు. క్రిస్మస్ నక్షత్రం, దీపాలు లేదా బహుమతి మనకు రక్షకుడిని ఎలా గుర్తుచేస్తాయనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు. అప్పుడు మీరు యేసు క్రీస్తుకు ప్రతీకగా ఉండే వాటి కోసం క్రింది లేఖనాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిని చూడవచ్చు: ఆదికాండము 22:8; సంఖ్యాకాండము 24:17; కీర్తనలు 23:1; 27:1. మీ పిల్లలు ప్రతీ వచనం చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన చిత్రాన్ని లేదా అలంకరణను వారు పైకెత్తి పట్టుకోవచ్చు. యేసు ఎలా ఒక గొర్రెపిల్ల, నక్షత్రం, గొర్రెలకాపరి లేదా వెలుగులా ఉన్నారు?

  • మీరు యెషయా 9:6ను చదివేటప్పుడు, మీ పిల్లలు ఈ నమూనా చివర ఉన్న చిత్రాన్ని కూడా చూడవచ్చు. “ఒక శిశువు పుట్టెను” అనే వాక్యభాగాన్ని విన్నప్పుడు శిశువైన యేసును సూచించమని మీ పిల్లలను అడగండి. పాత నిబంధనలోని ప్రవక్తలకు యేసు జన్మిస్తారని తెలుసని మీ సాక్ష్యాన్ని పంచుకోండి.

  • మీరు వచ్చే ఏడాది కొత్త నిబంధనలో యేసు క్రీస్తు జీవితాన్ని అధ్యయనం చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు, పాత నిబంధనలో ఈ సంవత్సరం ఆయన గురించి మీ పిల్లలు నేర్చుకున్న వాటిని వారితో సమీక్షించడాన్ని పరిగణించండి. మీరు నేర్చుకున్న వాటిని గుర్తుంచుకోవడంలో మీకు సహాయపడడానికి మీరు ఈ వనరులోని నమూనా‌లను మరియు ఏదైనా వ్యక్తిగత అధ్యయన గమనికలను సమీక్షించవచ్చు. పాత నిబంధన కథలు లేదా రండి, నన్ను అనుసరించండి లోని చిత్రాలను చూడడం వలన చిన్న పిల్లలు లబ్ధి పొందవచ్చు. ఏ ప్రవచనాలు లేదా కథలు మనకు ప్రత్యేకమైనవి? రక్షకుని గురించి మనము ఏమి నేర్చుకున్నాము?

క్రిస్మస్ సంప్రదాయాలు యేసు క్రీస్తు వైపు దారి చూపగలవు.

  • ఇశ్రాయేలీయుల కుటుంబాలు పస్కా మరియు ఇతర విందులు వంటి సంప్రదాయాలను కలిగియున్నాయి, అవి వారి హృదయాలను మరియు మనస్సులను ప్రభువు వైపుకు తిప్పడానికి ఉద్దేశించబడ్డాయి (నిర్గమకాండము 12 చూడండి). యేసు క్రీస్తుపై దృష్టి కేంద్రీకరించడానికి మీకు సహాయపడేలా క్రిస్మస్ సమయమందు మీరు, మీ పిల్లలు కలిగియున్న సంప్రదాయాలు ఏవి? మీ కుటుంబ చరిత్ర నుండి మీకు తెలిసిన సంప్రదాయాలు ఏవి? మీరు ప్రారంభించాలనుకున్న కొన్ని సంప్రదాయాలను మీ పిల్లలతో చర్చించడాన్ని మీరు పరిగణించవచ్చు. అవసరతలో ఉన్నవారికి సేవ చేయడం, మీరు రక్షకునికి “బహుమతి”గా అందించేదాన్ని ఎంచుకోవడం, ప్రథమ అధ్యక్షత్వము యొక్క క్రిస్మస్ భక్తి సమావేశమును మీతోపాటు చూడమని ఒక స్నేహితుడిని ఆహ్వానించడం (broadcasts.ChurchofJesusChrist.org), మీ స్వంత క్రిస్మస్ పాటను వ్రాయడం లేదా క్రీస్తు పుట్టుక యొక్క సందేశాన్ని పంచుకోవడానికి ఒక సృజనాత్మక విధానమును కనుగొనడం వంటివి కొన్ని ఉపాయాలు.

గృహములో, నేర్చుకోవడం మరియు జీవించడం అనేవి విడదీయరానివి. “గృహములో సువార్త తక్షణ సంబంధాన్ని పొందుతుంది. అక్కడ అనుదినము మీరు ఎవరితో కలిసి సువార్త నేర్చుకుంటున్నారో వారితో కలిసి మీరు సువార్తను జీవిస్తారు. వాస్తవానికి, ఎక్కువ సమయం మనం సువార్తను నేర్చుకొనేది సువార్తను జీవించడం ద్వారానే. కాబట్టి మీరు గృహములో సువార్తను నేర్చుకుని బోధిస్తున్నప్పుడు, మీరు నేర్చుకుంటున్న దానితో మీరు చేస్తున్న పనులను అనుసంధానించడానికి మార్గాలను వెదకండి. మీ గృహములో, సువార్త అనేది మీరు మాట్లాడే విషయముగా మాత్రమే కాకుండా, మీరు జీవించడానికి కృషి చేసేదిగా ఉండనివ్వండి” (రక్షకుని విధానములో బోధించుట31).

ఒక జనన దృశ్యం

జనన దృశ్యం యొక్క వివరణ, ఈథన్ బ్రౌన్ చేత

నా రక్షకునిగా ఉండేందుకు పరలోక తండ్రి తన కుమారుడిని బహుమతిగా ఇచ్చారు.

  • క్రీస్తు జననం యొక్క గౌరవాన్ని మరియు ఆనందాన్ని అనుభవించడానికి మీరు మీ పిల్లలకు ఎలా సహాయపడగలరు? మీరు కలిసి మత్తయి 1:18–25; 2:1–12; లూకా 1:26–38; 2:1–20 చదవవచ్చు. ప్రతీ కుటుంబ సభ్యుడు లేఖన వృత్తాంతమును నుండి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని, రక్షకుని గురించి ఆ వ్యక్తి ఎలా భావిస్తున్నాడో పంచుకోవచ్చు. అప్పుడు మీరు ఆయన గురించి మీ స్వంత భావాలను ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.

    17:57

    The Christ Child

  • బహుశా మీరు మరియు మీ పిల్లలు మీకు ఆనందాన్ని కలిగించేలా సంవత్సరాలుగా మీరు ఇచ్చిన లేదా అందుకున్న బహుమతుల గురించి మాట్లాడవచ్చు. అప్పుడు మీరు యెషయా 25:9ని కలిసి చదివి, పరలోక తండ్రి మనకు రక్షకుడిని పంపినందుకు మీరు ఎందుకు సంతోషిస్తున్నారనే దాని గురించి మాట్లాడవచ్చు. మన రక్షకునిగా యేసు క్రీస్తు పాత్రను బాగా అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయడానికి, యెషయా 25:8–9; 53:3–5; మరియు హోషేయ 13:14 చదవమని వారిని ఆహ్వానించండి. ప్రభువు మనల్ని ఎలా రక్షిస్తారనే దాని గురించి ఈ లేఖనాలు మనకు ఏమి బోధిస్తాయి?

  • మీరు కలిసి క్రిస్మస్ పాటను కూడా పాడవచ్చు. పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు వారిని ప్రేమిస్తున్నారని తెలుసుకోవడంలో సహాయపడే వాక్యభాగాలను పాటలో కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడండి.

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ఒక జనన దృశ్యం

The Nativity [జనన దృశ్యం], ఎన్. సి. వైయత్ చేత

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: పాత నిబంధన యేసు గురించి నాకు బోధిస్తుంది