2024 రండి, నన్ను అనుసరించండి
డిసెంబరు 7–13. “యెహోవాకు ప్రతిష్ఠితము”: హగ్గయి 1–2; జెకర్యా 1-4; 7–14


“డిసెంబరు 7–13. ‘యెహోవాకు ప్రతిష్ఠితము’: హగ్గయి 1–2; జెకర్యా 1-4; 7–14,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

“డిసెంబరు 7–13. ‘యెహోవాకు ప్రతిష్ఠితము,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026

మబ్బులు పట్టిన ఆకాశం క్రింద లేయి హవాయి దేవాలయము

లేయి హవాయి దేవాలయము

డిసెంబరు 7–13: “యెహోవాకు ప్రతిష్ఠితము”

హగ్గయి 1–2; జెకర్యా 1–4; 7–14

దశాబ్దాల చెర తరువాత, బహుశా హగ్గయి మరియు జెకర్యా ప్రవక్తలతో పాటు ఇశ్రాయేలీయుల గుంపు ఒకటి యెరూషలేముకు తిరిగి వెళ్ళడానికి అనుమతించబడింది. ఈ గుంపులో కొందరు దేవాలయము నాశనము చేయబడక ముందు ఎలా ఉండేదో గుర్తుంచుకున్నారు. ప్రభువు యొక్క మందిరము “పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను” (హగ్గయి 2:3) పోలియుంటుందా అని ఆశ్చర్యపడిన వారితో, హగ్గయి ప్రవక్త ప్రభువు యొక్క ప్రోత్సహించే మాటలను మాట్లాడాడు: “దేశములోనున్న సమస్త జనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.” “నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, … ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను” (హగ్గయి 2:4–5, 7, 9).

కానీ పరిశుద్ధ దేవాలయము మాత్రమే పునర్నిర్మించాల్సిన అవసరము కలిగిలేదు. అనేక విధాలుగా, దేవుని యొక్క జనులు ఆత్మీయంగా నాశనమైయున్నారు. పరిశుద్ధ జనులను పునర్నిర్మించుటకు రాళ్ళను ముక్కలుగా చేయుట మరియు పరిశుద్ధ మందిరమును కట్టించుటకు వాటిని సమలేఖనము చేయుట కంటె ఎక్కువ అవసరము. దాని అర్థము “యెహోవాకు ప్రతిష్ఠితము” అను మాట దేవాలయపు గోడ మీద మాత్రమే కాకుండా “గుఱ్ఱములయొక్క కళ్లెములమీద” మరియు “యెరూషలేములోని ప్రతీ పాత్ర మీద” (జెకర్యా 14:20–21) కూడా వ్రాయబడాలి. అది ప్రతీ హృదయము మీద కూడా వ్రాయబడాలి.

హగ్గయి మరియు జెకర్యా గ్రంథాలను సమీక్షించడానికి, బైబిలు నిఘంటువులో “హగ్గయి” మరియు “జెకర్యా” చూడండి.

అధ్యయన చిహ్నము

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

హగ్గయి 1; 2:1–9

సెమినరీ చిహ్నము
“మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి.”

యెరూషలేమును తిరిగి కట్టడానికి చేయవలసిన అనేక ముఖ్యమైన విషయాలున్నాయి. కానీ సుమారుగా ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చిన 15 సంవత్సరాల తరువాత, దేవాలయ పునర్నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడలేదని ప్రభువుకు కోపం వచ్చింది (హగ్గయి 1:2–5; ఎజ్రా 4:24 కూడా చూడండి). మీరు హగ్గయి 1; 2:1–9ను చదివినప్పుడు, ఈ విధమైన ప్రశ్నలను పరిగణించండి:

  • వారు దేవాలయమును పూర్తి చేయలేదు కనుక ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న పర్యవసానములేవి?

  • వారు ఆయన మందిర నిర్మాణమును పూర్తి చేసిన యెడల ప్రభువు వాగ్దానమిచ్చిన దీవెనలేవి?

  • హగ్గయి 1:5–7 లో మీ కొరకు ప్రభువు సందేశమేమిటి? మీరు మీ ప్రాధాన్యతలను ప్రభువు వాటితో ఎలా సర్దుబాటు చేయవచ్చు? మీ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినందుకు మీరు ఎప్పుడు ఆశీర్వదించబడ్డారు?

హగ్గయి కాలంలోని ఇశ్రాయేలీయుల మాదిరిగానే ప్రారంభ కడవరి-దిన పరిశుద్ధులు‌ కూడా అదే విధమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 95 చూడండి). దేవాలయాల పట్ల ప్రభువు యొక్క భావాల గురించి ఈ రెండు ఉదాహరణల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

డేల్ జి. రెన్‌లండ్, “యేసు క్రీస్తు మనకెంతో విలువైనవారు,” లియహోనా, నవ. 2023, 96–99; టెర్రెన్స్ ఎమ్.విన్సన్, “రక్షకుని యొక్క నిజమైన శిష్యులు,” లియహోనా, నవ. 2019, 9–11 కూడా చూడండి.ChurchofJesusChrist.org

7:17

Provo City Center Temple Completed

జెకర్యా 1–3; 7–8;14

ప్రభువు నన్ను పరిశుద్ధునిగా చేయగలరు.

మీ అభిప్రాయం ప్రకారం, జెకర్యా 14:20లో పేర్కొన్నట్లుగా రోజువారీ వస్తువులపై “యెహోవాకు ప్రతిష్ఠితము” అని చెక్కడం యొక్క విలువ ఏమిటి? (నిర్గమకాండము 28:36–38 కూడా చూడండి). ఈ రోజు దేవాలయాలపై దానిని చెక్కడం యొక్క విలువ ఏమిటి? ఈ వాక్యభాగము మీకు ఏ అర్థాన్ని కలిగియున్నది? మీ దైనందిన జీవితంలో పరిశుద్ధతను మీరెలా భాగంగా చేసుకోగలరు? జెకర్యా 1:1–6; 3:1–7; 7:8–10; 8:16–17లో మరింత పరిశుద్ధంగా ఉండమని ప్రభువు తన జనులకు ఇచ్చిన ఆహ్వానాలను మీరు చదివేటప్పుడు ఈ ప్రశ్నలను ధ్యానించండి.

పరిశుద్ధమైన స్థితిలో ప్రభువుతో మనమందరం జీవించినప్పుడు భవిష్యత్తు దినములో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మీరు జెకర్యా 2:10–11; 8:1–8; 14:9–11, 20–21 కూడా చదవవచ్చు. యెరూషలేము యొక్క భవిష్యత్తు గురించి జెకర్యా దర్శనములో మిమ్మల్ని ఆకట్టుకొనేదేమిటి? మీ సమాజములో మీరు చూడాలనుకొనేలా అక్కడ మీరు ఏమి కనుగొంటారు? జెకర్యా వివరించిన పరిస్థితుల్లో జీవించడానికి మీరు ఎలా సిద్ధపడగలరు?

గాడిదపై యెరూషలేములో ప్రవేశిస్తున్న యేసు

“నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు” (జెకర్యా 9:9). Triumphal Entry [విజయవంతమైన ప్రవేశము], హారీ ఆండర్సన్ చేత

జెకర్యా 9:9–11; 11:12–13; 12:10; 13:6–7; 14:1–9

యేసు క్రీస్తు వాగ్దానమివ్వబడిన మెస్సీయ.

జెకర్యా రచనలలో అనేకము యేసు క్రీస్తు యొక్క భూలోక పరిచర్యను మరియు చివరకు ఆయన రెండవ రాకడను కూడా సూచిస్తాయి. క్రింద జెకర్యా యొక్క కొన్ని ప్రవచనాలు, వాటి నెరవేర్పు గురించిన లేఖనాలతో సహా ఉన్నాయి. మీరు ఈ గద్యభాగాలను చదువుతున్నప్పుడు, “రక్షకుని గురించి ఇది నాకు ఏమి బోధిస్తుంది?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

  • జెకర్యా 9:9–11 (మత్తయి 21:1–11; 1పేతురు 3:18–19 చూడండి)

  • జెకర్యా 11:12–13 (మత్తయి 26:14–16; 27:1–7 చూడండి)

  • జెకర్యా 12:10 (యోహాను 19:37; ప్రకటన 1:7 చూడండి)

  • జెకర్యా 13:6–7; 14:1–9 (మత్తయి 26:31; సిద్ధాంతము మరియు నిబంధనలు 45:47–53 చూడండి)

జెకర్యా 9:9–11లో వివరించిన విధంగా యెరూషలేములోకి యేసును స్వాగతించే జనుల మధ్య ఉండడం ఎలా ఉండియుండవచ్చని మీరు అనుకుంటున్నారు? మీరు ఆయనను మీ జీవితంలోకి, మీ ఇళ్లలోకి మరియు మీ సమాజములోకి ఎలా స్వాగతించగలరు?

రోనాల్డ్ ఎ. రాస్బాండ్, “అత్యున్నతుడైన దేవుని నామము ధన్యమగును గాక,” లియహోనా, మే 2023, 108–12 కూడా చూడండి.

1:22

The Lord's Triumphal Entry into Jerusalem

అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లల విభాగపు చిహ్నము

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

హగ్గయి 1:2–8.

“మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి.”

  • మీరు మీ పిల్లలతో హగ్గయి 1:2–5లోని భాగాలను చదివేటప్పుడు, ప్రభువు జనుల పట్ల ఎందుకు సంతోషించలేదో తెలుసుకోవడానికి వారికి సహాయపడండి. బహుశా మీ పిల్లలు 6వ వచనము నుండి ఒక వాక్యభాగాన్ని ఎంచుకొని దాని చిత్రాన్ని గీయవచ్చు. వారు దానిని ఒకరికొకరు చూపించవచ్చు మరియు ప్రతీ చిత్రము ఏ వాక్యభాగాన్ని సూచిస్తుందో ఊహించవచ్చు. ప్రభువు కోరుకునే దానికి బదులు ఇతర విషయాలపై మనం సమయాన్ని వెచ్చించినప్పుడు, అది తినినప్పటికీ నింపబడనట్లుగా ఎలా ఉంటుంది? ప్రభువుకు ప్రాముఖ్యమైన విషయాల కోసం మీరు ఎలా సమయాన్ని వెచ్చించవచ్చో మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు.

  • మీరు మీ పిల్లలకు 8వ వచనమును కూడా చదివి, “పర్వతములెక్కి,” “మ్రాను తీసికొని వచ్చి,” “[ప్రభువు] మందిరమును కట్టించునట్లు” నటించమని వారిని ఆహ్వానించవచ్చు. మీ పిల్లలు ప్రభువు వారిని చేయమని కోరిన వాటితో సహా, మామూలుగా ఒక రోజులో చేసే పనుల జాబితాను తయారు చేయవచ్చు. వారి జాబితాలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాలుగా ప్రభువు చెప్పే వాటి చూట్టూ సున్నా చుట్టడం ద్వారా “[వారి] ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనమని” మీ పిల్లలను అడగండి.

గృహ-కేంద్రీకృత బోధన. “సువార్త నేర్చుకొనుటకు కేంద్రము”గా గృహము ఉండాలని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు (“మార్గదర్శకులైన కడవరి దిన పరిశుద్ధులగుట,” లియహోనా, నవ. 2018, 113). “మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి” అని హగ్గయి ఇచ్చిన సలహాను మీ కుటుంబం అధ్యయనం చేస్తున్నప్పుడు, మీ కుటుంబ జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం గురించి మీరు మాట్లాడవచ్చు.

జెకర్యా 3:1–7

నిబంధనలు చేయడం మరియు పాటించడం పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తులా ఉండడానికి నాకు సహాయపడగలదు.

  • ఒక దర్శనంలో, జెకర్యా “మలిన వస్త్రములు ధరించి” ఉన్న ఒక ప్రధాన యాజకుడిని చూశాడు (జెకర్యా 3:3). ఒక దేవదూత అతనికి శుభ్రమైన దుస్తులు ఇచ్చాడు. జెకర్యా 3:1–7ని కలిసి చదవడం ద్వారా మరియు మురికి దుస్తులు మరియు శుభ్రమైన దుస్తులు దేనిని సూచిస్తాయో మాట్లాడడం ద్వారా ముఖ్యమైన సత్యాలను కనుగొనడంలో మీరు మీ పిల్లలకు సహాయం చేయవచ్చు. మనం బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మన పాపాల నుండి ఎలా శుద్ధులం అవుతాము? మన బాప్తిస్మపు నిబంధన “[ప్రభువు] మార్గాలలో నడవడానికి” మనకు ఎలా సహాయం చేస్తుంది?

  • ఈ నమూనాలో ఉన్నటువంటి బాప్తిస్మపు చిత్రాన్ని మీరు మరియు మీ పిల్లలు చూడవచ్చు. మన బాప్తిస్మపు సమయంలో మనం తెల్లని దుస్తులు ఎందుకు ధరిస్తాము?

నదిలో తన కూతురికి బాప్తిస్మమిస్తున్న తండ్రి

జెకర్యా 9:9–11; 11:12; 13:6–7

యేసు క్రీస్తు వాగ్దానమివ్వబడిన మెస్సీయ.

  • జెకర్యా 9:9లో, యేసు తన మర్త్య జీవితంలోని చివరి వారంలో యెరూషలేములోకి వచ్చినప్పుడు ముందుగా చెప్పబడిన సంఘటనను మీ పిల్లలు ఊహించవచ్చు. దీనికి సహాయం చేయడానికి, ఈ నమూనా‌లో ఉన్నట్లుగా సంఘటన యొక్క చిత్రాన్ని వారికి చూపించండి. మీ పిల్లలు “చాలా సంతోషిస్తున్న” చిత్రాలలోని వ్యక్తులను సూచించవచ్చు. జెకర్యా 9:9లో రాజు ఎవరు? ఆయన పట్ల మనం ఎందుకు కృతజ్ఞులం?

    1:35

    Chapter 44: The Savior Goes to Jerusalem

  • జెకర్యా నుండి వచ్చిన ప్రవచనాలను వాటి నెరవేర్పును వివరించే క్రొత్త నిబంధన వచనాలతో పోల్చడానికి మీ పిల్లలకు సహాయం చేయడం గురించి ఆలోచించండి. ఇక్కడ కొన్ని ఉదాహరణలున్నాయి: జెకర్యా 9:9 మరియు మత్తయి 21:5–9; జెకర్యా 9:11 మరియు 1 పేతురు 3:18–19; జెకర్యా 11:12 మరియు మత్తయి 26:14–16; జెకర్యా 13:7 మరియు మత్తయి 26:31. ఈ వచనాల నుండి రక్షకుని గురించి మనమేమి నేర్చుకుంటాము?

అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

అనేక దేవాలయాలపై వివిధ భాషలలో “యెహోవాకు ప్రతిష్ఠితము” మరియు “ప్రభువు యొక్క మందిరము” అని రాసి ఉన్న సంకేతాలు

“యెహోవాకు ప్రతిష్ఠితము” అని ప్రతీ దేవాలయంపై కనిపిస్తుంది.

ప్రాథమిక ప్రోత్సాహకార్యక్రమ పేజీ: యేసు క్రీస్తు నా ఆత్మను శుద్ధిచేయగలరు