“డిసెంబరు 14–20. ‘యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను మీ యెడల ప్రేమ చూపియున్నాను’: మలాకీ,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“డిసెంబరు 14–20. ‘యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను మీ యెడల ప్రేమ చూపియున్నాను,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
డిసెంబరు 14–20: “యెహోవా సెలవిచ్చునదేమనగా, నేను మీ యెడల ప్రేమ చూపియున్నాను”
మలాకీ
ప్రవక్త మలాకీ ద్వారా, “నేను మీ యెడల ప్రేమ చూపియున్నాను” అని ప్రభువు తన జనులతో చెప్పారు. కానీ తరతరాలుగా శ్రమ, చెర అనుభవించిన ఇశ్రాయేలీయులు, ప్రభువును అడిగారు, “ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివి?” (మలాకీ 1:2). ఇశ్రాయేలీయులు అంతా అనుభవించాక, ఆయన నిబంధన జనుల కొరకు దేవుని ప్రేమను గూర్చి ప్రాచీన ఇశ్రాయేలు చరిత్ర నిజంగా ఒక వృత్తాంతమా అని వారు ఆశ్చర్యపడియుండవచ్చు. కొన్ని మార్గాల్లో, దీనిని మానవ బలహీనత మరియు తిరుగుబాటు కథగా చూడడం సులభం. అయినప్పటికీ, వీటన్నిటిలో దేవుడు ప్రేమతో చేరుకోవడాన్ని ఎన్నడూ ఆపలేదు. యాకోబు కుమారులు వారి తమ్ముడైన యోసేపుకు అన్యాయం చేసినప్పుడు, కరువు నుండి ప్రభువు ఇంకా వారిని కాపాడారు (ఆదికాండము 45:4–8 చూడండి). ఇశ్రాయేలీయులు అరణ్యములో సణిగినప్పుడు, ఆయన వారికి మన్నాను ఆహారంగా ఇచ్చారు (నిర్గమకాండము 16:1–4 చూడండి). ఇశ్రాయేలీయులు ఇతర దేవుళ్ళ వైపు తిరిగి చెదరగొట్టబడినప్పుడు కూడా, వారు పశ్చాత్తాపపడిన యెడల, వారిని సమకూర్చుతానని మరియు “గొప్ప వాత్సల్యములతో” (యెషయా 54:7 చూడండి) వారిని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసారు. నిజంగా, పాత నిబంధన దేవుని యొక్క సహనము, శాశ్వతమైన ప్రేమ యొక్క వృత్తాంతము. మరియు ఈ వృత్తాంతము నేడు కొనసాగుతున్నది. మలాకీ ఆయనను పిలిచినట్లుగా, “నీతి సూర్యుడైన యేసు క్రీస్తు తన రెక్కలలో ఆరోగ్యముతో” (మలాకీ 4:2) వచ్చియున్నారు. ఆయన ప్రాచీన ఇశ్రాయేలు కొరకు మరియు మనందరి కొరకు దేవుని యొక్క ప్రేమకు గొప్ప నిదర్శనంగా ఉన్నారు.
మలాకీ గ్రంథము గురించి ఎక్కువ సమాచారము కొరకు, బైబిలు నిఘంటువులో “మలాకీ” చూడండి.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
మలాకీ 1–4
“మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును.”
మలాకీ కాలములో, ఇశ్రాయేలీయులు అప్పటికే యెరూషలేములో దేవాలయమును పునర్నిర్మించారు, కానీ ఒక జనముగా వారు ఇంకా ప్రభువుతో వారి అనుబంధమును తిరిగి నిర్మించవలసియున్నది. మీరు మలాకీ చదివినప్పుడు, ఇశ్రాయేలీయులను ప్రభువు అడిగినవి లేదా వారు ఆయనను అడిగిన ప్రశ్నల కొరకు చూడండి. ప్రభువుతో మీ అనుబంధమును లెక్కించడానికి మరియు ఆయనకు దగ్గర కావడానికి అటువంటి ప్రశ్నలను మీకై మీరు అడగడాన్ని పరిగణించండి (కొన్ని మాదిరులు క్రింద సూచించబడినవి).
-
నా కోసం ప్రభువు ప్రేమను నేను ఎలా అనుభూతి చెందాను? (మలాకీ 1:2 చూడండి).
-
ప్రభువుకు నా అర్పణలు ఆయనను నిజంగా గౌరవిస్తున్నాయా? (మలాకీ 1:6–11 చూడండి).
-
నేను ఏవిధాలుగా ప్రభువు “తట్టు” తిరగవలసిన అవసరమున్నది? (మలాకీ 3:7 చూడండి).
-
నేను ఏ విధంగానైనా దేవుని నుండి దొంగిలిస్తున్నానా? (మలాకీ 3:8–11 చూడండి).
-
కష్టకాలములందు నా స్వభావము ప్రభువు పట్ల నా భావాలను ఎలా ప్రతిఫలిస్తుంది? (మలాకీ 3:13–15 చూడండి; 2:17 కూడా చూడండి).
మలాకీ 1:6–14
ప్రభువు “ఒక పవిత్రమైన అర్పణ” అడుగుతారు.
మలాకీ 1లో వివరించబడిన అర్పణల గురించి మీరు చదువుతున్నప్పుడు, యాజకులు అర్పిస్తున్న బలుల గురించి మీరు ఏమి గమనిస్తారు? ప్రభువు పట్ల యాజకుల భావనలను గూర్చి ఈ బలులు ఏమి సూచిస్తాయి? (మలాకీ 1:13 చూడండి). మీరు ప్రభువుకు సమర్పించే అర్పణలు లేదా బలుల జాబితాను రూపొందించండి. జాబితాలోని ప్రతి వస్తువు కొరకు, ఏది దానిని “కలుషితమైన” అర్పణగా లేదా “పవిత్రమైన” అర్పణగా మార్చగలదని ఆలోచించండి (మలాకీ 1:7, 11).
మలాకీ 3:8–12
నేను దశమభాగాన్ని చెల్లించడం ద్వారా నా విశ్వాసాన్ని చూపించినప్పుడు ప్రభువు పరలోకపు వాకిండ్లను తెరుస్తారు.
మీరు దశమభాగాన్ని చెల్లిస్తున్నారని మీ స్నేహితుడు ఇప్పుడే తెలుసుకున్నాడని ఊహించుకోండి. “నువ్వు ఎందుకు అలా చేస్తావు?” అని మీ స్నేహితుడు అడుగుతాడు. మీరు మలాకీ 3:8–12 చదువుతున్నప్పుడు దీని గురించి ఆలోచించండి. మీ స్నేహితుడి ప్రశ్నకు సమాధానమివ్వడంలో మీకు సహాయపడేలా మీరు ఏమి కనుగొంటారు? దశమభాగం గురించి మీ స్నేహితుడు ఇంకా ఏమి అర్థం చేసుకోవాలని మీరనుకుంటున్నారు? మరింత సహాయం కోసం, మీరు ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సెన్ సందేశము, “దశమభాగము: పరలోకపు వాకిండ్లను తెరుచుట” (లియహోనా, నవ. 2023, 32–35)ను శోధిస్తూ, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం చూడవచ్చు:
-
దశమభాగము చెల్లించమని ప్రభువు మనల్ని ఎందుకు కోరుతున్నారు?
-
దశమభాగాన్ని చెల్లించకుండా ఏది అడ్డుకోవచ్చు మరియు మనం ఆ అడ్డంకులను ఎలా అధిగమించవచ్చు?
-
దశమభాగాన్ని చెల్లించడం పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై మన విశ్వాసాన్ని ఎలా బలపరుస్తుంది?
మీరు దశమభాగాన్ని చెల్లించినప్పుడు ప్రభువు మిమ్మల్ని ఎలా ఆశీర్వదించారో కూడా మీరు మీ స్నేహితుడితో పంచుకోవచ్చు. దశమభాగాన్ని చెల్లించడం ద్వారా మనం ఎలాంటి వ్యక్తులమవుతాము?
“పరలోకపు వాకిండ్లను విప్పి” (10వ వచనము) అనే పదానికి అర్థం ఏమిటని మీరనుకుంటున్నారు? బహుశా మీరు ఒక కిటికీని చూసి, కిటికీల ప్రయోజనాల గురించి ఆలోచించవచ్చు. మనం దశమభాగాన్ని చెల్లించినప్పుడు ప్రభువు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారో వివరించడానికి “పరలోకపు వాకిండ్లు” ఎందుకు మంచి మార్గం?
Vision in the Kirtland Temple [కర్ట్‌లాండ్ దేవాలయములో దర్శనము], గ్యారీ ఈ. స్మిత్ చేత
మలాకీ 4:5–6
“నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుదును.”
మొరోనై జోసెఫ్ స్మిత్‌కు మలాకీ 4:5–6ను ఉదహరించినప్పుడు, బైబిలులో “ఉన్న దానికి స్వల్ప వ్యత్యాసముతో” (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:36) అతడు ఉదహరించాడు. మొరోనై యొక్క వ్యత్యాసము ఈ ప్రవచనము గురించి మన అవగాహనకు ఏమి చేరుస్తుంది? ప్రత్యేకించి, ఇటువంటి ప్రశ్నలను ధ్యానించండి:
-
“పితరులు” ఎవరు? (ద్వితీయోపదేశకాండము 29:13 చూడండి). వారికి ఏ వాగ్దానాలు చేయబడ్డాయి? (అబ్రాహాము 2:9–11 చూడండి). ఈ వాగ్దానాలను నెరవేర్చడంలో మీరు ఎలా సహాయం చేస్తారు?
-
మీ హృదయాన్ని మీ పూర్వీకుల వైపు తిప్పడానికి ఏ అనుభవాలు మీకు సహాయపడ్డాయి? పరలోక తండ్రి ప్రణాళికకు అది ఎందుకు అంత ముఖ్యమైనది?
ఏలీయా రాకడ గురించి మరియు ఈ ప్రవచనం నేడు ఎలా నెరవేరుతోందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, సిద్ధాంతము మరియు నిబంధనలు 110:13–16 మరియు డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్, “ముద్రవేయు శక్తి” (లియహోనా, నవ. 2023, 19–22) చూడండి. ఏలీయా వచ్చినందుకు మీరు ఎందుకు కృతజ్ఞత కలిగియున్నారు?
గెరిట్ డబ్ల్యు. గాంగ్, “మనలో ప్రతీఒక్కరికి ఒక కథ ఉంది,” లియహోనా, మే 2022, 43–46 కూడా చూడండి.ChurchofJesusChrist.org
The Sealing Power
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
మలాకీ 1:2
ప్రభువు నన్ను ప్రేమిస్తున్నారు.
-
మలాకీ 1:2లో ఉన్న—“ఏ విషయమందు [ప్రభువు] మా యెడల ప్రేమ చూపితిరి?” అనే ప్రశ్నకు మీరు మరియు మీ పిల్లలు ఎలా జవాబిస్తారు? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీకు తెలిసిన కారణాలను పరస్పరం పంచుకోండి. బహుశా మీ పిల్లలు ఆయన ప్రేమను గుర్తుచేసే చిత్రాలను గీయవచ్చు.
సువార్త చర్చలలో పిల్లలను ప్రోత్సహించండి. మీరు చిన్న పిల్లలకు బోధిస్తున్నట్లయితే, వారిని సువార్త చర్చలలో చేర్చుకొనే సృజనాత్మక మార్గాల గురించి మీరు ఆలోచించవలసి ఉంటుంది. ఉదాహరణకు, మీ పిల్లలు బంతిని ఒకరికొకరు అందించవచ్చు; వారు బంతిని పట్టుకున్నప్పుడు, యేసు తమను ప్రేమిస్తున్నారని వారికి తెలిసిన ఒక కారణాన్ని వారు పంచుకోవచ్చు.
మలాకీ 3:8–12
నేను దశమభాగాన్ని చెల్లించినప్పుడు, ప్రభువు నన్ను దీవిస్తారు.
-
దశమభాగం గురించి నేర్చుకోవడానికి మీ పిల్లలకు మీరెలా సహాయపడతారు? ఈ వారపు ప్రోత్సాహకార్యక్రమ పేజీలోని నాణేల వంటి 10 చిన్న వస్తువులను లెక్కించమని మీరు వారిని అడగవచ్చు. అప్పుడు వారు ఒక వస్తువును మిగిలిన వాటి నుండి వేరు చేయవచ్చు—దీనినే మనం ప్రభువుకు దశమభాగముగా ఇస్తున్నాము. మలాకీ 3:8–12 ప్రకారం, మనం దశమభాగం చెల్లించాలని ప్రభువు ఎందుకు కోరుతున్నారు? (పాత నిబంధన కథలు, 171–72లో “ప్రవక్తయైన మలాకీ” కూడా చూడండి).
0:58Malachi the Prophet
1:18First Things First!
-
మీరు మలాకీ 3:10ని కలిసి చదువుతున్నప్పుడు, మీరు “ఆకాశపు వాకిండ్లు” అనే వాక్యభాగాన్ని చదివినప్పుడు కిటికీ దగ్గర నిలబడమని మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. లేదా “పట్టజాలనంత విస్తారముగా” అనే వాక్యభాగాన్ని ఉదహరించడానికి మీరు ఒక కప్పులో పొంగి పొర్లిపోయే వరకు నీరు పోయవచ్చు. మీరు దశమభాగం చెల్లించినప్పుడు దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాల గురించి పిల్లలకు చెప్పండి. మీ పిల్లలు ఈ ఆశీర్వాదాలను సూచించే చిత్రాలను గీయవచ్చు మరియు వాటిని మీ ఇంటి కిటికీకి లేదా సమీపంలో వ్రేలాడదీయవచ్చు.
మలాకీ 4:5–6
ఏలీయా మన హృదయాలను మన కుటుంబాల వైపు తిప్పడానికి వచ్చాడు.
-
మలాకీ 4:5–6లో, మీ పిల్లలు మలాకీ ప్రవచనానికి సంబంధించిన ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాల కోసం వెదకవచ్చు: ప్రభువు ఎవరిని పంపుతానని వాగ్దానం చేశారు? ఈ వ్యక్తి ఎప్పుడు వస్తాడని ఆయన చెప్పారు? ఈ వ్యక్తి ఏమి చేస్తాడని ప్రభువు చెప్పారు? ఈ వ్యక్తి ఎందుకు రావాలి? ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:13–16 చూడండి).
-
మలాకీ 4:5లోని వాగ్దానం ఎలా నెరవేరిందో తెలుసుకోవడానికి, సిద్ధాంతము మరియు నిబంధనల కథలు, 26–30లో “జోసెఫ్ మరియు ఆలీవర్ యాజకత్వ తాళపుచెవులను పొందుట”ను కూడా మీరు సమీక్షించవచ్చు.
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.