“జూలై 14–20: ‘నేను మిమ్ములను నడిపించెదను’: సిద్ధాంతము మరియు నిబంధనలు 77–80,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 77–80,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
Going Home [ఇంటికి వెళ్ళుట], యాంగ్‌సుంగ్ కిమ్ చేత
జూలై 14–20: “నేను మిమ్ములను నడిపించెదను”
సిద్ధాంతము మరియు నిబంధనలు 77–80
యేసు క్రీస్తు యొక్క సంఘము పునఃస్థాపించబడిన రెండు సంవత్సరాల లోపు దాని సభ్యత్వము 2,000 మందికి పైగా పెరిగింది మరియు త్వరితగతిన విస్తరిస్తున్నది. 1832, మార్చిలో “సంఘ కార్యకలాపాలు”: బయల్పాటులను ప్రచురించవలసిన అవసరము, సమకూడుటకు భూమి కొనుగోలు మరియు బీదల పట్ల శ్రద్ధ చూపడం గురించి చర్చించడానికి జోసెఫ్ స్మిత్ ఇతర సంఘ నాయకులను కలుసుకున్నారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 78, ప్రకరణ శీర్షిక చూడండి). ఈ అవసరాలను తీర్చడానికి ఒక ఐక్య సంస్థను, అనగా ఈ అంశాలలో ప్రభువు యొక్క “హేతువును ముందుకు తీసుకొనిపోవుటకు” (4వ వచనము) వారి ప్రయత్నాలను జతచేయు సమూహమును ఏర్పాటు చేయడానికి ప్రభువు కొద్దిసంఖ్యలో సంఘ నాయకులను పిలిచారు. కానీ అటువంటి కార్యనిర్వాహక విషయాల్లో కూడా ప్రభువు నిత్య విషయాలపై కేంద్రీకరించారు. చివరకు, దేవుని రాజ్యములో ప్రతిదాని వలె—“సిలెస్టియల్ లోకములో ఒక స్థలమును” మరియు “నిత్యత్వపు ఐశ్వర్యములను” (7, 18 వచనములు) పొందడానికి ఆయన పిల్లలను సిద్ధపరచడమే ఒక ముద్రణాలయము లేదా గిడ్డంగి యొక్క ఉద్దేశము. అనుదిన జీవితపు పనుల మధ్య ఆ దీవెనలను గ్రహించడం ఇప్పుడు కష్టమైనట్లయితే, “సంతోషించుడి, నేను మిమ్ములను నడిపించెదను” (18వ వచనము ) అని ఆయన మనకు అభయమిస్తున్నారు.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
దేవుడు జ్ఞానాన్ని కోరుకునే వ్యక్తులకు దానిని ఇస్తారు.
జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్ బైబిల్ యొక్క ప్రేరేపిత అనువాదంపై పని చేస్తున్నప్పుడు, చాలామంది వ్యక్తుల మాదిరిగానే వారికి ప్రకటన గ్రంథము గురించి ప్రశ్నలు ఉన్నాయి. మరియు అతనికి జ్ఞానం కొదువగా ఉన్నప్పుడు, అతను దేవుణ్ణి అడగవచ్చని జోసెఫ్‌కు బాగా తెలుసు. అతడు పొందిన ఈ అంతర్దృష్టులు సిద్ధాంతము మరియు నిబంధనలు 77లో ఉన్నాయి. మీరు ఈ ప్రకరణమును చదువుతున్నప్పుడు, ప్రకటనల గ్రంథములోని సంబంధిత అధ్యాయాలలో మీకు కలిగిన అంతరార్థములను నమోదు చేయడాన్ని పరిగణించండి. బయల్పాటు పొందడం గురించి మీ అధ్యయనం నుండి మీరేమి నేర్చుకుంటారు?
Translation of the Bible [బైబిలు యొక్క అనువాదము], లిజ్ లెమన్ స్విండిల్ చేత
ఐక్య సంస్థ అంటే ఏమిటి?
ఒహైయో మరియు మిస్సోరిలో సంఘము యొక్క ప్రచురణ మరియు వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి ఐక్య సంస్థ స్థాపించబడింది. ఎదుగుతున్న సంఘము యొక్క భౌతిక అవసరాలను తీర్చడానికి వారి వనరులను ఏకం చేసిన జోసెఫ్ స్మిత్, న్యూయెల్ కె. విట్నీ మరియు ఇతర సంఘ నాయకులను అది కలిగియుంది. దురదృష్టవశాత్తూ, ఐక్య సంస్థ అప్పుల్లో మునిగిపోయింది మరియు అప్పులు సంభాళింప సాధ్యము కానప్పుడు 1834లో రద్దుచేయబడింది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 78:1–7
క్రీస్తు మరియు ఆయన సంఘము యొక్క “హేతువును ముందుకు తీసుకొనిపోవుటకు” నేను సహాయపడగలను.
ఒక గిడ్డంగిని, ఒక ముద్రణాలయమును నిర్వహించుట “మీరు అవలంబించుచున్న హేతువును ముందుకు తీసుకొనిపోవుటకు సహాయపడుతుందని” (సిద్ధాంతము మరియు నిబంధనలు 78:4) ప్రభువు జోసెఫ్ స్మిత్ మరియు ఇతర సంఘ నాయకులకు చెప్పారు. రక్షకుని సంఘము యొక్క “హేతువు” ఏమిటని మీరంటారు? మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 78:1–7 చదువుతున్నప్పుడు, దీనిని ధ్యానించండి. మీ కుటుంబంతో సహా ఆ హేతువును ముందుకు తీసుకెళ్ళడంలో మీరు సహాయపడే వివిధ మార్గాల్లో కొన్ని ఏవి?
ప్రధాన చేతిపుస్తకము, 1.2 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 78:17–18
ప్రభువు నన్ను నడిపిస్తారు.
ప్రభువు కొన్నిసార్లు తన అనుచరులను “చిన్నపిల్లలు” అని ఎందుకు పిలుస్తారని మీరనుకుంటున్నారు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 78:17). బహుశా దేనినైనా “మీరింకా అర్థం చేసుకోలేకపోయినందు వలన” లేదా “సహించలేనందువలన” మీరెప్పుడైనా చిన్నపిల్లల వలె భావించారా? (17–18 వచనములు). అటువంటి సమయాల్లో మీరు “సంతోషించునట్లు” (18వ వచనము) మీకు సహాయపడగలిగేలా ఈ వచనాలలో మీరేమి కనుగొంటారు? మీ చిన్నప్పటి చిత్రాన్ని కనుగొనడాన్ని పరిగణించండి మరియు అప్పటి నుండి మీరు ఆధ్యాత్మికంగా ఎలా ఎదిగారో ధ్యానించండి. లేదా మీరు యవ్వనంలో ఉన్నప్పుడు మీకు కష్టమైనదిగా ఉండి, ఇప్పుడు సులభంగా ఉన్నదాని గురించి ఆలోచించండి. ఇంకా ఏయే విధాలుగా మీరు పిల్లలవలె ఉండాలని పరలోక తండ్రి కోరుకుంటున్నారు? (మోషైయ 3:19 చూడండి). ఆయన “మిమ్మల్ని ఎలా [నడిపిస్తున్నారు]”?
సిద్ధాంతము మరియు నిబంధనలు 78:19
నేను అన్ని విషయములను కృతజ్ఞతాభావముతో స్వీకరించగలను.
సిద్ధాంతము మరియు నిబంధనలు 78:19ని అధ్యయనం చేయడానికి సిద్ధపడేందుకు, ఈరోజు మీకు జరిగిన మంచి విషయాల జాబితాను మీరు తయారు చేయవచ్చు. తర్వాత మీకు నిజంగా దీవెనలుగా అనిపించని విషయాల జాబితాను రూపొందించండి. మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 78:19 చదువుతున్నప్పుడు, ఈ జాబితాలను ధ్యానించండి. మీరు కృతజ్ఞతాభావముతో “అన్ని విషయాలను”—దీవెనలుగా అనిపించని వాటిని కూడా స్వీకరిస్తే మీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది?
దేవుని పట్ల కృతజ్ఞత మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ లేఖనాలను అన్వేషించండి మరియు మీరు కనుగొనే సత్యాల జాబితాను రూపొందించండి: కీర్తనలు 107:8–9; లూకా 17:11–19; ఫిలిప్పీయులకు 4:6–7; మోషైయ 2:19–24; ఆల్మా 34:38; 37:37; సిద్ధాంతము మరియు నిబంధనలు 46:32; 59:7, 15–21.
కృతజ్ఞతతో ఎలా ఉండాలనే దాని గురించి సలహా కోసం అధ్యక్షులు డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ గారి సందేశము “Grateful in Any Circumstances” (Liahona, May 2014, 70–77) ను పరిశోధించడాన్ని పరిగణించండి. కృతజ్ఞత యేసు క్రీస్తుతో మీ సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
President Russell M. Nelson on the Healing Power of Gratitude
శోధించండి మరియు పంచుకోండి. మీరు బోధించడానికి నియమించబడినట్లయితే, జనులు తమ స్వంతంగా లేదా చిన్న సమూహాలలో లేఖనాలను లేదా ప్రవక్తల మాటలను శోధించడంలో మరియు వారు నేర్చుకున్న వాటిని పంచుకోవడంలో వారికి సహాయపడే మార్గాల కోసం చూడండి. ఉదాహరణకు, ఈ కార్యకలాపంలో మీరు ప్రతీ వ్యక్తికి లేదా సమూహానికి అధ్యక్షులు ఉఖ్‌డార్ఫ్ గారి సందేశంలోని ఒక విభాగాన్ని ఇవ్వవచ్చు మరియు ఆయన బోధించిన దానిని సంక్షిప్తం చేస్తుందని వారు భావించే వాక్యభాగాన్ని లేదా వాక్యాన్ని పంచుకోమని వారిని అడగవచ్చు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 79–80
నేను ఎక్కడ సేవ చేస్తున్నాను అనే దానికంటే దేవునికి సేవ చేయడానికి పిలువబడ్డాను అనేది ముఖ్యమైనది.
సిద్ధాంతము మరియు నిబంధనలు 80 కు సంబంధించి ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా బోధించారు, “ఒక ప్రత్యేక స్థానములో పనిచేయడానికి నియమించబడడం ఆవశ్యకమైనది మరియు ముఖ్యమైనదే, కానీ పనిచేయడానికి పిలువబడడం కంటే ముఖ్యమైనది కాదు అనేది బహుశా ఈ బయల్పాటులో రక్షకుడు మనకు బోధిస్తున్న పాఠాలలో ఒకటి కావచ్చు” (“Called to the Work,” Liahona, May 2017, 68). ఎల్డర్ బెడ్నార్ మాటలు నిజమని మీరు తెలుసుకొనేలా మీకు సహాయపడిన అనుభవాలేవి? ఇప్పుడే క్రొత్తగా పిలుపును అందుకున్న వారికి సహాయపడగలిగేలా సిద్ధాంతము మరియు నిబంధనలు 79–80లో ఏ అదనపు పాఠాలను మీరు కనుగొనగలరు?
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 77:2
దేవుడు భూమిపై ఉన్న ప్రతి జీవిని సృష్టించాడు.
-
మీరు మరియు మీ పిల్లలు కలిసి సిద్ధాంతము మరియు నిబంధనలు 77:2 చదివినప్పుడు, మీరు కీటకాలు మరియు పక్షులతో సహా జంతువుల చిత్రాలను చూడవచ్చు. మీరు “మృగాలు,” “ప్రాకెడి జీవులు” మరియు “ఎగిరే పక్షులు” అనే పదాలను చదివినప్పుడు మీ పిల్లలు చిత్రాలను చూపగలరు. దేవుడు సృష్టించినవి ఆయన ప్రేమను అనుభవించడంలో మీకు ఎలా సహాయపడతాయో ఒకరితో ఒకరు పంచుకోండి.
దేవుడు భూమిపై ఉన్న అన్ని జీవులను సృష్టించాడు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 78:4
యేసు క్రీస్తు యొక్క “హేతువును ముందుకు తీసుకొనిపోవుటకు” నేను సహాయపడగలను.
-
మీ పిల్లలు ప్రభువు కార్యములో వారి పాత్రల గురించి ఆలోచించడంలో సహాయపడడానికి, మనము బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం “అవలంబించిన” (అంగీకరించిన లేదా మద్దతునిచ్చేందుకు ఎంచుకున్న) “హేతువును” గుర్తించడానికి వారితో సిద్ధాంతము మరియు నిబంధనలు 78:4 చదవడాన్ని పరిగణించండి. సాధ్యమయ్యే సమాధానాల కోసం ఇలాంటి లేఖనాల వాక్యభాగాలలో చూసేందుకు వారికి సహాయపడండి: మోషైయ 18:8–10; సిద్ధాంతము మరియు నిబంధనలు 20:37; మోషే 1:39. ప్రభువు కార్యములో వారెలా సహాయం చేయగలరో నటించి చూపడాన్ని మీ పిల్లలు ఆనందించవచ్చు. ఉదాహరణకు, “ఒకరి భారాన్ని మరొకరు మోయడం” లేదా “యేసు క్రీస్తు నామాన్ని [మన]పై తీసుకోవడం” ఎలా ఉంటుంది? ఇది క్రీస్తు యొక్క “హేతువును ఎలా ముందుకు తీసుకువెళుతుంది”?
సిద్ధాంతము మరియు నిబంధనలు 78:6
నాకు కలిగిన దానిని ఇతరులతో నేను పంచుకోగలను.
-
“లోక విషయములందు సమానంగా” (6వ వచనము) ఉండడం అంటే ఏమిటో బోధించడానికి, మీరు మీ పిల్లలకు అవసరంలోనున్న వ్యక్తుల చిత్రాలను (ఆకలి, గాయాలు లేదా చలి) మరియు సహాయపడే వస్తువులను (ఆహారం, గాయానికి కట్టే కట్టు లేదా ఒక దుప్పటి) ఇవ్వవచ్చు. అప్పుడు మీ పిల్లలు వస్తువులతో చిత్రాలను సరిపోల్చగలరు. అవసరంలోనున్న వ్యక్తులకు సహాయం చేయడానికి మనం ఏమి పంచుకోవచ్చు?
-
78వ ప్రకరణము కోసం కొంత సందర్భాన్ని పొందడానికి, “అధ్యాయము 28: ప్రవక్త జోసెఫ్ మళ్ళీ మిస్సోరికి వెళ్తారు” లోని మొదటి రెండు చిత్రాల క్రింద ఉన్న వాక్యాలను మీ పిల్లలతో కలిసి చదవండి. తర్వాత మీ పిల్లలు ఎవరైనా ఇల్లు కట్టడంలో సహాయం చేస్తున్నట్లు, ఆహారం పంచుకుంటున్నట్లు లేదా మరొక విధంగా సేవ చేస్తున్నట్లు నటించవచ్చు.
2:39Chapter 28: The Prophet Joseph Goes to Missouri Again: March–May 1832
సిద్ధాంతము మరియు నిబంధనలు 78:18
యేసు క్రీస్తు నన్ను నడిపిస్తారు.
-
ఒక నాయకుడిగా ఉండడం మరియు ఒక ప్రోత్సాహకార్యక్రమానికి నాయకత్వం వహించడం అంటే ఏమిటో మాట్లాడడం మీ పిల్లలకు సరదాగా ఉండవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 78:18 ను కలిసి చదివిన తర్వాత, మనల్ని నడిపించడానికి యేసు అవసరమైన సమయాలను మీరు చర్చించవచ్చు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 78:19
నేను “అన్ని విషయములను కృతజ్ఞతాభావముతో” స్వీకరించగలను.
-
కృతజ్ఞతతో ఉన్న జనులకు ప్రభువు ఏమి వాగ్దానం చేస్తారో తెలుసుకోవడానికి సిద్ధాంతము మరియు నిబంధనలు 78:19ను మీ పిల్లలతో కలిసి చదవండి. బహుశా వారికి ఒక చిన్న వస్తువును చూపించి, ఆపై అదే వస్తువును 100 సంఖ్యలో చూపించడం ద్వారా మీ పిల్లలకు “వంద రెట్లు” అంటే ఏమిటో అర్థం చేసుకోవడంలో సహాయపడండి. బహుశా వారు దేవుని నుండి “కృతజ్ఞతాభావముతో” పొందిన వస్తువుల చిత్రాలను గీయవచ్చు.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.