“జూలై 7–13: ‘వారి బహుమానము గొప్పది, వారి మహిమ నిత్యము నిలుచును’: సిద్ధాంతము మరియు నిబంధనలు 76,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)
“సిద్ధాంతము మరియు నిబంధనలు 76,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025
Refuge [ఆశ్రయము], షేలిన్ ఏబెల్ చేత
జూలై 7–13: “వారి బహుమానము గొప్పది, వారి మహిమ నిత్యము నిలుచును”
సిద్ధాంతము మరియు నిబంధనలు 76
“నేను మరణించిన తర్వాత నాకు ఏమి జరుగుతుంది?” దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఈ ప్రశ్న అడుగుతారు. శతాబ్దాలుగా, బైబిలు బోధనలపై ఆధారపడి అనేక క్రైస్తవ సంప్రదాయాలు స్వర్గము, నరకముల గురించి మరియు నీతిమంతుల కొరకైన పరదైసు, దుష్టుల కొరకైన బాధ గురించి బోధించాయి. కానీ, మానవ కుటుంబమంతా నిజంగా అంత ఖచ్చితంగా విభజించబడగలదా? 1832 ఫిబ్రవరిలో, ఈ విషయము గురించి ఇంకా తెలుకోవలసినది ఏమైనా ఉందా అని జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్‌లు ఆశ్చర్యపడ్డారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 76, ప్రకరణ శీర్షిక చూడండి).
ఖచ్చితంగా ఉంది. జోసెఫ్ మరియు సిడ్నీలు ఈ విషయాలను ధ్యానించుచుండగా ప్రభువు “(వారి) మనోనేత్రములను తాకగా, అవి తెరువబడినవి” (19వ వచనము). వారు ఎంత ఆశ్చర్యకరమైన, విస్తారమైన, ప్రకాశవంతమైన బయల్పాటు పొందిరనగా, పరిశుద్దులు నేరుగా దానిని “దర్శనము” అని పిలిచారు. అది పరలోకపు వాకిండ్లను తెరచి, దేవుని పిల్లలకు నిత్యత్వము యొక్క విస్తారమైన జ్ఞానమునిచ్చింది. చాలామంది ఇంతకు ముందు నమ్మిన దానికంటే పరలోకము చాలా ఘనమైనదని, విశాలమైనదని, అనేకమును కలిపియున్నదని ఆ దర్శనము బయల్పరిచింది. మనము గ్రహించగలిగిన దానికంటే దేవుడు ఎంతో దయామయుడు, న్యాయవంతుడు. మరియు దేవుని పిల్లలు మనము ఊహించగలిగిన దానికంటే ఎంతో మహిమకరమైన నిత్య గమ్యమును కలిగియున్నారు.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ వస్తుంది.
76వ ప్రకరణము మన నిత్య గమ్యము గురించి ముఖ్యమైన సత్యాలను బయల్పరుస్తుంది, అయితే ఈ బయల్పాటు మహిమ యొక్క మూడు రాజ్యాల గురించి లేదా రక్షణ ప్రణాళిక గురించి మాత్రమే అని చెప్పడం అసంపూర్ణంగా ఉంటుంది. మరింత ఖచ్చితంగా, 76వ ప్రకరణము మన రక్షణ మరియు నిత్య మహిమ కోసం దేవుని ప్రణాళికను సాధ్యం చేసే యేసు క్రీస్తు గురించినది. మీరు చదువుతున్నప్పుడు, యేసు క్రీస్తుకు మరియు మహిమ యొక్క విభిన్న రాజ్యాలను వారసత్వంగా పొందిన వ్యక్తులకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే పదాలు లేదా వాక్యభాగాల కోసం మీరు చూడవచ్చు. బహుశా క్రింది వంటి పట్టిక మీరు కనుగొన్న వాటిని నమోదు చేయడంలో మీకు సహాయపడవచ్చు.
|
మహిమ రాజ్యము |
యేసు క్రీస్తుతో సంబంధము |
నిత్య దీవెనలు |
|---|---|---|
మహిమ రాజ్యము సిలెస్టియల్ (50–70, 92–96 వచనములు) | యేసు క్రీస్తుతో సంబంధము
| నిత్య దీవెనలు
|
మహిమ రాజ్యము టెర్రెస్ట్రియల్ (71–79, 97 వచనములు) | యేసు క్రీస్తుతో సంబంధము | నిత్య దీవెనలు |
మహిమ రాజ్యము టిలెస్టియల్ (81-90, 98-106, 109-12 వచనములు) | యేసు క్రీస్తుతో సంబంధము | నిత్య దీవెనలు |
రక్షకునితో మీ అనుబంధాన్ని బలపరచడానికి ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?
ఈ దర్శనమును విల్ఫర్డ్ ఉడ్రఫ్ చదివినప్పుడు, “నా జీవితంలో మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ప్రభువును ప్రేమించాలని నేను భావించాను” అని ఆయన అన్నారు (“పునఃస్థాపన స్వరములు: ‘దర్శనము’ యొక్క సాక్ష్యములు” చూడండి). మీరు ఆయనను ఎక్కువగా ప్రేమించేలా చేసిన 1–5, 20–24, 39–43, 107–8 వచనముల నుండి యేసు క్రీస్తు గురించి మీరు ఏమి నేర్చుకుంటారు?
1 పేతురు 3:18–19; 4:6; డాలిన్ హెచ్. ఓక్స్, “మన రక్షకుడు మన కోసం ఏమి చేసారు?,” లియహోనా, మే 2021, 75–77 కూడా చూడండి.
పరలోక తండ్రి, యేసు క్రీస్తు మరియు వారి సిద్ధాంతంపై కేంద్రీకరించండి. లేఖనాలలో మనం నేర్చుకోగలిగే ప్రతీదానిలో, అత్యంత ముఖ్యమైన సత్యాలు మనకు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, పశ్చాత్తాపపడడానికి, వారితో నిబంధనలు చేసి, పాటించడానికి మరియు పరిశుద్ధాత్మను పొందడానికి సహాయపడతాయి. మహిమ యొక్క విభిన్న రాజ్యాలను పొందే వ్యక్తుల వైఖరులు లేదా ప్రవర్తనను పోల్చడం లేదా విశ్లేషించడం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, పరలోక తండ్రి మరియు రక్షకునిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఆ మహిమ కోసం మనల్ని సిద్ధం చేయడానికి వారు చేసే ప్రతీ పని మనల్ని వారి వైపు తిప్పుతుంది.
ఈ గదిలో, జోసెఫ్ స్మిత్ సిద్ధాంతము మరియు నిబంధనలు 76లో నమోదు చేయబడిన దర్శనమును చూశాడు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:5–10, 114–18
“పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా” నేను దేవుని చిత్తమును గ్రహించగలను.
సంఘము యొక్క సభ్యులందరు 76వ ప్రకరణములోని బయల్పాటును అంత సులువుగా అంగీకరించలేదు, ఎందుకనగా దాదాపు ప్రతీఒక్కరు రక్షించబడతారని మరియు ఏదో ఒక మహిమ క్రమమును పొందుతారని అది బోధించింది. ఉదాహరణకు, బ్రిగమ్ యంగ్ ఇలా అన్నారు: “నా సంప్రదాయాలు అలాంటివి, నాకు మొదట దర్శనము వచ్చినప్పుడు, అది నా పూర్వ విద్యకు నేరుగా విరుద్ధంగా మరియు వ్యతిరేకంగా ఉంది. కొంచెం ఆగండి, అన్నాను నేను. నేను దానిని తిరస్కరించలేదు; కానీ నేను దానిని అర్థం చేసుకోలేకపోయాను.” “నేను ఆలోచించి ప్రార్థించాలి, నేను తెలుసుకొని, దానిని పూర్తిగా అర్థం చేసుకునే వరకు చదవాలి మరియు ఆలోచించాలి” అని ఆయన వివరించారు (in “The Vision,” in Revelations in Context, 150). మీ ప్రస్తుత అవగాహనకు భిన్నమైన విషయాలను దేవుడు బయల్పరచినప్పుడు మీకు సహాయపడగలిగేలా ఆయన అనుభవం నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? సిద్ధాంతము మరియు నిబంధనలు 76:5–10, 114–18 లో దేవుని గురించి మీరేమి నేర్చుకుంటారు? మీరు “[దేవుని] చిత్తప్రకారమైన దయాసంకల్పమును” ఎలా అర్థం చేసుకోగలరనే దాని గురించి ఈ వచనాలు ఏమి బోధిస్తాయి? (7వ వచనము).
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:39-44, 50-70
ఉన్నతస్థితి అనేది రక్షణ యొక్క అత్యున్నత రూపం.
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:39–44 మామూలుగా రక్షణను వివరిస్తుంది. 50–70 వచనములు ఉన్నతస్థితిని, ఒక ప్రత్యేక రకమైన రక్షణను వివరిస్తాయి. రక్షణ మరియు ఉన్నతస్థితి మధ్య తేడాను మీరెలా వివరిస్తారు? రెండింటిలో రక్షకుని పాత్ర ఏమిటి? ఉన్నతస్థితిని వెదకడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా దేనిని మీరు ఈ వచనాలలో కనుగొంటారు?
యోహాను 3:16–17; సిద్ధాంతము మరియు నిబంధనలు 132:20–25 కూడా చూడండి.
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:50–70, 92–95
సిలెస్టియల్ రాజ్యములో నేను నిత్యజీవము పొందాలని నా పరలోక తండ్రి కోరుతున్నారు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:50–70, 92–95లో వివరించిన విధంగా మీరు సిలెస్టియల్ మహిమను పొందే వ్యక్తిగా మారగలరా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా లేదా ఆందోళన చెందారా? దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యమైనది అయినప్పటికీ, ఆయనలా మారేందుకు మనకు సహాయం చేయడానికి దేవుడు మన కోసం ఏమి చేసారు మరియు చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఈ వచనాలలో చూడడాన్ని పరిగణించండి. మీ ప్రయత్నాలు ఆయనకు ముఖ్యమైనవని మీరు ఎందుకు భావిస్తున్నారు?
సిలెస్టియల్ మహిమ యొక్క ఈ దర్శనము, మీ అనుదిన జీవితాన్ని మీరు జీవించాలని కోరే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
మోషే 1:39 కూడా చూడండి.
మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:24
మనమందరము దేవుని పిల్లలము.
-
మీ పిల్లలు వారి దైవిక సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడడానికి, మీరు వారికి పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల చిత్రాలను చూపించవచ్చు. అప్పుడు మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 76:24ని చదవవచ్చు మరియు మనమందరం “దేవుని కుమారులు మరియు కుమార్తెలం” అని తెలుసుకోవడంలో మీరు ఎందుకు సంతోషంగా ఉన్నారో ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:5, 41–42, 69
యేసు క్రీస్తు నా రక్షకుడు.
-
“యేసు క్రీస్తు నా కోసం ఏమి చేసారు?” అని ఎవరైనా అడిగే దృష్టాంతమును మీ పిల్లలు నటించి చూపడాన్ని పరిగణించండి. మీరు, మీ పిల్లలు 76వ ప్రకరణములోని 5, 41–42, లేదా 69 వచనములలో సాధ్యమైన జవాబుల కొరకు చూడవచ్చు. రక్షకుడు మన కోసం చేసిన దానికి మన కృతజ్ఞతను మనం ఎలా చూపగలము?
Suffer the Children [పిల్లలను రానివ్వండి] నుండి వివరణ, జె. కర్క్ రిఛర్డ్స్ చేత
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:62
ఆయనతో శాశ్వతంగా జీవించడానికి తిరిగి వెళ్ళాలని పరలోక తండ్రి నన్ను కోరుతున్నారు.
-
మీరు మరియు మీ పిల్లలు “అధ్యాయము 26: పరలోకము యొక్క మూడు రాజ్యములు” లో కొంతభాగం లేదా మొత్తం చదవవచ్చు లేదా చూడవచ్చు మరియు జోసెఫ్ స్మిత్‌కు వచ్చిన దర్శనము గురించి మీరు ఇష్టపడే వాటిని ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. సిలెస్టియల్ రాజ్యంలో పరలోక తండ్రితో కలిసి జీవించడం ఎలా ఉంటుందనే దాని గురించి మీ పిల్లలను వారి ఆలోచనలు మరియు భావాలను పంచుకోనివ్వండి.
3:1జోసెఫ్, సిడ్నీలు పరలోకం గురించి నేర్చుకుంటారు: ఆయన పిల్లల కొరకు దేవుని దీవెనల గురించి ఒక దర్శనము
-
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 76:62 కూడా చదవవచ్చు మరియు సిలెస్టియల్ రాజ్యంలో పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుతో కలిసి తమ చిత్రాలను గీయమని మీ పిల్లలను ఆహ్వానించవచ్చు (ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీని చూడండి).
సిద్ధాంతము మరియు నిబంధనలు 76:12, 15–19, 114–16
లేఖనాలను అధ్యయనం చేయడం “దేవుని విషయాలను అర్థం చేసుకోవడానికి” నాకు సహాయం చేయగలదు.
-
జోసెఫ్ స్మిత్ మరియు సిడ్నీ రిగ్డన్‌లు సిద్ధాంతము మరియు నిబంధనలు 76లోని దర్శనాన్ని చూసినప్పుడు వారు ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి 15–19 వచనములను చదవమని మీరు మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. లేఖనాలను చదివేటప్పుడు మీరు ప్రేరణ పొందిన సమయం గురించి మీ పిల్లలకు చెప్పండి మరియు మీ పిల్లలకు అలాంటి అనుభవాలు ఉన్నాయా అని వారిని అడగండి.
మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.