యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2025 ఫిబ్రవరి
సంపూర్ణమైన మూలము నుండి సహాయం
మీరు ఎలాంటి పోరాటాలను ఎదుర్కొంటున్నా, మీరు ఆయన వైపు తిరిగినప్పుడు యేసు క్రీస్తు మీకు సహాయం చేస్తారు.
The Pattern [ది ప్యాటర్న్] జెనెట్ బౌరప్ చేత
ఒక సమయంలో లేదా మరొక సమయంలో మనందరికీ చిన్న సహాయం కావాలి. కొన్నిసార్లు పెద్ద సహాయం కావాలి. నిజం ఏమిటంటే, మీరు ఒంటరిగా వెళ్లడానికి ప్రయత్నించనప్పుడు సాధారణంగా జీవితం చాలా మెరుగ్గా సాగుతుంది.
యేసు క్రీస్తు మీకు కావలసిన సహాయం, నిరీక్షణ మరియు బలము యొక్క సంపూర్ణమైన మూలము. ఆయన మిమ్మల్ని మంచిగా మార్చడంలో కూడా సహాయపడగలరు—బహుశా మీరు సాధ్యం కాదని భావించిన మార్గాలలో కూడా.
హృదయము యొక్క మార్పు
దేవుడు మీ శత్రువుల హృదయాలను మృదువుగా చేయగలుగునట్లు మీరు ఎప్పుడైనా ప్రార్థించారా? అలా అయితే, మీరు మంచి సహవాసములో ఉన్నారు (3 నీఫై 12:44 ; మొరోనై 7:48 చూడండి). అదే మోర్మన్ గ్రంథము యొక్క భావములో మీకు శత్రువులు లేకపోయినా (ఆయుధాలు ధరించి దాడికి సిద్ధంగా ఉన్న శత్రువులు), బహుశా మీతో మంచిగా ప్రవర్తించని వారి హృదయాన్ని మృదువుగా చేయమని మీరు దేవుడిని ప్రార్థించియుండవచ్చు.
అయితే మీ హృదయాన్ని మృదువుగా చేయగలుగునట్లు దేవుడిని ప్రార్థించాలని మరియు అడగాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరినైనా క్షమించడం మీకు చాలా కష్టంగా ఉండవచ్చు. లేదా మీరు కోరుకోనప్పటికీ, మీరు మీ నిగ్రహాన్ని కోల్పోతూ ఉండవచ్చు. లేదా మీ తోబుట్టువులు కొన్నిసార్లు మిమ్మల్ని బాధపెడుతున్నప్పటికీ మీరు వారి పట్ల మరింత దయ చూపాలని కోరుకోవచ్చు.
“[యేసు క్రీస్తు] మీ హృదయాన్ని మరియు మీ జీవితాన్ని మారుస్తారు. కొద్ది కొద్దిగా, మీరు ఎదుగుతారు మరియు మరింతగా ఆయన వలె మారతారు. ఆయనతో మీ నిబంధన సంబంధం ఆయన శక్తికి మీకు ఎక్కువ ప్రాప్తిని తెస్తుంది” (For the Strength of Youth: A Guide for Making Choices [2022], 8, ఉద్ఘాటన జోడించబడింది).
అది ఒక గొప్ప వాగ్దానం కాదా? మీరు దేనితో పోరాడుతున్నా, మీ స్వంత హృదయంతో పోరాడుతున్నప్పటికీ, యేసు క్రీస్తు మీకు సహాయం చేయగలరు. ఈ దినము మీరు దేవుని వైపు ఎలా తిరుగగలరు?
© 2025 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly For the Strength of Youth Message, February 2025 యొక్క అనువాదము. Telugu. 19621 421