“ప్రథమ అధ్యక్షత్వము నుండి సందేశము,” యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గదర్శి (2022)
“ప్రథమ అధ్యక్షత్వము నుండి సందేశము,” యౌవనుల బలము కొరకు
ప్రథమ అధ్యక్షత్వము నుండి సందేశము
మా ప్రియమైన యువ సహోదర మరియు సహోదరీలారా,
మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము మరియు మీపై మాకు నమ్మకం ఉంది. మీరు నిజంగా పరలోక తండ్రి ఎంపిక చేసుకున్న ఆత్మలలో ఉన్నారు, ఈ సమయంలో ముఖ్యమైన కార్యములు చేయడానికి భూమికి పంపబడ్డారు.
మీరు బలంగా లేదా సామర్థ్యంగా లేరని భావించే సందర్భాలు ఉండవచ్చు. అది సాధారణమే. ముఖ్యంగా ఆ క్షణాల్లో, రక్షకుని వైపు తిరగండి. ఆయనే “యౌవనుల బలము.”
నిబంధనా మార్గంలో ఉండేందుకు ఎంపిక చేయడానికి, బలమైన పునాదిని నిర్మించడంలో ఈ మార్గదర్శక పుస్తకం మీకు సహాయం చేస్తుంది. దేవాలయంలో పవిత్రమైన నిబంధనలను చేయడానికి, సువార్త సేవచేయుటకు సిద్ధపడటానికి మరియు మీ జీవితమంతా యేసు క్రీస్తు వారిని అనుసరించడంలో ఆనందాన్ని పొందేందుకు ఇది మీకు సహాయం చేస్తుంది. మీరు రక్షకుని సంఘానికి చెందినవారని మరియు మీ పట్ల ఆయన ఉద్దేశ్యాలను నెరవేర్చడానికి ఆయన నుండి శక్తిని పొందినట్లు మీరు భావిస్తారని మేము ఆశిస్తున్నాము.
దేవుడు జీవిస్తున్నాడని మనకు తెలుసు. మీ పరలోక తండ్రి వద్దకు తిరిగి వెళ్ళే నిబంధన మార్గంలో మీరు దృఢంగా ఉండాలనేది మా ప్రార్థన. మీరు అలా చేసినప్పుడు, మీరు మంచి కొరకు ఒక ప్రభావంగా ఉంటారు, సువార్తను ఆనందంగా పంచుకుంటారు మరియు రక్షకుని రెండవ రాకడ కోసం ప్రపంచాన్ని సిద్ధం చేస్తారు.
ప్రథమ అధ్యక్షత్వము