“జూన్ 8–14. ‘యెహోవా హృదయమును లక్ష్యపెట్టును’: 1 సమూయేలు 8–10; 13; 15-16,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)
“జూన్ 8–14. ‘యెహోవా హృదయమును లక్ష్యపెట్టును,’” రండి, నన్ను అనుసరించండి: పాత నిబంధన 2026
Beside Still Waters [నిశ్చల జలముల ప్రక్కన], సైమన్ డ్యూయీ చేత
జూన్ 8–14: “యెహోవా హృదయమును లక్ష్యపెట్టును”
1 సమూయేలు 8–10; 13; 15–16
సౌలు గార్దబములను మేపువాడు. బహు సౌందర్యముగల యౌవనుడైనప్పటికీ, “[అతని] దృష్టికి అతడు అల్పునిగా నుండెను” మరియు తన కుటుంబ వారసత్వం గురించి స్వీయ-చింతన కలిగియుండెను (1 సమూయేలు 9:2–3, 21; 15:17 చూడండి). ఇశ్రాయేలీయుల ముందు వారి రాజుగా హాజరు కావాల్సిన రోజున అతడు కనిపించలేదు; అతడు చాలా భయపడి “తనను తాను దాచుకున్నాడు” (1 సమూయేలు 10:21-22). సౌలును చూస్తే, అతను ఇశ్రాయేలీయులను వారి శత్రువులపై విజయానికి నడిపిస్తాడని లేదా తర్వాత అతడు గర్విష్ఠుడై యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడని మీరు ఊహించి ఉండకపోవచ్చు.
దావీదు ఒక గొర్రెల కాపరి. అతడు తన ఏడుగురు అన్నల వలె శారీరకంగా ఆకట్టుకునేవాడు కాదు. ఇశ్రాయేలుకు కొత్త రాజును ఎన్నుకోవడానికి సమూయేలు వచ్చిన రోజున, సాధ్యమైన అభ్యర్థులలో దావీదును చేర్చడం విలువైనదిగా అనిపించలేదు, కాబట్టి అతను గొర్రెలతో పొలాల్లో వదిలివేయబడ్డాడు. దావీదును చూస్తే, అతను ఒక రాక్షసుడిని ఓడించి ఇశ్రాయేలులో అత్యంత విజయవంతమైన రాజుగా మారగల విశ్వాసం మరియు ధైర్యం కలిగియుంటాడని మీరు ఊహించి ఉండకపోవచ్చు.
కానీ ప్రభువు మన పేరులను, మన భౌతిక రూపాన్ని, మన అభద్రతలను లక్ష్యపెట్టరు. బదులుగా ఆయన, “హృదయాన్ని లక్ష్యపెట్టును” (1 సమూయేలు 16:7) మరియు మన హృదయం సరిగ్గా లేనప్పటికీ, మనం ఇష్టపడితే, ఆయన మనకు “క్రొత్త మనస్సును” అనుగ్రహిస్తారు (1 సమూయేలు 10:9).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
1 సమూయేలు 8
యేసు క్రీస్తు నా రాజు.
1 సమూయేలు 8 ఇశ్రాయేలీయుల భవితవ్యాన్ని శాశ్వతంగా మార్చే ఒక సంఘటన గురించి చెబుతుంది. తమ శత్రువుల నుండి రక్షణ కోసం, ఇశ్రాయేలీయులు తమ పొరుగువారి వద్ద ఉన్నట్లుగా—తమను పరిపాలించడానికి ఒక రాజును కోరుకున్నారు. వారి అభ్యర్థన మరియు ప్రభువు యొక్క ప్రతిస్పందన గురించి మీరు చదువుతున్నప్పుడు, భద్రత మరియు మార్గదర్శకత్వం కోసం మీరు ఎవరి వైపు చూస్తున్నారో ఆలోచించండి. ప్రభువు “[మిమ్మల్ని] ఏలుటకు” (1 సమూయేలు 8:7) అనుమతించుట అంటే ఏమిటో పరిగణించండి.
రాబోయే వారాల్లో, మీరు ఇశ్రాయేలుకు నాయకత్వం వహించడానికి పిలువబడిన అనేకమంది రాజుల గురించి చదువుతారు. మీరు వారి గురించి తెలుసుకున్నప్పుడు, ఈ క్రింది ప్రశ్నలను పరిగణించండి:
-
1 సమూయేలు 8:10–18 లోనున్న ప్రభువు హెచ్చరికలు ఎలా నెరవేరాయి?
-
ఇశ్రాయేలీయులు భూసంబంధమైన రాజును కలిగి ఉండాలనే వారి ఎంపిక ద్వారా ఎలా ప్రభావితమయ్యారు?
-
యేసు క్రీస్తు భూలోక రాజుల నుండి ఎలా భిన్నంగా ఉన్నారు? మీ రాజుగా ఉండేందుకు క్రీస్తును అనుమతించడానికి మీరు మీ జీవితం నుండి ఏ ప్రాపంచిక ప్రభావాలను తీసివేయవలసి ఉంటుందో పరిగణించండి.
1 సమూయేలు 9–10; 16:1–13
ఆయన రాజ్యములో సేవ చేయడానికి ప్రవచనము ద్వారా దేవుడు జనులను పిలుస్తారు.
దేవుడు ఇశ్రాయేలు యొక్క రాజులను ఎలా ఎంచుకున్నారనే దాని గురించి 1 సమూయేలు 9–10 మరియు 16లో చదవండి (ప్రత్యేకించి 9:15–17; 10:1–12; 16:1–13 చూడండి). ఈ రోజుల్లో ప్రభువు యొక్క సంఘములో “దేవుని వలన, ప్రవచనము చేత పిలువబడడం” అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడే గద్యభాగాల కోసం చూడండి (విశ్వాస ప్రమాణాలు 1:5). పిలుపును ఇచ్చే నాయకుడి స్థానంలో (సమూయేలు), పిలువబడే వ్యక్తి స్థానంలో (సౌలు మరియు దావీదు) మరియు వారు సేవ చేయడానికి పిలువబడే వ్యక్తుల (ఇశ్రాయేలీయులు) స్థానంలో మిమ్మల్ని మీరు ఉంచుకోవడాన్ని మీరు పరిగణించవచ్చు. ఈ అధ్యాయాలలో వారి మాటలు మరియు క్రియల నుండి మీరేమి నేర్చుకుంటారు?
సౌలును అభిషేకిస్తున్న సమూయేలు యొక్క వివరణ, పి. మన్ చేత, © Lifeway Collection/licensed from goodsalt.com
1 సమూయేలు 13:5–14; 15
“బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుట శ్రేష్ఠము.”
1 సమూయేలు 10లో సౌలు ఎంత పిరికివాడిగా కనిపించాడో పరిశీలిస్తే, అతను రాజు అయిన తర్వాత అతని “తిరుగుబాటు” మరియు “మొండితనం” గురించి చదవడం ఆశ్చర్యంగా ఉంటుంది (1 సమూయేలు 15:23). ఇది ఎందుకు జరిగిందని మీరనుకుంటున్నారు? 1 సమూయేలు 13:5–14లో, అతని పతనానికి దారితీసిన ఏ వైఖరులు మరియు ప్రవర్తనలను మీరు చూస్తున్నారు?
1 సమూయేలు 15లో, ప్రభువు నుండి వచ్చిన ఒక ఆజ్ఞను సౌలు గైకొనలేదని మీరు చదువుతారు, ఎందుకంటే అతనికి తగిన కారణముందని అతడు భావించాడు. సౌలు యొక్క పేలవమైన ఎంపికల నుండి నేర్చుకునేందుకు, 22వ వచనమును చూడండి మరియు “బలి” మరియు “పొట్టేళ్ల క్రొవ్వు” అనే పదాలను ప్రభువును వినడం మరియు విధేయత చూపడం వంటి ముఖ్యమైన పదాలతో కాకుండా, మంచిగా అనిపించే వాటితో భర్తీ చేయండి. మీ జీవితంలో ప్రభువు చిత్తానికి మొదటి స్థానం ఇచ్చినందున మీరు ఎలా ఆశీర్వదించబడ్డారు?
1 సమూయేలు 16:6–12
“యెహోవా హృదయమును లక్ష్యపెట్టును”
దేని గురించైనా లేదా ఎవరి గురించైనా మీరు “బాహ్య రూపం”పై ఆధారపడి ఎప్పుడైనా నిర్ణయం తీసుకొని, మీరు తప్పు చేసారని తెలుసుకున్నారా? బహుశా కనిపించినంత మంచిది కానిది ఏదైనా మీరు తిన్నారేమో. లేదా మీరు ఎవరినైనా అన్యాయంగా తీర్పు తీర్చారేమో.
ఇశ్రాయేలు యొక్క కొత్త రాజు కోసం సమూయేలు వెదుకుతున్నప్పుడు, ప్రభువు అతనికి మంచి మార్గాన్ని నేర్పించారు. దాని గురించి 1 సమూయేలు 16:6–7లో చదవండి మరియు “బాహ్య రూపాన్ని బట్టి” జనులు ఇతరులను తీర్పు తీర్చే మార్గాల జాబితాను రూపొందించడాన్ని పరిగణించండి. ఎల్డర్ క్రిస్టోఫ్ జి. గిరాడ్-క్యారియర్ గారి సందేశము, “మనం ఆయన బిడ్డలము,” (లియహోనా, నవ. 2023, 114-16) లో మీరు కొన్ని ఉదాహరణలను కనుగొనగలరు. ప్రభువు చేసినట్లుగా “హృదయమును” లక్ష్యపెట్టుట అనగా అర్థమేమిటి? (1 సమూయేలు 16:7). మీరు ఎల్డర్ గిరాడ్-క్యారియర్ గారి సందేశంలో దీనికి కూడా ఉదాహరణలను కనుగొనవచ్చు. రక్షకుడు ఒక వ్యక్తి యొక్క బాహ్య రూపాన్ని దాటి చూసిన ఇతర సమయాల గురించి మీరు ఆలోచించవచ్చు. (ఉదాహరణకు, మార్కు12:41–44; లూకా 5:1–11; 19:1–9; యోహాను 4:5–30; మోషే 6:31–36 చూడండి.) ఈ మాదిరుల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
మీరు ఇతరులను—మిమ్మల్ని మీరు చూసే విధానములో క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించగలరా? ఆవిధంగా చేయడం ఇతరులతో మీ పరస్పర చర్యలను ఎలా ప్రభావితం చేస్తుంది? మీరు వారి హృదయంలో చూసే మంచితనం గురించి ఎవరికైనా చెప్పడాన్ని పరిగణించండి.
యులిసెస్ సోవారెస్, “క్రీస్తు నందు సహోదర సహోదరీలు,” లియహోనా, నవ. 2023, 70–73 కూడా చూడండి.
అధికము కొరకు, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
1 సమూయేలు 8
యేసు క్రీస్తు నా రాజు.
-
మీరు మీ పిల్లలతో కలిసి 1 సమూయేలు 8 చదువుతున్నప్పుడు, ఒక రాజును కలిగియుండడం చెడ్డ ఆలోచన అని సమూయేలు ఇశ్రాయేలీయులకు చెప్పిన కారణాలను కనుగొనడంలో వారికి సహాయపడండి. యేసు క్రీస్తును మన రాజుగా కలిగియుండడం ఎందుకు మంచిది? బహుశా మీరు కలిసి ఒక కాగితపు కిరీటాన్ని తయారు చేసి, దానిని ధరించి, యేసు మన రాజుగా ఉండాలని మనము కోరుకుంటున్నామని చూపించడానికి మనము చేయగలిగినదాన్ని పంచుకోవచ్చు. (యిర్మీయా 23:5; సిద్ధాంతము మరియు నిబంధనలు 45:59 కూడా చూడండి.)
1 సమూయేలు 8:6; 9:15–17; 10:1–24; 16:1–13
సంఘంలో సేవ చేసే వారు దేవుని చేత పిలువబడ్డారు.
-
దేవుడు సౌలు మరియు దావీదులను రాజులుగా ఎన్నుకోవడం గురించిన వృత్తాంతాలు ఈ రోజు సంఘములో సేవ చేయడానికి జనులు బయల్పాటు ద్వారా ఎలా పిలువబడుతున్నారో అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడగలవు. వారికి ఈ కథలను బోధించడానికి, మీరు కథల నుండి సంఘటనలను కాగితపు ముక్కలపై వ్రాయవచ్చు మరియు మీరు లేఖన గద్యభాగాలను కలిసి చదివేటప్పుడు మీ పిల్లలు వాటిని సరైన క్రమంలో ఉంచవచ్చు (పాత నిబంధన కథలు, 110–11లోని “యౌవనుడైన దావీదు” కూడా చూడండి). అప్పుడు మీరు ఒక నియామకమును లేదా పిలుపును నెరవేర్చడానికి దేవుడు మీకు ఆధ్యాత్మిక శక్తిని అనుగ్రహించిన సమయాల గురించి మాట్లాడవచ్చు (1 సమూయేలు 10:9–10 చూడండి).
1:16Young David
-
ఐదవ విశ్వాస ప్రమాణాన్ని మీ పిల్లలకు బోధించడానికి ఇది మంచి సమయం కావచ్చు. సంఘములో మీ పిలుపును మీరు ఎలా పొందారో వారికి చెప్పండి. మీరు దేవునిచే పిలువబడ్డారని మీకు ఎలా తెలుసు?
The Prophet Samuel Anoints David to Be King of Israel in Bethlehem [ప్రవక్తయైన సమూయేలు బెత్లేహేములో ఇశ్రాయేలీయుల రాజుగా దావీదును అభిషేకించాడు], బాలగే బలోగ్ చేత
1 సమూయేలు 16:1–13
యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
-
1 సమూయేలు 16:7లోని సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఒక వస్తు పాఠం మీ పిల్లలకు సహాయపడగలదు. ఉదాహరణకు, దానిలోపల ఉన్న విషయంతో సరిపోల్చలేని ముసుగు లేదా ఆచ్ఛాదనంతో కూడిన కొంత ఆహారాన్ని లేదా పుస్తకాన్ని మీరు వారికి చూపించవచ్చు. మనల్ని మరియు ఇతర వ్యక్తులను మనం ఎలా చూడాలి అనే దాని గురించి 1 సమూయేలు 16:7 మరియు ఈ వస్తు పాఠం ఏమి సూచిస్తున్నాయి?
వస్తు పాఠములను ఉపయోగించండి. మీ పిల్లలు సువార్త సూత్రానికి సంబంధించి చూడడానికి మరియు తాకడానికి ఏదైనా కలిగి ఉన్నప్పుడు, వారు దానిని గుర్తుంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, మీరు వారితో కలిసి 1 సమూయేలు 16:7 చదివినప్పుడు, “బాహ్య రూపం” ఆధారంగా చేసే తీర్పులకు బదులుగా—“హృదయమును లక్ష్యపెట్టి”—ప్రభువు చూసినట్లుగా చూడటానికి మనం ప్రయత్నించాల్సిన అంశాన్ని వివరించడానికి దృశ్యసంబంధమైన భ్రమల ఉదాహరణలను కనుగొనడంలో వారిని మీకు సహాయపడనివ్వండి.
-
“పై రూపమును” మాత్రమే కాకుండా (7వ వచనము) మీరు “హృదయాన్ని ఎందుకు లక్ష్యపెట్టాలని” నేర్చుకున్న అనుభవాలను మీరు మరియు మీ పిల్లలు పంచుకోవచ్చు. మీరు ఒకరి హృదయాల్లో మరొకరు చూసే మంచి లక్షణాల గురించి వంతులవారీగా ఒకరికొకరు చెప్పుకోవచ్చు.
అధికము కొరకు, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.