2025
ఈ జీవితం తర్వాత: కొన్ని ప్రశ్నలకు జవాబులు
2025 జూలై


యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2025 జూలై

జీవితం తర్వాత

కొన్ని ప్రశ్నలకు జవాబులు

పరలోక తండ్రి యొక్క ప్రణాళిక మరణము తరువాత జీవితం గురించి మనకు దృష్టికోణమును మరియు శాంతిని ఇస్తుంది.

మేఘాలలో ఒక నిచ్చెన

థామస్ ఆర్నాడ్ చేత వివరణ

మనం మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది?

ఇది అన్ని మతాలలోని ప్రశ్న కావచ్చు. యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త ద్వారా మనం కలిగియున్న జవాబులు శక్తివంతమైనవి. ఈ జీవితం అంతము కాదు. యేసు క్రీస్తు పునరుత్థానము చెందారు కనుక, మన శరీరాలతో మన ఆత్మలు ఏకమవుతాయి మరియు మనమందరం ఒకరోజు పునరుత్థానము చెందుతాము.

నిజానికి, మరణము తరువాత జీవితం గురించిన ఇతర వివరాలు మనకు ఆధునిక బయల్పాటు ద్వారా వచ్చాయి, అవి మనకు ఎదురయ్యే ఇతర ప్రశ్నలకు జవాబివ్వగలవు. ఇక్కడ అటువంటి కొన్ని ప్రశ్నలున్నాయి, వాటితోపాటు కొన్ని క్లుప్తమైన జవాబులు ఉన్నాయి.

ఆత్మ శరీరాలు ఎలా ఉంటాయి?

ఆత్మ అనేది ఒక రకమైన పదార్ధము, కేవలము “మరింత సున్నితమైనది లేదా శుద్ధమైనది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 131:7). ఆత్మ శరీరాలు వయోజన మానవ శరీరాల వలే కనిపిస్తాయి.

ఆత్మ లోకము ఎక్కడున్నది?

ఇక్కడే, మన చుట్టూ ఉన్నది.

ఆత్మ లోకంలో ఏం జరుగుతుంది?

మిగిలిన విషయాలతోపాటు, సువార్తను అంగీకరించిన ఆత్మలు సువార్తను అంగీకరించని ఆత్మలకు సువార్తను ప్రకటించడానికి ఏర్పాటు చేయబడతాయి. ఆ ఆత్మలు దానిని అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి ఎంచుకోవచ్చు.

పునరుత్థానం చెందిన శరీరాలు ఎలా ఉంటాయి?

పునరుత్థానం చెందిన శరీరాలు, మాంసము, ఎముకలు గలవి, మరియు పరిపూర్ణమైనవి. అవి మహిమకరమైనవి మరియు అందమైనవి. “పునరుత్థానము చెందిన పురుషుడు లేదా స్త్రీ కంటే చూడటానికి అందమైనది మరొకటి లేదు.”

సిలెస్టియల్ రాజ్యములో ఏం జరుగుతుంది?

సిలెస్టియల్ రాజ్యములో అత్యున్నత స్థాయిలో ఉన్నవారు మన పరలోక తండ్రిలా మారి, సంపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తారు. వారు తండ్రి కలిగియున్న సమస్తమును వారసత్వముగా పొందుతారు. వారు ఆయన కార్యము మరియు మహిమలో పాల్గొంటారు. వారు నిత్యత్వము కొరకు వివాహములో బంధింపబడ్డారు మరియు ఇప్పుడు, వారు తమ స్వంత నిత్య ఆత్మ పిల్లల్ని కలిగియుండి, ఆత్మ కుటుంబాలుగా జీవిస్తున్నారు.

ఈ జీవితంలో వివాహం చేసుకోని వ్యక్తుల సంగతేమిటి?

పరలోక తండ్రి పరిపూర్ణంగా న్యాయవంతుడు మరియు కనికరముగలవాడు. “వారి నిబంధనలకు యధార్ధంగా ఉండి, సరైన దానిని కోరుకొని, ఆజ్ఞలను పాటించిన ఆయన కుమారులు మరియు కుమార్తెలకు నిత్యత్వములో ఏ ఆశీర్వాదము నిరాకరించబడదని ప్రభువు వాగ్దానము చేసారు.”

మా తల్లిదండ్రులు దేవాలయంలో ముద్రింపబడ్డారు, కానీ ఇప్పుడు వారు విడాకులను పొందారు. నేను ఎవరితో ముద్రింపబడతాను?

మీరు “నిబంధనలో జన్మించి” యుండవచ్చు (మీరు తల్లిదండ్రులు దేవాలయంలో ముద్రింపబడిన తరువాత జన్మించారు), లేదా వారు ఒకరినొకరితో ఒకరు ముద్రింపబడిన తరువాత దేవాలయంలో మీ తల్లిదండ్రులకు మీరు ముద్రింపబడియుండవచ్చు. రెండు సందర్భాల్లోనూ, మీ తల్లిదండ్రులు విడాకులు తీసుకోవాలని ఎంపిక చేసినప్పటికిని, మరియు వారి ముద్రణ రద్దు చేయబడినా కూడా మీ ఆశీర్వాదాలు అమలులో ఉంటాయి.

మీ తల్లిదండ్రుల ఎంపికలు మీ దీవెనలను ప్రభావితం చేయవు. మీకు ముఖ్యమైన విషయమేదనగా మీకై మీరు విశ్వాసంగా నిలిచియుండి, దేవాలయ దీవెనలను వెదకుట. మీ కుటుంబ అనుబంధాలు విషయానికొస్తే, మీరు “ప్రతి వ్యక్తి అతడు లేక ఆమె తన కోరికలు మరియు ఎంపికలు అనుమతించే ప్రతి దీవెనను పొందేలా పరలోక తండ్రి నిశ్చయపరుస్తారని” తెలుసుకొని “ప్రభువునందు నమ్మకముంచి ఆయన ఓదార్పును వెదకాలి.”

ఆత్మహత్య ద్వారా చనిపోయిన జనులకు ఏం జరుగుతుంది?

ఆత్మహత్య ద్వారా చనిపోయిన జనులకు ఏం జరుగుతుందో మనకు తెలియదు, మరియు మనం వారికి (చివరికి, అందరిలాగే) తీర్పు చెప్పలేము. “ప్రియమైన వారు, నాయకులు, మరియు నిపుణుల యొక్క శ్రేష్ఠమైన ప్రయత్నాలు ఉన్నప్పటికినీ, ఆత్మహత్యను ఎల్లప్పుడూ నివారించలేము. …

“ఒక వ్యక్తి అతడు లేదా ఆమె తన ప్రాణమును తానే తీసుకోవడం సరైనది కాదు అయినప్పటికినీ, దేవుడు వ్యక్తుల ఆలోచనలు, క్రియలు మరియు జవాబుదారిత్వ స్థాయిలను తీర్పు తీర్చగలడు (1 సమూయేలు 16:7; సిద్ధాంతము మరియు నిబంధనలు 137:9) చూడండి). …

“ఆత్మహత్య కారణంగా ప్రియమైన వారిని కోల్పోయిన వారు యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు నిరీక్షణను మరియు స్వస్థతను కనుగొనగలరు.”