2025
నేను నిజంగా పశ్చాత్తాపపడ్డానని మరియు క్షమించబడ్డానని ఎలా తెలుసుకోగలను?
2025 జూన్


యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2025 జూన్

నేను నిజంగా పశ్చాత్తాపపడ్డానని మరియు క్షమించబడ్డానని ఎలా తెలుసుకోగలను?

ప్రార్థిస్తున్న యువతి

Coming Full Circle[అసలు స్థితికి తిరిగి రావడం], జెనెడీ పేజ్ చేత

ప్రభువు ఇలా చెప్పారు: “ఎవడైతే తన పాపములకు పశ్చాత్తాపపడునో వాడు క్షమించబడును, ప్రభువైన నేను వాటిని ఇక జ్ఞాపకముంచుకొనను.

“ఒక మనుష్యుడు తన పాపములను ఒప్పుకొని, వాటిని విడిచిపెట్టుటను బట్టి అతడు పశ్చాత్తాపపడెనని మీరు తెలుసుకొందురు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 58:42–43).

హృదయపూర్వకమైన పశ్చాత్తాపం ద్వారా, మనం క్షమాపణ పొందవచ్చు. “మీరు ఆత్మ నుండి ఆదరణను అనుభవించినప్పుడు, రక్షకుని యొక్క ప్రాయశ్చిత్త శక్తి మీ జీవితంలో పనిచేస్తుందని మీరు తెలుసుకోవచ్చు.” మరియు మనం మళ్ళీ తప్పు చేస్తే, మనం మళ్ళీ పశ్చాత్తాపపడవచ్చు, క్షమించబడవచ్చు మరియు ప్రయత్నిస్తూనే ఉండవచ్చు.

అదనంగా, పన్నెండుమంది అపొస్తలుల సమూహములోని ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ ఇలా బోధించారు: “మన పాపాలు క్షమించబడలేదని సాతాను మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తాడు, ఎందుకంటే మనం వాటిని గుర్తుంచుకోగలము. సాతాను అబద్ధికుడు. … మనం మన పాపాలను గుర్తుంచుకోమని దేవుడు వాగ్దానం చేయలేదు. గుర్తుంచుకోవడం వలన మనం మళ్లీ అదే తప్పులు చేయకుండా సహాయపడుతుంది. అయితే మనం యథార్థముగా మరియు విశ్వసం కలిగిన వారిలా ఉంటే, మన పాపాల జ్ఞాపకము కాలక్రమేణా మృదువుగా మారుతుంది.”