2024
జననము
2024 డిసెంబరు


యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2024 డిసెంబరు

జననము

ఈ సుపరిచితమైన క్రిస్మస్ దృశ్యం మరియు రక్షకునిపై దృష్టి కేంద్రీకరించడానికి ఇది మనకు ఎలా సహాయపడుతుందనే దాని గురించి తెలుసుకోండి.

బేత్లెహేము

కారోలైన్ విబ్బర్ట్ చేత వివరణలు

బేత్లెహేము

బేత్లెహేము అనగా హీబ్రూలో “ఆహారము కలిగియున్న గృహము” అని అర్థం. దీనిని కొన్నిసార్లు దావీదు పట్టణము అని పిలుస్తారు, ఆయన వంశం నుండి మెస్సీయ వచ్చునని ప్రవచించబడింది (యిర్మీయా 23:5; యోహాను 7:42 చూడండి). సమూయేలు బేత్లెహేములో దావీదును రాజుగా అభిషేకించాడు (1 సమూయేలు 16:1–13 చూడండి). అక్కడ మెస్సీయ పుడతాడని ప్రవచించబడింది (మీకా 5:2 చూడండి).

సత్రము

సత్రము

సత్రము అనే గ్రీకు పదానికి అతిథి గృహము లేదా ఏదైనా తాత్కాలిక బస అని అర్థం. మరియ “సత్రములో వారికి స్థలము లేనందున, [శిశువైన క్రీస్తును] పశువుల తొట్టిలో పరుండబెట్టెను” (లూకా 2:7). (జోసెఫ్ స్మిత్ అనువాదం “సత్రములు” అని చెబుతుంది.) “స్థలము లేనందున” అంటే వారు పంపివేయబడ్డారని లేదా వారు బస చేసిన ఏ ప్రదేశంలోనైనా బిడ్డను ప్రసవించే స్థలం లేదని అర్థం. ఏది ఏమైనప్పటికీ, వారు ఒక పశువుల తొట్టి ఉన్న చోటికి వెళ్లారు.

జనన దృశ్యం

పశువుల తొట్టి

పశువుల తొట్టి అనేది జంతువులకు ఆహారాన్ని ఉంచే ఒక ఎత్తైన పెట్టె లేదా తొట్టి. ప్రాచీన యూదయలో, ఇవి ఎక్కువగా రాతితో తయారు చేయబడ్డాయి. జంతువులను రాత్రిపూట ఉంచేందుకు వీలుగా, సత్రాలు పశువుల తొట్టిలతో కూడిన కేంద్రీయ ప్రాంగణాలు కలిగి ఉన్నాయి మరియు చాలా గృహాలు కూడా పెద్ద ప్రధాన గదులలో పశువుల తొట్టిలను కలిగి ఉన్నాయి.

పొత్తి గుడ్డలు

తల్లులు వేల సంవత్సరాలుగా నవజాత శిశువులను పొత్తిగుడ్డలతో చుట్టేవారు (వారిని దుప్పటి లేదా గుడ్డలో చుట్టడం). ఇది గర్భాన్ని విడిచిన కలత తర్వాత వారిని ప్రశాంతపరుస్తుంది మరియు ఓదార్చుతుంది. మరియ ఉపయోగించిన వస్త్రం కుటుంబానికి విశేషమైన ప్రత్యేక గుర్తును కలిగి ఉండవచ్చు.

మరియ మరియు యోసేపు

వారు మంచివారు మరియు నీతిమంతులు, మరియు ఇద్దరూ దావీదు సంతతివారు. రక్షకుని జననానికి సన్నాహకంగా ప్రతి ఒక్కరినీ ఒక దేవదూత సందర్శించారు (మత్తయి 1:18–25; లూకా 1:26–38 చూడండి). వారు బేత్లెహేముకు 100–140 కి.మీ. (60–90 మైళ్లు) ప్రయాణించారు. ఆ ప్రయాణ సమయంలో మరియ గర్భవతి.

గొఱ్ఱెల కాపరులు

గొఱ్ఱెల కాపరులు

బేత్లెహేము దగ్గర గొర్రెల కాపరులు తమ మందలను మేపుతున్నారు. కొంతమంది పండితుల ప్రకారం, ఆలయ బలి కోసం ఉద్దేశించిన గొర్రెలను మాత్రమే ఒక పట్టణానికి సమీపంలో పెంచడానికి అనుమతించబడింది. కాబట్టి ఈ గొర్రెల కాపరులు మన కోసం యేసు క్రీస్తు యొక్క త్యాగాన్ని సూచించే గొర్రెలను మేపుతూ ఉండవచ్చు (మోషే 5:6–7 చూడండి). మెస్సీయను చూడడానికి వారు తమ మందలను విడిచిపెట్టారు, ఆయన ప్రాయశ్చిత్త త్యాగం జంతు బలిని తొలగిస్తుంది.

శిశువైన క్రీస్తు

యేసు క్రీస్తు, జనన దృశ్యం యొక్క ప్రధాన వ్యక్తి—మరియు మన జీవితాలకు కూడా.

వివరణలు

  1. జోసెఫ్ స్మిత్ అనువాదము, లూకా 2:7 (లూకా 2:7 లో, పాదవివరణ ).

  2. See Andy Mickelson, “An Improbable Inn: Texts and Tradition Surrounding Luke 2:7,” Studia Antiqua vol. 14, no. 1 (May 2015).

  3. See Andy Mickelson, “An Improbable Inn.”

  4. See Russell M. Nelson, “The Peace and Joy of Knowing the Savior Lives,” Liahona, Dec. 2011, 19–20.చూడండి.

  5. See Alfred Edersheim, The Life and Times of Jesus the Messiah, 8th ed. (1907), 1:186.