“బాబేలు గోపురము,” పాత నిబంధన కథలు (2022)
“బాబేలు గోపురము,” పాత నిబంధన కథలు
ఆదికాండము 11
బాబేలు గోపురము
పరలోకానికి మార్గం నిర్మించడానికి ప్రయత్నిస్తున్న జనులు
జలప్రళయము తరువాత, జనులు దేవునికి అవిధేయులు కాసాగారు. వారిలో కొందరు దేవుని ప్రణాళికను నమ్మలేదు. దేవుని అడగకుండా, పరలోకం చేరడానికి వారు ఒక గోపురాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. అది బాబేలు గోపురముగా పిలువబడు అసత్య దేవాలయము.
ఆదికాండము 11:4, 9
జనులు ఆ గోపురాన్ని నిర్మిస్తున్నందుకు దేవుడు సంతోషంగా లేడు. వారు ఒకరినొకరు అర్థం చేసుకోలేనంతగా ఆయన వారి భాషను మార్చాడు. వారు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయినందున, వారు గోపుర నిర్మాణాన్ని ఆపవలసి వచ్చింది.
ఆదికాండము 11:6–8; ఈథర్ 1:33
దేవుడు జనులను చెదరగొట్టాడు మరియు భూమి అంతటా జీవించడానికి వారిని పంపించాడు.
ఆదికాండము 11:9