“ఎలీషా నయమానును స్వస్థపరచుట,” పాత నిబంధన కథలు (2022)
“ఎలీషా నయమానును స్వస్థపరచుట,” పాత నిబంధన కథలు
2 రాజులు 5
ఎలీషా నయమానును స్వస్థపరచుట
మామూలు విశ్వాసంతో గొప్ప అద్భుతం జరిగింది
దూరంగా సిరియాలో నయమాను అనే వ్యక్తి నివసించేవాడు. అతడు సిరియా సైన్యంలో గొప్ప సైన్యాధిపతి. కానీ నయమానుకు కుష్ఠురోగం అనే బాధాకరమైన చర్మవ్యాధి ఉండేది.
2 రాజులు 5:1
నయమాను భార్య యొక్క సేవకురాలు ఒక ఇశ్రాయేలు బాలిక. ఆ బాలిక ప్రభువునందు విశ్వాసము కలిగియుంది. నయమాను ప్రవక్తయైన ఎలీషాను దర్శించినట్లయితే, నయమాను వ్యాధి బాగుచేయబడుతుందని ఆమె చెప్పింది.
2 రాజులు 5:2–4
ఎలీషాను కనుగొనడానికి నయమాను చాలా దూరం ప్రయాణించాడు. గొప్ప అద్భుతంతో తాను బాగుచేయబడతానని నయమాను అనుకున్నాడు.
2 రాజులు 5:5–8
తన సేవకులు, గుర్రాలు, రథాలతో నయమాను ఎలీషా ఇంటికి వచ్చాడు. నయమానుకు ప్రభువు యొక్క సూచనలు ఇవ్వమని ఎలీషా తన సేవకుడిని పంపాడు. యొర్దాను నదిలో ఏడుసార్లు అతడు స్నానము చేసినట్లయితే, ప్రభువు నయమానును బాగుచేస్తారు.
2 రాజులు 5:9–10
నయమానుకు కోపం వచ్చింది, ఎందుకంటే ప్రభువు యొక్క ప్రవక్త బయటకు వచ్చి వెంటనే అతడిని బాగుచేయాలని అతను కోరుకున్నాడు. యొర్దాను నది సిరియాలో ఉన్న గొప్ప నదుల కంటే శ్రేష్ఠమైనదేమీ కాదని నయమాను ఫిర్యాదు చేసాడు.
2 రాజులు 5:11–12
కానీ, ఇంత సులువైన పనిని నయమాను ఎందుకు చేయడం లేదని నయమాను సేవకులు అడిగారు. నయమానుకు అది అర్థంలేనిదిగా అనిపించినప్పటికీ, ప్రభువు యొక్క ప్రవక్త దానిని చేయమని అతనికి చెప్పాడు.
2 రాజులు 5:13
నయమాను గర్వపడడం మానివేసి, తన సేవకుల మాట విన్నాడు. అతను ఏడుసార్లు యొర్దాను నదిలో స్నానం చేసాడు. అప్పుడు ఎలీషా చెప్పినట్లు ప్రభువు నయమానును బాగుచేసారు. ఎలీషా ఒక ప్రవక్త అని, ప్రభువు నిజంగా ఉన్నారని నయమాను తెలుసుకున్నాడు.
2 రాజులు 5:14–15