Old Testament 2022
చిన్న పిల్లలకు బోధించుట


“చిన్న పిల్లలకు బోధించుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“చిన్న పిల్లలకు బోధించుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

తల్లిదండ్రులు, చిన్న పిల్లలు పుస్తకం వైపు చూస్తున్నారు

చిన్న పిల్లలకు బోధించుట

మీ కుటుంబములో చిన్న పిల్లలున్న యెడల, ఇక్కడ కొన్ని ప్రోత్సాహకార్యక్రమాలు నేర్చుకోవటానికి వారికి సహాయపడగలవు:

  • పాడండి. కీర్తనలు మరియు పిల్లల పాటల పుస్తకము లోని, పాటలు సిద్ధాంతమును శక్తివంతముగా బోధిస్తాయి. మీరు బోధిస్తున్న సువార్త సూత్రాలకు సంబంధించిన పాటలను కనుగొనడానికి పిల్లల పాటల పుస్తకం వెనుక ఉన్న విషయసూచికను ఉపయోగించండి. పాటలలోని సందేశాలను వారి జీవితాలకు సంబంధింపజేసుకొనేలా పిల్లలకు సహాయం చేయండి. (ఈ వనరులో “Including Sacred Music in Your Gospel Learning” కూడా చూడండి.)

  • ఒక వృత్తాంతమును వినండి లేదా నటించండి. లేఖనాల నుండి, మీ జీవితం నుండి, మీ కుటుంబ చరిత్ర నుండి లేక సంఘ మాసపత్రికల నుండి—కథలను చిన్న పిల్లలు ఇష్టపడతారు. కథను చెప్పుటలో వారిని చేర్చగల మార్గముల కొరకు వెదకండి. వారు వినే దాని చిత్రములను లేక వస్తువులను వారు పట్టుకోవచ్చు, చిత్రములను గీయవచ్చు, కథను అభినయించవచ్చు, లేక కథను చెప్పుటలో సహాయపడవచ్చు. మీరు పంచుకునే కథలలో సువార్త సత్యములను గుర్తించుటకు మీ పిల్లలకు సహాయపడండి.

  • ఒక లేఖనమును చదవండి. చిన్న పిల్లలు ఎక్కువగా చదవలేకపోవచ్చు, కానీ ఇంకా మీరు లేఖనములనుండి నేర్చుకొనుటలో వారిని నిమగ్నం చేయండి. మీరు ఒక వచనము, ముఖ్యమైన వాక్యభాగము, లేక పదముపై దృష్టిసారించవలసి రావచ్చు. వారు పదే పదే చెప్పడం వల్ల లేఖనాలలోని చిన్న వాక్యభాగాలను పిల్లలు కంఠస్థం చేయగలుగుతారు. దేవుని వాక్యమును వారు విన్నప్పుడు, వారు ఆత్మను అనుభవిస్తారు.

  • ఒక చిత్రమును లేక ఒక వీడియోను చూడండి. ఒక సువార్త సూత్రము లేక లేఖన వృత్తాంతమునకు సంబంధించిన ఒక చిత్రమును లేక ఒక వీడియోను మీ పిల్లలకు చూపించినప్పుడు, వారు చూస్తున్న దానినుండి నేర్చుకోవటానికి వారికి సహాయపడు ప్రశ్నలను వారిని అడగండి. ఉదాహరణకు, “ఈ చిత్రము లేక వీడియోలో జరుగుచున్నది ఏమిటి? అని మీరు అడగవచ్చు. అది మిమ్మల్ని ఏవిధంగా భావించునట్లు చేస్తుంది?” సువార్త గ్రంథాలయ యాప్, MediaLibrary.ChurchofJesusChrist.org, మరియు children.ChurchofJesusChrist.org వీడియోలు మరియు చిత్రాలు చూడడానికి మంచి ప్రదేశాలు.

  • సృష్టించండి. పిల్లలు వారు నేర్చుకొన్న వృత్తాంతము లేక సూత్రముకు సంబంధించిన దానిని నిర్మించవచ్చు, గీయవచ్చు, లేక రంగులు వేయవచ్చు.

  • వస్తు పాఠములలో పాల్గొనండి. గ్రహించుటకు కష్టమైన సువార్త సూత్రమును మీ పిల్లలు గ్రహించుటకు సరళమైన వస్తు పాఠము సహాయపడగలదు. వస్తు పాఠమును ఉపయోగించినప్పుడు, మీ పిల్లలు పాల్గొనుటకు అనుమతించు విధానములు కనుగొనండి. కేవలము ఒక నిదర్శనమును చూచుట కంటె పరస్పర అనుభవము నుండి వారు ఎక్కువగా నేర్చుకుంటారు.

  • అభినయించుట. నిజ జీవితంలో వారు ఎదుర్కోగల ఒక సందర్భాన్ని పిల్లలు నటించి చూపుతున్నప్పుడు, ఒక సువార్త సూత్రం వారి జీవితాలకు ఎలా వర్తిస్తుందనేది వారు బాగా అర్థం చేసుకోగలుగుతారు.

  • ప్రోత్సాహకార్యక్రమాలను పునరావృతం చేయండి. వాటిని గ్రహించటానికి చిన్న పిల్లలు భావనలను పలుమార్లు వినాల్సిన అవసరమున్నది. తరుచుగా కథలను లేక ప్రోత్సాహకార్యక్రమాలను పునరావృతం చేయుటకు భయపడవద్దు. ఉదాహరణకు, ఒక లేఖన వృత్తాంతమును కొన్నిసార్లు వేర్వేరు విధాలుగా మీరు పంచుకోవచ్చు—లేఖనాలను చదువుట, మీ స్వంత మాటలలో సంక్షిప్తపరచుట, వీడియోలు చూపుట, మీరు వృత్తాంతమును చెప్పుటకు మీ పిల్లల్ని సహాయము చేయనిచ్చుట, ప్రోత్సాహకార్యక్రమాలను అభినయించుటకు ఆహ్వానించుట, మరియు మొదలైనవి.