Old Testament 2022
పరివర్తనే మన లక్ష్యం


“పరివర్తనే మన లక్ష్యం,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“పరివర్తనే మన లక్ష్యం,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022

ఇంటిలో లేఖనాలను అధ్యయనం చేస్తున్న స్త్రీ

పరివర్తనే మన లక్ష్యం

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుకు మన పరివర్తనను లోతుగా చేయుట మరియు వారి వలె ఎక్కువగా కావడానికి మనకు సహాయపడడమే సమస్త సువార్త అభ్యాసము మరియు బోధన యొక్క లక్ష్యము. ఈ కారణంగా సువార్తను అధ్యయనం చేసినప్పుడు, మనం కొత్త సమాచారం కోసం చూడటం లేదు; మనం “నూతన సృష్టిగా” మారాలి అని కోరతాము (2 కొరింథీయులకు 5:17). దీని అర్థము మన హృదయాలు, మన అభిప్రాయాలు, మన చర్యలు మరియు మన స్వభావాలను మార్చుకొనుటలో సహాయపడుటకు పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై ఆధారపడడం.

కానీ, మన విశ్వాసాన్ని బలపరచి, పరివర్తన అనే అద్భుతానికి నడిపించే అటువంటి సువార్త అభ్యాసమంతా ఒకేసారి జరుగదు. ఇది తరగతి గదుల నుండి మన హృదయాలు మరియు గృహాలకు వ్యాపిస్తుంది. సువార్తను అర్థం చేసుకొని, జీవించడానికి నిలకడగల, అనుదిన ప్రయత్నాలు అవసరము. నిజమైన పరివర్తనకు నడిపించే సువార్త శిక్షణకు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము అవసరము.

పరిశుద్ధాత్మ మనల్ని సత్యమునకు నడిపించి, ఆ సత్యము గురించి సాక్ష్యమిచ్చును (యోహాను 16:13 చూడండి). ఆయన మన మనస్సులను వెలుగుతో నింపును, మన అవగాహనను వేగవంతము చేయును మరియు సమస్త సత్యమునకు మూలాధారమైన దేవుని నుండి బయల్పాటుతో మన హృదయాలను తాకును. పరిశుద్ధాత్మ మన హృదయాలను శుద్ధి చేయును. సత్యమును బట్టి జీవించాలనే కోరికను ఆయన మనలో ప్రేరేపించును మరియు దానిని చేసే విధానాలను గుసగుసలాడుట ద్వారా మనకు తెలియజేయును. నిజముగా, “పరిశుద్ధాత్మ … సమస్తమును (మనకు) బోధించును” (యోహాను 14:26).

ఈ కారణాలను బట్టి, సువార్తను జీవించి, అభ్యసించి, బోధించేందుకు మన ప్రయత్నాల్లో మనము అన్నిటికంటే ముందుగా ఆత్మ యొక్క సహవాసాన్ని వెదకాలి. ఈ లక్ష్యము మన ఎంపికలను ప్రభావితం చేయాలి, మన ఆలోచనలను మరియు క్రియలను నడిపించాలి. ఆత్మ యొక్క ప్రభావాన్ని ఆహ్వానించే ప్రతిదానిని మనం కోరుకోవాలి మరియు ఆ ప్రభావాన్ని పారద్రోలే ప్రతిదానిని తిరస్కరించాలి—ఎందుకనగా, పరిశుద్ధాత్మ సమక్షంలో మనము యోగ్యులుగా ఉండగలిగినట్లయితే, పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు సమక్షంలో జీవించడానికి కూడా మనము యోగ్యులము కాగలము.