2024 రండి, నన్ను అనుసరించండి
గృహములో మరియు సంఘములో అభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఉపాయములు


“గృహములో మరియు సంఘములో అభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఉపాయములు,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

కలిసి అధ్యయనం చేస్తున్న కుటుంబము

గృహములో మరియు సంఘములో అభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఉపాయములు

రక్షకుని సువార్తను మీరు గృహములో మరియు సంఘములో అధ్యయనం చేస్తున్నప్పుడు, క్రింది ప్రశ్నలను పరిగణించండి:

  • మీ అధ్యయనంలో ఆత్మను మీరు ఏవిధంగా ఆహ్వానించగలరు?

  • మీ అధ్యయనంలో మీరు రక్షకునిపై ఏవిధంగా దృష్టి పెట్టగలరు?

  • అనుదిన అభ్యాస క్షణాలను మీరు ఎలా ఉపయోగించుకోగలరు?

  • స్వయంగా లేఖనాలను అధ్యయనం చేయడానికి మరియు వారు నేర్చుకున్న దానిని పంచుకోవడానికి కుటుంబమును మరియు తరగతి సభ్యులను మీరు ఎలా ప్రోత్సహించగలరు?

దేవుని వాక్యమునకు సంబంధించి మీ అధ్యయనాన్ని మెరుగుపరిచే కొన్ని సులువైన మార్గాలు ఇక్కడున్నాయి.

ప్రేరేపణ కొరకు ప్రార్థించండి

లేఖనాలు దేవుని యొక్క వాక్యము గనుక, వాటిని అర్థం చేసుకోవడానికి ఆయన సహాయం కోరండి.

యేసు క్రీస్తు గురించిన సత్యాల కొరకు చూడండి

సమస్త సంగతులు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చును (2 నీఫై 11:4; మోషే 6:63 చూడండి), కాబట్టి రక్షకుడి గురించి సాక్ష్యమిచ్చి, ఆయన పట్ల మీకున్న ప్రేమను బలపరచి, ఆయనను ఎలా అనుసరించాలో నేర్పే వచనాలను గమనించడాన్ని లేదా గుర్తించడాన్ని పరిగణించండి. కొన్నిసార్లు రక్షకుడు మరియు ఆయన సువార్త గురించిన సత్యములు సూటిగా వ్యాఖ్యానించబడతాయి, మరికొన్నిసార్లు అవి ఒక ఉదాహరణ లేదా వృత్తాంతము ద్వారా సూచించబడతాయి. “ఈ వచనములలో బోధించబడిన నిత్య సత్యాలేమిటి? ఈ సత్యాలు రక్షకుని గురించి నాకేమి బోధిస్తాయి?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

ఆత్మను ఆలకించండి

మీరు చదువుతున్న దానికి సంబంధించక పోయినప్పటికీ, మీ ఆలోచనలు మరియు భావాలపట్ల శ్రద్ధ వహించండి. ఆ మనోభావాలే మీ పరలోక తండ్రి మీరు నేర్చుకోవాలని కోరే విషయాలు కావచ్చు.

మీ మనోభావాలను నమోదు చేయండి

మీరు అధ్యయనము చేస్తున్నప్పుడు కలిగే మనోభావాలను నమోదు చేయడానికి అనేక విధానాలున్నాయి. ఉదాహరణకు, లేఖనాలలోని కొన్ని పదాలు మరియు వాక్యభాగాలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయని మీరు కనుగొనవచ్చు; మీరు వాటిని గుర్తించవచ్చు మరియు మీ లేఖనములందు ఒక వివరణగా మీ ఆలోచనలను వ్రాయవచ్చు. మీరు పొందే అంతరార్థములు, భావనలు మరియు మనోభావాలను దినచర్య పుస్తకములో వ్రాసిపెట్టుకోవచ్చు.

అధ్యయనము చేస్తున్న యువతి

మీరు నేర్చుకొనే దానిని ఇతరులతో పంచుకోండి

మీ వ్యక్తిగత అధ్యయనము నుండి వచ్చిన అంతరార్థములను చర్చించడం ఇతరులకు బోధించే ఒక మంచి మార్గం మరియు మీరు చదివిన దాని గురించి మీ అవగాహనను బలపరచడానికి కూడా అది సహాయపడుతుంది. మీరు నేర్చుకునే దానిని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో (వ్యక్తిగతంగా లేదా డిజిటల్‌గా) పంచుకోండి మరియు వారిని కూడా అలా చేయమని ఆహ్వానించండి.

లేఖనాలను మీ జీవితానికి అన్వయించుకోండి

మీరు చదువుతున్న వృత్తాంతములు మరియు బోధనలు ఏవిధంగా మీ జీవితానికి వర్తిస్తాయో ఆలోచించండి. ఉదాహరణకు, “నాకు కలిగిన ఏ అనుభవాలు నేను చదివిన దానిని పోలియున్నాయి?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు.

మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రశ్నలు అడగండి

మీరు లేఖనాలను అధ్యయనము చేస్తున్నప్పుడు, మనస్సులో ప్రశ్నలు తలెత్తవచ్చు. ఈ ప్రశ్నలు మీరు చదివే దానికి లేదా సాధారణంగా మీ జీవితానికి సంబంధించినవై యుండవచ్చు. మీరు లేఖనాలను అధ్యయనము చేయుట కొనసాగించినప్పుడు, ఈ ప్రశ్నలను ధ్యానించండి మరియు జవాబుల కొరకు వెదకండి.

అధ్యయనం చేస్తున్న యువకుడు

లేఖన అధ్యయన సహాయకాలను ఉపయోగించండి

మీరు చదివే వచనాల యొక్క అదనపు అంతరార్థములను తెలుసుకొనుటకు, పాదవివరణలను, విషయదీపిక, బైబిలు నిఘంటువు, లేఖనదీపిక మరియు ఇతర అధ్యయన సహాయకాలను ఉపయోగించండి.

లేఖనాల సందర్భాన్ని పరిగణించండి

అది వచ్చిన పరిస్థితులు లేదా అమరికతో సహా దాని సందర్భాన్ని మీరు పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఒక లేఖన భాగము గురించి అర్థవంతమైన అంతరార్థములను మీరు కనుగొనవచ్చు. ఉదాహరణకు, దేవుడు మాట్లాడిన మనుషుల యొక్క నమ్మకాలను మరియు నేపథ్యాన్ని తెలుసుకోవడం, ఆయన మాటల ఉద్దేశాన్ని బాగా అర్థంచేసుకోవడానికి మీకు సహాయపడగలదు.

కడవరి దిన ప్రవక్తలు మరియు అపొస్తలుల మాటలను అధ్యయనము చేయండి

లేఖనాల్లో మీరు కనుగొన్న సూత్రాల గురించి కడవరి దిన ప్రవక్తలు మరియు అపొస్తలులు ఏమి బోధించారో చదవండి.

కలిసి అధ్యయనం చేస్తున్న తల్లి మరియు కుమారుడు

మీరు నేర్చుకొన్న దానిని బట్టి జీవించండి

లేఖన అధ్యయనము మనల్ని ప్రేరేపించడం మాత్రమే కాదు, కానీ అది మన జీవన విధానాన్ని మార్చేలా కూడా ఉండాలి. మీరు చదువుతున్నప్పుడు ఆత్మ మిమ్మల్ని ఏమని ప్రేరేపిస్తాడో వినండి, తరువాత ఆ ప్రేరణలపై పనిచేయండి.

సంగీతాన్ని ఉపయోగించండి

సూచించబడిన కీర్తనలు మరియు పిల్లల పాటలు రండి, నన్ను అనుసరించండి అంతటా కనుగొనబడతాయి. ఆత్మను ఆహ్వానించడానికి, సువార్త సత్యాల గురించి మీ విశ్వాసాన్ని, సాక్ష్యాన్ని అధికం చేసుకోవడానికి పవిత్రమైన సంగీతాన్ని ఉపయోగించండి.

కలిసి పాడుతున్న కుటుంబము

లేఖనాలను కంఠస్థం చేయండి

మీకు, మీ కుటుంబానికి లేదా మీ తరగతికి అర్థవంతంగా అనిపించే ఒక లేఖన భాగాన్ని ఎంచుకోండి మరియు ప్రతిరోజూ పునరావృతం చేయడం ద్వారా లేదా జ్ఞాపకశక్తి ఆట ఆడడం ద్వారా దాన్ని కంఠస్థం చేయండి.

వస్తుపాఠాలను పంచుకోండి

మీరు చదువుతున్న అధ్యాయాలు మరియు వచనాలకు సంబంధించిన వస్తువులను కనుగొనండి. ప్రతీ వస్తువు లేఖనాల్లోని బోధనలతో ఎలా సంబంధం కలిగి ఉందో పరిగణించండి.

ఒక చిత్రాన్ని గీయండి, కనుగొనండి లేదా తీయండి

కొన్ని వచనాలను చదవండి, తరువాత మీరు చదివిన వాటికి సంబంధించినది ఏదైనా గీయండి. లేదా Gospel Art Book [సువార్త కళా పుస్తకము]లో లేదా సువార్త గ్రంథాలయములో మరెక్కడైనా ఒక చిత్రం కొరకు మీరు చూడవచ్చు. మీరు నేర్చుకున్న దానిని వివరించే ఒక చిత్రాన్ని కూడా మీరు తీసుకోవచ్చు.

ఒక కథను అభినయించండి

ఒక కథ చదివిన తరువాత, దాన్ని అభినయించడానికి కుటుంబమును లేదా తరగతి సభ్యులను ఆహ్వానించండి. తరువాత, మీరు అనుభవిస్తున్న విషయాలతో ఆ కథ ఎలా సంబంధం కలిగియుందనే దాని గురించి మాట్లాడండి.

ఇంటివద్ద మృదువుగా ఉండండి

కుటుంబ లేఖన అధ్యయనంలో పాల్గొనడానికి ఇష్టపడని కుటుంబ సభ్యులు మీకున్నట్లయితే, వారిని చేర్చుకోవడానికి ఇతర మార్గాలను వెదకండి. ఉదాహరణకు, మీ సంభాషణలలో సహజంగా మీరు నిత్య సత్యం గురించి పంచుకోగలరా లేదా ఉపదేశిస్తున్నట్లుగా, నిర్భంధిస్తున్నట్లుగా అనిపించని విధానంలో అర్థవంతమైన లేఖనాన్ని పంచుకోగలరా? లేఖన అధ్యయనము ప్రతి కుటుంబములో ఒకేవిధంగా ఉండవలసిన అవసరం లేదు. ఒక్కొక్కరితో విడిగా లేఖనాలను అధ్యయనం చేయడం పట్ల కొద్దిమంది పిల్లలు బాగా స్పందించవచ్చు. ప్రార్థనాపూర్వకంగా ఉండండి మరియు ఆత్మ యొక్క ప్రేరేపణలను అనుసరించండి.

తల్లిదండ్రుల కొరకు బోధకుల సలహాసభ సమావేశాలు. మీ పిల్లలకు బోధించే మీ ప్రయత్నాలలో మీకు అదనపు సహాయం కావాలంటే, తల్లిదండ్రుల కొరకు బోధకుల సలహాసభ సమావేశాలను మీ వార్డు నిర్వహిస్తుందో లేదో తెలుసుకోండి (ప్రధాన చేతిపుస్తకము, 17.5 చూడండి). వారి బోధనను ఎలా మెరుగుపరచుకోవాలనే దాని గురించి చర్చించడానికి మరియు కలిసి నేర్చుకోవడానికి ఈ సమావేశాలు తల్లిదండ్రుల కొరకు ఒక అవకాశము. రక్షకుని విధానములో బోధించుట లోని సూత్రాలను, కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచడానికి ఈ పేజీలలో ఉన్న ఉపాయాలను, రండి, నన్ను అనుసరించండి అంతటా కనుగొనబడే అభ్యాసము మరియు బోధనా సూచనలను వారు చర్చించవచ్చు.