2024 రండి, నన్ను అనుసరించండి
రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు ఉపయోగించుట


రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు ఉపయోగించుట,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: పాత నిబంధన 2026 (2026)

కలిసి అధ్యయనం చేస్తున్న జంట

రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు ఉపయోగించుట

ఈ వనరు ఎవరి కొరకైనది?

రండి, నన్ను అనుసరించండి అనేది వ్యక్తిగతంగా, కుటుంబంగా మరియు సంఘ తరగతుల్లో లేఖనాల నుండి నేర్చుకోవాలనుకొనే ప్రతీఒక్కరి కొరకైనది. మీరు గతంలో లేఖనాలను క్రమం తప్పకుండా చదవనట్లయితే, ఈ వనరు మీరు ప్రారంభించేందుకు సహాయపడగలదు. మీకు ఇదివరకే లేఖనాలను చదివే మంచి అలవాటు ఉంటే, ఇంకా ఎక్కువ అర్థవంతమైన అనుభవాలను కలిగియుండేందుకు ఈ వనరు మీకు సహాయపడగలదు.

ఇంటివద్ద వ్యక్తులు మరియు కుటుంబాలు

సువార్తను నేర్చుకోవడానికి ఉత్తమమైన ప్రదేశం ఇల్లు. సంఘములో మీ బోధకులు మీకు సహకరించగలరు మరియు ఇతర వార్డు సభ్యుల నుండి మీరు ప్రోత్సాహాన్ని పొందగలరు. కానీ ఆధ్యాత్మికంగా జీవించడానికి మీకు మరియు మీ కుటుంబానికి “దేవుని సువార్త” నుండి అనుదిన పోషణ అవసరము (మొరోనై 6:4; రస్సెల్ ఎమ్. నెల్సన్, “ప్రారంభ వ్యాఖ్యలు,” లియహోనా, నవ. 2018, 6–8 కూడా చూడండి).

మీకు సహాయకరంగా ఉండే ఏ విధానంలోనైనా ఈ వనరును ఉపయోగించండి. నమూనాలు పాత నిబంధనలో కనుగొనబడు నిత్య సత్యాలలో కొన్నింటిని ప్రముఖంగా పేర్కొంటాయి. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మీరు లేఖనాలను అధ్యయనం చేయడానికి సహాయపడే ఆలోచనలను, కార్యకలాపాలను కూడా అవి సూచిస్తాయి. మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు, మీకు అర్థవంతమనిపించే నిత్య సత్యాలను కనుగొనడానికి ఆత్మ యొక్క నడిపింపును అనుసరించండి. మీ కొరకు దేవుని సందేశాలకై చూడండి మరియు మీరు పొందే ప్రేరేపణలను అనుసరించండి.

సంఘము వద్ద బోధకులు మరియు అభ్యాసకులు

రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు అనేది ప్రాథమికలో ఆదివారపు తరగతులు, యౌవనులు మరియు పెద్దల ఆదివారపు బడి, యువతుల తరగతులు మరియు అహరోను యాజకత్వ సమూహ సమావేశాల కొరకు పాఠ్యప్రణాళిక. మీరు ఈ సందర్భా‌లలో దేనిలోనైనా బోధిస్తే, మీ వ్యక్తిగత అధ్యయనం కోసం మరియు మీరు బోధించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ వనరులోని నమూనాలను ఉపయోగించమని మీరు ప్రోత్సహించబడుతున్నారు. లేఖనాలలో మీ స్వంత అనుభవాలను కలిగియుండడం ద్వారా ప్రారంభించండి. మీరు లేఖనాలను పరిశోధించి, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను వెదికినప్పుడు, మీ అత్యంత ముఖ్యమైన సిద్ధపాటు సంభవిస్తుంది. మరింతగా పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు వలె మారడానికి మీకు సహాయపడే నిత్య సత్యాల కొరకు చూడండి. ఈ సత్యాలలో కొన్నింటిని గుర్తించడానికి మరియు లేఖన సందర్భాలను అర్థం చేసుకోవడానికి రండి, నన్ను అనుసరించండి మీకు సహాయపడగలదు.

సువార్తను ఉత్తమంగా నేర్చుకొనుట అనేది గృహ-కేంద్రీకృతమైనది మరియు సంఘ సహకారమివ్వబడినది అని గుర్తుంచుకోండి. మరొక మాటలో, మీరు బోధించే జనులకు ఇంటివద్ద సువార్తను నేర్చుకొని, జీవించడానికి వారు చేసే ప్రయత్నాలలో సహకరించడమే మీ ప్రధాన బాధ్యత. తరగతిలో వారి కోసం ప్రత్యేక విషయాన్ని అందించడం గురించి చింతించకండి. బదులుగా, ఇంటివద్ద వారు చదివిన లేఖన గద్యభాగాల గురించి వారి అనుభవాలను, ఆలోచనలను మరియు ప్రశ్నలను పంచుకోవడానికి వారికి అవకాశాలివ్వండి. వారు కనుగొన్న నిత్య సత్యాలను పంచుకోమని వారిని ఆహ్వానించండి. పాఠంలో నిర్దిష్ట మొత్తాన్ని పూర్తిచేయడం కంటే ఇది చాలా ముఖ్యమైనది.

యౌవనులు మరియు పెద్దల ఆదివారపు బడి తరగతులు

యేసు క్రీస్తును అనుసరించడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఒకరికొకరం సహకరించుకోవడం మరియు ప్రోత్సహించుకోవడమే ఆదివారపు బడి తరగతులలో మనం సమకూడడానికి గల ఒక ముఖ్య కారణం. దీనిని చేయడానికి ఒక సులువైన మార్గము, “మీరు లేఖనాలను చదివినప్పుడు, పరిశుద్ధాత్మ ఈ వారం మీకు ఏమి బోధించాడు?” వంటి ప్రశ్నను అడగడం. ఈ ప్రశ్నకు జవాబులు యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తలో విశ్వాసాన్ని పెంపొందించే అర్థవంతమైన చర్చలకు దారితీయగలవు.

అప్పుడు మీరు రండి, నన్ను అనుసరించండి లోని అధ్యయన సూచనలపై ఆధారపడి చర్చను ఆహ్వానించవచ్చు. ఉదాహరణకు, యెషయా 53ను పరిశోధించి, రక్షకుని నియమితకార్యము గురించి వర్ణించే పదాల కొరకు చూడమని ఒక అధ్యయన ఉపాయము సూచించవచ్చు. వారి కొరకు ఈ పదాలు ప్రేరేపించిన ఏవైనా ఆలోచనలు లేదా భావాలను పంచుకోమని మీరు తరగతి సభ్యులను అడగవచ్చు. లేదా ఒక తరగతిగా మీరు ఈ పదాల కొరకు చూడడంలో కొంత సమయం గడపవచ్చు.

అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతులు

ఆదివారాలు అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతులు కలుసుకున్నప్పుడు, వారి ఉద్దేశ్యము ఆదివారపు బడి తరగతి కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. యేసు క్రీస్తు యొక్క సువార్తను నేర్చుకోవడానికి ఒకరికొకరు సహాయపడడానికి అదనంగా, ఈ సమూహాలు రక్షణ మరియు ఉన్నతస్థితి కార్యమును సాధించడం గురించి చర్చించడానికి కూడా కలుసుకుంటాయి (ప్రధాన చేతిపుస్తకము, 1.2 చూడండి). వారు దీనిని తరగతి మరియు సమూహ అధ్యక్షత్వాల మార్గనిర్దేశకత్వంతో చేస్తారు.

ఈ కారణం చేత, ప్రతీ సమూహము లేదా తరగతి సమావేశము వారి ప్రయత్నాల గురించి సమూహము లేదా తరగతి అధ్యక్షత్వము యొక్క సభ్యుడు చర్చను నడిపించడంతో ప్రారంభం కావాలి, ఉదాహరణకు, సువార్తను జీవించడం, అవసరంలోనున్న జనులకు పరిచర్య చేయడం, సువార్తను పంచుకోవడం లేదా దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యములో పాల్గొనడం వంటివి.

కలిసి సలహా సమావేశం జరిపిన తర్వాత, కలిసి సువార్తను నేర్చుకోవడానికి ఒక ఉపదేశకుడు తరగతిని లేదా సమూహాన్ని నడిపిస్తాడు. పెద్దవారైన నాయకులు లేదా తరగతి లేదా సమూహ సభ్యులు బోధించడానికి నియమించబడగలరు. పెద్దవారైన నాయకులతో సంప్రదించి, తరగతి లేదా సమూహ అధ్యక్షత్వము ఈ నియామకాలను చేస్తారు.

బోధించడానికి నియమించబడిన వారు రండి, నన్ను అనుసరించండి యొక్క వారపు నమూనాలోని అభ్యాస సూచనలను ఉపయోగిస్తూ సిద్ధపడాలి. ప్రతీ నమూనాలో, ఈ చిహ్నము సెమినరీ చిహ్నము ప్రత్యేకించి యౌవనులకు తగిన ప్రోత్సాహ కార్యక్రమాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ, నమూనాలోని సూచనలలో దేనినైనా యౌవనుల కొరకు అభ్యాస కార్యకలాపముగా ఉపయోగించవచ్చు.

సమూహము మరియు తరగతి సమావేశాల విషయపట్టిక మాదిరి కొరకు అనుబంధము డి చూడండి.

ప్రాథమిక

ప్రాథమికకు బోధించడానికి మీ సిద్ధపాటు అనేది మీరు వ్యక్తిగతంగా మరియు మీ కుటుంబంతో లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు మొదలవుతుంది. మీరు అలా చేసినప్పుడు, మీ ప్రాథమిక తరగతిలోని పిల్లల గురించి పరిశుద్ధాత్మ నుండి వచ్చే ఆత్మీయ మనోభావాలను, అంతర్దృష్టులను పొందడానికి సిద్ధంగా ఉండండి. ప్రార్థనాపూర్వకంగా ఉండండి మరియు యేసు క్రీస్తు యొక్క సువార్తను నేర్చుకోవడానికి వారికి సహాయపడేందుకు ఉపాయాలతో ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించగలడు.

మీరు బోధించడానికి సిద్ధపడుతున్నప్పుడు, రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకులోని బోధనా ఉపాయాలను అన్వేషించడం ద్వారా మీరు అదనపు ప్రేరేపణను పొందవచ్చు. ఈ వనరులోని ప్రతీ నమూనాలో “పిల్లలకు బోధించడానికి ఉపాయములు” అనే శీర్షికగల విభాగము కలదు. ఈ ఉపాయాలను మీ ప్రేరేపణను వెలిగించే సూచనలుగా భావించండి. మీ ప్రాథమిక తరగతిలోని పిల్లలు మీకు తెలుసు—మరియు తరగతిలో మీరు వారితో మాట్లాడినప్పుడు వారి గురించి మీరు ఇంకా బాగా తెలుసుకుంటారు. దేవుడు కూడా వారిని ఎరిగియున్నారు మరియు వారికి బోధించడానికి, దీవించడానికి ఉత్తమమైన మార్గాలతో ఆయన మిమ్మల్ని ప్రేరేపిస్తారు.

రండి, నన్ను అనుసరించండి లోని కొన్ని ప్రోత్సాహ కార్యక్రమాలను మీ తరగతిలోని పిల్లలు ఇదివరకే వారి కుటుంబాలతో చేసియుండవచ్చు. ఫరవాలేదు. మళ్ళీ చేయడం మంచిది. వారు ఇంటివద్ద నేర్చుకున్నదానిని ఒకరితో ఒకరు పంచుకోమని పిల్లలను ఆహ్వానించడాన్ని పరిగణించండి—అయినప్పటికీ, వారు ఇంటి వద్ద నేర్చుకోకపోయినా కూడా పిల్లలు పాల్గొనడానికి మార్గాలను మీరు ప్రణాళిక చేయాలి. రకరకాల ప్రోత్సాహ కార్యక్రమాల ద్వారా మళ్ళీ మళ్ళీ ఈ సత్యాలు బోధించబడినప్పుడు పిల్లలు సువార్త సత్యాలను మరింత ప్రభావవంతంగా నేర్చుకుంటారు. ఒక అభ్యాస కార్యక్రమము పిల్లల కొరకు ప్రభావవంతంగా ఉన్నట్లు మీరు కనుగొన్నప్పుడు, ప్రత్యేకించి మీరు చిన్నపిల్లలకు బోధిస్తున్నట్లయితే దానిని పునరావృతం చేయడం గురించి ఆలోచించండి. ఇంతకుముందు పాఠం నుండి కూడా మీరు ఒక ప్రోత్సాహ కార్యక్రమాన్ని పునర్వీక్షించవచ్చు.

ఐదు ఆదివారాలు ఉన్న నెలల్లో, ఐదవ ఆదివారం ప్రణాళిక చేయబడిన రండి, నన్ను అనుసరించండి నమూనాను “అనుబంధం బి: ప్రాథమిక కొరకు—దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధపరచుట”లో ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అభ్యాస కార్యకలాపాలతో భర్తీ చేయమని ప్రాథమిక బోధకులు ప్రోత్సహించబడ్డారు.