2023
యౌవనులు మరియు పిల్లల కొరకు వనరులు
2023 ఫిబ్రవరి


“యౌవనులు మరియు పిల్లల కొరకు వనరులు,”లియహోనా, 2023 ఫిబ్రవరి.

లియహోనా నెలవారీ సందేశము, 2023 ఫిబ్రవరి

యౌవనులు మరియు పిల్లల కొరకు వనరులు

కుమారునితో కలిసి లేఖనములు చదువుతున్న తల్లిదండ్రులు

యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి తమ పిల్లలకు బోధించే ప్రాథమిక బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. వారి ప్రయత్నాలలో తల్లిదండ్రులకు సహాయం చేయడానికి యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము నిర్మాణములు, కార్యక్రమాలు మరియు ఇతర వనరులను కలిగి ఉంది. తల్లిదండ్రులు, సంఘ నాయకులు మరియు స్నేహితులు అందరు కలిసి పిల్లలు మరియు యుక్తవయస్కులందరూ క్రీస్తు వద్దకు రావడానికి సహాయపడగలరు.

ప్రాథమిక పిల్లలు

బెన్ జాన్సన్ చేత ఛాయాచిత్రము

ప్రాథమిక

ప్రాథమిక అనేది 18 నెలల నుండి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లల కొరకు సంఘము యొక్క నిర్మాణము. ప్రాథమికలో, పిల్లలు పాఠాలు, సంగీతం మరియు ప్రోత్సాహ కార్యక్రమాల ద్వారా యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి నేర్చుకుంటారు. దేవునికి తమ పట్ల గల ప్రేమను అనుభూతి చెందడానికి పిల్లలకు ప్రాథమిక సహాయపడగలదు.

అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతులు

పిల్లలకు 12 ఏళ్ళ వయస్సు వచ్చే ఏడాది జనవరిలో, వారు ప్రాథమిక నుండి అహరోను యాజకత్వ సమూహములకు (బాలుర కొరకు) లేదా యువతుల తరగతులకు (బాలికల కొరకు) మారతారు. వారి సమూహములు మరియు తరగతులలో, యువత తమ సాక్ష్యాలను బలోపేతం చేయడం మరియు ఇతరులకు సేవ చేయడం కొనసాగిస్తారు.

ఒక చిత్రాన్ని గీస్తున్న చేతులు

పిల్లలు మరియు యువత కార్యక్రమము

ఆయన యవ్వనంలో, యేసు క్రీస్తు “జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను” (లూకా 2:52). పిల్లలు మరియు యువత కార్యక్రమము, యువ సంఘ సభ్యులకు క్రీస్తు మాదిరిని అనుసరించడంలో సహాయపడుతుంది. వారు తమ జీవితంలోని అన్ని అంశాలలో—ఆధ్యాత్మికంగా, సామాజికంగా, శారీరకంగా మరియు మేధోపరంగా నేర్చుకుంటారు మరియు ఎదుగుతారు.

సంఘ పత్రికలు

ఫ్రెండ్ పత్రిక అనేది పిల్లల కొరకైన సంఘ పత్రిక. యౌవనుల బలము కొరకు అనేది యువత కొరకైన సంఘ పత్రిక. ఈ పత్రికలలో పిల్లలు మరియు యుక్తవయస్కుల కొరకు ప్రత్యేకంగా వ్రాసిన కథలు, బోధనలు మరియు ప్రోత్సాహ కార్యక్రమాలు ఉంటాయి.

స్పానిష్‌లో మార్గదర్శక పుస్తక ముఖచిత్రం

యౌవనుల బలము కొరకు మార్గదర్శక పుస్తకం

యౌవనుల బలము కొరకు: ఎంపికలు చేయుటకు ఒక మార్గదర్శిని అనేది యువతకు సువార్త సత్యాల గురించి బోధిస్తుంది. యేసు క్రీస్తును అనుసరించడంలో వారికి సహాయపడే నిర్ణయాలు ఎలా తీసుకోవాలో అది వారికి బోధిస్తుంది. సువార్తను ఎలా జీవించాలనే దాని గురించి యువతకు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇందులో ఉంటాయి.

సువార్త గ్రంథాలయము

సువార్త గ్రంథాలయములో వీడియోలు, సంగీతం, లేఖన కథలు మరియు ప్రోత్సాహ కార్యక్రమాలతో సహా అనేక డిజిటల్ వనరులు ఉన్నాయి. సువార్త సూత్రాలను బోధించడానికి తల్లిదండ్రులకు మరియు నాయకులకు సహాయపడే వనరులు కూడా ఇందులో ఉంటాయి. ఈ వనరులు ChurchofJesusChrist.org లోని సువార్త గ్రంథాలయములో మరియు సువార్త గ్రంథాలయ యాప్‌లో కనుగొనబడతాయి.

FSY సమావేశాలు

యౌవనులకు 14 సంవత్సరాలు నిండే సంవత్సరం నుండి వారు యౌవనుల బలము కొరకు (FSY) సమావేశాలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించబడ్డారు. ఈ కార్యక్రమాలు యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో సహాయపడే ప్రోత్సాహ కార్యక్రమాలను, తరగతులను కలిగి ఉంటాయి మరియు యువత ఆధ్యాత్మికంగా, సామాజికంగా, శారీరకంగా మరియు మేధోపరంగా ఎదగడానికి సహాయపడతాయి.