2021
దేవాలయ కార్యము
2021 అక్టోబరు


“దేవాలయ కార్యము,” లియహోనా, 2021 అక్టోబరు

2021 అక్టోబరు, లియహోనా నెలవారీ సందేశము

దేవాలయ కార్యము

దేవాలయములు ప్రభువు యొక్క మందిరములు. దేవాలయములలో మనము విధులను పొంది, ఆయనతో నిబంధనలు చేయగలము. దేవాలయములలో మన పూర్వీకుల కొరకు మనము విధులను కూడా నెరవేర్చగలము.

దేవాలయము

బ్రూనొ లిమా చేత బారన్క్విల్లా కొలంబియా దేవాలయ చిత్రము

చరిత్ర అంతటా, దేవాలయములు నిర్మించమని ప్రభువు తన జనులకు ఆజ్ఞాపించారు. దేవాలయములు పరిశుద్ధ స్థలములు, అక్కడ మనము దేవుని ప్రేమను అనుభూతి చెందగలము, విధులను పొందగలము మరియు ఆయనతో వాగ్దానములు చేయగలము. ఎక్కువమంది జనులు ఈ దీవెనలు కలిగియుండునట్లు సంఘము ప్రపంచవ్యాప్తంగా దేవాలయములను నిర్మిస్తున్నది.

దేవాలయం యెదుట స్త్రీ

నెక్సియో మరియు మథ్యూ రైర్ చేత ఓక్విర్ మౌంటైన్ యూటా దేవాలయము యెదుట స్త్రీ యొక్క చిత్రము

వరము

నీతిమంతులుగా జీవించే సంఘ సభ్యులు విధులు పొందడానికి, దేవునితో నిబంధనలు లేక వాగ్దానములు చేయడానికి దేవాలయముకు వెళతారు. దేవాలయములో మనము పొందే ఒక విధి వరము. వరము అనే మాటకు “బహుమానము” అని అర్థము. దేవాలయ వరము దేవుని నుండి బహుమానము. ఈ విధిలో మనము మన రక్షణ కొరకు పరలోక తండ్రి యొక్క ప్రణాళిక గురించి నేర్చుకుంటాము మరియు దేవుని ఆజ్ఞలను పాటించడానికి నిబంధనలు చేస్తాము. మనము చేసే నిబంధనలకు మనము విశ్వాసంగా ఉన్నయెడల, దేవుడు మనల్ని దీవిస్తారు.

దేవాలయం యెదుట దంపతులు

క్రిస్టీనా స్మిత్ చేత మనీలా ఫిలిప్పీన్స్ దేవాలయము వద్ద నడుస్తున్న దంపతుల చిత్రము.

కుటుంబాలు కలిసి ముద్రవేయబడుట

దేవాలయములో వివాహము ముద్రవేయబడుట అని కూడా పిలువబడుతుంది. ఒక దంపతులు దేవాలయములో ముద్రవేయబడి, వారి నిబంధనలు పాటించినప్పుడు, వారు శాశ్వతంగా వివాహము చేసుకోబడతారు. వారికి పిల్లలు కలిగితే, ఆ పిల్లలు కూడా వారితో ముద్రవేయబడతారు. పిల్లలు కలిగిన తరువాత ముద్రవేయబడిన తల్లిదండ్రులు తమ పిల్లలతో ముద్రవేయబడగలరు. వారు నీతిగా జీవిస్తే, వారు నిత్యత్వమంతటా ఒక కుటుంబంగా ఉంటారు.

లిస్బన్ పోర్చుగల్ దేవాలయపు బాప్త్మీస్మమిచ్చే ప్రదేశము

లెస్లీ నిల్సన్ చేత లిస్బన్ పోర్చుగల్ దేవాలయ చిత్రము

దేవుని పిల్లలందరి కొరకు దేవాలయ కార్యము

మన పూర్వీకుల గురించి కనుగొనడానికి మనము కుటుంబ చరిత్ర కార్యమును చేస్తాము. తరువాత మనము వారి తరఫున దేవాలయ కార్యమును చేస్తాము. జీవించే వారికి అవసరమైన విధులన్నిటిని వారి కొరకు మనము చేస్తాము: బాప్తీస్మము, నిర్ధారణ, యాజకత్వమును పొందుట (పురుషులకు), వరము మరియు ముద్రవేయబడుట. అప్పుడు వారు ఈ విధులను అంగీకరించాలా వద్దా అని వారు ఎంపిక చేయగలరు. ఈవిధంగా, దేవుని పిల్లలందరూ సువార్త యొక్క దీవెనలు ఆనందించగలరు.

దేవాలయము ఎదుట కుటుంబము

కొడీ బెల్ చేత ఫిలడెల్ఫియా పెన్సిలేనియా దేవాలయము ఎదుట కుటుంబము యొక్క చిత్రము

దేవాలయ కార్యము యొక్క దీవెనలు

దేవాలయములో మనము చేసే నిబంధనలను మనము పాటించిన యెడల మనము దీవించబడతాము, కాపాడబడతాము మరియు బలపరచబడతాము. మనము యాజకత్వపు శక్తిని మనతో కలిగియుంటాము. మన కుటుంబాలు శాశ్వతంగా కలిసి ఉంటాయి.

దేవాలయము అనేది శాంతి మరియు బయల్పాటు యొక్క స్థలము కూడా. దేవాలయ కార్యము చేసినప్పుడు, మనము ఆత్మీయ నడిపింపును పొందగలము మరియు దేవుని ప్రేమను అనుభవించగలము.