“నావూ నిర్మాణం,” ఫ్రెండ్, 2025 సెప్టంబరు, 26-28.
నెలవారీ ఫ్రెండ్ సందేశం, 2025 సెప్టంబరు
నావూ నిర్మాణం
ఒక కొత్త ప్రదేశంలో సమకూడాలని ప్రభువు పరిశుద్ధులకు చెప్పారు. అది ఓ పెద్ద నదికి దగ్గరగా ఉండేది, అక్కడి భూమి తడిగా మరియు కొద్దిగా బురదగా ఉండేది. అది నగరాన్ని నిర్మించడానికి మంచి ప్రదేశంగా అనిపించలేదు. కానీ ప్రభువు సహాయంతో వారు దానిని అందంగా చేయగలరని ప్రవక్త జోసెఫ్ స్మిత్‌కు తెలుసు.
నివసించడానికి దానిని ఒక మంచి ప్రదేశంగా చేయడానికి పరిశుద్ధులు కష్టపడి పనిచేసారు. ఆ పట్టణాన్ని జోసెఫ్ నావూ అని పిలిచారు, దానర్థం “అందమైన ప్రదేశం.”
పరిశుద్ధులు నావూలో ఒక ఆలయాన్ని నిర్మించాలని ప్రభువు కోరుకున్నారు. జనం త్వరగా పనిచేయడం ప్రారంభించారు.
ప్రభువు తన ప్రజలకు ప్రసాదించేందుకు గొప్ప దీవెనలను సిద్ధంగా ఉంచారు. దేవాలయంలో, వారు ప్రభువుతో నిబంధనలు లేదా ప్రత్యేక వాగ్దానాలు చేస్తారు. ఆయన పిల్లలందరి కోసం పరలోక తండ్రి యొక్క సంతోష ప్రణాళిక గురించి కూడా వారు నేర్చుకుంటారు.
దేవాలయాన్ని నిర్మించడానికి పరిశుద్ధులు కష్టపడి పనిచేసారు. దానికి చాలా సమయం పట్టింది, కానీ ప్రభువు ఆయన దేవాలయంలో, వారి కోసం సిద్ధంగా ఉంచిన ప్రత్యేక వాగ్దానాల గురించి తెలుసుకోవడానికి వారు ఉత్సాహంతో ఉన్నారు.
రంగులువేసే పేజీ
దేవాలయము ప్రభువు యొక్క మందిరము
కోరీ ఎగ్‌బర్ట్ చేత వివరణ
మీరు ఒక దేవాలయాన్ని చూసినప్పుడు ఏవిధంగా భావిస్తారు?
© 2025 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, September 2025 యొక్క అనువాదము. Telugu. 19640 421