రక్షకుని విధానములో బోధించుట
బోధకుల సలహామండలి సమావేశాలు—తల్లిదండ్రులు మరియు బోధకులుగా పిలువబడిన వారి కొరకు


“బోధకుల సలహామండలి సమావేశాలు—తల్లిదండ్రులు మరియు బోధకులుగా పిలువబడిన వారి కొరకు,” రక్షకుని విధానములో బోధించుట: గృహములో మరియు సంఘములో బోధించువారందరి కొరకు (2022)

“బోధకుల సలహామండలి సమావేశాలు,” రక్షకుని విధానములో బోధించుట

ఆదివారపు బడి తరగతి

బోధకుల సలహామండలి సమావేశాలు—తల్లిదండ్రులు మరియు బోధకులుగా పిలువబడిన వారి కొరకు

తల్లిదండ్రుల కొరకు మరియు వార్డులో బోధకులుగా పిలువబడిన వారి కొరకు ప్రతీ వార్డు త్రైమాసిక బోధకుల సలహామండలి సమావేశాలు నిర్వహించాలి. ఈ సమావేశాలలో, తల్లిదండ్రులు మరియు ఇతర బోధకులు కలిసి క్రీస్తును పోలిన బోధనా సూత్రాల గురించి ఆలోచన చేయగలరు (ప్రధాన చేతిపుస్తకము: యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో సేవచేయుట, 13.4, 13.5, 17.4, 17.5, సువార్త గ్రంథాలయము చూడండి).

మూడు నెలలకు ఒకసారి ఆదివారం 50 నిమిషాల తరగతి సమయంలో రెండు రకాల బోధకుల సలహామండలి సమావేశాలు నిర్వహించబడతాయి.

తల్లిదండ్రుల కొరకు బోధకుల సలహామండలి సమావేశాలు

ఈ సమావేశాలకు ఎవరు నాయకత్వం వహిస్తారు? సాధారణంగా, ఆదివారపు బడి అధ్యక్షత్వములో ఒక సభ్యుడు తల్లిదండ్రుల కొరకు బోధకుల సలహామండలి సమావేశాలకు నాయకత్వం వహిస్తాడు. అయినప్పటికీ, సమావేశాలను నడిపించుటకు ఇతర వార్డు సభ్యులను సందర్భానుసారంగా బిషప్రిక్కు నియమించవచ్చు.

ఆదివారపు బడి అధ్యక్షత్వము సహాయంతో వార్డు సలహాసభ, తల్లిదండ్రుల కొరకు బోధకుల సలహామండలి సమావేశాలను పర్యవేక్షిస్తుంది. తల్లిదండ్రులు మరియు కుటుంబాల అవసరాల గురించి వారు కలిసి ఆలోచన చేస్తారు మరియు రక్షకుని విధానములో బోధించుటలోని ఏ సూత్రాలు ఆ అవసరాలను ఉత్తమంగా తీరుస్తాయో తెలుసుకోవడానికి వారు కలిసి పని చేస్తారు.

ఎవరు హాజరు కావాలి? నిర్దిష్ట తల్లిదండ్రులను ఆహ్వానించాలా లేదా పాల్గొనాలనుకునే వారందరికీ హాజరయ్యే అవకాశాన్ని కల్పించాలా అని వార్డు సలహాసభ నిర్ణయిస్తుంది.

ఈ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలి? వార్డు సలహాసభ చేత నిర్ణయించబడిన ప్రకారం, తల్లిదండ్రుల కొరకు బోధకుల సలహామండలి సమావేశం ఏ ఆదివారమైనా నిర్వహించబడవచ్చు.

బోధకులుగా పిలువబడిన వారి కొరకు బోధకుల సలహామండలి సమావేశాలు

ఈ సమావేశాలకు ఎవరు నాయకత్వం వహిస్తారు? సాధారణంగా, ఆదివారపు బడి అధ్యక్షత్వములో ఒక సభ్యుడు బోధకులుగా పిలువబడిన వారి కొరకు బోధకుల సలహామండలి సమావేశాలకు నాయకత్వం వహిస్తాడు. అయినప్పటికీ, సమావేశాలను నడిపించుటకు ఇతర వార్డు సభ్యులను సందర్భానుసారంగా బిషప్రిక్కు నియమించవచ్చు.

ఆదివారపు బడి అధ్యక్షత్వము సహాయంతో వార్డు సలహాసభ, బోధకులుగా పిలువబడిన వారి కొరకు బోధకుల సలహామండలి సమావేశాలను పర్యవేక్షిస్తుంది. వారు బోధకులు మరియు అభ్యాసకుల అవసరాల గురించి కలిసి ఆలోచన చేస్తారు మరియు రక్షకుని విధానములో బోధించుటలోని ఏ సూత్రాలు ఆ అవసరాలను ఉత్తమంగా తీరుస్తాయో గుర్తించడానికి వారు కలిసి పని చేస్తారు.

ఎవరు హాజరు కావాలి? వార్డులో సమూహము లేదా తరగతికి బోధించే ప్రతి ఒక్కరూ బోధకుల సలహామండలి సమావేశాలకు హాజరు కావాలి. సమూహ మరియు నిర్మాణ అధ్యక్షత్వ సభ్యులు కూడా ఆహ్వానించబడ్డారు.

ఈ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలి? బోధకులు తమ సాధారణ తరగతికి బోధించని ఆదివారం బోధకుల సలహామండలి సమావేశాలకు హాజరవుతారు.

  • స్థానిక నాయకులచేత నిర్ణయించబడిన ప్రకారం యాజకత్వ సమూహము, ఉపశమన సమాజము మరియు యువతుల యొక్క బోధకులు మొదటి లేదా మూడవ ఆదివారం హాజరు కావచ్చు.

  • స్థానిక నాయకులచేత నిర్ణయించబడిన ప్రకారం, ఆదివారపు బడి బోధకులు రెండవ లేదా నాల్గవ ఆదివారం హాజరు కావచ్చు.

  • వార్డు ప్రాథమిక మరియు ఆదివారపు బడి అధ్యక్షత్వములచేత నిర్ణయించబడిన ప్రకారం, ప్రాథమిక బోధకులు ఏ ఆదివారమైనా హాజరు కావచ్చు. కోరినట్లయితే, ప్రాథమిక బోధకులు ఇతర బోధకుల నుండి విడిగా సమావేశమై పిల్లలకు బోధించే ప్రత్యేక అంశాల గురించి ఆలోచన చేయవచ్చు. ఇది పాటలు పాడే 20 నిమిషాల సమయంలో, సాధారణ ఆదివారపు సమావేశాలకు ముందు లేదా తర్వాత లేదా వారంలో మరొక రోజు జరుగవచ్చు. ప్రాథమిక బోధకులకు త్రైమాసికానికి ఒకటి కంటే ఎక్కువ బోధకుల సలహామండలి సమావేశాలు నిర్వహించబడవచ్చు, తద్వారా వారందరూ ఒకే వారంలో ప్రాథమిక తరగతులను కోల్పోరు. (గమనిక: అవసరమైనప్పుడు, ప్రాథమిక అధ్యక్షత్వము ప్రత్యామ్నాయ బోధకులను నియమిస్తుంది, తరగతులను జతచేస్తుంది లేదా ప్రాథమిక బోధకులు బోధకుల సలహామండలి సమావేశాలకు హాజరు కావడానికి ఇతర ఏర్పాట్లు చేస్తుంది.)

సమావేశాల కొరకు నిర్దిష్ట రూపం

బోధకుల సలహామండలి సమావేశాలు—తల్లిదండ్రులు మరియు బోధకులుగా పిలువబడిన వారి కొరకు—ఈ నిర్దిష్ట రూపాన్ని అనుసరించండి:

  1. కలిసి పంచుకోండి మరియు ఆలోచన చేయండి (సుమారు 20 నిమిషాలు). తల్లిదండ్రులు లేదా బోధకులు ఇంట్లో లేదా వారి తరగతుల్లో సువార్త బోధిస్తున్నప్పుడు బాగా పని చేస్తున్న వాటిని పంచుకోవడానికి వారిని ఆహ్వానించండి. వారు ఎదుర్కొంటున్న సవాళ్లను లేదా వారు మెరుగుపరచాలనుకుంటున్న విషయాలను కూడా వారు పంచుకోవచ్చు.

  2. కలిసి నేర్చుకోండి (సుమారు 15 నిమిషాలు). రక్షకుని విధానములో బోధించుటలోని సూత్రాలలో ఒకదానిని తల్లిదండ్రులు లేదా బోధకులతో చర్చించండి. రండి, నన్ను అనుసరించండి కూడా ఈ చర్చలకు ఒక వనరుగా ఉపయోగించబడవచ్చు.

  3. ప్రణాళిక చేయండి మరియు ఆహ్వానించండి (సుమారు 10 నిమిషాలు). సమావేశం‌లో వారు నేర్చుకున్నవి మరియు వాటిని ఎలా వర్తింపజేయాలని ప్రణాళిక చేస్తారో పంచుకోవడానికి తల్లిదండ్రులు లేదా బోధకులను ఆహ్వానించండి.

6:15