Doctrine and Covenants 2025
అనుబంధం డి: అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతుల కొరకు—సమావేశ విషయ పట్టిక


“అనుబంధం డి: అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతుల కొరకు—సమావేశ విషయ పట్టిక,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2025 (2025)

“అనుబంధం డి,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2025

అనుబంధం డి

అహరోను యాజకత్వ సమూహములు మరియు యువతుల తరగతుల కొరకు—సమావేశ విషయ పట్టిక

సమావేశ తేదీ:

నిర్వహణ (తరగతి లేదా సమూహ అధ్యక్షత్వము యొక్క సభ్యురాలు/సభ్యుడు):

ప్రారంభ

కీర్తన (ఐచ్ఛికం):

ప్రార్థన:

యువతుల ఇతివృత్తము లేదా అహరోను యాజకత్వ సమూహ ఇతివృత్తమును పునరావృతం చేయండి.

కలిసి ఆలోచన చేయండి

సమావేశాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి నాయకత్వం క్రింద, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దేవుని కార్యములో తమ బాధ్యతల గురించి కలిసి ఆలోచన చేయడానికి తరగతి లేదా సమూహము 5 నుండి 10 నిమిషాలు వెచ్చిస్తారు. అధ్యక్షత్వ సమావేశము లేదా వార్డు యౌవనుల సలహా సమావేశములో చర్చించబడిన అంశాల గురించి తెలుసుకోవడానికి తరగతి లేదా సమూహ అధ్యక్షత్వానికి ఇది ఒక అవకాశము.

నిర్వహిస్తున్న వ్యక్తి కూడా ఈ ప్రశ్నలలో ఒకటి లేదా ఎక్కువ వాటిని ఉపయోగించవచ్చు:

సువార్తను జీవించుట

  • యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి మన సాక్ష్యాలను బలపరచిన ఇటీవలి అనుభవాలేవి?

  • రక్షకునికి దగ్గర కావడానికి మనమేమి చేస్తున్నాము? ఆయన వలె ఎక్కువగా ఉండడానికి మనమెలా ప్రయత్నిస్తున్నాము?

  • మన జీవితాల్లో ప్రభువు యొక్క నడిపింపును మనమెలా భావించాము?

అవసరతలో ఉన్నవారి పట్ల శ్రద్ధచూపుట

  • ఎవరికి సహాయం చేయడానికి లేదా సేవ చేయడానికి మనము నడిపించబడ్డాము? అవసరంలో ఉన్నవారికి సహాయపడేందుకు బిషప్రిక్కు నుండి ఏ నియామకాలను మనం పొందాము?

  • మన తరగతి లేదా సమూహ సభ్యులు ఎదుర్కొంటున్న సవాళ్ళేవి? మనం అనుభవిస్తున్న విషయాలలో మనము ఒకరికొకరం ఎలా సహకారమిచ్చుకోగలము?

  • ఇటీవల ఎవరైనా మన వార్డులోకి మారారా లేదా సంఘములో చేరారా? స్వాగతించబడినట్లు భావించడానికి వారికి మనమెలా సహాయపడగలము?

సువార్తను పొందడానికి అందరిని ఆహ్వానించుట

  • ఇతరులు దేవుని ప్రేమను అనుభవించేలా సహాయపడడానికి మనం ఏమి చేయగలము?

  • మన స్నేహితులను హాజరుకమ్మని ఆహ్వానించగలిగేలా ఏ ప్రోత్సాహ కార్యక్రమాలు రాబోతున్నాయి?

  • సువార్తను పంచుకోవడానికి ఏ ప్రణాళికలు వార్డు యౌవనుల సలహా సమావేశాలలో చర్చించబడ్డాయి? మన తరగతి లేదా సమూహము ఎలా జతచేరగలదు?

నిత్యత్వము కొరకు కుటుంబాలను ఏకం చేయుట

  • మామ్మ తాతలు మరియు బంధువులతో పాటు, కుటుంబ సభ్యులతో మనం బాగా అనుసంధానింపబడగల కొన్ని విధానాలేవి?

  • దేవాలయ విధులు అవసరమైన మన పూర్వీకుల పేర్లు కనుగొనడానికి మనం ఏమి చేస్తున్నాము? వారి పూర్వీకుల పేర్లు కనుగొనడానికి ఇతరులకు సహాయపడడానికి మనమేమి చేయగలము?

  • దేవాలయ కార్యములో—వ్యక్తిగతంగా మరియు ఒక తరగతిగా లేదా సమూహంగా మనం మరింత ఎక్కువగా ఎలా పాల్గొనగలము?

కలిసి నేర్చుకోండి

పెద్దవారైన ఒక నాయకుడు లేదా సమూహము లేదా తరగతి యొక్క ఒక సభ్యుడు ఈ వారపు రండి, నన్ను అనుసరించండి చదవడం గురించి సూచనను నడిపిస్తారు. రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు లోని అధ్యయన ఉపాయాలను వారు ఉపయోగిస్తారు. ఈ చిహ్నము సెమినరీ చిహ్నము గల అధ్యయన ఉపాయము సెమినరీతో సమలేఖనం చేయబడింది మరియు ప్రత్యేకించి యువతకు తగినది. ఏమైనప్పటికీ, అధ్యయన ఉపాయాలలో దేనినైనా ఉపయోగించవచ్చు. సాధారణంగా సమావేశంలోని ఈ భాగము సుమారు 35 నుండి 40 నిమిషాల సమయం తీసుకుంటుంది.

ముగింపు

సమావేశాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి:

  • బోధించబడిన సూత్రాల గురించి సాక్ష్యమిస్తారు.

  • వారు నేర్చుకున్న వాటిపై తరగతి లేదా సమూహము—ఒక సమూహముగా లేదా వ్యక్తిగతంగా ఎలా పనిచేస్తారో చర్చిస్తారు.

ప్రార్థన: