ఆసియా ప్రాంతీయ నాయకత్వ సందేశం
నిత్యత్వము యొక్క దర్శనాన్ని కలిగిఉండుట
“విశ్వాసంలో ఐక్యమైన కుటుంబాలు కష్టపడవచ్చు, కానీ ప్రభువు ఎల్లప్పుడూ వారిని ముందుకు నడిపిస్తారు.”
కంబోడియా అనేక విషాదకరమైన అంతర్యుద్ధాలను ఎదుర్కొంది. ఆ సంఘర్షణలు ముగిసిన వెంటనే నేను పుట్టాను. ఎనిమిది మంది పిల్లలను పెంచడానికి నా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుండగా జీవితం కష్టంగా మరియు ఆహారం కొరతగా ఉండేది . కొన్నిసార్లు,అటువంటి పరిస్థితులలో నా భవిష్యత్తు ఏమిటని నేను ఆలోచించేవాడిని.
1998లో,నేను యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో చేరినప్పుడు నా జీవితం మారిపోయింది. హైస్కూల్ పూర్తి చేయడానికి ఒక సంవత్సరం ముందు నేను బాప్తిస్మం తీసుకున్నాను. కళాశాలకు వెళ్లడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో,నేను పూర్తికాల సువార్తసేవ చేయడానికి ఎంచుకున్నాను. సేవ చేస్తున్నప్పుడు,నా ఆధ్యాత్మిక కళ్ళు తెరవబడ్డాయి. తన పిల్లల కోసం దేవుని నిత్య ప్రణాళికను మరియు నా స్వంత నిత్యకుటుంబాన్ని స్థాపించడానికి నేను ఎలా సిద్ధం కావాలో నేను అర్థం చేసుకున్నాను.
పునఃస్థాపించబడిన సువార్త యొక్క ఆత్మీయ సత్యాలు ఒక రోజు నేను దేవాలయములో వివాహం చేసుకుంటానని మరియు నా భార్య మరియు పిల్లలతో శాశ్వతంగా ముద్రవేయబడతానని నాకు తెలియజేసాయి. మేము కలిసి సంఘానికి వెళ్లడం, కలిసి కీర్తనలు పాడటం,కలిసి సువార్త అధ్యయనం చేయడం మరియు ఒక రోజు నా పిల్లలను మిషన్లకు పంపడం మరియు వారు పవిత్ర దేవాలయాలలో ముద్రవేయబడి వారి స్వంత కుటుంబాలను ప్రారంభించుట చూడటం నేను ఊహించుకున్నాను. మా కుటుంబం కోసం నాకు ఎంత అందమైన దర్శనం కలిగింది. ప్రతి ఒక్కరికీ ఈ రకమైన దర్శనం ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
2005లో హాంకాంగ్ చైనా దేవాలయములోఆశీర్వదించారు ఒక అందమైన స్త్రీతో నేను ముద్రవేయబడినప్పుడు నా కల నెరవేరడం ప్రారంభమైంది. అప్పటి నుండి,నిత్య మార్గం స్పష్టంగా మారింది. ప్రభువు మాకు ఐదుగురు శక్తివంతమైన కుమారులను ఆశీర్వదించారు.
నిత్యత్వ దర్శనం అందంగా ఉన్నప్పటికీ,ప్రయాణం సులభంగా లేదు. స్టేకు అధ్యక్షుడిగా,ఫ్యాక్టరీ మేనేజర్‌గా మరియు ఐదుగురు చురుకైన అబ్బాయిల తండ్రిగా బాధ్యతలను సమతుల్యం చేసుకోవడం చాలా కష్టంగావుండేది . మా కుమారులు ఎల్లప్పుడూ శక్తితో నిండి ఉండేవారు - పరిగెత్తడం,ఎక్కడం మరియు కుస్తీ పడుతూఉండేవారు. వారు తరచుగా వస్తువులను పగలగొట్టడం,ఆహారాన్ని చల్లడం మరియు ఇంటిని తలక్రిందులుగా చేసేవారు . ఒక రోజు,నేను మరియు నా భార్య పనితొందరలో ఉన్నప్పుడు, వారు వంటగది సింక్‌ను అడ్డుపడేలాచేసారు,టైల్డ్ నేలపై నీరు ప్రవహించేలాచేసి,ముందుకు వెనుకకు జారడానికి సబ్బును జోడించారు మరియు గర్వంగా ఇలా అన్నారు,“మేము ఈత కొలను నిర్మిస్తున్నాము!”
కుటుంబ లేఖన అధ్యయనం సవాలుగా ఉండేది ఎందుకంటే అబ్బాయిలు ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ, మా సహనాన్ని పరీక్షించువారు. ఆదివారాల్లో,నేను వేదికఫై కూర్చున్నప్పుడు,నా భార్య ప్రేక్షకులలో పిల్లలను చూసుకునేది. వారు బెంచీల కిందకి పాకుట, ప్రజల కాళ్ళను లాగుట మరియు కొన్నిసార్లు బిగ్గరగా అరవడం లేదా ఏడవడం చేసేవారు . నా భార్య తరచుగా ఇబ్బందిపడుతూ అలసిపోయేది. ఒక రోజు ఆమె నాతో,“నేను ఆత్మనుభూతి చెందాలని మరియు ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాను. కానీ చాలా సార్లు నేను సంఘానికి వెళ్ళినప్పుడు, నేను ఏమీ నేర్చుకోను మరియు మా పిల్లలతో నిరాశ చెందుతాను. నేను కొన్నిసార్లు మనం ఎందుకు వెళుతున్నామోనని ఆశ్చర్యపోతాను.
అలాంటి క్షణాల్లో,నేను లీహై అరణ్యంలో చేసిన ప్రయాణాన్ని గుర్తుతెచ్చుకుంటాను. వారికి అనేక సమస్యలు ఉన్నాయి, కానీ ప్రభువు వాగ్దానం చేశారు."అరణ్యములో నేను మీకు వెలుగుగా కూడా ఉందును...మీరు నా ఆజ్ఞలను పాటించియున్నంత కాలము మీరు వాగ్దానదేశమునకు నడిపింపబడుదురు." విశ్వాసంలో ఐక్యమైన కుటుంబాలు కష్టపడవచ్చు, కానీ ప్రభువు ఎల్లప్పుడూ వారిని ముందుకు నడిపిస్తారు.
“[మీ పిల్లలకు] సత్యము, స్వస్థబుద్ధిగల మార్గములందు నడుచుటను... ఒకరినొకరు ప్రేమించుకొనుటను ఒకరికొకరు పరిచర్య చేసుకొనుటను మీరు వారికి బోధించెదరు.” అని రాజైన బెంజమిన్ తల్లిదండ్రులకు సలహా ఇచ్చాడు. “మీ పిల్లలను వెలుగులో మరియు సత్యంలో పెంచండి” అని కూడా ప్రభువు మనకు ఆజ్ఞాపించారు. కుటుంబ జీవితం భారంగా అనిపించినప్పుడు ఈ బోధనలు మనల్ని బలపరుస్తాయి.
ఒకరోజు నా పెద్ద కొడుకు స్టేకు సమావేశంలో మాట్లాడినప్పుడు నిరంతర శ్రమ యొక్క ఆశీర్వాదాలు స్పష్టమయ్యాయి. అతను ఇలా అన్నాడు, “ఒక యాజకత్వ కలిగియున్నావనిగా, నా తండ్రిలాగే నేను కూడా ఇతరులను ఆశీర్వదించడానికి నా యాజకత్వాన్ని ఉపయోగిస్తాను.” నా కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. కష్టంగా ఉన్నప్పటికీ మనం ఎందుకు ముందుకు సాగుతామో నాకు అర్థమైంది. నేడు అతను మాడ్రిడ్ సౌత్ స్పెయిన్ మిషన్‌లో నమ్మకంగా సేవ చేస్తున్నాడు. అతని తమ్ముళ్ళు ప్రతి వారం సంస్కారాన్ని సిద్ధం చేసి అందిస్తారు. మా రెండవ కొడుకు త్వరలో ఒక సువార్త సేవ చేయడానికి సిద్ధమవుతున్నాడు.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అన్నారు, “మన జీవితంలో గొప్ప పని మరియు ఆనందానికి మన కుటుంబం కేంద్రంగా ఉంది; మనం ‘సింహాసనాలు, రాజ్యాలు, ప్రధానులు, . . . అధికారాలు, ఆధిపత్యాలు . . . ఉన్నత స్థితి మరియు మహిమను వారసత్వంగా పొందగలిగేటప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది.” ఆ వాగ్దానం నా కుటుంబాన్నికి బోధించడానికి మరియు సంఘము మరియు దేవాలయానికి నడిపించడానికి నాకు బలాన్ని ఇస్తుంది.
నా భార్య మరియు నేను, పిల్లలు అల్లరిచేసినప్పటికీ , విశ్రాంతి లేకుండా ఉన్నప్పటికీ, వారం వారం సంఘానికి వెళ్ళేవాళ్ళం. మా ఇంటిలో సువార్తను కేంద్రంగా ఉంచడానికి మేము కృషి చేసినందున, ఆ ప్రయత్నాల ఫలాలను నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను . యోగ్యతతో సంస్కారమును అందించే నా కుమారులలో, ఆనందంతో విశ్వాసంతో సేవ చేసే నా మిషనరీ కుమారుడిలో మరియు మా చిన్న పిల్లలలో పెరుగుతున్న సాక్ష్యాలలో నేను వాటిని చూస్తున్నాను. ప్రతి త్యాగం, ప్రతి అలసిన ఆదివారం మరియు ప్రతి కుటుంబ లేఖన అధ్యయనం విలువైనదని ప్రభువు నాకు చూపించారు, ఎందుకంటే ఆయన సువార్త నిజంగా కుటుంబాలను ఆశీర్వదిస్తుంది.
కుటుంబాలు సంఘంలో కలిసి ఆరాధించినప్పుడు, వారు ఆత్మను తమ ఇంట్లోకి ఆహ్వానిస్తారని, వారి ఐక్యతను బలోపేతం చేస్తారని మరియు క్రీస్తుకు దగ్గరగా ఎదుగుతారని నాకు తెలుసు. ప్రభువు ప్రేమ, శాంతి మరియు రక్షణను పెంచుతానని వాగ్దానం చేస్తున్నారు. వారి నిబంధనలు పునఃప్రారంభించబడతాయి మరియు పిల్లలు విశ్వాసంలో పెంచబడతారు, ఇప్పుడు మరియు నిత్య ఆశీర్వాదాలను పొందుతారు. మన కుటుంబంలో సువార్తను అవలంబించడం కొనసాగిస్తే, ప్రభువు మన ప్రయత్నాలను ఘనపరుస్తారు. "ఒలీవతోట యజమాని కూడా వారితోపాటు పనిచేసినట్లు ", రక్షకుడు మన పోరాటాలలో నిత్యత్వం వైపు ఆశ మరియు ఆనందంతో సహాయం చేస్తారు .■